1. కిందివాటిని పరిశీలించి స్పంజిక, జలగ, డాల్ఫిన్, పెంగ్విన్‌లకు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి.
1) పెంగ్విన్ స్థిరోష్ణజీవి మిగిలినవి అస్థిరోష్ణ జీవులు.
2) జలగ మంచినీటి జీవి. మిగిలినవి సముద్ర జీవులు.
3) స్పంజికలో కాలర్ కణాలు ఉంటాయి. మిగిలిన మూడింటిలో ఉండవు.
4) అన్నీ ద్విపార్శ్వ సౌష్ఠవంతో ఉంటాయి.
జ: 3(స్పంజికలో కాలర్ కణాలు ఉంటాయి. మిగిలిన మూడింటిలో ఉండవు.)
2. కింది వాటిని జతపరచండి:
A) దంశకణాలు | I) ప్లాటీహెల్మింథిస్ |
B) కొయనోసైట్లు | II) టీనోఫోరా |
C) జ్వాలా కణాలు | III) పోరిఫెరా |
D) వృక్కాలు | IV) నిడేరియా |
E) కంకాకార ఫలకాలు | V) అనెలిడా |
జ: A B C D E
IV III I V II
3. కిందివాటిలో దేన్ని 'వీనస్ ఫ్లవర్ బాస్కెట్' అంటారు?
1) స్పాంజిల్లా 2) సైకాన్ 3) యూప్లక్టెల్లా 4) క్లయోనా
జ: 3(యూప్లక్టెల్లా)
4. కుల్యావ్యవస్థ వీటి ప్రత్యేక లక్షణం-
జ: స్పంజికలు
5. పోరిఫెరాను దీని ఆధారంగా వర్గీకరించారు.
జ: అస్థిపంజరం
6. కిందివాటిని జతపరచండి:
A) హయలోనీమా | I) మంచినీటి స్పంజిక |
B) యూస్పాంజియా | II) డెడ్ మ్యాన్ ఫింగర్స్ |
C) కలైనా | III) బాత్ స్పంజిక |
D) స్పాంజిల్లా | IV) గాజుతాడు స్పంజిక |
జ: A B C D
IV III II I
7. కింది పట్టికను పరిశీలించండి.

పై పట్టికలో సరిగా జతపరచిన అంశాలు
జ: b - c
8. వ్యాఖ్య (A): పినాకోడర్మ్, కొయనోడర్మ్‌లు నిజమైన ఉపకళలు కావు.
కారకం (R): పినాకోడర్మ్, కొయనోడర్మ్‌లకు ఆధారత్వచం, కణసంధానాలు ఉండవు.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.
9. సరళమైన కుల్యావ్యవస్థలో నీటి ప్రవాహ మార్గం
a. స్పాంగోసీల్ b. కుల్యాముఖాలు c. వెలుపలకు d. ఆస్కులం
జ: b a d c
10. కింది అంశాలు అధ్యయనం చేయండి:
a. సైకాన్ లో కాల్కేరియస్ కంటకాలు ఉంటాయి.
b. స్పాంజిల్లా సముద్రజలాల్లో నివసించే స్పంజిక.
c. యూప్లక్టెల్లా లో సిలిషియస్ కంటకాలు ఉంటాయి.
d. పోరిఫెరా ముఖ్యలక్షణం జలప్రసరణ వ్యవస్థ.
పై అంశాల్లో తప్పుగా ఉన్నది గుర్తించండి.
జ: d
11. ద్వివలయ సౌష్ఠవం, దంశకణాలు ఉండకపోవడం వీటి ముఖ్య లక్షణాలు-
జ: ప్లూరోబ్రేకియా, బీరో
12. నిడేరియన్ల ముఖ్య లార్వా దశ
జ: ప్లానులా
13. కిందివాటిలో దేన్ని 'పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్' అంటారు?
1) ఒబీలియా 2) ఫైసేలియా 3) ఆరీలియా 4) ప్లాటిపస్
జ: 2(ఫైసేలియా)
14. బహురూపకత వ్యక్తం చేసే నిడేరియన్
జ: ఫైసేలియా
15. ఎరుపు శిలా ప్రవాళం
జ: కొరాలియం
16. కిందివాటిని జతపరచండి:
A) ఒబీలియా | I) సీ అనిమోన్ |
B) ఆరీలియా | II) సముద్రపు కలం |
C) ఎడామ్సియా | III) జెల్లీ చేప |
D) గార్గోనియా | IV) సీ ఫర్ |
E) పెన్నాట్యులా | V) సముద్రపు విసన కర్ర |
జ: A B C D E
IV III I V II
17. కింది అంశాలు అధ్యయనం చేయండి:
సరిగా జతపరచనిది(వి) గుర్తించండి.
