1. 27oC , 127oC వద్ద ఒక చర్యకు Kc విలువలు వరుసగా 1.6 × 10-3, 7.6 × 10-2 అయితే ఆ చర్య
1) ఉష్ణ మోచక చర్య
2) ఉష్ణగ్రాహక చర్య
3) 27oC వరకు ఉష్ణమోచక, 127oC పైన ఉష్ణ గ్రాహక
4) 27oC వరకు ఉష్ణగ్రాహక, 127oC పైన ఉష్ణమోచక
సమాధానం: (2)
వివరణ: Kc ∝ T కాబట్టి అది ఉష్ణమోచక చర్య.
2. చర్యా భాగఫల స్థిరాంకం (Qc), సమతాస్థితి స్థిరాంకాల మధ్య సరైన సంబంధం
1) తిరోగామి చర్యకు Qc > Kc 2) పురోగామి చర్యకు Qc< Kc
3) సమతాస్థితి వద్ద Qc = Kc 4) అన్నీ సరైనవే
సమాధానం: (4)
వివరణ: అన్నీ సరైన సమాధానాలే.
3. T ఉష్ణోగ్రత వద్ద N2 (వా) + O2 (వా) 2 NO (వా) అనే చర్యకు Kc = 4 × 10-4 అయితే అదే ఉష్ణోగ్రత వద్ద NO (వా)
1/2 N2 (వా) + 1/2 O2(వా) చర్యకు Kc ఎంత?
1) 0.02 2) 2.5 × 102 3) 4 × 10-4 4) 50
సమాధానం: (4)
వివరణ:
4. 1000 K వద్ద ఒక పాత్రలో 0.5 అట్మా పీడనం వద్ద CO2 ఉంది. దీనికి గ్రాఫైట్‌ను కలిపితే కొంత CO2, COగా మారింది. సమతాస్థితి వద్ద మొత్తం పీడనం 0.8 అట్మా అయితే Kp విలువ ఎంత?
1) 1.8 అట్మా. 2) 3 అట్మా. 3) 0.3 అట్మా. 4) 0.18 అట్మా.
సమాధానం: (1)
వివరణ:

5. కింది చర్యకు మొత్తం పీడనం p, PCl5 విఘటన తీవ్రత x అయితే PCl3 పాక్షిక పీడనం ఎంత?
PCl5 PCl3 + Cl2

సమాధానం: (3)
వివరణ:
6. SO3 (వా) SO2 (వా) + 1/2 O2 (వా) అనే చర్యకు సమతాస్థితి స్థిరాంకం
= 4.9 × 10-2 అయితే
2 SO2 (వా) + O2 (వా) 2 SO3 (వా) అనే చర్యకు సమతాస్థితి స్థిరాంకం
ఎంత?
1) 4.9 × 10-2 2) 416 3) 2.4 × 10-3 4) 9.8 × 10-2
సమాధానం: (2)
వివరణ:
7. ఎసిటిక్ ఆమ్లం, HCN ల విఘటన స్థిరాంకాలు వరుసగా 1.5 × 10-5, 4.5 × 10-10 అయితే
CN- + CH3COOH HCN + CH3COO- అనే చర్యకు సమతాస్థితి స్థిరాంకం Kc ఎంత?
1) 3 × 105 2) 3 × 10-4 3) 3 × 10-5 4) 3 × 104
సమాధానం: (4)
వివరణ:
8. 2 లీటర్ల ఫ్లాస్కులో H2, I2 ల సమ మోల్‌లను కలిపి వేడిచేస్తే సమతాస్థితి వద్ద పురోగామి, తిరోగామి రేటు స్థిరాంకాలు సమానంగా ఉన్నాయి. అయితే H2 ప్రారంభ గాఢతతో పోల్చితే సమతాస్థితి చేరేసరికి ఎంత శాతం చర్య జరిగింది?
1) 20% 2) 33% 3) 50% 4) 40%
సమాధానం: (3)
వివరణ:

9.
పై చర్యలకు సరైన సంబంధాన్ని గుర్తించండి.
1) K3 = K1K2 2) K1 = K2K3 3) K12 = K3K23 4)
సమాధానం: (1)
వివరణ:
10. హైడ్రోజన్ అణువులు, పరమాణువులుగా మారడానికి అనువైన పరిస్థితులు ఏవి?
1) అల్ప T, అధిక P 2) అధిక T, అల్ప P
3) అధిక T, అధిక P 4) అల్ప P, అల్ప T
సమాధానం: (2)
వివరణ: H2 (వా) 2 H (వా) —— ఉష్ణం
11. ఫాస్ఫారికామ్లం విలువలు వరుసగా 7.5 × 10-3, 6.2 × 10-3, 4.2 × 10-13 అయితే కింది చర్యకు Kc విలువ ఎంత?
H3PO4 3 H+ + PO4-3
1) 7.5 × 10-3 2) 4.7 × 10-17 3) 4.2 × 10-13 4) 1.95 × 10-22
సమాధానం: (4)
వివరణ:
Kc =

