• facebook
  • whatsapp
  • telegram

మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం - IV

1. కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.

1) లిపిడ్లలో కరిగే హార్మోన్లు అన్నీ రక్తంలోని ప్లాస్మా ప్రొటీన్లతో కలిసి రవాణా చెందుతాయి.

2) హార్మోన్ గ్రాహకాలన్నీ లక్ష్యాంగ కణత్వచాల్లో ఉండే ప్రొటీన్‌లే.

3) లిపిడ్లలో కరిగేవన్నీ స్టీరాయిడ్ హార్మోన్‌లే.

4) నీటిటో కరిగే హార్మోన్లన్నీ రక్తం లోని ప్లాస్మా ద్వారా స్వేచ్ఛగా ప్రసరణ చెందుతాయి.

జ: 4 (నీటిటో కరిగే హార్మోన్లన్నీ రక్తం లోని ప్లాస్మా ద్వారా స్వేచ్ఛగా ప్రసరణ చెందుతాయి.)
 

2. కింది అంశాలు చదివి, వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

1) అమైనో హార్మోన్లు అమైనో ఆమ్లపు ఉత్పన్నకాలు

2) పెప్టైడ్, ప్రొటీన్ హార్మోన్లు అమైనో ఆమ్లాల అణుపుంజాలు

3) స్టీరాయిడ్ హార్మోన్లు కొలెస్టిరాల్ ఉత్పన్నకాలు

4) అన్ని రకాల హార్మోన్లు రసాయనికంగా ప్రొటీన్‌లే

జ: 4 (అన్ని రకాల హార్మోన్లు రసాయనికంగా ప్రొటీన్‌లే)

3. నాడీ, అంతస్రావక వ్యవస్థలను అనుసంధానం చేసేది-

జ: హైపోథాలమస్
 

4. సెల్లా టర్సికాలో ఇమిడి రక్షణ పొందే వినాళ గ్రంథి-

జ: పీయూష గ్రంథి
 

5. ప్రసవ సమయంలో గర్భాశయ కండరాలను సంకోచింపజేసే హార్మోన్ -

జ: ఆక్సిటోసిన్
 

6. దైనందిన సర్కాడియన్ లయలను క్రమపరిచే హార్మోన్-

జ: మెలటోనిన్
 

7. అతిపెద్ద అంతస్స్రావక గ్రంథి స్రవించే అయోడిన్ రహిత హార్మోన్-

జ: కాల్సిటోనిన్
 

8. హైపర్ కాల్సీమిక్ హార్మోన్ -

జ: పారాథార్మోన్
 

9. T - లింఫోసైట్ల విబేధనంలో పాల్గొనే ముఖ్య హార్మోన్ -

జ: థైమోసిన్
 

10. పాలను చిందించే హార్మోన్-

జ: ఆక్సిటోసిన్

11. సొమాటోక్రైనిన్ అనేది -

జ: హైపోథాలమస్ స్రవించే పెరుగుదల హార్మోన్ విడుదల కారకం.
 

12. ACTH దీన్ని ప్రేరేపిస్తుంది

జ: జోనా ఫాసిక్యులేటా
 

13. వృక్కనాళికల్లో ఆల్డోస్టీరాన్ లాంటి మినరలో కార్టికాయిడ్‌లు ఈ ప్రక్రియను అధికం చేస్తాయి.

జ: Na+ , H2O  ల శోష‌ణ‌, ‌; K+, PO-ల విస‌ర్జ‌న

14. అండోత్సర్గానికి కారణమయ్యే హార్మోన్ -

జ: LH
 

15. కిందివాటిని జతపరచండి.

A) అధివృక్క దవ్వ I) ఎండోస్టైల్‌కి సమజాతం
B) న్యూరోహైపోఫైసిస్ II) మార్పు చెందిన సహానుభూతనాడీ సంధి
C) అవటు గ్రంథి III) హైపోథాలమస్
D) అధివృక్క వల్కలం IV) మధ్యస్త్వచం
  V) రాత్‌కీ కోశం

     A      B     C     D
జ:  II     III     I      IV

16. కిందివాటిని జతపరచండి.

