• facebook
  • whatsapp
  • telegram

మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం! 

జేఈఈ - 2022 మెరుగైన స్కోరుకు సూచ‌న‌లు

 

 

ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష సెషన్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష రాసిన 7,69,589 మందిలో 14 మంది 300కు 300 మార్కులు (100 పర్సంటైల్‌) సాధించారు. అయితే మొదటి సెషన్‌లో ఆశించినమేర స్కోరు సాధించనివారు మెరుగు పరచుకోవడానికి మరో అవకాశం ఉంది. సెషన్‌ 2 పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరుగుతాయి. వీరంతా ఇప్పుడున్న వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన మార్కులు తెచ్చుకునేందుకు ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!

 

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించారు. ఇందులో మొత్తం 13 ప్రశ్నపత్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థుల అభిప్రాయం ప్రకారం..

మ్యాథ్స్‌ సంక్లిష్టంగా.. 

ఫిజిక్స్‌ తేలిక నుంచి మధ్యస్థంగా..

కెమిస్ట్రీ తేలిక నుంచి కఠినంగా ఉంది..

పరీక్ష ఫలితాలు సైతం దాదాపు ఇలాగే ఉన్నాయి. అయితే పేపర్‌ కఠినమా, మధ్యస్థమా లేదా తేలికగా ఉందా అనేది పూర్తిగా విద్యార్థి సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ సెషన్‌లో పరీక్ష రాసినవారి తెలివితేటలూ కీలకమే.

 

మ్యాథ్స్‌..

ఇది సంక్లిష్టంగా ఎందుకు అనిపించిందంటే.. జేఈఈ మెయిన్‌కు అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో సన్నద్ధమైనవారికి ప్రతి పేపర్‌లోనూ దాదాపు 2 నుంచి 3 ప్రశ్నలు కాస్త సమయం ఎక్కువ తీసుకునే విధంగా ఉన్నాయి. అంటే ఎక్కువ శాతం ఆ తరహా ప్రశ్నలు విద్యార్థులకు తెలిసినా.. అర్థం చేసుకుని సాధించడానికి నిర్దేశిత సమయం కంటే ఎక్కువ వ్యవధి అవసరమైంది. 

జేఈఈ మెయిన్‌ పరీక్షను ఇంటర్మీడియట్‌ బోర్డు తరహా లేదా ఎంసెట్‌ స్థాయిలో సన్నద్ధమైనవారికి సుమారు 10 నుంచి 12 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. 

మ్యాథ్స్‌లో ఎక్కువ శాతం విద్యార్థులు డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, వెక్టార్స్, 3డీ, నంబర్‌ థియరీ సంబంధిత ప్రశ్నల్లో తప్పులు చేశారు.

 

ఫిజిక్స్‌...

ఇది తేలిక నుంచి మధ్యస్థం ఎందుకు అనిపించిందంటే.. ఎక్కువ శాతం ప్రశ్నలు నేరుగా, ఎలాంటి మెలికలు పెట్టకుండా అడిగారు. అందుకే ఎక్కువ మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఎలక్ట్రోస్టాటిక్స్, ఈఎంఐ, మోడరన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్‌లో కొన్ని ప్రశ్నలు సంక్లిష్టంగానే ఉన్నాయి. 

 

కెమిస్ట్రీ..

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలోని ప్రతి అంశంపైనా పట్టుసాధించిన విద్యార్థులకు ఈ విభాగంలో 90 శాతం ప్రశ్నలు సాధారణంగానే ఉన్నాయి. 

ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలోని గుర్తుంచుకోవాల్సిన అంశాలను సరిగా సాధన చేయనివాళ్లు ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. అందుకే వీరు పేపర్‌ మధ్యస్థంగా ఉందన్నారు. 

ఫిజికల్‌ కెమిస్ట్రీ నుంచి ముఖ్యమైన అధ్యాయాల నుంచి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావడంతో అవి కఠినం అనిపించాయి. 

సెషన్‌-1లో అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఎక్కువ ప్రశ్నలు అసర్షన్‌ అండ్‌ రీజన్‌ లేదా స్టేట్‌మెంట్‌-1, స్టేట్‌మెంట్‌-2 తరహాలో ఉన్నాయి. కాన్సెప్ట్‌పై పట్టు లేనివారు, ఆ తరహా ప్రశ్నలను సాధన చేయనివారు ఎక్కువ తప్పులు చేశారు. 

 

 

పై రెండు పట్టికల ద్వారా గమనించాల్సింది ఏమిటంటే.. ఎంత పర్సంటైల్‌ స్కోరుకు ఎంత ర్యాంకు వచ్చే ఆస్కారం ఉంది అన్న విషయం. అయితే దీనికి కొనసాగింపుగా ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌ రావచ్చో తెలుసుకుంటే, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుని, సెషన్‌-2లో మంచి ఫలితం సాధించవచ్చు.

 

ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌?

జేఈఈ మెయిన్‌ 2022 సెషన్‌-1లో ఎన్ని మార్కులకు ఎంత పర్సంటైల్‌ స్కోరు సాధించారంటే... (పేపర్‌ స్థాయిని కఠిన, మధ్యమ, తేలిక ఇలా 3 విధాలుగా తీసుకుని మార్క్స్‌ వర్సెస్‌ పర్సంటైల్‌)


ఉన్న వ్యవధిలో ఏం చేయాలంటే..

కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించకండి.

సెషన్‌-1లో మీరు రాసిన ప్రశ్నపత్రంతోపాటు మిగిలిన 12 ప్రశ్నపత్రాలనూ సాధన చేయాలి. 

ప్రతి సబ్జెక్టులోనూ కనీసం కొన్ని అసర్షన్‌ అండ్‌ రీజన్‌ లేదా స్టేట్‌మెంట్‌-1 అండ్‌ స్టేట్‌మెంట్‌-2 తరహా ప్రశ్నలను సాధన చేయాలి. 

సెషన్‌-1లో ప్రశ్నపత్రాల స్థాయి ఎలా ఉందో సెషన్‌-2లోనూ అలాగే ఉంటుందని భావించకుండా సన్నద్ధతను ఉన్న వ్యవధిలో వీలైనంత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.

ఎన్‌టీఏ ప్రాక్టీస్‌ టెస్టులను తప్పకుండా రాయాలి. 

ఎంతలోపు ర్యాంకు ఆశిస్తున్నారో నిర్ణయించుకుని, అందుకు తగ్గ సాధన చేయాలి. 

జేఈఈ మెయిన్‌- 2021 మాదిరిగానే జేఈఈ మెయిన్‌- 2022 కటాఫ్‌ ఉండొచ్చు.

 


 

స్టడీమెటీరియల్
 

రసాయన శాస్త్రం
భౌతికశాస్త్రం
గణితశాస్త్రం

T.M
T.M
T.M

E.M
E.M
E.M

 

పాత ప్రశ్నప‌త్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు

 

T.M
T.M 

 

E.M
E.M 

 


 


Posted Date : 15-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