1) 2 2) 544 3) 5.6 4) 130
సమాధానం: (2)

2. కింది వాటిలో సరైన వ్యాఖ్యలేవి?
a) ఒకే మూలకానికి చెందిన ఐసోటోపులు అన్నింటికీ IE1 విలువలు ఒకే విధంగా ఉంటాయి.
b) Al, Mg వారధి మూలకాలు.
c) La, Lu విరళ మృత్తికలు.
d) N, P, O, S ల ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ (E.G.E.) వరుస క్రమం N < P < O < S.
1) a, c, d 2) a, b, d 3) a, b, c 4) b, c, d
సమాధానం: (3)
వివరణ: La విరళ మృత్తిక కాదు. కాబట్టి (c) తప్పు.
3. మెండలీవ్ ఆవర్తన పట్టికలో అసంగత శ్రేణి/ శ్రేణులు
1) Ar, K 2) Co, Ni 3) Te, I 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: అన్నీ అసంగత శ్రేణులే.
4. [Al Cl (H2O)5]+2 లో ఆక్సీకరణ స్థితి, సంయోజనీయత వరుసగా
1) +2, 6 2) +3, 6 3) +2, 5 4) +3, 5
సమాధానం: (2)
వివరణ: x - 1 + 5 (0) = +2
∴ x = 2 + 1 = +3 (ఆక్సీరణ స్థితి)
సంయోజనీయత = 6 (Al చుట్టూ 6 లైగాండ్‌లు ఉన్నాయి).
5. పౌలింగ్ స్కేలుపై Be రుణవిద్యుదాత్మకత 1.5. ఇదే స్కేలుపై Al కి ఉండదగు రుణ విద్యుదాత్మకత ఎంత?
1) 1.5 2) 1.8 3) 1.2 4) 2.1
సమాధానం: (1)
వివరణ: బెరీలియం Al తో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంది. ఈ రెండు మూలకాల రుణ విద్యుదాత్మకత ఒకే విధంగా ఉంటుంది.
6. కింద తెలిపిన లాంథనాయిడ్ మూలకాల జంటల్లో లాంథనాయిడ్ సంకోచాన్ని ప్రదర్శించని జంటను గుర్తించండి.
1) Eu, Yb 2) Ce, Lu 3) Eu, Pm 4) పైవేవీకావు
సమాధానం: (1)
వివరణ: Eu, Ybలు +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. వీటికి భిన్న స్ఫటిక నిర్మాణం ఉంటుంది.
7. కిందివాటిలో ఒకే ధర్మాలను (దాదాపు) ప్రదర్శించే జతను గుర్తించండి.
1) Zr, Hf 2) Mo, W 3) Nb, Ta 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: లాంథనాయిడ్ సంకోచం కారణంగా 4d, 5d మూలకాలకు ఒకే విధమైన పరమాణు వ్యాసార్ధాలు, ధర్మాలు ఉంటాయి.
8. ఒకవేళ Z = 117 మూలకాన్ని కనుక్కుని ఉంటే దాని ఎలక్ట్రాన్ విన్యాసం, గ్రూపు సంఖ్యలు వరుసగా ఏమవుతాయి?
1) [Rn] 5f14 6d10 7s1 7p6, 16 2) [Rn] 5f14 6d10 7s0 7p6 8s1, 7
3) [Rn]5f14 6d10 7s2 7p5, 17 4) [Rn]5f11 6d10 7s2 7p6 8s2, 10
సమాధానం: (3)
వివరణ: Z = 117 = [Rn] 5f14 6d10 7s2 7p5
గ్రూపు సంఖ్య = 10 + 2 + 5 = 17.
9. కిందివాటిలో బలమైన ఆమ్ల ఆక్సైడ్ ఏది?
1) SO3 2) Cl2O7 3) P4O10 4) SiO2
సమాధానం: (2)
వివరణ: Cl కు అధిక రుణవిద్యుదాత్మకత ఉంది.
10. పరమాణు సంఖ్య 111 ఉండే మూలకం అధికారిక నామం ఏమిటి?
