• facebook
  • whatsapp
  • telegram

రసాయనబంధం

1. ఒకే బంధక్రమాన్ని కలిగిన సమూహం

1) C2, O2, N2-2     2) CN-, NO+, CO
3) N2+, N2-, NO    4) పైవన్నీ
సమాధానం: 4 (పైవన్నీ)

 

2. కింద తెలిపిన వ్యాఖ్యల్లో సరికానిది
1) బంధక్రమం: N2 > N2+ = N2- > N2-2
2) H2+ & H2- ల బంధక్రమం ఒకటే
3) H2+ & H2- ల స్థిరత్వం ఒకటే
4) డయా అయస్కాంత అయాన్లు: NO+, O2-2
సమాధానం: 3 (H2+ & H2- ల స్థిరత్వం ఒకటే)

 

3. అత్యధిక ద్విధ్రువ భ్రామకం దేనిలో ఉంటుందంటే
1) CHCl3     2) CH3Cl      3) CH2Cl2    4) CCl4
సమాధానం: 2 (CH3Cl)

4. శాశ్వత ద్విధ్రువ భ్రామకాన్ని కలిగిన రెండు అణువులు
1) NO2 & O3      2) NO2 & CO2      3) NO2 & SiF4   4) CO2 & SiF4
సమాధానం: 1 (NO2 & O3)

 

5. సమ నిర్మాణాలున్న జంట/ జంటలు

1) NO3- & CO3-2     2) BrO3- & XeO3
3) రెండూ 1 & 2        4) BF3 & ClF3
సమాధానం: 3 (రెండూ 1 & 2)

 

6. ఆల్కైల్ హాలైడ్‌ల ద్విధ్రువ భ్రామకం సరైన క్రమం
1) CH3F > CH3Cl > CH3Br > CH3I
2) CH3I > CH3Br > CH3Cl > CH3F
3) CH3Br > CH3Cl > CH3F > CH3I
4) CH3Cl > CH3F > CH3Br > CH3I
సమాధానం: 4 (CH3Cl > CH3F > CH3Br > CH3I)

7. PH3 లో P & H ల ఫార్మల్ ఆవేశాలు వరుసగా
సమాధానం: 0, 0

 

8. C రుణ విద్యుదాత్మకత దేనిలో గరిష్ఠంగా ఉంటుందంటే
1) C2H4     2) C2H2     3) C2H6      4) అణువుల్లో ఒకేలా ఉంటుంది
సమాధానం: 2 (C2H2)

 

9. Br పరమాణువు 2 వ ఉద్రిక్తస్థాయిలో ఎక్కువ F2 తో చర్య జరిపి X అనే సమ్మేళనాన్ని ఇచ్చింది. X ఫార్ములా, ఆకృతి
సమాధానం: BrF5, సమతల పిరమిడ్

 

10. 1 యూనిట్ సెల్ NaCl జాలకంలో Na+, Cl- ల నిష్పత్తి
సమాధానం: 4 : 4

 

11. ఒక NaCl యూనిట్ సెల్‌లో జాలక బిందువులను ఆక్రమించిన Na+, Cl- అయాన్ల సంఖ్యలు వరుసగా
సమాధానం: 13 : 14 

 

12. H2C = C = C = CH2 లో ప్రతి కార్బన్‌పై ఉండే సంకరీకరణం రకం
సమాధానం: sp2 - sp - sp - sp2

 

13. NO3-, NO2+, NH4+ లలో వి సంకరీకరణం రకాలు వరుసగా
సమాధానం: sp2, sp, sp3

14. సమయోజనీయ స్వభావం పెరిగే సరైన క్రమం
1) NaCl > LiCl > BeCl2    2) BeCl2< LiCl < NaCl
3) NaCl < LiCl < BeCl2    4) LiCl < BeCl2< NaCl
సమాధానం: NaCl < LiCl < BeCl2