A) అండజననం I) ఆక్సిటోసిన్
B) అండోత్సర్గం II) మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
C) ప్రసవం III) ప్రొలాక్టిన్
D) క్షీరోత్పత్తి IV) పుటికోద్దీపన హార్మోన్
  V) ల్యుటినైజింగ్ హార్మోన్

       A    B     C     D
జ:   IV    V      I    III

 

17. కిందివాటిని జతపరచండి.

A) మధ్యాంతర కణాలు I) క్లోమ రసం
B) ఎసినార్ కణాలు II) టెస్టోస్టిరాన్
C) ఆల్ఫా కణాలు III) ఇన్సులిన్
D) బీటా కణాలు IV) గ్లూకగాన్
  V) సోమాటోక్రైనిన్

     A     B     C     D
జ:  II     I     IV     III

18. కింది అంశాలు అధ్యయనం చేయండి.


పైవాటిలో సరైన వాటిని గుర్తించండి.
జ: a, b, c

 

19. వ్యాఖ్య (A): హార్మోన్లు రక్తం ద్వారా దేహమంతా ప్రవహిస్తున్నప్పటికీ అవి నిర్దిష్ట లక్షిత కణాలపైనే ప్రభావం చూపుతాయి.
     కారణం (R): ఒక హార్మోన్‌కి సంబంధించిన నిర్దిష్ట గ్రాహకాలు లక్షిత కణాలకు అనుసంధానం చెంది ఉంటాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

20. వ్యాఖ్య (A): అధివృక్క గ్రంథి యొక్క దవ్వ బాహ్యస్త్వచం నుంచి అభివృద్ధి చెందుతుంది.
       కారణం (R): అధివృక్క దవ్వ సహానుభూత నాడీ సంధి రూపాంతరం చెందగా ఏర్పడుతుంది.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

21. అధివృక్క గ్రంథిలో కింది భాగాలు ఉంటాయి.
   a) జోనా గ్లోమెర్యులోసా         b) జోనా రెటిక్యులారిస్          

   c) క్రొమాఫిన్ కణాలు           d) జోనా ఫాసిక్యులేటా
గ్రంథిలో వెలుపలి నుంచి లోపలికి సరైన వరస క్రమం
జ: a - d - b -c

 

22. అధివృక్క గ్రంథికి సంబంధించిన కింది అంశాలు అధ్యయనం చేయండి.
      a) అవటు గ్రంథి దేహంలోని అతిపెద్ద వినాళ గ్రంథి
      b) ఇది ప్రాథమిక కార్డేట్లలోని ఎండోస్టైల్‌కు సమజాతం
      c) దీనిలోని పుటికా కణాలు టైరోసిన్ నుంచి సంశ్లేషించిన హార్మోన్లను స్రవిస్తాయి
      d) దీనిలోని పుటికాంతర కణాలు థైరాక్సిన్‌ను స్రవిస్తాయి
పైవాటిలో సరైన అంశాలు గుర్తించండి.
జ: a - b - c

23. మానవుడిలోని కొన్ని వినాళ గ్రంథులను కింద పేర్కొన్నారు. అవి:
      a) పీయూష గ్రంథి             b) అవటు గ్రంథి        

     c) అధివృక్క వల్కలం         d) అధివృక్క దవ్వ
పైవాటిలో బాహ్యస్త్వచం నుంచి అభివృద్ధి చెందినవి-
జ: a - d

 

24. వీపుపై మూపురం, డోలన ఉదరం, గుండ్రటి ముఖం మొదలైనవి దీని లక్షణాలు.
జ: కుషింగ్ వ్యాధి

 

25. పిల్లల్లో సొమాటోట్రాపిన్ అధికోత్పత్తి వల్ల వచ్చేది-
జ: అతికాయత

 

26. పెద్దల్లో అవటు గ్రంథి అల్పస్రావం వల్ల వచ్చేది
   1) ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్      2) సరళ గాయిటర్       

  3) క్రెటినిజం                         4) మిక్సిడీమా
జ: 4 (మిక్సిడీమా)

 

27. గ్లూకోకార్టికాయిడ్‌ల అల్పస్రావం వల్ల వచ్చే వ్యాధి-
జ: ఎడిసన్స్ వ్యాధి

28. కిందివాటిని జతపరచండి.

