• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం

* మే 26న పరీక్ష.. జూన్ 9న ఫలితాలు

* 2.5 లక్షల మందికి అర్హత

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) గాను బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ మెయిన్స్‌లో నిర్ణీత కటాఫ్‌ పర్సంటైల్‌ సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష మే 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ మద్రాస్‌.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 రిజిస్ట్రేషన్‌ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరీక్ష రాసేందుకు 2.5 లక్షల మందికి అర్హత ఉంది.

 

   జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ లింక్‌  


 జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి 


Model paper-1  


Model paper-2  


  ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు
 

 ♦ నమూనా ప్రశ్నపత్రాలు  

Posted Date : 28-04-2024

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