• facebook
  • whatsapp
  • telegram

శ్రద్ధపెడితే సానపట్టడం సులభమే!

శైలజకు కూతురిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఈ కాలం పిల్ల కాదనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా చదువే లోకం! పొద్దునే లేచి చదువుకుంటుంది. కాలేజీలో ఎలాగూ అదే పని. ఇంటికొచ్చాక కూడా మిగతా పిల్లల్లా టీవీ ముందు కూర్చోదు. తన గదిలో పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. లేదా కంప్యూటర్ నుంచి తనకు కావాల్సిన పాఠాలు డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటుంది. స్నేహితులతో తిరగడాలు, పార్టీలు, సినిమాలు ఏవీ పడవు. అంతా తనని మెచ్చుకుంటూ ఉంటారు. 'మీకేమండీ అదృష్టవంతులు! మీ అమ్మాయి ఎంత బాగా చదువుతుందో' అంటూ తననూ పొగడ్తల్లో ముంచెత్తుతారు. అందుకే కూతురు ఇంకా బాగా చదవాలని అన్నీ శ్రద్ధగా అమరుస్తూ ఉంటుంది. వేళకు అన్నీ గదిలోకి తీసుకెళ్తుంది. అలారం పెట్టుకుని నిద్ర లేపుతుంది. ఇదో కోణం... 

        రామారావుకి కొడుకుని చూస్తే భయంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధే లేదు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది మార్కులు బాగా రాలేదు. బెటర్‌మెంట్ రాయమంటే పట్టించుకోలేదు. ఎంసెట్ ఎలా రాస్తాడో అని దిగులు పట్టుకుందా తండ్రికి. గట్టిగా మాట్లాడాలంటే వాడి మనసు గాయపడుతుందేమో అని సంకోచం! తాను ఇవ్వకపోతే వాడికెక్కడినుంచి వస్తుందనే ఉద్దేశంతో కొడుకు కోరినంత డబ్బు ఇస్తాడు. లైసెన్స్ లేకపోయినా బైక్ ఇస్తాడు. ఒక్కగానొక్క కొడుకు చదవడం లేదని బెంగగా ఉన్నా, కోప్పడితే ఏమైపోతాడోనని భయం. స్కూల్ స్థాయిలో ఉండగా చదువు మీద సరిగా శ్రద్ధ చూపించడం లేదని గమనించినా, కాలేజీకి వస్తే వాడే తెలుసుకుంటాడని అశ్రద్ధ చేశారు. ఇప్పుడు చూస్తే అసలు చేతికొచ్చేలా లేడు. వాడి భవిష్యత్తు ఏమవుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు భార్యాభర్తలిద్దరూ. ఇది మరో కోణం! 
          ఈ రెండు కోణాల్లో కొన్ని లోపాలున్నాయి! వాటిని ఎలా సరిదిద్దుకోవాలో మాత్రం తల్లిదండ్రులకు తెలియదు.
          ఒక చేతి వేళ్లన్నీ ఒకలా ఉండనట్లే పుట్టిన పిల్లలందరూ ఒకేరకంగా ఉండకపోవచ్చు. ఒకరు బాగా ప్రతిభావంతులై ఉండొచ్చు. మరొకరు అంత తెలివి లేనివారు కావొచ్చు. పిల్లలని రకాలుగా విభజిస్తే- 
          1) ప్రతిభావంతులు             2) ఒక మాదిరిగా చదివేవారు             3) చదువులో వెనకబడిన పిల్లలు.

 ప్రతిభావంతులు 

          ఇలాంటి పిల్లలు స్వతహాగా ఒక్కసారి పాఠం వినగానే ఆకళింపు చేసుకుని, గుర్తుంచుకోగలుగుతారు. అందుకే వీరికి పాఠాన్ని మళ్లీ మళ్లీ బట్టీపట్టాల్సిన అవసరం రాదు. పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి దానిపై ఆసక్తి పెరుగుతుంది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనీ, పరిశోధించాలనీ ఉంటుంది. పరీక్షల్లో కూడా ఎక్కువసేపు ఆలోచించకుండా జవాబులు రాయగలుగుతారు. 