A) డయాబిటిస్ ఇన్‌సిపిడస్ I) క్రెటినిజం
B) డయాబిటిస్ మెల్లిటిస్ II) కంచువర్ణ మచ్చలు
C) ఎడిసన్ వ్యాధి III) ఇన్సులిన్
D) కుషింగ్ వ్యాధి IV) వీపుపై మూపురం
  V) వాసోప్రెస్సిన్

      A     B     C     D
జ:  V    III     II     IV


29. కిందివాటిని జతపరచండి.

A) అవటు గ్రంథి అల్పస్రావం I) ఎడిసన్ వ్యాధి
B) అవటు గ్రంథి అధిక స్రావం II) మూత్రపిండంలో రాళ్లు
C) అవటవటు గ్రంథి అల్పస్రావం III) గ్రేవ్ వ్యాధి
D) అవటవటు గ్రంథి అధిక స్రావం IV) ధనుర్వాతం
  V)   మిక్సిడీమా

       A     B      C    D
జ:  V     III     IV    II

30. వ్యాఖ్య (A): మిక్సిడీమా వ్యాధిగ్రస్థుడు జలుబుతో బాధపడుతున్నాడు.
      కారణం (R): దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచే అవటు గ్రంథి హార్మోన్ అల్పస్రావం వల్ల మిక్సిడీమా వస్తుంది.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

31. కింది అంశాలు అధ్యయనం చేయండి.
       a. డయాబిటిస్ ఇన్‌సిపిడస్‌కి కారణం ADH అల్పస్రావం.
       b. డయాబిటిస్ మెల్లిటస్‌కి కారణం ఇన్సులిన్ అల్పస్రావం.
       c. కార్టిసోల్ అల్పస్రావం వల్ల ఎడిసన్స్ వ్యాధి వస్తుంది.
       d. కార్టిసోల్ అధికస్రావం వల్ల కుషింగ్ వ్యాధి వస్తుంది.
పైవాటిలో తప్పుగా ఉన్న అంశం/ అంశాలు గుర్తించండి.
జ: ఏదీకాదు

 

32. మానవ దేహంలోని ఈ హార్మోన్ రక్తంలోని కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను నియంత్రిస్తుంది
జ: పారాథార్మోన్

 

33. కిందివాటిలో సరికాని జతలను గుర్తించండి.
     a. గ్లూకాగన్ - బీటా కణాలు                b. టెస్టోస్టిరాన్ - సెర్టోలీ కణాలు
    c. కార్పస్ ల్యూటియం - ప్రొజెస్టిరాన్      d. ఇన్సులిన్ - డయాబిటిస్ మెల్లిటస్
జ: a - b

34. కింది అంశాలు అధ్యయనం చేయండి.
       a. కాల్షియం జీవక్రియలను కాల్సిటోనిన్ నియంత్రిస్తుంది.
       b. ఆక్సిటోసిన్ గర్భాశయ కండరాల సంకోచాన్ని ప్రేరేపిస్తుంది.
       c. అధివృక్క గ్రంథి పనిచేయకపోవడం వల్ల గ్రేవ్ వ్యాధి వస్తుంది.
       d. ADH నీటి పునశోషణాన్ని ప్రేరేపించి అధిక మూత్ర ఉత్పత్తిని కలగచేస్తుంది.
పైవాటిలో సరికాని అంశాలు
జ: c - d

 

