1. ఆంధ్రను ఏలిన ప్రప్రథమ రాజవంశం ఏది?
జ: శాతవాహనులు
2. 'పితుండనగరం' ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఉంది?
జ: మచిలీపట్నం దగ్గర
3. 'సాంచి స్తూపానికి' దక్షిణ తోరణం నిర్మించిన రాజు?
జ: రెండో శాతకర్ణి
4. శాతవాహనుల రెండో రాజధాని ఏది?
జ: ధాన్యకటకం
5. 'దక్షిణాపథపతి' బిరుదున్న రాజెవరు?
జ: మొదటి శాతకర్ణి
6. బౌద్ధమత మార్టిన్ లూథర్ అని ఎవరికి పేరు?
జ: నాగార్జునుడు
7. శకక్షహరాట వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు?
జ: నహపాణుడు
8. కిందివాటిలో నాణేలు - బొమ్మలకు సంబంధించి సరైన జతను గుర్తించండి.
ఎ) ఏనుగు బొమ్మ - శ్రీముఖుడు బి) ఉజ్జయిని బొమ్మ - మొదటి శాతకర్ణి
సి) తెరచాప ఓడ బొమ్మ - యజ్ఞశ్రీ డి) పైవన్నీ సరైనవే
జ: డి (పైవన్నీ సరైనవే)
9. జోగల్‌తంబి పునర్ముద్రించిన నాణేలు ఏవి?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి
10. శ్రీముఖుడిని వాయుపురాణంలో ఏ విధంగా పేర్కొన్నారు?
జ: సింధకుడు
11. ఒక రాష్ట్రం, ఒక గ్రామం, ఒక సైనికుని ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నాయి?
జ: మ్యాకదోని
12. కిందివాటిలో శాతవాహనులకు సంబంధించనిదేది?
ఎ) రాజులు దైవాంశ సంభూతులు బి) సామంత రాజులు మహారథి, మహాభోజ
సి) రాజు ఆధీనంలో ఉన్న భూమి - రాజకంఖేట డి) ఆహారాల అధికారి నాగరికుడు
జ: డి (ఆహారాల అధికారి నాగరికుడు)
13. గుణాఢ్యుని 'బృహత్కథ' ఏ సంస్కృత గ్రంథం నుంచి తర్జుమా చేశారు?
ఎ) క్షేమేంద్రుడు - బృహత్కథమంజరి బి) సోమదేవసూరి - కథా సరిత్సాగరం
సి) ఉద్యోతనుడు - లీలావతి పరిణయం డి) ఎ, బి
జ: డి(క్షేమేంద్రుడు - బృహత్కథమంజరి, సోమదేవసూరి - కథా సరిత్సాగరం)
14. శాతవాహనుల కాలం నాటి 'జలక్రీడ' ఏది?
జ: మమ్మోండస్తాండయా
15. ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం ఏది?
జ: వేదలి
16. స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించిన మొదటి ఆంధ్ర రాజులెవరు?
జ: శాతవాహనులు
17. 'రజ్జు గాహక' అంటే...
జ: శిస్తు వసూలు చేసే అధికారి
18. 'భిక్షురాజుగా' ప్రసిద్ధి చెందిన రాజెవరు?
జ: ఖారవేలుడు
19. ''సత్యవచనదాన నిరతయా" అనే ప్రసక్తి కిందివారిలో ఎవరిని ఉద్దేశించింది?
జ: గౌతమీ బాలశ్రీ
20. 'భదయనేల' అంటే...
జ: బౌద్ధశాఖ