1. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం -
జ: జాతి
2. లిన్నేయన్ వర్గీకరణకు సంబంధించిన కింది స్థాయిలను ఆరోహి క్రమంలో అమర్చండి.
a. రాజ్యం b. విభాగం c. కుటుంబం d. క్రమం e. వర్గం f. జాతి g. ప్రజాతి
జ: a - e - b - d - c - g - f
3. స్పీసిస్ (జాతి) అనే పదాన్ని ప్రతిపాదించింది -
జ: జాన్ రే
4. వ్యాఖ్య (A): నాజా నాజా అనే శాస్త్రీయ నామం అనుచితమైంది.
కారణం (R): ఇదొక టాటోనిమ్.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.
5. టాటోనిమ్ అంటే -
జ: జాతి, ప్రజాతి పేర్లు ఒకేలా ఉండటం
6. కార్వస్ స్ల్పెండెన్స్ ఇన్‌సోలెన్స్‌లో ఇన్‌సోలెన్స్ అనే పదం దీన్ని సూచిస్తుంది.
జ: ఉపజాతి
7. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.
1) కార్వస్ స్ల్పెండెన్స్ స్ల్పెండెన్స్ - మయన్మార్ 2) కార్వస్ స్ల్పెండెన్స్ ఇన్‌సోలెన్స్ - భారతదేశం
3) కార్వస్ స్ల్పెండెన్స్ ప్రోటిగేటస్ - శ్రీలంక 4) స్ఫీనోడాన్ - దక్షిణ ఆఫ్రికా
జ: 3(కార్వస్ స్ల్పెండెన్స్ ప్రోటిగేటస్ - శ్రీలంక)
8. నిర్దిష్టమైన కణజాలాలు లేని బహుకణ జంతువులు -
జ: పేరాజోవా
9. కంకయుత జెల్లీలు దీనికి చెందుతాయి.
జ: డిప్లోబ్లాస్టికా
10. పిండాభివృద్ధిలో మిగిలిపోయిన సంయుక్త బీజకుహరిక కొన్ని బహుకణ జీవుల్లో ఈ కుహరంగా మారుతుంది.
జ: మిథ్యాసీలోమ్
11. కిందివాటిని జతపరచండి.
A) ఏసీలోమేటా | I) ఏలికపాములు |
B) మిథ్యాసీలోమేటా | II) ఎఖైనోడర్మ్‌లు |
C) ఎంటిరోసీలోమేటా | III) అనెలిడ్లు |
D) షైజోసీలోమేటా | IV) పేరాజోవన్లు |
V) బల్లపరుపు పురుగులు |
జ: A B C D
V I II III
12. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. ఒక జాతి జీవులు నిర్మాణాత్మక సారూప్యతతో ఉంటాయని జాన్ రే పేర్కొన్నారు.
b. ఒక జాతి జీవులు ప్రత్యుత్పత్తిపరంగా వివక్తత చెంది ఉంటాయని ఎమర్సన్ వివరించాడు.
c. ఒక జాతి జీవులు ఒక దాంతో మరొకటి పోలి ఉండి నియమిత పరిధిలో వైవిధ్యాలు వ్యక్తం చేస్తాయని లిండ్‌సే పేర్కొన్నాడు.
పై అంశాల్లో సరైనవి గుర్తించండి.
జ: a, b, c
13. కిందివాటిని జతపరచండి.
A) సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం | I) అనువంశికత |
B) పురాజీవ శాస్త్రం | II) కణజాలాలు |
C) జీవావరణ శాస్త్రం | III) ప్రవర్తన |
D) జన్యు శాస్త్రం | IV) శిలాజాలు |
V) పరిసరాలు |
జ: A B C D
II IV V I
14. కింది పట్టికలోని అంశాలు అధ్యయనం చేయండి.
పైవాటిలో సరిగా జతపరిచినవి -
జ: b - d
15. కింది పట్టిక పరిశీలించండి.

