• facebook
  • whatsapp
  • telegram

మానవ శరీర నిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం

1. ఒడోంటోబ్లాస్ట్‌ల పుట్టుక
జ: మధ్యస్త్వచం నుంచి

 

2. మానవుడిలో దంత విన్యాసం
జ: విషమదంతి, థీకోడాంట్, ద్వివారదంతి

 

3. మానవుడి దంత సూచిక
జ: 

4. మానవుడిలో పేగుకు అనుబంధంగా ఉండే అవశేషావయంలోని ముఖ్య కణజాలం
జ: శోషాభ కణజాలం

 

5. లైసోజైమ్ అనే ఎంజైమ్ దీనిలో ఉంటుంది
జ: లాలాజలం

 

6. లాక్టోజ్ జల విశ్లేషణ వల్ల ఏర్పడే ఉత్పన్నకాలు
జ:  గ్లూకోజ్, గాలక్టోజ్

 

7. కఫర్ కణాలనేవి -
జ: కాలేయంలో ఉండే భక్షక కణాలు

8. ఈ హార్మోను పిత్తాశయాన్ని సంకోచింపజేస్తుంది
జ: కోలెసిస్టోకైనిన్

 

9. ఒడ్డి సంవరిణి దీని ప్రవాహాన్ని నియంత్రిస్తుంది
జ: పిత్తాశయం నుంచి పైత్యరసాన్ని ఆంత్రమూలంలోకి

 

10. కైలోమైక్రాన్‌లు అంటే
జ: ప్రొటీన్ పొరతో ఆవరించి ఉండే ట్రైగ్లిజరైడ్‌లు: కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లు కొలెస్టరాల్‌తో

 

11. కిందివాటిని జతపరచండి.

A. డిగ్లుటేషన్ I.  ఎమల్సీకరణం చెందిన కొవ్వులు
B. డిఫకేషన్ II.  కాలేయం
C. మైసిల్లేలు III.  మలవిసర్జన
D. గ్లిస్సన్ గుళిక IV.  క్లోమం
  V.  మింగడం

                  
జ:   A      B     C    D
     V      III    I     II

 

12. కింది అంశాలు అధ్యయనం చేయండి. ఆమ్ల లక్షణాలున్న కైమ్‌ను క్షారయుతంగా మార్చడం
a. ఆమ్ల లక్షణాలున్న కైమ్‌ను క్షారయుతంగా మార్చడం
b. కొవ్వుల ఎమల్సీకరణ

c. కొవ్వులను జీర్ణం చేయడం
d. కొవ్వులు జీర్ణమవగా ఏర్పడిన అంత్య ఉత్పన్నకాల శోషణం
పై అంశాల్లో పైత్యరసం నిర్వర్తించని విధులు
జ:  c, d (కొవ్వులను జీర్ణం చేయడం , కొవ్వులు జీర్ణమవగా ఏర్పడిన అంత్య ఉత్పన్నకాల శోషణం)

 

13. కైలోమైక్రాన్‌లు లాక్టియల్‌లోకి ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తాయి.
జ: కణ బహిష్కరణ

 

14. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. ఇది రెండో అతిపెద్ద జీర్ణగ్రంథి
b. దీనికి అయిదు లంబికలు ఉంటాయి
c. ఇది ఎంజైమ్‌లను, హార్మోన్లను స్రవిస్తుంది
d. ఇది స్రవించే జీర్ణరసం కొద్దిగా ఆమ్లలక్షణాలు కలిగి ఉంటుంది.
పైవాటిలో క్లోమానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
జ:  a, c (ఇది రెండో అతిపెద్ద జీర్ణగ్రంథి, ఇది ఎంజైమ్‌లను, హార్మోన్లను స్రవిస్తుంది)

 

