1. కెర్నైట్ ఏ లోహానికి చెందిన ఖనిజం?
1) Al 2) B 3) K 4) Kr
సమాధానం: (2)
వివరణ: కెర్నైట్ - Na2B4O7. 4 H2O
2. 13వ గ్రూపు మూలకాల రుణ విద్యుదాత్మకతల సరైన క్రమాన్ని గుర్తించండి.
1) B > Al > Ga > In > Tl 2) B < Al < Ga < In < Tl
3) B > Tl > In > Ga > Al 4) B < Al > Ga < In > Tl
సమాధానం: (3)
వివరణ: మూలకాల పరమాణు పరిమాణాల్లో ఉండే వ్యత్యాసాల వల్ల వాటి రుణవిద్యుదాత్మకతల్లో క్రమరాహిత్యం కనిపిస్తుంది.
రుణ విద్యుదాత్మకతలు: B = 2, Tl = 1.8, In = 1.7, Ga = 1.6, Al = 1.5
3. Ga పరమాణు వ్యాసార్ధం
1) Al కంటే ఎక్కువ 2) Alకి సమానం 3) Al, In కంటే ఎక్కువ 4) Al కంటే తక్కువ
సమాధానం: (4)
వివరణ: Ga పై తక్కువ పరిరక్షక ప్రభావం, పెరిగిన కేంద్రకావేశం.
4.

AlCl3 ద్వి అణుకంలో x, y, z బంధ కోణాల సరైన క్రమం
1) x > y = z 2) z > x > y 3) x > y > z 4) x < y > z
సమాధానం: (2)
వివరణ: x = 101o, y = 79o, z = 118o
5. గాఢ HNO3 లోకి Al ముక్కను ఉంచితే
1) Al(NO3)3 ఏర్పడుతుంది.
2) NO2 వాయువు వెలువడుతుంది.
3) NO వాయువు వెలువడుతుంది, తెల్లని జిగట లాంటి అవక్షేపం ఏర్పడుతుంది.
4) గాఢ HNO3 అల్యూమినియంను క్రియారాహిత్యం చేస్తుంది
సమాధానం: (4)
వివరణ: Al2O3 పరిరక్షక పొర ఏర్పడటం వల్ల.
6. అనార్ద్ర అల్యూమినియం క్లోరైడ్ సీసా చుట్టూ తెల్లని పొగలు కనబడటానికి కారణం ఏమిటి?
1) పొడి HCl వాయువు 2) తడి HCl వాయువు
3) పొడి Cl2 వాయువు 4) తడి Cl2 వాయువు
సమాధానం: (2)
వివరణ: అనార్ద్ర AlCl3 పాక్షికంగా జలవిశ్లేషణ చెందడం వల్ల.
7. బోరాక్స్ నీటికి ఉండే స్వభావం ఏమిటి?
1) తటస్థ 2) ఆమ్ల 3) క్షార
4) కరిగించిన బోరాక్స్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది
సమాధానం: (3)
వివరణ:

8.
పై చర్యల్లో x, y, z లు వరుసగా
1) Na2B4O7, B2O3, H3BO3 2) Na2B4O7, H3BO3, B2O3
3) B2O3, H3BO3, Na2B4O7 4) Na2B4O7 . 7 H2O, B2O3, H3BO3
సమాధానం: (1)
వివరణ:
9. B(OH)3 అనేది
1) బలమైన త్రిక్షార ఆమ్లం 2) బలహీనమైన ఏక క్షార ఆమ్లం
3) లూయీ ఆమ్లం 4) 2, 3 రెండూ
సమాధానం: (4)
వివరణ: B(OH)3 + 2 HOH

10. డై బోరేన్, బోరజీన్లలో ఉండే సంకరీకరణాలు వరుసగా
1) sp3, sp3 2) sp3, sp2 3) sp, sp2 4) sp2, sp3
సమాధానం: (2)
వివరణ: డై బోరేన్‌లో - sp3, బోరజీన్‌లో - sp2
11. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) హైడ్రోజన్ బంధాల వల్ల బోరిక్ ఆమ్లం బృహదణువుగా ఉంటుంది.
2) 370 K కంటే పైన బోరిక్ ఆమ్లాన్ని వేడిచేస్తే NaBO2 ఏర్పడుతుంది.
3) బోరేన్‌ల జలవిశ్లేషణలో బోరిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
4) బోరాక్స్ జలద్రావణాన్ని ఆమ్లీకృతం చేస్తే బోరిక్ ఆమ్లం వస్తుంది.
సమాధానం: (2)
వివరణ:
12. కిందివాటిని జతపరచండి.
సమూహం - I | సమూహం - II |
A) బోరాన్ పోగులు (B4C) | I) కఠినమైన దుర్గలనీయ ఘనపదార్థం |
B) బోరాన్ | II) న్యూక్లియర్ పరిశ్రమలో రక్షణ కవచం |
C) లోహ బోరైడ్‌లు | III) తుపాకీ గుండును నిరోధించే వస్త్రాలు |
D) ఆర్థో బోరిక్ ఆమ్లం | IV) వంట పాత్రలు |
V) నెమ్మదైన యాంటీసెప్టిక్ |
A B C D A B C D
1) IV I II III 2) III I II IV
3) III I II V 4) IV I V III
సమాధానం: (3)
వివరణ: ఉపయోగాలు సరైన జత.
13. BF3 & BF4- లలో B - F బంధ దైర్ఘ్యాలు వరుసగా
1) 130 pm, 130 pm 2) 143 pm, 130 pm
3) 130 pm, 143 pm 4) 143 pm, 143 pm
సమాధానం: (3)

