• facebook
  • whatsapp
  • telegram

తగిన బ్రాంచి తెలుసుకోండి!

పక్కింటి పవన్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి డల్లాస్‌లో డాలర్లు పోగేస్తున్నాడట. మనవాడిని ఆ బ్రాంచిలోనే చేర్చి అమెరికా పంపేద్దాం. తల్లిదండ్రుల సగటు ఆలోచన. ప్రోగ్రామింగ్‌ పడదు. మెకానికల్‌ చేస్తా అని మదన్‌ మొత్తుకున్నా వినకుండా చీవాట్లు పెట్టి మరీ సీఎస్‌ఈలో చేర్చారు. అయిదు సెమిస్టర్లు దాటినా ఆరు బ్యాక్‌లాగ్‌లు అలాగే ఉండిపోయాయి. తప్పు జరిగిందా అని ఇప్పుడు తెగ బాధపడినా ప్రయోజనం లేకపోయింది. అందుకే విద్యార్థికి తగిన బ్రాంచి ఏదో ముందే ఒక అంచనాకి రావాలి. అభిరుచి, ఆసక్తి ప్రధానమే అయినప్పటికీ ఆయా సబ్జెక్టుల్లోని కొన్ని అధ్యాయాలపై పట్టు గురించి పరిశీలిస్తే విద్యార్థి ఏ బ్రాంచిలో రాణించగలడో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎంసెట్‌ అనే మొదటి అడుగు ముగిసింది. ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం అ్కనే రెండో అడుగు వెయ్యటానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీసీ విద్యార్థులు. ఇక ఏ బ్రాంచి తీసుకోవాలనేదానిపై వారి దృష్టి ప్రధానంగా ఉంటుంది. ఈసందర్భంగా ఒక బ్రాంచిలో చేరటానికి ఏ సబ్జెక్టులో ఏ అంశాలపై పట్టు ఉండాలో గ్రహించటం అవసరం. అప్పుడే విద్యార్థులకో స్పష్టత వస్తుంది.
కౌన్సెలింగ్‌ ప్రక్రియలో నిపుణులు సాధారణంగా ఇచ్చే సమాధానాలు విద్యార్థులకు అంత సంతృప్తికరంగా అనిపించవు. కొంతవరకు ఆ సలహాలూ, సూచనలూ అందరికీ వర్తించేవేనని అనిపిస్తుంటాయి. మరి సొంతంగా పరీక్షించుకుని తెలుసుకునే విధానం ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అందుకే ఈ బ్రాంచి చదవాలంటే ఫలానా సబ్జెక్టులో ఏయే అంశాలపై పట్టు అవసరమో నిర్దిష్టంగా తెలిస్తే.. అది ప్రయోజనకరం.
వచ్చిన ర్యాంకు, అందుబాటులో ఉన్న సీట్లు, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం తీసుకోవాలి. కొత్త ఆవిష్కరణలతో కొన్ని రకాల ఉద్యోగాలు తగ్గిపోతుండటంతో అభ్యర్థులు ఏ బ్రాంచి తీసుకోవాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. ఇలాంటి గందర గోళాన్ని తప్పించుకోవాలంటే పేరున్న కాలేజీలో మంచి బ్రాంచిలో చేరాలి.
అలాంటప్పుడు ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేస్తే అవకాశాలుంటాయి, ఏ బ్రాంచి బాగుంటుంది వంటి ప్రశ్నలకే కాకుండా అదనంగా, ఏ బ్రాంచిలో నాకు అభిరుచి అనే దిశలో ఆలోచించటం మేలు చేస్తుంది. దీనివల్ల ఇంజినీరింగ్‌పట్ల భయం, అనిశ్చితి తొలగుతుంది. శ్రద్ధతో, ఉత్సాహంతో కోర్సు పూర్తి చెయ్యడమే కాకుండా, ధీమాతో కెరియర్‌ తీర్చిదిద్దుకోవచ్చు.
ఇంటర్మీడియట్‌ వరకూ తల్లిదండ్రుల, అధ్యాపకుల రక్షణకవచంలో పెరిగిన విద్యార్థులకు తమ అభిరుచి తెలుసుకోవడం కాస్త కష్టమనిపించవచ్చు. పైగా ఇంజినీరింగ్‌లో అన్ని సబ్జెక్టులూ తిరిగి నేర్పిస్తారు కదా అప్పుడు బాగా చదవొచ్చులే అనుకునే అవకాశాలు లేకపోలేదు. ఇందులోని సత్యం కొంత మాత్రమే.
గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలు మళ్లీ చదివినా, ఇంటర్మీడియట్‌ స్థాయికీ¨, ఇంజినీరింగ్‌ స్థాయికీ మధ్య అంతరం చాలా ఉంటుంది. ఇంజినీరింగ్‌ స్థాయిలో ప్రయోగాలకు, ఆచరణకు ప్రాధాన్యం ఎక్కువ. కాబట్టి కేవలం బట్టీకొట్టే పద్ధతిలో చదివితే సరిపోదు. పైగా అధ్యాపకులకు కూడా ఎంతో చెప్పాలని ఉన్నా సమయాభావం, వెంటవెంటనే వచ్చే పరీక్షల ఒత్తిడి వల్ల అన్నీ వివరంగా చెప్పలేరు. లెక్చరర్లు చెప్పదలచుకున్న పాఠ్యాంశాలను ఒకసారి చదువుకుని తరగతుల్లో వింటే చక్కగా అర్థమవుతాయి. ఈ ప్రక్రియ కూడా సరిగ్గా జరగాలంటే, మన అభిరుచికి తగిన బ్రాంచిని ఎన్నుకుంటే మంచిది.
ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో డిగ్రీ స్థాయిలో అందరికీ ఒకే సిలబస్‌ ఉంటుంది. సందిగ్ధతకు అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇంజినీరింగ్‌ విషయానికి వచ్చేసరికి పనుల వైవిధ్యం, సమాజ పురోగతిపై ఇంజినీర్ల ప్రభావం, అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వడంవైపే మొగ్గు చూపుతాయి.
మీ ఆసక్తి వేటిపై?
సాధారణంగా ఒక సబ్జెక్టులోని అన్ని అధ్యాయాలూ విద్యార్థులకు ఆసక్తి కలిగించవు. కొన్ని అధ్యాయాలే ఎక్కువ ఆసక్తి కలిగిస్తాయి; ఇంకా వినాలనిపించే సందర్భాలూ ఉంటాయి.
ఇంటర్మీడియట్‌ గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని కొన్ని అధ్యాయాలు మన అభిరుచిని గుర్తించడంలో సహాయపడతాయి. దాన్ని బట్టి ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో రాణించగలమో అంచనా వేసుకోవటానికి పట్టికలు చూడండి.

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