‣ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎంసెట్ పరీక్ష రానే వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అనేక సందేహాలు ఉండటం సహజం. వారి అనుమానాలు నివృత్తి చేసేలా పరీక్ష ప్రక్రియపై faq's (frequently asked questions), వాటి జవాబులు..
ప్రశ్న: దరఖాస్తు ఏ మోడ్‌లో చేయాలి?
జవాబు: కేవలం ఆన్లైన్లోనే చేయాలి.
ప్ర: ఫీజు ఎలా కట్టాలి?
జ: టీఎస్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కట్టొచ్చు. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ పేమెంట్ చేయొచ్చు.
ప్ర: దరఖాస్తు చేరిందని ఎలా తెలుస్తుంది?
జ: దరఖాస్తు పూర్తిచేశాక మన మొబైల్ నంబర్‌కు ఒక రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. అలాగే మనం ఇచ్చిన వివరాలు బార్‌కోడ్‌తో సహా డేటాబేస్‌లో నిక్షిప్తం అవుతాయి.
ప్ర: దరఖాస్తులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నంబరు తప్పుగా రాస్తే ఏంచేయాలి?
జ: convener.eamcet@tsche.ac.in అనే మెయిల్ ఐడీకి మీ సంతకంతో కూడిన రిక్వెస్ట్ లెటర్ కాపీని స్కాన్ చేసి పంపాలి. దానికి సెకెండ్ ఇయర్ హాల్ టికెట్ లేదా మార్క్స్ మెమో కాపీని జతచేసి నంబరు మార్చుకునే అవకాశం కోరవచ్చు.
ప్ర: ఏవైనా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలా?
జ: అక్కర్లేదు. పరీక్ష సమయంలో దరఖాస్తు నకళ్లు తీసుకెళ్తే సరిపోతుంది.
ప్ర: కుల ధ్రువపత్రాలు జతచేయాలా?
జ: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కేటగిరీ ధ్రువపత్రాన్ని కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువపత్రాన్ని దరఖాస్తుతోపాటు పరీక్ష సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.
ప్ర: అప్లికేషన్ పీజు ఎంత?
జ: ఇంజినీరింగ్ స్ట్రీమ్ - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ - రూ.400/-, ఇతరులకు రూ. 800/-
* అగ్రికల్చర్ అండ్ మెడికల్ - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ - రూ.400, ఇతరులకు రూ.800.
ప్ర: ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేశాక తిరిగి ఎడిట్ చేయడం వీలవుతుందా?
జ: అనుమతించిన గడువులో కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. పేరు, తండ్రిపేరు, పుట్టినతేదీ వంటి వివరాలు మార్చుకోవాలంటే కన్వీనర్‌కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ప్ర: ఒక స్ట్రీమ్‌లో పరీక్ష రాసేందుకు ఫీజు కట్టి దాన్ని వేరే స్ట్రీమ్‌లో రాసేందుకు మార్చుకోవడం వీలుపడుతుందా?
జ: లేదు, ఏ స్ట్రీమ్‌కి ఫీజు కడితే దానికే పరీక్ష రాయాలి. వేరే రాయాలి అనుకుంటే మళ్లీ ఫీజు కట్టాల్సిందే.
ప్ర: మీడియం ఎలా ఎంచుకోవాలి?
జ: పూర్తిగా ఇంగ్లిష్ మాధ్యమంలోనే చదివిన వారు కావాలంటే ‘ఇంగ్లిష్ ఓన్లీ’ ఆప్షన్ ఎంచుకోవచ్చు. తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో చదివిన వారికి వాటితోపాటూ ఇంగ్లిష్‌లోనూ పేపర్ ఉంటుంది.
ప్ర: మీడియం తప్పుగా ఎంచుకుంటే ఏం చేయాలి?
జ: మార్చుకునేందుకు అవకాశం కోరుతూ కన్వీనర్‌కు రిజిస్టర్ అయిన ఐడీ నుంచి మెయిల్ చేయాలి. దానికి ఇంటర్ సెకెండ్ ఇయర్ హాల్ టికెట్ లేదా మార్క్స్ మెమో జత చేయాలి.
ప్ర: ఎన్ని మార్కుల ప్రశ్నలుంటాయి?
జ: మూడు విభాగాల్లో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.
ప్ర: నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా?
జ: లేదు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 6
దరఖాస్తుకు చివరి తేదీ: మే 28
ఎడిటింగ్ విండో తెరిచి ఉండే సమయం: మే 30 - జూన్ 6
లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరితేదీ: జులై 7
అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేది: జూన్ 25 - జులై 11
పరీక్ష తేదీలు: జులై 14, 15, 18, 19, 20.
స్టడీమెటీరియల్
‣ భౌతికశాస్త్రం
‣ గణితశాస్త్రం
‣ రసాయన శాస్త్రం
‣ వృక్షశాస్త్రం
‣ జంతుశాస్త్రం
‣ నమూనా ప్రశ్నపత్రాలు
‣ పాత ప్రశ్నపత్రాలు
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ‘డిజిటల్ సొసైటీ’లో ఎమ్మెస్సీ
‣ అధిక వేతనాలతో అవకాశాలు అందించే ఆస్ట్రో ఫిజిక్స్
‣ భారత విద్యార్థులకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్షిప్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.