1. లోతైన సముద్ర జలాల్లో నివసిస్తూ సిలికా నిర్మితమైన కంటకాలు కలిగిన స్పంజికలున్న విభాగం
జ: హెక్సాక్టినెలిడా
2. కిందివాటిని జతపరచండి:
A B C D
జ: ii iv i iii
3. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a. నెమటోడ్‌లలో రెనెట్ గ్రంథులు ఉండి, శ్వాసక్రియలో తోడ్పడతాయి.
b. సెస్టోడ్‌లు మిథ్యాఖండీభవనాన్ని వ్యక్తం చేస్తాయి.
c. ఏకలైంగిక అనెలిడ్‌లలో క్లైటెల్లం ఉండదు.
d. వానపాము గ్రసనీవృక్కాలు సంవృత రకం, బాహ్య వృక్కాలు
పై అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
జ: a-d
4. ఒక జత కెలిసరే, ఒక జత పెడిపాల్ప్‌లు దీని ముఖ్యలక్షణాలు
జ: ఎరేనియా
5. అర్సియోలస్‌లో కశాభ రకం
జ: పాంటాక్రోనిమాటిక్
6. నిశ్చితం (A): అనెలిడ్‌లలో ప్రసరణ వ్యవస్థ సంవృత రకం.
కారణం (R): హీమోగ్లోబిన్ వర్ణకం రక్తపు ప్లాస్మాలో కరిగి ఉంటుంది.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ కాదు.
7. సొలెనోసైట్లతో కూడిన ప్రాథమిక వృక్కాలున్న కార్డేట్‌లు
జ: సెఫలోకార్డేట్‌లు
8. నిశ్చితం (A): అన్ని సకశేరుకాలూ కార్డేట్‌లే కానీ, అన్ని కార్డేట్‌లూ సకశేరుకాలు కాదు.
కారణం (R): ప్రాథమిక కార్డేట్‌లలో వెన్నెముక ఉండదు.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.
9. కప్ప పురుష జననేంద్రియ వ్యవస్థలో కింది భాగాలు ఉంటాయి.
a. బిడ్డర్ కుల్య b. మూత్రనాళం c. ముష్కాలు
d. శుక్రనాళికలు e. అడ్డునాళాలు f. అవస్కరం
శుక్రకణాలు ఏర్పడిన దగ్గర నుంచి బయటికి వెళ్లే మార్గపు సరైన వరుసక్రమం..
జ: c-d-a-e-b-f
10. నిశ్చితం (A): యూగ్లీనాలో ద్విధావిచ్ఛిత్తి సిమ్మెట్రోజెనిక్.
కారణం (R): ఏర్పడిన పిల్ల కణాలు దర్పణ ప్రతిబింబాల్లా ఉంటాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.
11. కిందివాటిని జతపరచండి.

A B C D
జ: iv iii i ii
12. క్షీరదాల్లో ఉండే గ్రీవా కశేరుకాల సంఖ్య
జ: 7
13. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a. యూగ్లైఫాలో ఫైలోపోడియా ఉంటాయి
b. కైనెటోసోం అనేది కశాభం లేదా శైలికను ఏర్పరచడంలో తోడ్పడుతుంది.
c. పాంటోనిమాటిక్ కశాభ అక్షీయతంతువుకు రెండు లేదా ఎక్కువ వరసల్లో పార్శ్వతంతువులు ఉంటాయి.
d. కశాభాలు తరంగ చలనాన్ని వ్యక్తం చేస్తాయి.
పై వాటిలో సరిగా ఉన్న అంశం/ అంశాలు
జ: a, b, c, d
14. కిందివాటిలో సజీవ శిలాజంగా పరిగణించే సరీసృపం
1) లాటిమేరియా 2) పెరిపేటస్ 3) నియోపిలైనా 4) స్ఫీనోడాన్
జ: 4(స్ఫీనోడాన్)
15. కింది పట్టికను పరిశీలించండి:
పై అంశాల్లో సరిగా జతపరచనివి గుర్తించండి.
జ: a-c