1) అన్అన్అన్నియం 2) రాంట్‌జీనియం 3) 1, 2 4) మిట్నీరియం
సమాధానం: (2)
వివరణ: అధికారిక నామం రాంట్‌జీనియం.
11. C, F, O, N మూలకాల ద్వితీయ అయనీకరణ ఎంథాల్పీ విలువలు వరుసగా
1) C > N > O > F 2) C < N < O < F 3) O > F > N > C 4) C < N > O < F
సమాధానం: (3)
12. భూస్థాయిలో హైడ్రోజన్ పరమాణువు ఎలక్ట్రాన్ శక్తి -2.18 × 10-18 J అయితే హైడ్రోజన్ పరమాణువు అయనీకరణ ఎంథాల్పీ (జౌల్/మోల్‌లలో) ఎంత?
1) 1.31 × 106 2) 2.16 × 10-18 3) 2.62 × 106 4) 1.08 × 106
సమాధానం: (1)
వివరణ: I.E. = E∞ - E1 = 0 - (-2.18 × 10-18) = 2.18 × 10-18 J/ atom
= 2.18 × 10--18 × 6.023 × 1028
= 1.31 × 106 J/ mole.
13. Cl + e-→ Cl- చర్యలో ఒక అవగాడ్రో సంఖ్యలోని పరమాణువులకు విడుదలయ్యే శక్తితో
Cl → Cl+ + e- చర్యలో ఎన్ని Cl పరమాణువులను అయనీకరణం చెందించవచ్చు?
(I.E. = 13 e.V., E.G.E. = 3.6 e.V., N = 6 × 1023)
1) 21.74 × 1023 2) 4.6 × 1021 3) 1.66 × 10-23 4) 1.67 × 1023
సమాధానం: (4)
వివరణ: N × ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్పీ = n × అయనీకరణ ఎంథాల్పీ
14. Ce సాధారణ ఆక్సీకరణ స్థితులు ఏవి?
1) +2, +3 2) +2, +4 3) +3, +4 4) +3, +5
సమాధానం: (3)
వివరణ: Ce = 58 = [Xe] 4f1 5d1 6s2
∴ ఆక్సీకరణ స్థితులు = +3, +4.
15. V, Cr, Mn, ఐరన్‌లలో రెండో అయనీకరణ ఎంథాల్పీ ఎక్కువగా ఉండే మూలకం ఏది?
1) Mn 2) Cr 3) V 4) Fe
సమాధానం: (2)
వివరణ: Cr = 24 = [Ar]4s1 3d5. సంగం నిండిన విన్యాసం 3d5 రావడానికి రెండో ఎలక్ట్రాన్‌ను తొలగించాల్సి వస్తుంది. కాబట్టి I.E.2 విలువ Cr కు ఎక్కువగా ఉంటుంది.
16. కింది ఏ మూలక ఎలక్ట్రాన్ విన్యాసం అధిక ఆక్సీకరణ స్థితిని పొందగలదు?
1) (n - 1)d5 ns2 2) (n - 1)d3 ns2 3) (n - 1)d5 ns1 4) (n - 1)d8 ns2
సమాధానం: (1)
వివరణ: (n - 1)d8 ns2 విన్యాసం +4 ఆక్సీకరణ స్థితిని మాత్రమే చూపిస్తుంది. (+10 మాత్రం కాదు)
(n - 1)d5 ns2 విన్యాసం +7 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది.
17. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) వివిధ లాంథనాయిడ్‌ల రసాయనశాస్త్రం చాలావరకు పోలి ఉంటుంది.
2) 4f, 5f ఆర్బిటాళ్లు సమానంగా పరిరక్షింపబడి ఉంటాయి.
3) La, Lu లలో కేవలం d ఆర్బిటాళ్లు మాత్రమే పాక్షికంగా నిండి ఉంటాయి.
4) d - బ్లాక్ మూలకాలకు ఊహించలేని విధంగా క్రమరాహిత్య రసాయన ధర్మాలు ఉన్నాయి.
