• facebook
  • whatsapp
  • telegram

దిశా నిర్దేశ పరీక్ష

అనలిటికల్ ఎబిలిటీలో 'దిశానిర్దేశ' ప్రశ్నలు... అభ్యర్థుల పరిశీలనా జ్ఞానాన్ని, దిశా నిర్దేశ శక్తిని పరీక్షించడానికి ఉద్దేశించినవి. ఈ ప్రశ్నల్లో దత్తాంశం ఆధారంగా దిశను గుర్తించమని అడుగుతారు. ఇచ్చిన వివరాలతో నమూనా చిత్రాన్ని గీయడం ద్వారా సమస్యను సులువుగా సాధించవచ్చు. దిక్కులపై అవగాహన దీనికి ఉపకరిస్తుంది.

* భూమికి నాలుగు దిక్కులు, నాలుగు మూలలు ఉన్నాయి.

* నాలుగు దిక్కులు - తూర్పు (East), పడమర (West), ఉత్తరం (North), దక్షిణం (South).

* నాలుగు మూలలు - ఈశాన్యం (NE), వాయవ్యం (NW), నైరుతి (SW), ఆగ్నేయం (SE).

* మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఈ సమయంలో వస్తువులకు ఏ దిశలోనూ నీడలు (Shadows) ఏర్పడవు.

* సూర్యాస్తమయ సమయంలో వస్తువు నీడ ఎల్లప్పుడూ తూర్పు వైపు పడుతుంది.

* సూర్యోదయ సమయంలో వ్యక్తి తూర్పు దిశగా నిలుచుంటే, అతడి నీడ పడమర దిశగా పడుతుంది.

* ఒక వ్యక్తి వివిధ దిక్కులకు ఎదురుగా నిలుచున్నప్పుడు... అతడి కుడి, ఎడమలు సూచించే దిశలు కింది విధంగా ఉంటాయి.

 

మాదిరి సమస్యలు

1. ఒక వ్యక్తి పడమర దిశగా నిల్చున్నాడు. గడియారపు సవ్యదిశలో 450 తిరిగి మళ్లీ అక్కడి నుంచి అదే దిశలో 1800 తిరిగి నిలుచున్నాడు. ఇప్పుడు గడియారపు అపసవ్య దిశలో 2700 తిరిగితే, అతడు ప్రస్తుతం ఏ దిశలో నిలుచున్నాడు?

ఎ) దక్షిణం బి) వాయవ్యం సి) పడమర డి) నైరుతి

సమాధానం: (డి)

వివరణ: దత్తాంశం నుంచి కింది విధంగా పటం గీసి, దిశ కనుక్కోవచ్చు.

 

2. ఒక వ్యక్తి ఉత్తర దిశగా 4 కి.మీ. నడిచిన తర్వాత ఎడమవైపు తిరిగి మళ్లీ 6 కి.మీ నడిచాడు. అక్కడ నుంచి కుడివైపు తిరిగి 4 కి.మీ. నడిచాడు. ప్రారంభ స్థానం నుంచి ప్రస్తుతం అతడు ఎంత దూరంలో ఉన్నాడు?

ఎ) 5 కి.మీ. బి) 6 కి.మీ. సి) 10 కి.మీ. డి) 8 కి.మీ.

సమాధానం: (సి)

వివరణ: దత్తాంశం నుంచి కింది విధంగా పటాన్ని గీయవచ్చు.

పటం ఆధారంగా,

 

3. ఒక వ్యక్తి తూర్పుదిశగా నడుస్తూ, అతడికి ఎడమవైపు 45ళ తిరిగి మళ్లీ కుడివైపు 90ళ తిరిగాడు. ప్రస్తుతం అతడు ఏ దిశలో నిలుచున్నాడు?

ఎ) ఉత్తరం బి) వాయవ్యం సి) ఈశాన్యం డి) పడమర

సమాధానం: (సి)

వివరణ: దత్తాంశం నుంచి కింది విధంగా పటం గీసి, దిశ కనుక్కోవచ్చు.

