• facebook
  • whatsapp
  • telegram

S - బ్లాకు మూలకాలు (క్షార, క్షార మృత్తిక లోహాలు)  

1. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.

      1) లిథియం లవణాలు చాలావరకు చెమ్మగిల్లుతాయి.
      2) నీటితో జరిపే చర్య సోడియం కంటే లిథియంకు తక్కువ.
      3) క్షారలోహ కార్బొనేట్లలో, లిథియం కార్బొనేట్‌కు ఉష్ణీయ స్థిరత్వం తక్కువ.
      4) క్షారలోహ హైడ్రోజన్ కార్బొనేట్లన్నీ ఘనపదార్థాలే.
సమాధానం: (4)
వివరణ: 1వ గ్రూపులో LiHCO3 ద్రవం కాగా మిగిలిన మూలకాల బైకార్బొనేట్లు ఘనపదార్థాలు.

2. సాల్వే విధానంలో పొటాషియం కార్బొనేట్‌ను ఎందుకు తయారు చెయ్యలేం?
       1) ఇది చాలా పొడవైన (దీర్ఘ) ప్రక్రియ.
       2) KHCO3 నీటిలో ఎక్కువగా కరగడం వల్ల దీన్ని వేరుచెయ్యడం కష్టం.
       3) ఈ ప్రక్రియలో వచ్చే K2CO3 లో మలినాలు ఎక్కువగా ఉంటాయి.
       4) పైవన్నీ
సమాధానం: (2)
వివరణ: KHCO3 నీటిలో బాగా కరిగిపోవడం వల్ల K2CO3 ను వేరుపరచలేం. కాబట్టి దీన్ని తయారు చేయలేం.

 

3. Na2CO3 ను నీటిలో కరిగిస్తే ఏర్పడే సమ్మేళనం(లు)
       1) కేవలం NaOH           2) NaHCO3 & NaOH
       3) Na2O & H2CO3      4) Na2O2, NaOH
సమాధానం: (2)
వివరణ: Na2CO3 + H2O  
 NaHCO3 + NaOH

4. ద్రవ అమ్మోనియాలో క్షార లోహాన్ని కరిగిస్తే ఆ ద్రావణం
       1) నీలి రంగులో ఉంటుంది      2) పారా అయస్కాంతత్వాన్ని పొందుతుంది
       3) మిశ్రమ వాహకం              4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్నీ సరైనవే, అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల.


            
 

5. S అనేది ఉత్పతన శక్తి, I.E. అనేది అయనీకరణ ఎంథాల్పీ, H.E. అనేది హైడ్రేషన్ ఎంథాల్పీ అయితే ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ Eo సంబంధం
      1) Eo = S + I.E + H.E.      2) E=  1/2 
 S + I.E. + 2 H.E.
     3) Eo = S - I.E. + H.E.       4) Eo = S + I.E. +  H.E.
సమాధానం: (1)
వివరణ: Eo = S + I.E + H.E. 

6. సాల్వే విధానం మొత్తం మీద జరిపే చర్య
   1) 2 NH3 + H2O + CO2  
 (NH4)2CO3
   2) 2 NaCl + CaCO3  
 Na2CO3 + CaCl2
   3) NH3 + H2O + CO2  
 NH4HCO3
  4) 

సమాధానం: (2)
వివరణ: మొత్తం చర్య: 2 NaCl + CaCO3  Na2CO3 + CaCl2

7. మృదువైన సబ్బులో వాడే పదార్థం
  1) NaOH        2) NaCl        3) KOH        4) KCl
సమాధానం: (3)
వివరణ: మృదువైన సబ్బుల్లో KOH ను ఉపయోగిస్తారు.

 

8. బట్టలు ఉతికే సోడాను 375 K వరకు వేడిచేసినప్పుడు, 375 K కు పైగా వేడిచేసినప్పుడు పోయే నీటి ద్రవ్యరాశులు వరుసగా
   1) 180 గ్రా., 0 గ్రా.               2) 90 గ్రా., 90 గ్రా.
   3) 18 గ్రా., 162 గ్రా.             4) 162 గ్రా., 18 గ్రా.
సమాధానం: (4)


9. మానవ శరీరంలో Na, K నిష్పత్తి ఎంత?
   1) 9 : 5         2) 17 : 5         3) 9 : 17         4) 17 : 9
సమాధానం: (3)
వివరణ: Na భారం : K భారం = 90 గ్రా : 170 గ్రా. = 9 : 17
         (70 కిలోల బరువున్న వ్యక్తిలో)

 

10. నాడీ సంకేతాలను ప్రసారం చేసే అయాన్లు ఏవి?
   1) Mg+2 & Ca+2   2) Na+, K+    3) 1 & 2 రెండూ   4) కేవలం Na+
సమాధానం: (2)
వివరణ: Na+ & K+ నాడీ సంకేతాలను ప్రసారం చేస్తాయి.

11. కిందివాటిలో తేమను గ్రహించే పదార్థం(లు)
    1) CaCl2         2) MgCl2         3) NaOH         4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: ఇవన్నీ వాతావరణంలోని తేమను (H2O) గ్రహిస్తాయి.