15. పెప్సినోజెన్‌కు సంబంధించిన కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. ఇది నిష్క్రియా రూపంలో ఉన్న ప్రోటియోలైటిక్ ఎంజైమ్
b. దీన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్తేజితం చేస్తుంది

c. దీన్ని జఠర గ్రంథులు స్రవిస్తాయి
d. ఇది ప్రోరెన్నిన్‌ను ఉత్తేజితం చేస్తుంది
పై అంశాల్లో సరికానిది(వి)
జ: d (ఇది ప్రోరెన్నిన్‌ను ఉత్తేజితం చేస్తుంది)

 

16. వ్యాఖ్య (S): జీర్ణంకాని ఆహారపదార్థాల్లోని నీరు పెద్ద పేగులో శోషణం చెందుతుంది.
    కారణం (R): చిన్నపేగులో లాగానే పెద్దపేగు లోపలి తలం ఆంత్రచూషకాలతో ఉంటుంది
1) S , R సరైనవి. S కు R సరైన వివరణ.
2) S , R సరైనవి. కానీ S కు R సరైన వివరణ కాదు.
3) S సరైంది కానీ R తప్పు.
4) S , R రెండూ తప్పే.
జ: 3( S సరైంది కానీ R తప్పు.)

 

17. ఇది పాలలోని కెసిన్ అనే ప్రొటీన్‌ను కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్‌గా మారుస్తుంది
జ: రెన్నిన్

 

18. కింది అంశాలు అధ్యయనం చేయండి.  

పై అంశాల్లో సరిగా జతపరచనిది-
జ: d (ప్రోరెన్నిన్ పెప్సిన్ రెన్నిన్)

 

19. వ్యాఖ్య (A): గ్లూకోజ్, గాలక్టోజ్, అమైనో ఆమ్లాలు సింపోర్టర్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి.
    కారణం (R): సింపోర్టర్ అనే వాహక ప్రొటీన్ పదార్థాలను కణత్వచం ద్వారా ఒకేవైపునకు రవాణా చేస్తుంది.
       సరైన సమాధానం గుర్తించండి.

1) A , R సరైనవి. A కి R సరైన వివరణ.
2) A , R సరైనవి. A కి R సరైన వివరణ కాదు.
3) Aనిజం కానీ, R నిజం కాదు.
4) A , R నిజం కాదు.
జ: 1( A , R సరైనవి. A కి R సరైన వివరణ.)

 

20. ఎంజైమ్‌లు లేని జీర్ణరసం
జ: పైత్య రసం

 

21. ఇద్దరు మిత్రులు భోజనం చేస్తున్నారు. ఒకరు ఆహారాన్ని మింగుతుండగా ఆకస్మికంగా దగ్గు వచ్చింది. దేని కదలిక సరిగా లేకపోవడం దగ్గు రావడానికి కారణమైంది?
జ: ఉపజిహ్వక

 

22. నిశ్వాస సమయంలో విభాజక పటలం ఇలా మారుతుంది.
జ: డోమ్‌లా

 

23. వ్యాఖ్య (A): ఎర్ర రక్తకణాల ద్వారా CO2 రవాణా వేగంగా జరుగుతుంది.
    కారణం (R): రక్తం యొక్క ప్లాస్మాలో కార్బొనిక్ ఎన్‌హైడ్రేజ్ ఉండదు.
జ: A నిజం కానీ, R నిజంకాదు.

24. కింది అంశాలను చదివి సరైనదాన్ని గుర్తించండి.
1) H2COనుంచి విడుదలయ్యే H+ హిమోగ్లోబిన్‌తో కలిసి హీమోగ్లోబిన్ ఆమ్లం ఏర్పడుతుంది.
2) ఎర్రరక్త కణంలో ఆక్సీహీమోగ్లోబిన్ క్షారయుతంగా ఉంటుంది.
3) కార్బొమైనో సమ్మేళనాల రూపంలో దాదాపు 70%  CO2 రవాణా అవుతుంది.
4) ఊపిరితిత్తుల్లో O2 రక్తంలోకి సక్రియా రవాణా ద్వారా ప్రవేశిస్తుంది.
జ: 1(H2CO3 నుంచి విడుదలయ్యే Hహిమోగ్లోబిన్‌తో కలిసి హీమోగ్లోబిన్ ఆమ్లం ఏర్పడుతుంది.)