14. బోరాక్స్ పూస అంటే ఏమిటి?
1) Na2B4O7 2) Na2B4O7 . 7 H2O
3) NaBO2 4) NaBO2 + B2O3
సమాధానం: (4)
వివరణ:

15. మురుగుకాల్వను తెరవడానికి ఏ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు?
1) Al ముక్కలు + సజల NaOH 2) బోరాక్స్ + Al ముక్కలు
3) Al భస్మం + గాఢ HNO3 3) Al కడ్డీ + గాఢ H2SO4
సమాధానం: (1)
వివరణ: నవజాత హైడ్రోజన్ వెలువడి, మురుగు కాల్వను తెరుస్తుంది.
16. అల్యూమినియం గాఢ HCl, గాఢ H2SO4, గాఢ HNO3లతో చర్య జరిపి వరుసగా ఏ పదార్థాలను ఇస్తుంది?
1) H2, SO3, Al(NO3)3 2) H2, SO2, చర్య లేదు
3) AlCl3, Al2(SO4)3, Al(NO3)3 4) AlCl3, SO2, చర్య లేదు
సమాధానం: (2)
వివరణ: 2 Al + 6 HCl

2 Al + 6 H2SO4

Al + గాఢ HNO3

17.

1) Na2SO4 & C2H5ONa 2) B2O3 & C2H5HSO4
3) H3BO3 & (C2H5)3BO3 4) NaHSO4 & (C2H5)3BO3
సమాధానం: (3)
వివరణ:
18. డైబోరేన్ అణువులో ఒకే తలంపై ఉండే పరమాణువులు ఎన్ని?
1) 6 2) 8 3) 4 4) 2
సమాధానం: (1)
వివరణ: 2 B పరమాణువులు, 4 H పరమాణువులు ఒకే తలంలో ఉంటాయి. 1 H తలంపైన, 1 H తలం కింద ఉంటాయి.
19. కిందివాటిలో ద్వి స్వభావ ఆక్సైడ్(లు)
1) Al2O3 2) Ga2O3 3) 1 & 2 రెండూ 4) B2O3
సమాధానం: (3)
వివరణ: Al2O3, Ga2O3 ఆమ్లాలు, క్షారాలతో చర్య జరపడం వల్ల ద్విస్వభావ ఆక్సైడ్‌లు. B2O3 - ఆమ్లాక్సైడ్.
20. +1 ఆక్సీకరణ స్థితి స్థిరత్వం పెరిగే క్రమాన్ని గుర్తించండి.
1) Ga < In < Al < Tl 2) Al < Ga < In < Tl
3) Tl < In < Ga < Al 4) In < Tl < Ga < Al
సమాధానం: (2)
వివరణ: జడ జంట ఎలక్ట్రాన్ ప్రభావం వల్ల +1 ఆక్సీకరణ స్థితి స్థిరత్వం గ్రూపులో పైనుంచి కిందకు పెరుగుతుంది.
21. H3BO3 లో B, O సంకరీకరణాలు వరుసగా
1) రెండింటిలో sp3 2) sp2, sp3
3) sp3, sp2 4) రెండింటిలో sp2
సమాధానం: (2)
వివరణ: B - sp2 సంకరీకరణం, O - sp3 సంకరీకరణం.
22. 1 : 1 నిష్పత్తిలో BF3, NH3 సంశ్లిష్టంలో N, B చుట్టూ ఉండే ఆకృతి, సంకరీకరణం
1) N (పిరమిడల్, sp3), B(టెట్రాహెడ్రల్, sp3)
2) N(పిరమిడల్, sp3), B (సమతల, sp3)
3) N(పిరమిడల్, sp3), B(పిరమిడల్, sp3)
4) N(టెట్రాహెడ్రల్, sp3) B(టెట్రాహెడ్రల్, sp3)
సమాధానం: (4)
వివరణ: N, Bలు sp3 సంకరీకరణం చెందుతాయి. వీటి చుట్టూ టెట్రాహెడ్రల్ ఆకృతులు ఉంటాయి.
23. కొలిమనైట్ ఫార్ములా ఏమిటి?
1) Ca2B6O11 . 5 H2O 2) Ca(BO2)2
3) Na2B4O7 . 7 H2O 4) Ca2B6O11 . 10 H2O
సమాధానం: (1)
వివరణ: కొలిమనైట్ - Ca2B6O11 . 5 H2O
24. అల్యూమినియం సజల HCl , గాఢ NaOHతో చర్య జరిపి వెలువరించే వాయువులు వరుసగా
1) O2 & O2 2) H2 & O2 3) H2 & H2 4) O2 & H2
సమాధానం: (3)
వివరణ: 2 Al + 6 HCl 2 AlCl3 + 3 H2
2 Al + 2 NaOH + 6 H2O 2 Na[Al(OH)4] + 3 H2.
25. క్యారమ్స్ ఆటలో బోర్డుపై బోరిక్ ఆమ్లం పొడిని చల్లడానికి కారణం ఏమిటి?
1) దీనికి జారుడు స్వభావం ఉంటుంది.
2) దీనికి యాంటీసెప్టిక్ స్వభావం ఉండటం వల్ల మనకు రక్షణగా ఉంటుంది.
3) 1, 2 రెండూ
4) బోర్డు అరిగిపోకుండా అలాగే ఉండటానికి
సమాధానం: (1)
వివరణ: బోరిక్ ఆమ్లంలో BO3-3 యూనిట్లు హైడ్రోజన్ బంధాలతో బంధింపబడి పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల బోరిక్ ఆమ్లానికి జారుడు స్వభావం వస్తుంది. అందువల్ల కాయిన్స్ తేలిగ్గా జరుగుతాయి.