 

4. ఒక వృత్తాకార పార్కు మధ్యలో కరెంటు స్తంభం ఉంది. ఒక వ్యక్తి పార్కు అంచు వద్దకు రావడానికి స్తంభం నుంచి 21 మీ. ఉత్తరం వైపు ప్రయాణించాడు. తర్వాత పార్కు అంచు వెంబడి 66 మీ. ప్రయాణించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి స్తంభానికి ఏ దిశలో, ఎంత దూరంలో ఉన్నాడు?

ఎ) 66 మీ. దక్షిణం బి) 21 మీ. దక్షిణం సి) 42 మీ. తూర్పు డి) 66 మీ. ఆగ్నేయం

సమాధానం: (బి)

వివరణ:

ఆ వ్యక్తి పార్కు అంచు వెంబడి 66 మీ. నడిచాడు. అంటే చుట్టుకొలతలో సగం నడిచాడు. కాబట్టి, ఆ వ్యక్తి స్తంభం నుంచి 21 మీటర్ల దూరంలో, దక్షిణం వైపు ఉంటాడు.

 

5. A, B అనే ఇద్దరు వ్యక్తులు శి అనే స్థానం వద్ద నిలుచున్నారు. తర్వాత అక్కడ నుంచి వారిద్దరూ వరుసగా 4 కి.మీ./గంట, 5 కి.మీ./ గంట వేగాలతో వ్యతిరేక దిశల్లో నడవడం మొదలుపెట్టారు. 3 గంటల తర్వాత A, B మధ్య దూరం ఎంత?

ఎ) 3 కి.మీ. బి) 21 కి.మీ. సి) 18 కి.మీ. డి) 27 కి.మీ.

సమాధానం: (డి)

వివరణ: A వేగం = 4 కి.మీ./గంట, B వేగం = 5 కి.మీ./గంట.
వారి సాపేక్ష వేగం = 4 + 5 = 9 కి.మీ./ గంట.
3 గంటల తర్వాత వారి మధ్య దూరం = వేగం  కాలం = 9 3 = 27 కి.మీ.

 

6. ఒక గడియారంలోని నిమిషాల ముల్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాయవ్య దిశను సూచించింది. అయితే ఉదయం 9 గంటల సమయంలో గంటల ముల్లు ఏ దిశను సూచిస్తుంది?

ఎ) ఉత్తరం బి) దక్షిణం సి) ఆగ్నేయం డి) నైరుతి

సమాధానం: (డి)

వివరణ: దత్తాంశం ఆధారంగా... మధ్యాహ్నం 3 గంటల సమయంలో గడియారంలోని నిమిషాల ముల్లు వాయవ్య దిశను సూచిస్తుంది. కింది విధంగా పటం గీయవచ్చు.

ఇదే విధంగా ఉదయం 9 గంటల సమయాన్ని సూచించే పటం కింది విధంగా ఉంటుంది.

 

7. ఒక పార్కు సమబాహు త్రిభుజాకారంలో ఉంది. ఆ పార్కు మూడు శీర్షాల వద్ద రమ, ఉమ, సుమ నిలుచున్నారు. రమ.. పార్కు అంచు వెంబడి సవ్యదిశలో ఒక భుజం దూరాన్ని, ఉమ 1 1/2 భుజం దూరాన్ని, సుమ రెండు భుజాల దారాన్ని నడిచారు. అయితే

* ప్రస్తుతం ఉమ బయలు దేరిన స్థానానికి ఏ దిశలో ఉంది?

ఎ) నైరుతి బి) వాయవ్యం సి) ఆగ్నేయం డి) ఈశాన్యం

సమాధానం: (డి)

* సుమ, రమ మధ్య ప్రస్తుత దూరం ఎంత?

ఎ) 5 కి.మీ. బి) 10 కి.మీ. సి) 0 కి.మీ డి) 20 కి.మీ.

సమాధానం: (సి)

* ప్రస్తుతం ఉమ, సుమకు ఏ దిశలో ఉంది?

ఎ) ఈశాన్యం బి) దక్షిణం సి) నైరుతి డి) వాయవ్యం

సమాధానం: (ఎ)

Posted Date : 28-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్రటేరియల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