 ఒక మాదిరిగా చదివేవారు 

          వీళ్లు తరగతిలో శ్రద్ధగానే పాఠాలు విన్నా, అందులోని సారాంశాన్ని వెంటనే గ్రహించలేకపోతారు. ఇంటికి వచ్చాక మరోసారి పాఠాన్ని చదివితే తప్ప అర్థం కాదు. అక్కడితో దాని గురించి వదిలేస్తారు. కానీ ఆ పాఠ్యాంశంలో ముందుకెళ్లి ఆలోచించే ఆసక్తి ఉండదు. నోట్సు రాసుకుని దాన్నే వల్లె వేసి పరీక్షల్లో రాయగలరు. కొత్త కోణాల్లో పాఠ్యాంశాన్ని గురించి ఆలోచించలేరు! చదివింది మాత్రమే పరీక్షల్లో రాయగలుగుతారు. అంతమాత్రాన వీళ్లని తెలివితక్కువ వారిగా అంచనా వేయలేం.  

 చదువులో వెనకబడిన పిల్లలు  

          వీరిలో అనేక కారణాల వల్ల చదువు మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. మిగతా విషయాలు బాగానే పట్టించుకుంటారు. క్లాసులో పాఠం శ్రద్ధగా వినరు. వేరే ఏదో ఆలోచిస్తారు. దాంతో నోట్సులో ఏం రాసుకున్నామనే ఆసక్తి లేకుండా చదవాలి కాబట్టి చదివి; రాయాలి కాబట్టి పరీక్షల్లో రాస్తారు. ఆసక్తి ఉండదు కాబట్టి పాఠ్యాంశాన్ని బట్టీ పద్ధతిలో చదువుతారు. పరీక్షల్లో రాసే సమయానికి సగానికి సగం గుర్తుండదు. ఎక్కడైనా ఒక పదం గుర్తుకు రాకపోతే ఇక సమాధానం కుంటుపడుతుంది. అందుకే వీళ్లు వెనకపడిపోతుంటారు.

గుర్తుంచుకోండి...! 

         ఇక అసలు విషయానికొస్తే - పిల్లల ప్రతిభ స్థాయిని బట్టి తల్లిదండ్రులు వారిపై, చదువుపై చూపాల్సిన శ్రద్ధ కూడా మారుతుంది. సగటు విద్యార్థి తెలివైనవాడిగా రూపొందాలన్నా, వెనకపడిన విద్యార్థి కనీసం సగటు విద్యార్థిగా రూపొందాలన్నా తల్లిదండ్రుల తోడ్పాటు చాలా ముఖ్యం! పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలంటే తమ కృషి తప్పనిసరిగా ఉండాలనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. 
    ¤ ప్రతిభ ఉన్న విద్యార్థుల గురించి అంతగా విచారపడాల్సిన పనిలేదు. కాబట్టి రోజూ క్లాసులో చెప్పిన పాఠాలేమిటో, మామూలుగా కనుక్కుంటూ ఉంటే చాలు. అదే సమయంలో ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు బోధించే విధానం, విద్యార్థులతో ప్రవర్తించే తీరు లాంటి విషయాలను సహజ సంభాషణ తీరులో చర్చిస్తూ ఉండటం మంచిది. సాధారణంగా క్లాసులో నాలుగైదు ర్యాంకుల్లో ఉండే విద్యార్థులను నిరాశపరిచేలా మాట్లాడటం సరికాదు. 

 ఇలా చేయకండి...!
'మొదటి ర్యాంకు ఎవరికొచ్చింది?'
'వాడికొచ్చిన మార్కులు నీకెందుకు రాలేదు?'
'రెండు మార్కులెందుకు పోయాయి?'
'ఈసారి కూడా నాలుగో ర్యాంకేనా?'
'ఇక ముందుకెళ్లేది లేదా?'  

          ఇలాంటి ప్రశ్నలతో పిల్లలు చిన్నబుచ్చుకునేలా మాట్లాడటం ఎంతమాత్రం మేలు చేయదు. తరగతిలో నాలుగు లేదా అయిదో స్థానం అంటే ఎంతో తెలివైన విద్యార్థి అనే అర్థం. తెలివితేటలను నిర్ణయించేది మొదటి రెండు ర్యాంకులే కావు. కానీ దురదృష్టవశాత్తూ ర్యాంకుల పంటలు పండిస్తున్నామనే ప్రకటనలతో ఊదరగొడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఆ ప్రభావంలోనే జీవిస్తున్నారు. పిల్లలు ఎంత బాగా చదివినా 'ఇంకా చదవాలి, ఇంకా మంచి ర్యాంకు రావాలి' అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. జీవితంలో ర్యాంకులకి ఎంతో ప్రాముఖ్యం ఉందనుకుంటున్నారు. తర్వాతి స్థాయి విద్యలో అడ్మిషన్ దృష్ట్యా ప్రాముఖ్యం ఉండొచ్చు. కానీ అవి పిల్లల జీవితాల పాలిట పీడకలలుగా పరిణమిస్తున్నాయన్న సంగతి తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.