 

12. LiF, CsI ద్రావణీయతలు చాలా తక్కువ. ఎందుకు?
     1) LiFకు ఉండే అధిక లాటిస్ శక్తి; Cs+, I- అయాన్లకు ఉండే అల్ప హైడ్రేషన్ ఎంథాల్పీ
     2) LiFకు ఉండే అధిక లాటిస్ శక్తి; Cs+, I- అయాన్లకు ఉండే అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ
     3) LiFకు ఉండే అల్ప లాటిస్ శక్తి; Cs+, I- అయాన్లకు ఉండే అల్ప హైడ్రేషన్ ఎంథాల్పీ
     4) LiF కు ఉండే అల్ప లాటిస్ శక్తి; Cs+, I- అయాన్లకు ఉండే అధిక హైడ్రేషన్ ఎంథాల్పీ
సమాధానం: (1)

13. ఎర్రరక్త కణాల్లో కింది ఏ అయాను ఎక్కువగా పోగవుతుంది?
     1) Na+      2) K+      3) Ca+2      4) Mg+2
సమాధానం: (2)

వివరణ: ఎర్ర రక్తకణాల్లో K+ అయాన్లు ఎక్కువగా పోగవుతాయి.
 

14. కిందివాటిలో వేడి చేసినప్పటికీ విఘటనం చెందని కార్బొనేట్ ఏది?
     1) Li2CO3      2) BaCO3     3) Na2CO3     4) CaCO3
సమాధానం: (3)
వివరణ: వేడి చేసినప్పటికీ Li2CO3 తప్ప మిగిలిన కార్బొనేట్లన్నీ స్థిరంగా ఉంటాయి.

 

15. క్షార లోహాల సూపర్ ఆక్సైడ్లు
     1) పసుపు లేదా నారింజ రంగును కలిగి ఉంటాయి.
     2) పారా అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటాయి.
     3) 1, 2 రెండూ
     4) రంగులేనివి, డయా అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటాయి.
సమాధానం: (3)
వివరణ: సూపర్ ఆక్సైడ్‌లలో బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల అవి పసుపు లేదా నారింజ రంగులో ఉంటాయి. పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి.

2వ గ్రూపు మూలకాలు: క్షారమృత్తిక లోహాలు

16. 'Be' మూలకం ' Al ' మూలకంతో కర్ణ సంబంధాన్ని కలిగి ఉండటానికి కారణం
       1) అయాన్ పరిమాణంలో సారూప్యత ఉండటం
       2) ధ్రువణ శక్తిలో సారూప్యత ఉండటం
       3) ఒకే విధమైన రుణవిద్యుదాత్మకత ఉండటం
       4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: పైన తెలిపిన అన్ని కారణాల వల్ల

 

17. సిమెంట్‌కు జిప్సమ్‌ను కలపడానికి కారణం
     1) గట్టిపడే ప్రక్రియ నెమ్మదిగా జరగడానికి
     2) గట్టిపడే ప్రక్రియను వేగవంతం చెయ్యడానికి
     3) కట్టడం దృఢత్వాన్ని పెంచడానికి
     4) పగుళ్లు రాకుండా చూడటానికి
సమాధానం: (1)
వివరణ: సిమెంట్‌కు 2 నుంచి 3% జిప్సంను కలపడం వల్ల సిమెంట్ నెమ్మదిగా గట్టిపడుతుంది.

18. మంచి గుణాలు ఉండే సిమెంట్‌లో సిలికా, అల్యూమినా నిష్పత్తి ఎంత?
      1) 1 నుంచి 2.5 వరకు             2) 2.5 నుంచి 4 వరకు
      3) 4 నుంచి 6.5 వరకు            4) ఏ నిష్పత్తిలోనైనా
సమాధానం: (2)
వివరణ: SiO2, Al2O3 నిష్పత్తి 2.5 నుంచి 4 వరకు ఉంటుంది.

 

19. పెద్దవారి శరీరంలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం నిష్పత్తి ఎంత?
    1) 5 : 1 : 24      2) 5 : 1 : 240     3) 1 : 5 : 240     4) 1 : 25 : 120
సమాధానం: (3)
వివరణ: పెద్దవారిలో 5 గ్రా. ఐరన్, 25 గ్రా. మెగ్నీషియం, 1200 గ్రా. కాల్షియం ఉంటాయి.

 

20. డై కాల్షియం సిలికేట్‌ను DCS తో, ట్రై కాల్షియం సిలికేట్‌ను TCS తో, ట్రై కాల్షియం అల్యూమినేట్‌ను DCA తో సూచిస్తే, పోర్ట్‌లాండ్ సిమెంట్‌లో ఉండే వాటి శాతాల సరైన క్రమం
     1) DCS > TCS > TCA      2) TCA > TCS > DCS
     3) DCS = TCS = TCA      4) TCS > DCS > TCA
సమాధానం: (4)
వివరణ: సిమెంట్‌లో ఉండే ముఖ్యమైన అనుఘటకాలు: 26% డై కాల్షియం సిలికేట్, 51% ట్రై కాల్షియం సిలికేట్, 11% ట్రై కాల్షియం అల్యూమినేట్.

