• facebook
  • whatsapp
  • telegram

పజిల్స్

  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనున్న పోటీ పరీక్షల్లో విశ్లేషణ సామర్ధ్యం (అనలిటికల్ ఎబిలిటీ) విభాగం పరిధిలోకి వచ్చే ప్రధాన అంశాల్లో పజిల్స్ ఒకటి. వీటిని పరిష్కరించడానికి తార్కిక ఆలోచన అవసరం. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, భిన్నాలు, నిష్పత్తులు లాంటి వాటికి సంబంధించిన ప్రాథమిక గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. కష్టసాధ్యమైన గణిత సూత్రాలు కచ్చితంగా వచ్చితీరాలన్న ఆందోళన అవసరం లేదు. ఒక్కోసారి ఇచ్చిన ఐచ్ఛిక సమాధానాల ఆధారంగా కూడా సరైన జవాబు ఏదో గుర్తించవచ్చు.

 

1. ఒక జంతు సంరక్షణ కేంద్రంలో కొన్ని నెమళ్లు, లేళ్లు ఉన్నాయి. వాటి మొత్తం కాళ్లు 224, తలలు 60 అయితే ఆ కేంద్రంలోని లేళ్ల సంఖ్య ఎంత?
ఎ) 26 బి) 32 సి) 42 డి) 52
సమాధానం: (డి)
వివరణ: సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువులన్నీ నాలుగు కాళ్లవి అనుకుంటే, వాటి మొత్తం కాళ్ల సంఖ్య 604 = 240 అవుతుంది. జంతువులన్నీ రెండు కాళ్లవనుకుంటే మొత్తం కాళ్ల సంఖ్య 602 = 120 అవుతుంది. సమస్యలో మొత్తం కాళ్ల సంఖ్యను 224గా ఇచ్చారు. ఈ విలువ 240కి దగ్గరగా ఉంది కాబట్టి 240 - 224 = 16 ఇప్పుడు 16ను 2తో భాగిస్తే 16 + 2 = 8 కాబట్టి 8 జంతువులు 2 కాళ్లవి అవుతాయి. మిగిలినవి అంటే 60 - 8 = 52 జంతువులు 4 కాళ్లవి (లేళ్లు).
సరిచూడటం: 82 = 16, 524 = 208 మొత్తం కాళ్లు = 16 + 208 = 224, మొత్తం తలలు 8 + 52 = 60.

 

2. ఒక సమావేశానికి కొంతమంది వ్యక్తులు హజరయ్యారు. అక్కడ ప్రతి వ్యక్తి మిగిలినవారితో 28 సార్లు కరచాలనం చేస్తే, సమావేశానికి హాజరైన మొత్తం వ్యక్తులు ఎంతమంది?

ఎ) 5 బి) 6 సి) 7 డి) 8
సమాధానం: (డి)
వివరణ: ఇలాంటి సమస్యలను కింది సూత్రం ద్వారా సాధించవచ్చు. సమావేశానికి హాజరైన వ్యక్తుల సంఖ్యను n అనుకుంటే

 
n(n - 1) = 2  28 = 56
n = 8 గా తీసుకుంటే 8 (8 - 1) = 8  7 = 56 అవుతుంది. కాబట్టి సమావేశానికి హాజరైన మొత్తం వ్యక్తులు '8' మంది.

 

3. ఒక ఉడత 12 మీ. ఎత్తున్న స్తంభాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. రోజూ 4 మీటర్లు ఎక్కి 2 మీటర్లు కిందికి జారిపోతుంది. అయితే ఎన్ని రోజుల్లో అది స్తంభ శిఖరాన్ని చేరుకుంటుంది?

ఎ) 4 బి) 5 సి) 6 డి) 3
సమాధానం: (బి)
వివరణ: ఇలాంటి సమస్యలను కింది సూత్రం ద్వారా సాధించవచ్చు.


శిఖరాన్ని చేరేందుకు పట్టే రోజులు (D) =
ఈ సమస్యలో దత్తాంశం నుంచి, ఉడత శిఖరాన్ని చేరుకునేందుకు పట్టే రోజుల సంఖ్య = 

 

4. ఒక వ్యాపారి తన దగ్గరున్న మొత్తం ఆపిల్స్‌లో సగం పళ్లకు మరొకటి కలిపి మొదటి కొనుగోలుదారుడికి అమ్మాడు. మిగిలినవాటిలో 1/3 వ వంతుకు ఒకటి కలిపి రెండో వినియోగదారుడికి అమ్మాడు. మిగిలినవాటిలో 1/5 వ వంతుకు ఒకటి కలిపి మూడో వ్యక్తికి అమ్మాడు. ఇంకా 3 ఆపిల్స్ మిగిలి ఉంటే, అతడి వద్ద ఉన్న మొత్తం ఆపిల్స్ ఎన్ని?