15. HBr ద్విధ్రువ భ్రామకం 1.6 × 10-30 కులూంబ్ మీటర్. HBr బంధ దైర్ఘ్యం 1Ao. HBr అయానిక స్వభావం %
సమాధానం: 10

 

16. P4O10 లో ఉండే సిగ్మా, పై బంధాల సంఖ్య
సమాధానం: 16, 0

 

17. అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారం O2 అణువులో అపబంధక ఆర్బిటాళ్లలో ఉండే జతకూడిన ఎలక్ట్రాన్ల మొత్తం సంఖ్య, జత కూడని ఎలక్ట్రాన్ల మొత్తం సంఖ్యలు వరుసగా
సమాధానం: 4, 2

 

18. N2 & O2 లను N2+, O2+ లుగా మార్చినప్పుడు సరికాని వ్యాఖ్య
1) N2+ లో N - N బంధ సామర్థ్యం తగ్గుతుంది.
2) O2+ లో O - O బంధక్రమం పెరుగుతుంది
3) N2+ డయా అయస్కాంతం అవుతుంది.
4) O2+ లో పారా అయస్కాంతత్వం తగ్గుతుంది.
సమాధానం: 3 (N2+ డయా అయస్కాంతం అవుతుంది.)

19. కింద తెలిపిన వాటిలో సరికాని వ్యాఖ్య/ వ్యాఖ్యలు
1) HFH బంధకోణం 120.1o
2) హైడ్రోజన్ బంధం పరిమాణం ఘన స్థితిలో గరిష్ఠంగా, వాయు స్థితిలో కనిష్ఠంగా ఉంటుంది.
3) అనేక సందర్భాల్లో హైడ్రోజన్ బంధాలు సౌష్టవంగా ఉంటాయి.
4) అన్ని సరికాని వ్యాఖ్యలే.
సమాధానం: 3 (అనేక సందర్భాల్లో హైడ్రోజన్ బంధాలు సౌష్టవంగా ఉంటాయి.)

20. కింద తెలిపిన వాటిలో అణువు/ అయాన్, సంకరీకరణం, ఆకృతిని అనుసరించి సరికాని సమూహం.
1) BrF5, sp3d, ట్రైగోనల్ బై పిరమిడల్
2) [CO (NH3)6]+3, d2 sp3, ఆక్టాహెడ్రల్
3) [Pt(Cl)4]−2, dsp2, సమతల చతురస్ర
4) [CoF6]−3, sp3 d2, ఆక్టాహెడ్రల్
సమాధానం: 1 (BrF5, sp3d, ట్రైగోనల్ బై పిరమిడల్)

 

21. CsI3
సమాధానం: Cs+, I3- అయాన్లను కలిగి ఉంది

22. కింద తెలిపిన అయాన్లలో బలమైన బంధం దేనిలో ఉందంటే
1) O2-2                        2) O2-                     3) O2+2                    4) O2+
సమాధానం: 3 (O2+2)

 

23. కింద తెలిపిన వాటిలో బాష్పశీలత తక్కువ కలిగిన సమ్మేళనం

1) H2S    2) H2Se    3) H2Te    4) H2O
సమాధానం: 4 (H2O)

 

24. పొట్టిగా ఉండే హైడ్రోజన్ బంధాన్ని దేనిలో గమనించవచ్చంటే
1) F - H .... O   2) F - H .... F    3) రెండు    4) N - H .... O
సమాధానం: 2 (F - H .... F)

 

25. H2O లో గమనించదగిన వికర్షణ రకం/ రకాలు
1)  l.p. - l.p     2) b.p. - b.p.  3)  l.p. - b.p.   4) పైవన్నీ
సమాధానం:  పైవన్నీ (1, 2, 3)

26. 20% కేంద్రక పరమాణవు ఏర్పరిచే సంకర ఆర్బిటాల్ లో 'S' ఇరవై శాతం ఉంటే ఆ అణువులో సాధ్యపడే బంధకోణాలు
సమాధానం: 90o & 120o

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