1. ఆక్సిజన్ సమ్మార్జకంగా పనిచేసేది-
జ: హిమోగ్లోబిన్
2. కిందివాటిలో ఏ కణాలు విభజన చెందడం వల్ల లెగ్యుమినేసి వేర్లలో బుడిపెలు ఏర్పడతాయి.
ఎ) బాహ్య చర్మం బి) వల్కలం సి) అంతః చర్మం డి) పరిచక్రం
1) ఎబి 2) బిసిడి 3) ఎబిసి 4) సిడి
జ: 4 (సిడి)
3. అమైడ్లు మొక్కల్లో ఇతర భాగాలకు వేటి ద్వారా రవాణా చెందుతాయి?
జ: దారువు
4. ఆక్సిజన్‌కు వాహకంగా పనిచేసేది
జ: లెగ్ - హిమోగ్లోబిన్
5. నైట్రోజినేజ్ ఎంజైమ్‌లో ఉండే ఖనిజ మూలకాలు
జ: Mo, Fe
6. ఒక నత్రజని అణువు స్థాపన చెందేటప్పుడు ఏర్పడే అమ్మోనియా అణువులకు, వినియోగమయ్యే ATPలకు మధ్య నిష్పత్తి
జ: 1 : 8
7. ఆల్నస్ వేర్లపై నత్రజని స్థాపన బుడిపెలను ఏది ఏర్పరుస్తుంది?
జ: ఫ్రాంకియా
8. 60 మూలకాలున్న మొక్కలో అన్ని కణాంగాలు ఉన్నప్పటికీ పత్రహరితం ఒక్కటే తయారు కాలేదు. ఏ మూలకం లోపం వల్ల ఇలా జరిగింది.
జ: Fe
9. పోషక కణజాలంలో సుక్రోజ్ రవాణా సరిగా జరగనప్పుడు లోపించిన మూలకాన్ని కింది ఏ మొక్కలోని క్రియాత్మక వ్యాధి వల్ల తెలుసుకోవచ్చు.
జ: బీటు దుంపలో కుళ్లు
10. జతపరచండి.
పట్టిక - 1 | పట్టిక - 2 |
I. బ్రాంజింగ్ | A. వర్ణరహిత పత్రహరితం |
II. సల్ఫర్ | B. లెగ్యూమ్ |
III. మెగ్నీషియం లోపం | C. నిర్హరిత ఈనెలు, గోధుమ రంగు మచ్చలు |
IV. మాంగనీస్ విష లక్షణం | D. లోప లక్షణాలు మొదట లేత పత్రాల్లో |
సరైన జోడింపు
I II III IV
జ: B D A C
11. IAA ఆక్సిడేజ్ ఎంజైమ్‌కు ఉత్ప్రేరకారి అయిన ఒక సూక్ష్మ మూలకం సందిగ్ధ గాఢత కంటే ఎక్కువ లభ్యమైనప్పుడు అది ఏ మూలకాల లోపాన్ని ప్రేరేపిస్తుంది?
1) N, P, K 2) Fe, Mg, Ca 3) Fe, Cu, Ca 4) S, Mo, Fe
జ: 2 (Fe, Mg, Ca)
12. నిశ్చితం (A): సల్ఫర్, కాల్షియం చలన శీల మూలకాలు కావు.
వివరణ (R) : సల్ఫర్, కాల్షియం కణ నిర్మాణాత్మక భాగాలుగా ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు.
13. హైడ్రోఫోనిక్స్‌ను ఎవరు మొదలుపెట్టారు?
జ: జూలియస్ వాన్‌సాక్స్
14. సల్ఫర్‌తోపాటు ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆమ్లం
జ: సిస్టీన్
15. జతపరచండి.
పట్టిక - 1 | పట్టిక - 2 |
I. సల్ఫర్ | A. కండె పరికరం ఏర్పాటు |
II. కాపర్ | B. పరాగరేణువులు మొలకెత్తడం |
III. కాల్షియం | C. ఫెరిడాక్సిన్ |
IV. బోరాన్ | D. సైటోక్రోమ్ ఆక్సిడేజ్ |
సరైన జోడింపు
I II III IV
జ: C D A B
16. నైట్రోజినేజ్ ఎంజైమ్ కింది ఏ మూలకానికి సున్నితత్వాన్ని సూచిస్తుంది?
1) ఆక్సిజన్ 2) సల్ఫర్ 3) ఐరన్ 4) కాపర్
జ: 1 (ఆక్సిజన్)
17. సోయాచిక్కుడు వేరుబుడిపెలో ఉండే నత్రజని ఏ విధంగా ఇతర భాగాలకు సరఫరా అవుతుంది?
జ: యూరైడ్ల ద్వారా
18. నత్రజని స్వాంగీకరణలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడేది-
జ: కర్బన నత్రజని
19. నత్రజని లోపించినప్పుడు కనిపించే లక్షణాలు -
జ: పుష్పాలు ఆలస్యంగా ఏర్పడటం, నిర్హరితం, కణవిభజన నిరోధింపబడటం
20. లోహాలు కానీ మూలకాలు ఏవి లోపించడమనేది మెక్కల్లో ఉండదు
జ: C, H, O
21. మొక్క ఎన్ని మూలకాలను ఖనిజ మూలకాల రూపంలో మృత్తిక నుంచి శోషిస్తుంది?
జ: 14
22. అణుపరీక్షలు జరిపే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు ఏ మూలకాన్ని (రేడియోధార్మికత) సంచయనం చేసుకుంటాయి?
జ: స్ట్రాన్షియం
23. ఉన్నతశ్రేణి మొక్కలకు కింది మూలకాలు ఆవశ్యకం కాదు, కానీ లాభదాయకం. అవి
జ: సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం
24. శక్తి సంబంధ రసాయన పదార్థ భాగాల్లో ఉన్న ముఖ్యమైన ఆవశ్యక మూలకాలు
జ: Mg, P
25. కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో తోడ్పడే ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే ఆవశ్యక మూలకం ఏది?
జ: Mg
26. ఆల్కహాల్ డీ హైడ్రోజినేజ్‌కు ఉత్తేజకారి-
జ: Zn2+
27. పత్ర రంధ్రాలు తెరచుకునే, మూసుకునే విధానంలో కింది ఏ కేటయాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది?
1) K 2) Cl 3) 1, 2 4) Mn
జ: 1 (K)
28. జతపరచండి.
పట్టిక - 1 | పట్టిక - 2 |
I. కాంతి నీటి విచ్ఛేదనం | A. ఐరన్ |
II. పత్రహరితం ఏర్పడటం | B. మాంగనీస్ |
III. DNA, RNA సంశ్లేషణ | C. బోరాన్ |
IV. కార్బోహైడ్రేట్ల స్థానాంతరణ | D. మెగ్నీషియం |
సరైన జోడింపు
I II III IV
జ: B A D C
29. నిశ్చితం (A): మొక్కలు చూపే లోప లక్షణానికి కారణమైన ఆవశ్యక మూలకం. అది లోపించినప్పుడు ఇంకా ఇతర మొక్కల్లో, ఏ లోప లక్షణాలనూ ప్రదర్శించదు.
వివరణ (R): నిమ్మలో డైబాక్కు కారణం Cu లోపమే.
జ: A సరైంది. కానీ, R తప్పు.
30. నత్రజని, మెగ్నీషియం, పొటాషియం లోప లక్షణాలు వేటిలో కనిపిస్తాయి?
జ: ముదురు పత్రాల్లో