సమాధానం: (2)
వివరణ: వేర్వేరు శక్తి స్థాయులకు చెందిన ఆర్బిటాళ్ల పరిరక్షక ప్రభావాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
18. కింద తెలిపిన సమజాతి శ్రేణుల్లో అయానిక వ్యాసార్ధాలు పెరిగే క్రమాన్ని గుర్తించండి.
1) Cl-, Ca+2, K+, S-2 2) S-2, Cl-, Ca+2, K+
3) Ca+2, K+, Cl-, S-2 4) K+, S-2, Ca+2, Cl-
సమాధానం: (3)
వివరణ: కేంద్రకావేశం తగ్గడం వల్ల అయానిక పరిమాణం పెరిగే క్రమం: Ca+2< K+< Cl-< S-2.
19. కిందివాటిలో డాబర్‌నీర్ త్రికం/ త్రికాలు
1) Li, Na, K 2) Ca, Sr, Ba 3) Cl, Br, I 4) పైవన్నీ
సమాధానం: (4)
వివరణ: 3 త్రికాలూ డాబర్‌నీర్ త్రికాలే.
20. Be, Al లకు కింద తెలిపిన ఒక ధర్మంలో తప్ప మిగిలిన వాటిలో సారూప్యత ఉంది. ఈ రెండు మూలకాలు భేదించే ధర్మం ఏది?
1) సమ్మేళనాల్లో అధిక సంయోజకతను ప్రదర్శించడం 2) సంయోజనీయ హైడ్రైడ్‌లను ఏర్పరచడం
3) బృహదణు హైడ్రైడ్‌లను ఏర్పరచడం 4) వాటి ఆక్సైడ్‌లకు ద్విస్వభావం ఉండటం
సమాధానం: (1)
వివరణ: Be ప్రదర్శించే గరిష్ఠ సంయోజనీయత 4, Al చూపగల గరిష్ఠ సంయోజనీయత 6.
21. M అనే మూలకానికి 170, 340, 1870 కిలోకాలరీల వరుస అయొనైజేషన్ ఎంథాల్పీలు ఉంటే, ఆ మూలకం ఏర్పరిచే ఫాస్ఫేట్ ఫార్ములా ఏది?
1) M2(PO4)3 2) MPO4 3) M3(PO4)2 4) M2PO4
సమాధానం: (3)

22. లాంథనాయిడ్ మూలకాలు ------ వ గ్రూపు ------ వ పీరియడ్‌లో ఉంటాయి.
1) 13వ, 6వ 2) 4వ, 7వ 3) 5వ, 6వ 4) 3వ, 6వ
సమాధానం: (4)
వివరణ: అవి 3వ గ్రూపు, 6వ పీరియడ్‌లో ఉన్నాయి.
23. కిందివాటిలో సరైన బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం/ విన్యాసాలను గుర్తించండి.
1) Ru = 4d7 5s1 2) Mo = 4d5 5s1 3) Rh = 4d8 5s1 4) అన్నీ సరైనవే
సమాధానం: (4)
వివరణ: అన్నీ అసంగత ఎలక్ట్రాన్ విన్యాసాలే. కాబట్టి అన్నీ సరైనవే.
24. కిందివాటిలో మిథనైడ్ (లు)
1) CaC2 2) Be2C 3) Al4C3 4) 2, 3 రెండూ
సమాధానం: (4)
వివరణ: Be2C, Al4C3 లను జల విశ్లేషణ చేస్తే CH4 వస్తుంది.
Be2C + 4 H2O → CH4 + 2 Be(OH)2
Al4C3 + 12 H2O → 3 CH4 + 4 Al(OH)3.
25. రెండో పీరియడ్ మూలకాల ప్రథమ అయొనైజేషన్ ఎంథాల్పీ విలువల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) Li < Be < B < C < N < O < F < Ne
2) Li < Be < B < C < N > O < F < Ne
3) Li < Be > B < C < N > O < F < Ne
4) Li < Be > B < C > N < O < F < Ne
సమాధానం: (3)
వివరణ: Beకు 2s2, Nకు 2p3 స్థిర ఎలక్ట్రాన్ విన్యాసాలు ఉన్నాయి.
కాబట్టి I.E.1 విలువలు: Li < Be > B < C < N > O < F < Ne.