1. N2O5, N2O3, N2O4 లలో ONO బంధకోణాల సరైన క్రమం
జ: N2O4 > N2O3 > N2O5
2. పెంటా ఆక్వా నైట్రోసోనియం ఐరన్ (I) సల్ఫేట్ రంగు
జ: జేగురు
3. p-p బంధం దేనిలో ఏర్పడుతుందంటే
జ: H4P2O6
4. కింద తెలిపిన వాటిలో సరికాని వ్యాఖ్య
1) N2O3 నీలిరంగు ఘనపదార్థం 2) N2O5 పసుపురంగు ఘనపదార్థం
3) NO రంగులేని వాయువు 4) NO2 జేగురు రంగు వాయువు
జ: 2 (N2O5 పసుపురంగు ఘనపదార్థం)
5. ప్రస్తుత కాలంలో హేబర్ విధానంలో NH3 సంశ్లేషణలో ఉపయోగించే ఉత్ప్రేరకం
జ: Al2O3 + K2O + ఐరన్ ఆక్సైడ్
6. 15 వ గ్రూపు మూలకాల ఏ హైడ్రైడ్‌కి కనిష్ఠ బాష్పీభవన స్థానం ఉంటుందంటే
జ: PH3
7. O3 విఘటనంలో ΔG, ΔH, ΔS ల సంజ్ఞలు వరుసగా
జ: -Ve, -Ve, +Ve
8. O3 దేనితో చర్య జరిపి O2 వాయువును వెలువరించదంటే...
జ: C2H4
9. రాంబిక్ సల్ఫర్ దేనిలో త్వరగా కరుగుతుందంటే
జ: CS2
10. కార్బన్, గాఢ H2SO4 తో చర్య జరిపినప్పుడు ఏర్పడే వాయువు/ వాయువులు?
1) CO2 2) SO2 3) CO2, SO2 రెండూ 4) CO
జ: 3 (CO2, SO2 రెండూ)
11. కింద తెలిపిన వాటిలో తటస్థ ఆక్సైడ్‌ల సమూహం
1) SO2, Cl2O7, N2O5 2) ZnO, PbO, SnO2
3) Mn2O7, CrO3, V2O5 4) పైవేవీకావు
జ: 2 (ZnO, PbO, SnO2)
12. S-S బంధం దేనిలో ఏర్పడుతుందంటే
జ: H2S2O4
13. CO ని నిర్ణయించడంలో వాడే ఆక్సైడ్
జ: I2O5
14. అవశేష కేంద్రక ఇంధనం నుంచి Pu ను PuF6 రూపంలో తొలగించడానికి ఉపయోగించే సమ్మేళనం
జ: O2F2
15. స్పర్శా విధానంలో ఆర్సెనిక్ శుద్ధకారిలో ఆర్సెనిక్ మలినాలను తొలగించడానికి వాడేది
జ: జిగటలాంటి సార్ద్ర Fe(OH)3
16. U ను సంపన్నం చేసే ప్రక్రియలో UF6 ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సమ్మేళనం/ సమ్మేళనాలు
1) ClF3 2) BrF3 3) ClF3, BrF3 రెండూ 4) IF7
జ: 3 (ClF3, BrF3 రెండూ)
17. కింద తెలిపిన క్రమాలకు ఎదురుగా తెలిపిన వాటి ధర్మాలకు పొంతన లేనిది?
1) ClO- > ClO2- > ClO3- > ClO4- : ఆమ్ల స్వభావం
2) F2 > Cl2 > Br2 > I2 : బంధ విఘటన శక్తి
3) F2 > Cl2 > Br2 > I2 : ఆక్సీకరణ సామర్థ్యం
4) HF > HI > HBr > HCl : బాష్పీభవన స్థానాలు
జ: 2 (F2 > Cl2 > Br2 > I2 : బంధ విఘటన శక్తి)
18. కింద తెలిపిన చర్యల్లో జరగని చర్య ఏది?
1) 2 KI + Br2 2 KBr + I2 2) 2 KBr + Cl2

3) 2 H2O + 2 F2


జ: 4 (2 KBr + I2

19. Cl2 వెలువడని చర్య
జ: NaNO2 + HCl
20. SO2 తాత్కాలిక విరంజనకారిణి కాగా Cl2 శాశ్వత విరంజనకారిణి. ఎందువల్ల?
జ: Cl2 ఆక్సీకరణం మూలంగా విరంజనం చేస్తే SO2 క్షయకరణం మూలంగా విరంజనం చేస్తుంది.
21. S8 క్లోరిన్‌తో చర్య జరిపి X అనే సమ్మేళనాన్ని ఇస్తుంది. X నిర్మాణం దేనితో సమంగా ఉంటుందంటే
1) H2O2 2) O2F2 3) H2O2, O2F2 రెండూ 4) XeF2
జ: 3 (H2O2, O2F2 రెండూ)
22. HCl మెత్తగా చూర్ణం చేసిన ఐరన్‌తో చర్య జరిపి ఒక రంగున్న అవక్షేపాన్ని ఇస్తుంది. ఆ అవక్షేపం రంగు
జ: లేత ఆకుపచ్చ
23. రేడియం విఘటనంలో ఏర్పడే ఉత్పన్నాలు
జ: ఒక రేడియోధార్మిక ఉత్కృష్ట వాయువు, ఒక రేడియోధార్మికత లేని ఉత్కృష్ట వాయువు
24. నీల్ బార్ట్‌లెట్ Xe కి చెందిన IE1 విలువ, ఏ వాయువు IE1 విలువతో సమానంగా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాడంటే
జ: O2
25. Xe తో 5 రెట్లు, 20 రెట్ల F2 చర్య జరిపినప్పుడు, అధిక Xe, ఫ్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే సమ్మేళనాల పేర్లు వరుసగా....
జ: XeF4, XeF6, XeF2
26. XeO3, XeOF4, XeF6, XeF4, XeF2 లలో Xe పై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు వరుసగా
జ: 1, 1, 1, 2, 3