జ: c
18. వ్యాఖ్య (A): స్కైఫోజోవన్లను సాధారణంగా జెల్లీ చేపలు అంటారు.
కారణం (R): స్కైఫోజోవన్లలో అధిక పరిమాణంలో మీసోగ్లియా ఉంటుంది.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.
19. కింది వాటిని అధ్యయనం చేసి తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి.
1) నిడేరియాలో సీ వాల్‌నట్స్, కూంబ్ జెల్లీలు, సీ గూస్ బెర్రీలను చేర్చారు.
2) టీనోఫోర్లు ద్వివలయ సౌష్ఠవంతో ఉంటాయి.
3) ఫ్లూరోబ్రేకియాలో కంకాకార ఫలకాలు ఉండి, చలనంలో తోడ్పడతాయి.
4) టీనోఫోర్ల లార్వా సైడిప్పిడ్.
జ: 1(నిడేరియాలో సీ వాల్‌నట్స్, కూంబ్ జెల్లీలు, సీ గూస్ బెర్రీలను చేర్చారు.)
20. కింది అంశాలు అధ్యయనం చేసి సరైన అంశాలు గుర్తించండి.
a. స్కైఫోజోవన్లు ఏకాంత జీవులు, స్వేచ్ఛగా ఈదగలవు.
b. ఎడామ్సియా జఠర ప్రసరణ కుహరం విభాజకాల వల్ల గదులుగా విభజితమై ఉంటుంది.
c. ఏనిడేరియన్లలో లాసోకణాలు లేదా కొల్లోబ్లాస్ట్‌లు ఉంటాయి.
d. హైడ్రోజోవాలో దంశకణాలు బాహ్యస్త్వచంలో మాత్రమే ఉంటాయి.
జ: a, b, c, d
21. టర్బలేరియన్లు స్వేచ్ఛగా నివసించే -
జ: బల్లపరుపు పురుగులు
22. జ్వాలా కణాల ప్రాథమిక విధి-
జ: ద్రవాభిసరణక్రమత
23. కిందివాటిని జతపరచండి:
A) డుగీసియా | I) బ్లడ్ ఫ్లూక్ |
B) ఫాసియోలా | II) టర్బల్లేరియన్ |
C) టీనియా | III) లివర్ ఫ్లూక్ |
D) సిస్టోసోమా | IV) బద్దెపురుగు |
జ: A B C D
II III IV I
24. వ్యాఖ్య (A): బద్దెపురుగులు కుహర రహిత జీవులు.
కారణం (R): వాటిలో జఠరప్రసరణ కుహరం ఉండదు.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ కాదు.
25. కింది అంశాలు అధ్యయనం చేసి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
1) ట్రెమటోడ్‌లను సాధారణంగా బద్దెపురుగులు అంటారు
2) టర్బల్లేరియన్ల లార్వా ముల్లర్ లార్వా
3) బద్దెపురుగులు మిథ్యాఖండీభవనాన్ని చూపుతాయి
4) బల్లపరుపు పురుగులు త్రిస్తరిత ఏసీలోమేట్లు
జ: 1(ట్రెమటోడ్‌లను సాధారణంగా బద్దెపురుగులు అంటారు)
26. కింది అంశాల్లో సరికానిది ఏది?
1) ఏలికపాములు మిథ్యా సీలోమేట్లు
2) నెమటోడ్లలో విసర్జనకు తోడ్పడే జ్వాలా కణాలు ఉంటాయి.
3) ఆస్కారిస్ లార్వా బాహ్యాంత్ర ప్రవాసాన్ని జరుపుతుంది.
4) కొన్ని నెమటోడ్లకు ఫాస్మిడ్‌లు ఉంటాయి
జ: 2(నెమటోడ్లలో విసర్జనకు తోడ్పడే జ్వాలా కణాలు ఉంటాయి.)
27. వ్యాఖ్య (A): మానవుడి పేగులోని పరాన్నజీవులు బద్దెపురుగు, ఏలికపాము, నులిపురుగులు.
కారణం (R): సరిగా ఉడకని ఆహారం పేగులోని సంక్రమణలకు కారణం.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.
28. కింది అంశాల్లో నెమటోడ్‌కు సంబంధించనిది -
1) వలయ కండరాలు లేని దేహం 2) ఏంఫిడ్‌లు, ఫాస్మిడ్‌లు జ్ఞానాంగాలు
3) H ఆకార విసర్జక కుల్యలు 4) మిథ్యాసీలోంలో హీమోలింఫ్
జ: 4(మిథ్యాసీలోంలో హీమోలింఫ్)
29. వ్యాఖ్య (A): నెమటోడ్‌లు లైంగిన ద్విరూపకతను వ్యక్తం చేస్తాయి.