35. కింది అంశాలు అధ్యయనం చేయండి.
      a. హానికర, సాంక్రమిక సూక్ష్మజీవుల బారి నుంచి దేహానికి రక్షణ కలిగించే అంగాలు, కణాలు, ప్రొటీన్లను కలిపి రోగనిరోధక వ్యవస్థ అంటారు.
      b. వ్యాధికారక జీవులతో పోరాడే జీవి సామర్థ్యాన్ని రోగనిరోధకత అంటారు.
      c. కన్నీటిలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది.
      d. ఇంటర్‌ల్యూకిన్‌లను ఎరిథ్రోసైట్లు స్రవిస్తాయి.
పైవాటిలో సరైన అంశాలు
జ: d తప్ప అన్నీ

36. భక్షక కణాలు, సహజ హంతక కణాలు ఈ రక్షణ రేఖకు చెందుతాయి.
జ: రెండో రక్షణ రేఖ

36. భక్షక కణాలు, సహజ హంతక కణాలు ఈ రక్షణ రేఖకు చెందుతాయి.
జ: రెండో రక్షణ రేఖ

 

37.  పెర్‌ఫోరిన్‌ల‌ను, గ్రాంజైముల‌ను ఉత్పత్తి చేసే క‌ణాలు
జ: సహజ హంతక కణాలు

 

38. కింది అంశాలు అధ్యయనం చేయండి.
       a. TH కణాలు దేహద్రవ, కణ మధ్యవర్తిత్వ రోగనిరోధకతలో పాల్గొంటాయి.
       b. పెర్‌ఫోరిన్‌లు లక్ష్యకణత్వచాలకు రంధ్రాలు చేస్తే, వాటి ద్వారా గ్రాంజైములు లక్ష్యంలోకి చేరి ఎపోటోసిస్‌ను ప్రారంభిస్తాయి.
       c. సహజ హంతక కణాలు ఒక రకమైన లింఫోసైట్స్.
       d. B - కణాలు దేహ ద్రవ నిర్వర్తిత్వ రోగనిరోధకతలో పాల్గొంటాయి.
పై అంశాల్లో సరికానివి గుర్తించండి.
జ: ఏవీకావు

 

39. కిందివాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
    1) మోనోసైట్స్ - రక్తం                                   2) కఫ్ఫర్ కణాలు - సంయోజక కణజాలం
    3) మైక్రోగ్లియల్ కణాలు - మెదడు                 4) మీసాంజియల్ కణాలు - మూత్రపిండం
జ: 2(కఫ్ఫర్ కణాలు - సంయోజక కణజాలం)

40. బేసోఫిల్స్-
జ: బ్రాడీకైనిన్‌లను విడుదల చేస్తాయి

 

41. వ్యాఖ్య (A): బేసోఫిల్స్ భక్షక కణాలు కాదు కానీ, రోగ నిరోధకతలో తోడ్పడతాయి.
కారణం (R): బేసోఫిల్స్ ఉజ్జ్వలన మాథ్యమిక పదార్థాలైన హిస్టమిన్, హెపారిన్‌లను విడుదల చేసి సంక్రమణ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

42. కిందివాటిని జతపరచండి.

A) ఇంటర్‌ఫెరాన్లు I) యాంటీవైరల్ ప్రొటీన్ల సంశ్లేషణ
B) పెర్‌ఫోరిన్లు II) T - సహాయక కణాలు
C) గ్రాంజైమ్‌లు III) లక్ష్య కణత్వచానికి రంధ్రాలు చేయడం
D) ఇంటర్‌ల్యూకిన్ - 2 IV) ఎపోటోసిస్ ప్రారంభం
  V) యాంటీవైరల్ ప్రొటీన్

        A    B     C    D
జ:   V   III    IV     I

43. ప్రతిదేహానికి ప్రతిజనకం ఈ భాగంలో బంధితమవుతుంది.
జ: పారాటోప్

 

44. అంటు తిరస్కరణ ఈ రోగనిరోధక చర్యవల్ల జరుగుతుంది.
జ: కణ నిర్వర్తిత్వ రోగనిరోధకత

 

45. HIVమానవ శరీరంలో ఈ కణాలపై దాడి చేస్తుంది.
జ: T - కణాలు, డెండ్రిక్ కణాలు

Posted Date : 03-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