• facebook
  • whatsapp
  • telegram

రసాయన గతిశాస్త్రం, ఉపరితల రసాయనశాస్త్రం

1.  A ఉత్పన్నాలు అనే చర్యకు ఈ గ్రాఫ్ సూచించబడింది. 'A' పరంగా చర్య

జ:  శూన్య క్రమాంక
 

2. ఒక ప్రథమ క్రమాంకచర్య 50% పూర్తయ్యేందుకు 100 నిమిషాలు పట్టింది. 100% పూర్తయ్యేందుకు పట్టేకాలం
జ:  అనంతం

 

3. ఒక చర్యకు Ea = 0, k = 3.2 × 104 s-1 ఉష్ణోగ్రత 300 k అయితే 310 k వద్ద 'k' విలువ
జ:  3.2 × 104 s-1

 

4.  2A(వా) + B(వా)     2C(వా) అనే వాయుచర్యలో 10 నిమిషాల్లో పీడనం 120 mm నుంచి 100 mm కు తగ్గింది. అయితే 'C' ఏర్పడే రేటు
జ:  2mm/ min

 

5.  ఒక నిర్దిష్ట చర్యకు t0.5 విలువ ప్రారంభ గాఢతను సగంచేస్తే, సగమైంది. అయితే క్రియాజనకంపరంగా చర్యాక్రమాంకం
జ:  0

6. లయోఫోబిక్ కొల్లాయిడ్ లు
A) పొగ      B) పాలు      C) స్టార్చ్ ద్రావణం     D) గోల్డ్ స్టాల్
జ:  A, D

 

7. A, B, C, D అనే నాలుగు రక్షక కొల్లాయిడ్ ల గోల్డ్ సంఖ్యలు వరుసగా 0.005, 0.01, 0.1, 0.5 అయితే వాటి రక్షణ సామర్థ్యం తగ్గే క్రమం
జ:  ABCD

 

8. ఒక బ్రైనరీ మిశ్రమంలో కణంసైజు 10-9 సెం.మీ. అయితే ఆ మిశ్రమం.
జ:  నిజద్రావణం

 

9. Assertion (A): సందిగ్ధ గాఢత కంటే అధిక గాఢత వద్ద సబ్బు కొల్లాయిడ్ లో ద్రావణం.
Reason (R): నీరు - ధూళి ఎమల్షన్ కు సబ్బు ఎమల్సీకరణ కారకంగా పనిచేస్తుంది. .
జ:  A మరియు R సరైనవి A ను R వివరించదు

 

10. A, B, C, D అనే నాలుగు వాయువులు సందిగ్ధ ఉష్ణోగ్రతలు 430k, 356k, 400k, 441k అయితే ఒక గ్రామ్ చార్ కోల్ మీద అధికంగా అధిశోషణం చెందే వాయువు.
జ:  D

11. ఒక ప్రథమక్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంకం 1 x 10-2 s-1. క్రియజనకాల గాఢత ఒక మోల్ నుంచి 0.25 మోల్స్ కు తగ్గడానికి పట్టే కాలం
జ:  138.6 sec

 

12. ln k మరియు 1/T  గ్రాఫ్ వాలు దీనికి సమానం
జ:   -Ea/R

 

13. 2 NO + Br2 2 NOBr అనే చర్య యాంత్రికం. కింది ఇచ్చారు.
I. No + Br2 NOBr2 .... త్వరిత
II. NOBr2 + NO 2NOBr.... నెమ్మదిగా
NO మరియు Br2ల గాఢతలను రెండురెట్లు పెంచితే, చర్యారేటు ఎన్ని రెట్లు పెరుగుతుంది.
జ:  8 times

 

14. A + B    క్రియాజనకాలు అనే చర్యలో 'A' పరంగా చర్యారేటు ప్రథమ క్రమాంకం మరియు 'B' పరంగా ప్రథమ క్రమాంకం ఒక లీ. పాత్రలో ఒక మోల్ 'A' మరియు 'B' లను తీసుకుంటే, ప్రారంభరేటు 1 × 10-2 mol  L-1 s-1, 90% క్రియాజనకాలు ఉత్పన్నాలుగా మారితే, చర్యారేటు
జ:  1 × 10-4 Mol L-4 s-1

15. చర్యారేటు స్థిరాంకం కింది కారకంపై ఆధారపడదు.
జ:  గాఢత

 

16. కింది చర్యలో డీఎమల్సీకరణం ఉంటుంది.
జ:  పెరుగు మజ్జిగగా మారడం

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