 

25. కిందివాటిని క్రమంగా ఘనపరిమాణాత్మకంగా పెరిగే రీతిలో అమర్చండి.
a) టైడల్ వాల్యూం            b) అవశేష పరిమాణం
c) నిశ్వాస నిల్వ పరిమాణం    d) వైటల్ సామర్థ్యం
జ: a < c < b < d

 

26. ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల లోపలి తలాన్ని ఏర్పరిచేది
జ: సరళ శల్కల ఉపకళ

 

27. శ్వాసకేంద్రం ఏ భాగంలో ఉంటుంది?
జ: మజ్జాముఖం
 

28. జతపరచండి.

A. ఉబ్బసం I) నాసికా కుహరాల్లో వాపు
B. బ్రాంకైటిస్ II) వాయునాళ కండరాల్లో ఈడ్పు
C. రైనైటిస్ III) శిథిలమైన వాయుగోణులు
D. ఎంఫసీమా IV) శ్వాసనాళాల్లో వాపు
  V) దగ్గు, కళ్లెలో రక్తపు జీరలు

జ:   A    B    C   D
     II    IV   I   III

 

29. క్లోరైడ్ విస్తాపం దీనికి సంబంధించింది
జ: CO2 రవాణా

 

30. ఆక్సిజన్ - హీమోగ్లోబిన్ వక్రరేఖ ఎడమవైపునకు జరగడానికి కారణం
జ: తక్కువ ఉష్ణోగ్రత, అధిక pH

 

31. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a) అధికశాతం CO2 బైకార్బొనేట్ అయాన్ల రూపంలో రవాణా అవుతుంది.
b) అతిస్వల్ప పరిమాణంలో CO2 కార్బొనిక్ఆమ్ల రూపంలో రవాణా అవుతుంది.

c) హీమోగ్లోబిన్ CO2 ను కూడా రవాణా చేస్తుంది.
d) ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెంది CO2 విడుదలైనప్పుడు రక్తం pH అధికమవుతుంది.
పైవాటిలో సరైన అంశాలను గుర్తించండి.
జ: a , b , c

 

32. కిందివాటిని జతపరచండి.

A) క్లోరైడ్ విస్తాపం I) O2 రవాణాపై CO2 ప్రభావం
B) బోర్ ఎఫెక్ట్ II) హాంబర్గర్ దృగ్విషయం
C) సహజ ఎయిర్ కండిషనర్‌లు III) నాసికా కుహరాలు
D) విభాజక పటలం IV) శ్వాస కదలికలు
  V) ధ్వని ఉత్పాదన

                                
జ:    A    B    C      D
      II    I    III     IV

 

33. వ్యాఖ్య (A): ఊపిరితిత్తుల్లో రక్తం ఆక్సిజన్‌తో కలవడం CO2 విడుదలను సులభతరం చేస్తుంది.
    వివరణ (R): CO2 లో అధికభాగం బైకార్బొనేట్‌ల రూపంలో రవాణా అవుతుంది.
జ: A , R నిజం. A కి R సరైన వివరణ కాదు.

 

34. నాసికా కుహరాల నుంచి వాయుగోణుల్లోకి O2 రవాణా అయ్యే మార్గాన్ని సరైన క్రమంలో అమర్చండి.
a) శ్వాసనాళాలు b) వాయునాళం c) స్వరపేటిక  d) అంత్యశ్వాస నాళికలు e) శ్వాసత్వచం
జ: 
  b a d e
 

35. సూక్ష్మజీవుల సంక్రమణ వల్ల ఊపిరితిత్తుల్లో వాపు, వాయు గోణుల్లో శ్లేష్మం నిండటం జరిగింది. ఇవి ఈ వ్యాధి లక్షణాలు
జ: న్యుమోనియా

Posted Date : 23-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