ఎ) 15 బి) 18 సి) 20 డి) 25
సమాధానం:
(సి)
వివరణ: ఇలాంటి సమస్యల సాధనకు బీజగణిత పద్ధతి కష్టసాధ్యం. ఐచ్ఛికాల నుంచి జవాబును సరిచూసుకోవడం అనువుగా ఉంటుంది. రెండో ఆప్షన్ సరైంది అనుకుంటే, మొదటి కొనుగోలుదారుడికి అమ్మిన ఆపిల్స్ = 
మిగిలిన ఆపిల్స్ = 18 - 10 = 8 మిగిలినవాటిలో 1/3 వ వంతు పళ్లను రెండో వినియోగదారుడికి అమ్మాడు. కాబట్టి మిగిలిన 8 ఆపిల్స్‌లో 1/3 వ వంతు అసాధ్యం (8ను 3తో నిశ్శేషంగా భాగించలేం). కాబట్టి (బి) ఆప్షన్ సరికాదు.
(సి) ఆప్షన్ నుంచి, మొదటి కొనగోలుదారుడికి అమ్మిన ఆపిల్స్ = 
... మిగిలిన ఆపిల్స్ = 20 - 11 = 9
రెండో కొనుగోలుదారుడికి అమ్మిన ఆపిల్స్ = 
... మిగిలిన ఆపిల్స్ = 9 - 4 = 5
మూడో కొనుగోలుదారుడికి అమ్మిన ఆపిల్స్ = 
... చివరగా అతడి వద్ద మిగిలిన ఆపిల్స్ = 5 - 2 = 3 కాబట్టి అతడి వద్ద ఉన్న మొత్తం ఆపిల్స్ సంఖ్య 20 అవుతుంది.

 

5. ఒక చేతి రుమాలు యొక్క ఒక మూలను కత్తిరిస్తే, మిగిలిన మూలల సంఖ్య ఎంత?

ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
సమాధానం: (సి)
వివరణ: చేతి రుమాలును కత్తిరించక ముందు పటం (ఎ)లో చూపిన విధంగా ఉంటుంది. అంటే 4మూలలు ఉంటాయి. మూలలను కత్తిరించిన తర్వాత పటం (బి)లో చూపిన విధంగా ఉంటుంది. అంటే కత్తిరించిన తర్వాత 5 మూలలు ఉంటాయి.

 

6. ఒక పెద్ద పెట్టెలో 4 చిన్న పెట్టెలు ఉన్నాయి. అలాగే ప్రతి చిన్న పెట్టెలోనూ 4 మరికాస్త చిన్న పెట్టెలు ఉంటే మొత్తం పెట్టెల సంఖ్య ఎంత?

ఎ) 17 బి) 20 సి) 21 డి) 5
సమాధానం: (సి)
వివరణ: పెద్ద పెట్టెలో 4 చిన్న పెట్టెలు ఉన్నాయి. ప్రతి చిన్న పెట్టెలోనూ మళ్లీ మరో 4 చిన్న పెట్టెలు ఉన్నాయి. మొత్తం పెట్టెల సంఖ్య = 4 5 + 1 = 21

 

7. చంద్రుడు ఒక పూర్తి భ్రమణం చేయడానికి 30 రోజులు పడుతుంది. మొదటి రోజున తూర్పు దిక్కులో సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు కనిపిస్తే, నాలుగో రోజున రాత్రి ఏ సమయానికి చంద్రుడు కనిపిస్తాడు?

(ఊహాజనితం మాత్రమే)
ఎ) 8 : 24 బి) 9 : 12 సి) 10 : 00 డి) 11 : 48
సమాధానం: (బి)
వివరణ: దత్తాంశం నుంచి, చంద్రుడు ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే రోజులు - 30
ఒక రోజులో చంద్రుడు కనిపించే సమయం

కాబట్టి, మూడు రోజులకు 3  48 = 144 నిమిషాలు అంటే 2 గంటల 24 నిమిషాల తర్వాత నాలుగో రోజు చంద్రుడు కనిపిస్తాడు. అంటే మొదటి రోజున సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు కనిపిస్తే, నాలుగో రోజున రాత్రి 6 గంటల 48 నిమిషాలు + 2 గంటల 24 నిమిషాలు = 9 గంటల 12 నిమిషాలకు చంద్రుడు కనిపిస్తాడు.

 

8. ఒక సరస్సులో ప్రతి బాతు దానికి ముందు రెండు బాతులు, వెనుక రెండు బాతులు, మధ్యలో ఒక బాతు ఉండేలా ఈదుతున్నాయి. ఆ సరస్సులో ఈదుతున్న కనీస బాతుల సంఖ్య ఎంత?

ఎ) 11 బి) 9 సి) 7 డి) 3
సమాధానం: (డి)
వివరణ: దత్తాంశం నుంచి పైపటంలో చూపిన విధంగా 3 బాతులు మాత్రమే ఈదగలవు.

 

9. ఒక కుటుంబంలో ముగ్గురు తండ్రులు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనవళ్లు, ఒక మునిమనవడు ఉన్నారు. ఆ కుటుంబంలో ఉండదగిన కనీస సభ్యుల సంఖ్య ఎంత?

ఎ) 5 బి) 6 సి) 4 డి) 7
సమాధానం: (సి)
వివరణ: దత్తాంశం నుంచి కింది విధంగా పటాన్ని రూపొందించవచ్చు.
A, B, Cలు తండ్రులు
B, Aకు; C, Bకు కొడుకులు
C, Aకు; D, Bకు మనవలు
D, Aకు మునిమనవడు
 

Posted Date : 10-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