• facebook
  • whatsapp
  • telegram

మానవ ప్రత్యుత్పత్తి

1. మానవుడిలో అండం ఫలదీకరణం చెందే భాగం
జ: ఫాల్లోపియన్ నాళం కలశికలో

 

2. మానవ పురుష జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన కింది భాగాలు అధ్యయనం చేయండి.
      a. రీటే ముష్కం       b. ఎపిడిడైమిస్
      c. ప్రసేకం              d. శుక్రోత్పాదక నాళికలు
      e. శుక్రవాహిక       f. స్కలన నాళం
      g. శుక్రనాళికలు
శుక్రకణాలు బయటకు వెళ్లే మార్గాన్ని సరైన వరస క్రమంలో అమర్చండి.
జ: d - a - g - b - e - f - c

 

3. నిశ్చితం (A): మానవుడిలో జరాయువు హీమోకోరియల్ రకానికి చెందుతుంది.
     కారణం (R): పిండ పరాయు చూషకాలు గర్భాశయం గోడలోని రక్తపు మడుగుల్లో మునిగి ఉంటాయి.
జ: A, R నిజం. A కు R సరైన వివరణ.

4. కిందివాటిని జతపరచండి.

A. సిఫిలిస్ i. HIV
B. జననాంగ హెర్పిస్ ii. నైసేరియా
C. AIDS iii. ట్రెపోనీమా
D. గనేరియా iv. HSV

     A   B    C   D
జ: ii    i     iv   iii

 

5. ముష్కాలను ముష్కగోణుల్లో తమ స్థానంలో నిలిపి ఉంచేవి-
జ: శుక్ర దండాలు

 

6. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. మానవుడిలో ముష్కాలు ముష్కగోణుల్లో ఉంటాయి. దీనికి కారణం శుక్రకణోత్పత్తికి కొంత తక్కువ ఉష్ణోగ్రతను కల్పించడమే.
b. సెర్టోలీ కణాలు టెస్టోస్టిరాన్ లాంటి ఆండ్రోజన్‌లను స్రవిస్తాయి.
c. స్కీన్ గ్రంథులు పురుష జననేంద్రియ వ్యవస్థకు అనుబంధంగా ఉంటాయి.
d. గుహ్యాలగాంకురం అనేది మేహనానికి సమజాతం.
పైవాటిలో సరైన అంశాలు:
జ: a, d


7. ప్రసేకంలోని ఆమ్లత్వాన్ని వీటి స్రావం తటస్థీకరిస్తుంది.
జ: కౌపర్ గ్రంథులు

 

8. కిందివాటిని జతపరచండి:

A. ఆంట్రమ్ i. కరోనా రేడియేటా
B. క్యుములస్ ఊఫోరస్ ii. పరిణతి చెందిన పుటిక
C. గ్రాన్యులోజా కణాలు iii. పుటిక కుహరం
D. గ్రాఫియన్ పుటిక iv. అండ మాతృకను ఆవరించిన కణాలు

     A    B   C   D
జ: iii    iv   i     ii

 

9. నిశ్చితం (A): శుక్రజనన ప్రక్రియలో ప్రాథమిక ఊసైట్‌లో క్షయకరణ విభజన- I జరుగుతుంది.
కారణం (R): ప్రతీ తరంలో క్రోమోజోమ్‌ల సంఖ్య స్థిరంగా ఉండటానికి బీజకణోత్పత్తి జరిగేటప్పుడు క్షయకరణ విభజన జరుగుతుంది.
జ: A నిజం కాదు కానీ, R నిజం.

 

10. అండోత్సర్గం తర్వాత ఖాళీ పుటికలో నిండేది-
జ: కార్పస్ ల్యుటియమ్

11. స్త్రీ జనన నాళంలో శుక్రకణాలు కొన్ని మార్పులకు లోనైన తర్వాత అండాన్ని ఫలదీకరించే ఉత్తేజాన్ని పొందుతాయి. ఈ ప్రక్రియను కింది విధంగా పేర్కొంటారు.
జ: సామర్థ్యీకరణం

 

12. ఫలదీకరణ ప్రక్రియలో ఆక్రోసోం నుంచి విడుదలయ్యే ఎంజైమ్-
జ: హయాలురోనిడేజ్

 

13. కింది అంశాలు చదవండి.
      a. బ్లాస్టోసిస్ట్ అంతర కణజాలానికి పైన ఉన్న కణాలను రాబర్ కణాలు అంటారు.
      b. పిండంలో జరాయువు ఏర్పడే ప్రాంతాన్ని ఆధార డెసిడ్యువా అంటారు.
      c. మానవుడిలో జరాయువు హీమోకోరియల్ రకం.
      d. మానవుడి జరాయువు మానవ పరాయు గొనాడోట్రోపిన్‌ను స్రవిస్తుంది.
   పైవాటిలో సరైన అంశం / అంశాలు
జ: a, b, c, d

 

14. కిందివాటిని జతపరచండి.

a. ప్రొజెస్టిరాన్ i. క్షీర గ్రంథులు
b. ఆక్సిటోసిన్ ii. కార్పస్ ల్యుటియమ్
c. hCG iii. పీయూష గ్రంథి
d. ప్రొలాక్టిన్ iv. జరాయువు

     A    B    C   D
జ: ii    iii    iv    i

15. మానవుడిలో గర్భావధి కాలం
జ: 38 వారాలు

 

16. శిశుజనన ప్రక్రియ అనేది ఒక-
జ: పార్చురిషన్

 

17. సరిగా జతపరచని జతను గుర్తించండి.
      1) గనేరియా - నైస్సీరియా         2) సిఫిలిస్ - ట్రెపోనీమా
      3) ఎయిడ్స్ - హెచ్ఐవీ             4) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ - ట్రైకోమోనాస్
జ: 4 (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ - ట్రైకోమోనాస్)

 

18. కిందివాటిలో ఒకటి సహజమైన గర్భనిరోధక పద్ధతి కాదు
      1) విభాజకం                    2) ఆవర్తనంగా సంపర్కించకుండటం
      3) అంతరాయ సంభోగం     4) క్షీరోత్పాదన వల్ల రుతుక్రమం ఆగడం
జ: 1 (విభాజకం)

 

19. గర్భనిరోధక నోటిమాత్రల్లో ఉండేవి-
జ: ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్

 

20. ఉల్బద్రవ పరీక్ష దీని నిర్ధారణకు చేస్తారు.
జ: పిండంలో జన్యులోపాలు గుర్తించడానికి

Posted Date : 03-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