= 1.95 × 10-22
12. CO (వా) + Cl2 (వా) COCl2 (వా) చర్యకు Kp/ Kc విలువ ఎంత?
1) RT 2) (RT)1/2 3) (RT)-1 4) 1.0
సమాధానం: (3)
వివరణ:
13. T అనే ఉష్ణోగ్రత వద్ద HI అనేది 33.33 శాతం విఘటనం చెందితే, 2 HI H2 + I2 చర్యకు Kc విలువ ఎంత?
1) 0.5 2) 0.25 3) 1.7 × 10-1 4) 6.25 × 10-2
సమాధానం: (4)
వివరణ:
14. N2 (వా) + 3 H2 (వా) 2 NH3 (వా) అనే చర్యకు 1218 K వద్ద Kp, Kc నిష్పత్తి ఎంత?
[R = 0.0821 లీ. మోల్-1 K-1]
1) 104 2) 106 3) 10-4 4) 10-6
సమాధానం: (3)
వివరణ:
15. 673 K వద్ద 1 లీటరు ఫ్లాస్కులో 56 గ్రాముల N2, 6 గ్రా. H2 లను ఉంచారు. సమతాస్థితి వద్ద మిశ్రమంలో 27.54 గ్రా. NH3 ఉంటే Kc విలువ సుమారుగా ఎంత?
1) 6 2) 12 3) 24 4) 36
సమాధానం: (2)
వివరణ:
ఆమ్లాలు - క్షారాలు
16. HQ అనే 0.1 మోలార్ ద్రావణం pH విలువ 3. ఈ ఆమ్లం అయనీకరణ స్థిరాంకం Ka విలువ ఎంత?
1) 1 × 10-5 2) 1 × 10-3 3) 1 × 10-7 4) 3 × 10-1
సమాధానం: (1)
వివరణ:
17. Cr(OH)3 కి Ksp విలువ 1.6 × 10-30 అయితే నీటిలో ఈ సమ్మేళనం మోలార్ గాఢత ఎంత?

సమాధానం: (3)
వివరణ:
18. ఒక ఉష్ణోగ్రత వద్ద AgIO3 ద్రావణీయతా లబ్ధం స్థిరాంకం Ksp విలువ 1.0 × 10-8. ఈ సంతృప్త ద్రావణం
100 మి.లీ. ఉంటే AgIO3 ద్రవ్యరాశి ఎంత?
1) 2.83 × 10-3 గ్రా. 2) 2.83 × 10-2 గ్రా. 3) 1 × 10-7 గ్రా. 4) 1 × 10-4 గ్రా.
సమాధానం: (1)
వివరణ:
19. NH3 ఎలా వ్యవహరిస్తుంది?
1) లూయీ క్షారం 2) బ్రాన్‌స్టెడ్ క్షారం 3) బ్రాన్‌స్టెడ్ ఆమ్లం 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: NH3 లూయీ క్షారం (ఎలక్ట్రాన్ జంట దాత), బ్రాన్‌స్టెడ్ క్షారం (ప్రోటాన్ దాత), బ్రాన్‌స్టెడ్ ఆమ్లం (ప్రోటాన్ గ్రహీత).
20. CuSO4 జలద్రావణం స్వభావం ఏమిటి?
1) క్షార 2) ఆమ్ల 3) తటస్థ 4) ద్విస్వభావ
సమాధానం: (2)
వివరణ: CuSO4 బలహీన క్షారం, బలమైన ఆమ్లంతో తయారైంది. Cu+2 బలమైన ఆమ్లం, ఇది కాటయాన్ జల విశ్లేషణ చెంది H+ అయాన్లను ఇవ్వడం వల్ల ద్రావణానికి ఆమ్లత్వం ఉంటుంది.
Cu+2 + 2 H2O Cu(OH)2 + 2 H+
21. ఆర్థో ఫాస్ఫారికామ్లం అయనీకరణ స్థిరాంకాల సరైన క్రమాన్ని గుర్తించండి.
సమాధానం: (1)
వివరణ:
H3PO4, H2PO4- లతో పోల్చితే HPO4-2 నుంచి ప్రోటాన్‌ను తొలగించడం కష్టం.
22. సీలు ఉండే నీటి సీసాను విప్పినప్పుడు సన్నని బుడగలతో కూడిన వాయువు వెలువడటానికి కారణం
1) వివిధ పీడనాల వద్ద CO2 ద్రావణీయతలు వేర్వేరుగా ఉండటం.
2) సీలు ఉండే సీసాను విప్పిన తర్వాత సన్నని బుడగలతో కూడిన వాయువు వెలువడటం.
3) ద్రవస్థితిలో కరిగి ఉన్న అణువులు, వాయుస్థితిలో ఉన్న అణువుల మధ్య సమతాస్థితి ఏర్పడటం.
4) పై వ్యాఖ్యలన్నీ సరైనవే.
సమాధానం: (4)
వివరణ: అన్ని సమాధానాలు సరైనవే.
23. విఘటనం చెందిన నీటి అణువులు, విఘటనం చెందని నీటి అణువుల నిష్పత్తి ఎంత?
1) 1 × 10-7 2) 1.8 × 10-9 3) 1 × 10-14 4) 1.8 × 10-7
సమాధానం: (2)
వివరణ:
24. CH3COOH యొక్క pKa విలువ 4.76, NH4OH యొక్క pKb విలువ 4.75 అయితే అమ్మోనియం ఎసిటేట్ pH విలువ ఎంత?
1) 0 2) 4.76 3) 7.005 4) 4.75
సమాధానం: (3)
వివరణ:

25. NaOH సంతృప్త ద్రావణం pH విలువ ఎంత?
1) 13 2) 14 3) 0 4) > 15
సమాధానం: (4)
వివరణ: NaOH సంతృప్త ద్రావణం గాఢత ఎక్కువ. సాధారణంగా దీని pH విలువ 15.1 నుంచి 15.5 వరకు ఉంటుంది.
26. 10-8 M HCl, 10-8 M NaOH ల pH విలువలు వరుసగా
1) 8, 8 2) 8, 6 3) 6.96, 7.04 4) 6, 8
సమాధానం: (3)
వివరణ: 10-8 M HCl: [H+] = 10-7 + 10-8 = 1.1 × 10-7 ... pH = 6.96
10-8 M NaOH: [OH-] = 10-7+ 10-8 = 1.1 × 10-7 ... pOH = 6.96
pH =14 - pOH = 14 - 6.96 = 7.04
27. కిందివాటిలో సరైన ఆమ్ల స్వభావ క్రమాన్ని గుర్తించండి.
a) HF < HCl < HBr < HI b) CH4< NH3< H2O < HF
1) a మాత్రమే నిజం 2) b మాత్రమే నిజం
3) a, b నిజం కాదు 4) a, b రెండూ నిజమే
సమాధానం: (4)
వివరణ:
28. జిర్కోనియం ఫాస్ఫేట్ ద్రావణీయత ఎంత?
1) 27 S3 2) 6912 S7 3) 4 S3 4) 108 S4
సమాధానం: (2)
వివరణ:
29. అల్ప ద్రావణీయత గల Ni(OH)2, AgCN ల Ksp విలువలు వరుసగా 2 × 10-15, 6 × 10-17 అయితే ఎక్కువగా కరిగే లవణం ఏది?
1) AgCN 2) Ni(OH)2
3) రెండూ సమానంగానే కరుగుతాయి 4) రెండూ కరగవు
సమాధానం: (2)
వివరణ: AgCN కి Ksp = [S1][S1] = 6 × 10-17 ... S1 = 7.8 × 10-9
Ni(OH)2 కి Ksp = [S2][2 S2]2 = 4 S23 ... S2 = 0.58 × 10-4
S2 > S1
... Ni(OH)2, AgCN కంటే ఎక్కువ కరుగుతుంది.
30. pH = 4 బఫర్ ద్రావణాన్ని తయారు చెయ్యాలంటే 50 మి.లీ. 0.05 M ఫార్మిక్ ఆమ్లానికి ఎంత ఘనపరిమాణం (మి.లీ.లలో) ఉండే 0.1 M సోడియం ఫార్మేట్‌ను కలపాలి?
(ఫార్మిక్ ఆమ్లం pka = 3.8)
1) 39.62 మి.లీ 2) 93.62 మి.లీ 3) 36.29 మి.లీ 4) 26.39 మి.లీ
సమాధానం: (1)
వివరణ: