• facebook
  • whatsapp
  • telegram

6 - 9 అధ్యాయాలు (జూనియర్ బోటనీ)

1. ఒక అమెరికన్ మిషనరీ టీచర్ వల్ల ఉత్తేజితులైన ఒక రాజస్థానీ శాస్త్రజ్ఞుడు కిందివాటి వల్ల మొదటిసారిగా గుర్తింపు పొందారు.
    A) రిస్ట్రిక్షన్ ఎంజైమ్.
    B) వర్గీకరణ శాస్త్రంలో పిండోత్పత్తి శాస్త్ర అంశాలను ఉపయోగించడం.
    C) C4 మార్గంలో పరిశోధన.
    D) పరీక్షనాళికలో ఫలదీకరణ.
    E) కణజాల వర్థనానికి కావలసిన యానకాన్ని ప్రతిపాదించడం.
    F) అండాశయస్థ పరాగ సంపర్కం
జ: B D F

 

2. కిందివాటిలో కణ విభజన అసమానంగా జరుగుతుంది.
    1) ఈస్ట్‌లో ప్రహారోత్పత్తి.
    2) ఆవృత బీజాల్లో సూక్ష్మసిద్ధ బీజంలో మొదటి విభజన.
    3) పరాగరేణువులో రెండో కణ విభజన.
    4) (ఈస్ట్‌లో ప్రహారోత్పత్తి. , ఆవృత బీజాల్లో సూక్ష్మసిద్ధ బీజంలో మొదటి విభజన.)
జ: 4 (ఈస్ట్‌లో ప్రహారోత్పత్తి. , ఆవృత బీజాల్లో సూక్ష్మసిద్ధ బీజంలో మొదటి విభజన.)

 

3. కేంద్రకం లోపల DNA అర్థవంతంగా ఇమిడి ఉండేలా చేసే లక్షణం
జ: హిస్టోన్‌ల ధనాత్మక ఆవేశం, DNA రుణాత్మక ఆవేశం

 

4. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించి, సరికానిదాన్ని గుర్తించండి.
1) కొన్ని శిలీంద్రాలు, శైవలాల్లో సంయోగంలో పాల్గొనే సంయోగ బీజాలు రెండూ కూడా చలనాన్ని చూపిస్తాయి.
2) మొక్కలు ఏక స్థితికాలు లేదా ద్వయ స్థితికాలైనప్పటికీ అవి ఉత్పత్తి చేసే సంయోగ బీజాలు మాత్రం ఏక స్థితికంగా ఉంటాయి.
3) మొక్కల్లో హార్మోన్లు లైంగిక ప్రత్యుత్పత్తికి కారణమవుతాయి.
4) అన్ని ఆవృత బీజాల్లో అలైంగికోత్పత్తి సర్వసాధారణం.
జ: 4 (అన్ని ఆవృత బీజాల్లో అలైంగికోత్పత్తి సర్వసాధారణం.)

 

5. క్రియాశీలతను బట్టీ స్త్రీ సంయోగ బీజదంలో ఉండే కణాల రకాలు
జ: 4

 

6. నిశ్చితం (A): సంకర మొక్కల్లోని విత్తనాలను ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసుకుంటూ ఉండాలి. ఇదే వాటిలోని ప్రధాన సమస్య.
వివరణ (R): ఒక వేళ ఈ సంకరాలను అసంయోగ జననాలుగా మారిస్తే ఏర్పడే సంతతిలో లక్షణాల పృథక్కరణ జరగదు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.

 

7. జతపరచండి.
 

   ఇదే సరైన జోడింపు
      I  II   III   IV
జ: B  D   A   C

 

8. జతపరచండి.
 

  ఇదే సరైన జోడింపు.
      I  II   III   IV
జ: D  A   C   B

 

9. కిందివాటిలోని సరికాని వ్యాఖ్యల జతలను గుర్తించండి.
I) క్యాప్సికంలోని అండాశయ బిలాల సంఖ్య ట్రైగోనెల్లా ఫల దళాల సంఖ్యకు సమానం.
II) బెంథామ్, హూకర్‌ల వర్గీకరణలోని జిమ్నోస్పెర్మేలోని సహజ క్రమాల సంఖ్య ఆలియంలోని కేసరాల జతల సంఖ్యకు సమానం కాదు.
III) సోలనేసిలోని నాళిక పుంజాల్లో ఉన్న నాళికా కణజాలాల రకాల సంఖ్య టెఫ్రోషియా పుష్పంలో పూర్వ భాగంవైపు ఉండే ఒకే పరిమాణం ఉన్న ఆకర్షణ పత్రాల సంఖ్యకు సమానం.
IV) లిన్నెయస్ లైంగిక వర్గీకరణ వ్యవస్థలోని మొక్కల సముదాయాల సంఖ్య బ్రాసికేసి పుష్పభాగాల మొత్తానికి సమానం.
జ: I, III

 

10. బెంథామ్, హుకర్‌ల వర్గీకరణలో ఫాబేసి స్థానం
జ: ఉప కుటుంబం పాపిలియోనాయిడియే

 

11. కిందివాటిలోని సరికాని జతను గుర్తించండి.
       1) అరిస్టాటిల్ - హిస్టోరియా ప్లాంటారమ్
       2) లిన్నెయస్ - స్పీసిస్ ప్లాంటారమ్
       3) హచిన్‌సన్ - ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్
       4) బెంథామ్ & హూకర్ - జెనిరా ప్లాంటారమ్
జ: 1 (అరిస్టాటిల్ - హిస్టోరియా ప్లాంటారమ్)

 

12. సొలానమ్ జాతుల్లో ఆవశ్యకాంగాలు పరిపక్వం చెందే విధానానికి సమానంగా దేనిలో చూడొచ్చు?
జ: మెడోసాఫ్రన్

 

13. గ్లైకోప్రొటీన్లు, లైపోప్రొటీన్లు కిందివాటితో వరుసగా సంశ్లేషణ చేస్తాయి.
       1) SER, RER       2) పెరాక్సీజోములు, ER     3) గాల్జీ పరికరం, ER     4) ER, పెరాక్సిజోములు
జ: 3 (గాల్జి పరికరం, ER)

 

14. కింది కణాంగాల సంఖ్య కణం క్రియాశీల చర్యల ఆధారంగా మారుతుంది.
       1) కేంద్రకం       2) మైటోకాండ్రియా       3) కశాభాలు       4) క్రోమోజోములు
జ: 2 (మైటోకాండ్రియా)

 

15. కణరూపాన్ని నిలిపేది
జ: కణ అస్థిపంజరం

 

16. లైంగికోత్పత్తి చెందే జీవుల్లో జాతులు ఒక తరం నుంచి తర్వాత తరం మధ్య ఎడతెగకుండా ఉండే సంబంధానికి కింది నిర్మాణం ప్రధాన అనుసంధానంగా ఉంటుంది.
       1) ముక్కలు        2) సంయోగ బీజాలు       3) సిద్ధ బీజాలు        4) సంయుక్త బీజం
జ: 4 (సంయుక్త బీజం)

 

17. కింది పట్టికను పరిశీలించి, సరైన జతను గుర్తించండి.

జ: II, III

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