పైవాటిలో సరిగా జతపరిచినవి గుర్తించండి.
జ: b - c
16. వ్యాఖ్య (A): జాతి అనేది ప్రజనన ప్రమాణం.
కారణం (R): ఒక జాతికి చెందిన జీవులు ఇతర జాతుల నుంచి ప్రత్యుత్పత్తి పరంగా వివక్తత చెంది ఉంటాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.
17. వ్యాఖ్య (A): ఆడ గాడిద, మగ గుర్రం భిన్నజాతుల జీవులైనా వాటి సంపర్క ఫలితంగా కంచర గాడిద (Mule) జన్మిస్తుంది.
కారణం (R): కంచర గాడిదలు వంధ్య జీవులు.
జ: A నిజం కాదు కానీ, R నిజం.
18. కిందివాటిని వర్గీకరణ అంతస్థుల రీత్యా ఆరోహి క్రమంలో అమర్చండి.
a. జాతి b. కుటుంబం c. క్రమం d. వర్గం e. విభాగం f. ప్రజాతి
జ: a - f - b - c - e - d
19. డ్యుటిరోస్టోమియాకు సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి.
a. ఆది ఆంత్రం నుంచి సీలోమ్ ఏర్పడుతుంది.
b. పిండదశలోని సంయుక్త జీజకుహరిక సీలోమ్‌గా మారుతుంది.
c. పాయువుకు వ్యతిరేక దిశలో బీజరంధ్రం నుంచి తర్వాత నోరు ఏర్పడుతుంది.
d. విదళనాలు వలయ, అనిర్ధారిత రకం.
జ: a - d
20. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవసమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న టాక్సా (సాధారణంగా జాతులు)ను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు.
జ: α - వైవిధ్యం
21. విక్టోరియా సరస్సులోకి దీన్ని ప్రవేశపెట్టడం వల్ల సుమారు 200 జాతుల సిక్లిడ్ చేపలు క్షీణించాయి.
జ: నైల్‌పెర్చ్
22. కిందివాటిని జతపరచండి.
A) వింకా రోజియా | I) విన్‌బ్లాస్టిన్ |
B) డిజిటాలిస్ పర్‌పూరియా | II) తేనె |
C) సింకోనా అఫిసినాలిస్ | III) డిజిటాలిన్ |
D) ఎపిస్ మెల్లిఫెరా | IV) టానిన్ |
V) క్వినైన్ |
జ: A B C D
I III V II
23. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a. అధిక జాతి సమృద్ధత, అధిక స్థానిక జాతులున్న ప్రదేశాలకు గరిష్ఠ సంరక్షణను కల్పించేందుకు అనువైన ప్రాంతాలను బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లు అంటారు.
b. అంతరించిపోతున్న నిర్దిష్ట జంతుజాతులను రక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభ్యయారణ్యాలు అంటారు.
c. జంతు ప్రదర్శనశాలలు స్థలబాహ్య సంరక్షణకు ఉద్దేశించినవే.
d. విన్‌బ్లాస్టిన్ అనే యాంటీక్యాన్సర్ ఔషధాన్ని డిజిటాలిస్ నుంచి సేకరిస్తారు.
పై అంశాల్లో సరైనవి గుర్తించండి.
జ: a - b - c
24. వ్యాఖ్య (A): తక్కువ స్థాయి రేఖాంశాల్లో జాతుల సమృద్ధత అధికం.
కారణం (R): తక్కువ స్థాయి రేఖాంశాల్లో అధిక స్థలం, సౌరశక్తి, వనరులు అధికం.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.
25. వ్యాఖ్య (A): జాతుల వైవిధ్యానికి బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ మంచి ఉదాహరణ.
కారణం (R): నిర్దిష్ట జాతుల సమృద్ధత, సమానత్వం అధికంగా ఉండే జీవ భౌగోళిక రిజర్వాయరే బయోడైవర్సిటీ హాట్‌స్పాట్.
జ: A , R నిజం. A కి R సరైన వివరణ.