          కొందరు ప్రతిభావంతులైన పిల్లలు అదే పనిగా చదువుతూ పుస్తకాల పురుగుల్లా గదిలోంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు దీన్నొక గొప్ప లక్షణంగా భావిస్తూ 'మా అబ్బాయికి/ అమ్మాయి పుస్తకాలు తప్ప మరో లోకం పట్టదు. గదిలోంచి బయటికే రాడు/దు' అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. మెదడుకి ఒక స్థాయి తర్వాత శ్రమను ఇవ్వడం అంత మంచిపని కాదు. చదువులో ఎలాగూ ముందంజలోనే ఉంటున్నారు కాబట్టి అలాంటి పిల్లలు అప్పుడప్పుడూ కొంత విరామం తీసుకునేలా తల్లిదండ్రులే చొరవ చూపాలి. భోజనాలు, పానీయాలు గదిలోకే తీసుకెళ్లి అందిస్తూ పిల్లలు గదిలోంచి బయటికి రావాలనుకున్నా నిరోధించడం మంచిది కాదు. బాగానే చదువుతున్నాడు కదా అని పూర్తిగా వదిలివేయడమూ అంత మంచిది కాదు. 
           సగటు విద్యార్థుల విషయానికొస్తే వీళ్ల మీద కొంచెం శ్రద్ధపెడితే ఉత్తమస్థాయి విద్యార్థులవుతారు. వీళ్లకున్న సమస్యల్లా జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటమే. పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. ఈ రెంటినీ అధిగమించడం పెద్ద కష్టమేం కాదు. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక, చదువుకునే సమయంలో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వారి దగ్గర ఉండాలి. తనపై అమ్మకీ, నాన్నకీ శ్రద్ధ ఉందన్న భావన విద్యార్థికి మానసికంగా ధైర్యాన్నిస్తుంది. అర్థం కాని పాఠాన్ని వివరించి చెప్పాలి. ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాక కూడా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పాఠ్యాంశాలు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి. తద్వారా పాఠం అర్థమవడమే కాదు మానసిక బంధం కూడా బలపడుతుంది. దాదాపు ట్యూషన్ల జోలికి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నిస్తే ఉత్తమం. ఎందుకంటే ట్యూషన్ పిల్లలకు మరో స్కూలు లేదా కాలేజీలాంటిదే! ఇంట్లో ఉండి చదువుకున్నప్పుడు లభించే ప్రశాంతత అక్కడ దొరకదు. ఇలాంటి పిల్లలలో ఆత్మవిశ్వాసం స్థాయిని పెంచడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యం. వారితో వీలైనంత సమయాన్ని గడపాలి. అంటే అస్తమానం నీడలా వెంటాడుతూ చదువుకోమని వేధించకూడదు. సగటు విద్యార్థిగా ఉన్నంత మాత్రన కొంపలేమీ మునగవని ధైర్యం చెప్పాలి. అయితే, మంచి మార్కులు సంపాదించుకోకపోతే కెరీర్ ప్లానింగ్ కష్టమవుతుందనీ, జీవితంలో స్థిరపడటం ఆలస్యమవుతుందనీ వారికి అర్థమయ్యేలా వివరించాలి. మంచి మార్కులు సంపాదించాలనే తపన వారిలో సహజంగా రేకెత్తేలా తల్లిదండ్రుల ప్రవర్తన, మాటలు ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్లు కాస్త శ్రద్ధ పెడితే వీరిని సానపెట్టడం కష్టమేం కాదు. కావల్సిందల్లా సమయం, సహనం! 
           మూడోరకం  విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వారి గురించి తర్వాత వ్యాసంలో తెలుసుకుందాం.

Posted Date: 22-04-2020

పిల్లల స్వభావాలు