కారణం (R): మగజీవులు పొట్టిగా, అవస్కరం, సంపర్క కంటకాలను కలిగి ఉటాయి.
జ: A, R నిజం. A కు R సరైన వివరణ.
30. కింది అంశాలు పరిశీలించండి.
a. నెమటోడ్‌ల దేహాన్ని ఆవరించి కొల్లాజన్ సహిత అవభాసిని ఉంటుంది.
b. నెమటోడ్‌లు 'యూటెలిని' వ్యక్తం చేస్తాయి.
c. ట్రైకినెల్లాకు ఫాస్మిడ్‌లు ఉండవు.
d. ట్రైకియూరిస్ అనే జీవి నెమటోడాలోని ఫాస్మిడియా విభాగానికి చెందుతుంది.
పైవాటిలో సరైన అంశాలు
జ: a - b - c
31. కిందివాటిలో సరికాని జత ఏది?
1) అనెలిడా - ఎంటిరోసీలోమేటా
2) ప్లాటీహెల్మింథిస్ - ఏసీలోమేటా
3) ఆర్థ్రోపోడా - షైజోసీలోమేటా
4) నెమటోడా - మిథ్యాసీలోమేటా
జ: 1(అనెలిడా - ఎంటిరోసీలోమేటా)
32. అనెలిడ్‌ల ముఖ్య లక్షణం.
జ: సమఖండ విన్యాసం
33. సముద్రపు చుంచెలుక దీనికి చెందుతుంది.
జ: అనెలిడా
34. జలగ స్రవించే రక్త స్కందన నివారిణి -
జ: హైరుడిన్
35. రాగ్ వర్మ్, లగ్ వర్మ్ దీనికి చెందుతాయి
జ: పాలీకీటా
36. ట్యూబిఫెక్స్ ఇక్కడ నివసిస్తుంది
జ: మంచి నీటిలో
37. సరైన జతను గుర్తించండి.
జ: a - b
38. వ్యాఖ్య (A): జలగలో అంతర ఫలదీకరణం జరుగుతుంది.
కారణం (R): మగ జలగలో సిర్రస్ అనే మేహనం ఉంటుంది.
జ: A నిజం. R తప్పు.
39. ఫెరిటిమా దేహకుడ్యంలో కింది పొరలు ఉంటాయి.
a. అంతశ్చర్మం b. కండరాలు c. అవభాసిని d. కుడ్యస్తరం e. బాహ్యచర్మం
వెలుపల నుంచి లోపలకు వరస క్రమం
జ: c - e - a - d - b
40. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. జలగల దేహకుహరంలో బోట్రాయిడల్ కణజాలం ఉంటుంది
b. పాలీకీట్లలో పిండాభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది.
c. పాంటాబ్డెల్లా ఒక ఒలిగోకీటా
d. పాలీకీట్‌ల లార్వా ట్రోకోఫోర్
పై అంశాల్లో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి.
జ: b - c
41. వ్యాఖ్య (A): జంతు సమూహాల్లో ఆర్థ్రోపోడా జీవులు విజయవంతమైనవి.
కారణం (R): ఆర్థ్రోపోడ్‌లు విలక్షణమైన ఉపయుక్త వికిరణాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, భిన్న ఆవాసాల్లో నివసించడానికి అనుకూలనాలు కలిగి ఉంటాయి.
జ: A, R నిజం. A కు R సరైన వివరణ.
42. శతపాది, బొద్దింక, పీతల్లో ఒకేరకమైన రెండు లక్షణాలు
జ: అతుకులున్న కాళ్లు, కైటినస్ బాహ్య అస్థిపంజరం
43. సాలీడ్లు, తేళ్లలోని శ్వాసాంగాలు
జ: పుస్తకాకార ఊపిరితిత్తులు
44. క్రస్టేషియన్లలో ఇవి ఉండటం వల్ల కీటకాలను భేదిస్తాయి.
జ: రెండు జతల స్పర్శశృంగాలు
45. కింది జత కీటకాలు మానవుడికి ఆర్థికంగా ఉపయుక్త కీటకాలు
1) ఎపిస్, పెరిప్లానెటా 2) బాంబిక్స్, ఏడిస్
3) బాంబిక్స్, లాక్సిఫర్ 4) లాక్సిఫర్, క్యాన్సర్
జ: 3(బాంబిక్స్, లాక్సిఫర్)
46. కిందివాటిని జతపరచండి.
A) జిఫోసోరియా | I) జూలస్ |
B) అరాఖ్నిడా | II) డాఫ్నియా |
C) క్రస్టేషియా | III) స్కోలోపెండ్రా |
D) కైలోపోడా | IV) లిమ్యులస్ |
E) డిప్లోపోడా | V) ఎరానియా |
VI) మస్కా |
జ: A B C D E
IV V II III I
47. కింది అంశాలు అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి.
a. లెపిస్మా ఒక షట్పాది
b. డిప్లోపాడ్‌లలో జంభికలు గ్నాతోకైలేరియంగా రూపాంతరం చెందుతాయి
c. శత పాదుల్లో విషనఖాలు ఉండవు
d. రొయ్యలు కెలిజరేటాకు చెందుతాయి
జ: a - b
48. కిందివాటిని జతపరచండి.
A) లిమ్యులస్ | I) శతపాది |
B) పలామ్నియస్ | II) రొయ్య |
C) పేలిమాన్ | III) సహస్రపాది |
D) స్కూటిజెరా | IV) రాచపీత |
E) స్పైరోస్ట్రెప్టస్ | V) తేలు |
జ: A B C D E
IV V II I III
49. వ్యాఖ్య (A): లిమ్యులస్‌ను సజీవ శిలాజం అంటారు.
కారణం (R): ఇది మిలియన్ సంవత్సరాలుగా మార్పు చెందకుండా నిలిచి ఉంది.
జ: A, R నిజం. Aకు R సరైన వివరణ.
50. కింది పట్టిక పరిశీలించండి.

పైవాటిలో సరైన జతను గుర్తించండి.
జ: a - b - c - d
51. వ్యాఖ్య (A): గాస్ట్రోపోడ్‌లలో ఎక్కువగా పాయువు, ప్రావార కుహరం తలకు పూర్వభాగంపై అమరి ఉంటాయి.
కారణం (R): గాస్ట్రోపోడ్‌ల పిండాభివృద్ధిలోని అంతరాంగ సముదాయంలో మెలిక అనే ప్రక్రియ జరుగుతుంది.
జ: A, R నిజం. A కు R సరైన వివరణ.
52. మొలస్క్‌లలో ఆస్ఫ్రేడియం విధి
జ: నీటి నాణ్యతను గుర్తించడం
53. కిందివాటిలో ఏది మొలస్కన్ల లార్వా కాదు?
1) ప్లూటియస్ 2) ట్రోకోఫోర్ 3) వెలిజర్ 4) గ్లోఖీడియం
జ: 1(ప్లూటియస్ )
54. ముత్యాలను ఏర్పరిచేది-
జ: పింక్టాడా
55. కిందివాటిని జతపరచండి.
A) ఏప్లాకోఫోరా | I) నియోపిలైనా |
B) పాలీప్లాకోఫోరా | II) డోరిస్ |
C) మోనోప్లాకోఫోరా | III) పల్సెల్లం |
D) గ్యాస్ట్రోపోడా | IV) లెపిడోప్లూరస్ |
E) స్కాఫోపోడా | V) పింక్టాడా |
VI) కీటోడెర్మా |
జ: A B C D E
VI IV I II III
56. కింది అంశాలు అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి.
a. సెఫలోపాడ్‌లలో సిరాగ్రంథి, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటాయి.
b. పెలిసిపాడ్‌ల జీర్ణాశయంలో స్ఫటికదండం ఉంటుంది. ఇది పిండి పదార్థాల జీర్ణక్రియలో తోడ్పడుతుంది.
c. పైలా సాధారణ స్కాఫోపాడ్.
d. బైవాల్వియా జీవుల్లో రాడ్యులా ఉండదు.
జ: a - b - d
57. కిందివాటిని జతపరచండి.
A) ఆక్టోపస్ | I) ముత్యపుచిప్ప |
B) పింక్టాడా | II) సముద్రపు నిమ్మకాయ |
C) డెంటాలియం | III) సజీవసేతువు |
D) డోరిస్ | IV) దెయ్యపు చేప |
E) నియోపిలైనా | V) ఏనుగు దంతం గవ్వ |
జ: A B C D E
IV I V II III
58. ఎఖైనాయిడ్‌లకు సంబంధించిన కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. కదిలే కంటకాలు ఉంటాయి.
b. అరిస్టాటిల్ దీపం ఉంటుంది.
c. రంధ్రఫలకం ప్రతిముఖ తలంలో ఉంటుంది.
d. ఎఖైనాయిడ్‌లు మంచినీటిలో నివసిస్తాయి.
పై అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
జ: a - b - c
59. పెంటాక్ట్రెనాయిడ్ దీని లార్వా
జ: క్రైనాయిడియా
60. శ్వాస వృక్షాలు దీనిలో ఉంటాయి.
జ: హోలోథురాయిడియా