21. కిందివాటిలో గ్రూపులో పై నుంచి కిందికి ఏది తగ్గడం వల్ల క్షారమృత్తిక లోహాల కార్బొనేట్ల ద్రావణీయతలు తగ్గుతాయి?
      1) ఘనపదార్థాల లాటిస్ ఎంథాల్పీ       2) కాటయాన్ల హైడ్రేషన్ ఎంథాల్పీ
      3) అయాన్ల మధ్య ఆకర్షణ                 4) ద్రావణం ఏర్పడటంలో ఎంట్రోపీ
సమాధానం: (2)
వివరణ: కాటయాన్ల హైడ్రేషన్ శక్తి తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.

 

22. Be, Al ఏ విషయంలో విభేదిస్తాయి?
    1) సమ్మేళనాల్లో అధిక సంయోజకతలను ప్రదర్శించడం.
    2) వాటి ఆక్సైడ్‌లు ద్వి స్వభావాన్ని ప్రదర్శించడం.
    3) సంయోజనీయ హైడ్రేట్లను ఏర్పరచడం.
   4) బృహదణు హైడ్రేట్లను ఏర్పరచడం.
సమాధానం: (1)
వివరణ: Be ప్రదర్శించే గరిష్ఠ సంయోజకత = 4
            Al ప్రదర్శించే గరిష్ఠ సంయోజకత = 6.

23. Ca, Sr, Ba లు జ్వాల పరీక్షలో ఇచ్చే రంగులు వరుసగా
      1) రంగు లేదు, కెంపు, ఆకుపచ్చ            2) రంగు లేదు, ఆపిల్ పచ్చ, కెంపు
     3) ఇటుక ఎరుపు, కెంపు, ఆపిల్ పచ్చ     4) ఇటుక ఎరుపు, ఆపిల్ పచ్చ, కెంపు
సమాధానం: (3)
వివరణ: Ca - ఇటుక ఎరుపు, Sr - కెంపు, Ba - ఆపిల్ పచ్చ.

 

24. BeO, C, Cl2 లు 800 K వద్ద చర్య జరిపి, ఇచ్చే క్రియాజన్యాలేవి?
     1) Be2C, Cl2O    2) BeCl2, CO    3) BeCl2, COCl2  4) చర్య లేదు
సమాధానం: (2)

25. Mg, O2; BeCl2, H2O మధ్య చర్య జరిపి వరుసగా ఇచ్చేవి
     1) MgO, Be(OH)2     2) MgO, BeO    3) MgO, BeH2     4) చర్య లేదు
సమాధానం: (4)
వివరణ: O2 & H2O లు పలుచని ఆక్సైడ్ పొరను (వాటి ఉపరితలంపై) ఏర్పరచడం వల్ల Be, Mg లు ఆక్సిజన్,
నీటితో తదుపరి చర్య జరపవు.

26. జతపరచండి.

సమూహం - I సమూహం - II
A) Cu - Be మిశ్రమ లోహం I) X - కిరణ గొట్టాలకు కిటికీలుగా
B) Be లోహం II) లోహాలను సంగ్రహించడానికి
C) Ca లోహం III) టూత్‌పేస్ట్‌లో ఒక అనుఘటకం
D) MgCO3 IV) అధిక బలం ఉన్న స్ప్రింగులు
  V) ఆమ్ల విరోధి

సరైన జత
           A   B    C   D               A    B    C  D
      1) IV   I    II    III           2) III    I    V    II
      3) III   II    I    IV           4) IV   V   III   II
సమాధానం: (1)
వివరణ: Cu - Be మిశ్రమ లోహం అధిక బలం ఉండే స్ప్రింగులు
            Be లోహం X - కిరణ గొట్టాలకు కిటికీలుగా
            Ca లోహం - లోహాక్సైడ్‌ల నుంచి లోహాలను సంగ్రహించడానికి
            MgCO3 - టూత్‌పేస్టులో ఒక అనుఘటకం.

27. కిందివాటిలో వాయు క్రియాజన్యాలను ఇవ్వని చర్య ఏది?    

    
         
సమాధానం: (3)


          
 

28. సిమెంట్ గట్టిపడటం అనేది
     1) ఉష్ణమోచక చర్య
     2) హైడ్రేషన్
     3) డై కాల్షియం సిలికేట్ వల్ల నెమ్మదిగా జరిపే చర్య
     4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్నీ సరైనవే

29. కింది ఏ సల్ఫేట్‌కు లాటిస్ శక్తి కంటే హైడ్రేషన్ శక్తి ఎక్కువగా ఉంటుంది?
      1) BaSO4      2) MgSO4       3) SrSO4     4) RaSO4
సమాధానం: (2)

30. CaCO3 ను
      1) సౌందర్య సాధనాల్లో పూరకంగా వాడతారు.
       2) టూత్‌పేస్ట్‌లో సున్నితమైన అపఘర్షకంగా వాడతారు.
       3) మేలురకం కాగితం తయారీలో వాడతారు.
      4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్ని ఉపయోగాలూ సరైనవే.

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