• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ... జయీభవ! 

జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ ‌ పరీక్షలో గరిష్ఠంగా స్కోరు చేసేందుకు అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. అవేమిటో చూద్దాం! ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి ఎంపీసీ విద్యార్థీ తన జీవితంలో రాసే తొలి జాతీయస్థాయి పరీక్ష.. జేఈఈ మెయిన్‌. 
 పరీక్ష సులభంగా ఉంటుందా, కఠినంగా ఉంటుందా అనే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎలా ఉన్నా అది పెద్ద విషయమేమీ కాదు. రెండు సంవత్సరాలు నిజాయితీగా సిద్ధమైన మీకు పేపర్‌ కష్టం అనిపిస్తే అది అందరికీ కష్టమే అవుతుంది. ఈ విషయం మర్చిపోవద్దు.  విద్యార్థులు కనీసం కొన్ని కీలక అంశాలపై దృష్టి సారిస్తే.. మెరుగైన ఫలితాలు సాధించే ఆస్కారం ఉంటుంది. అవి..
 

మాదిరి ప్రశ్నపత్రాలు
ఇప్పటివరకూ మీరు సిద్ధమైవున్న అంశాలపై పట్టు తెలుసుకునేందుకు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు, మాదిరి ఆన్‌లైన్‌ ప్రశ్నపత్రాలను కనీసం రోజుకొక్కటి రాయాలి.

 

ఫార్ములాలూ కాన్సెప్టులూ
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని జేఈఈ-మెయిన్‌ ప్రాధాన్య అధ్యాయాల్లో ఉన్న ఫార్ములాలనూ, కాన్సెప్టులనూ చూసుకోవాలి. రసాయన శాస్త్రంలోని చర్యలూ (రియాక్షన్స్‌) ప్రతిచర్యలనూ మననం చేసుకోవాలి. 

 

షార్ట్‌ నోట్సు
ప్రతి సబ్జెక్టులో మీరు తయారుచేసుకున్న ముఖ్య విషయాలతో కూడిన షార్ట్‌ నోట్సుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పునశ్చరణకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

 

ఆందోళన వద్దు
పేపర్‌ ఎలా ఉంటుందో, ఏమో, పరీక్ష హాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తుందో..ఇలాంటి అనవసర విషయాలపై ఆందోళనలకు గురి కావొద్దు. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. 

 

ఇవి గమనించండి
* పరీక్ష ముందురోజు రాత్రి పెందలాడే నిద్రపోవటం మంచిది. మరుసటి రోజు రాసే పరీక్షను ఎలా బాగా రాయాలో ఊహించుకుంటూ నిద్రపొండి.
* పరీక్ష రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. 
ఇంటిదగ్గరే తేలిక ఆహారం తీసుకోండి. ఖాళీకడుపుతో పరీక్షకు వెళ్లవద్దు. తగినంత నీరు తాగండి.   
* వీలైతే ప్రాణాయామం చేయండి. 
* ధీమాగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.  
* రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరేలా చూసుకోండి.
* ప్రశ్నపత్రాల స్థాయిని గురించి వచ్చే వదంతులను పట్టించుకోవద్దు.
* మీతో పాటు శానిటైజర్, రెండు మాస్కులు, ఒక వాటర్‌ బాటిల్‌ తీసుకువెళ్లండి. వీలైతే రఫ్‌వర్క్‌ కోసం తెల్లకాగితం తీసుకువెళ్లండి. పరీక్ష హాల్లో అనుమతి ఇచ్చారా సరేసరి, లేకపోతే అక్కడే వదిలేసెయ్యండి. 
పరీక్ష హాల్లో ప్రశ్నపత్రంలోని నియమనిబంధనలన్నీ  జాగ్రత్తగా చూసుకోవాలి. 
* ఏ చిన్నవిషయంలోనైనా మీకు సమస్య వస్తే మొహమాటపడకుండా ఇన్విజిటేటర్‌ని అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి.
* మూడు గంటల సమయాన్ని పూర్తిగా వాడుకోండి.
పరీక్ష ఒకవేళ సరిగా రాయకపోయినా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్ష మాత్రమే. దీని ప్రభావం ఎంసెట్, ఇతర పరీక్షలపై పడనీయొద్దు. 

Posted Date : 17-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు