• facebook
  • whatsapp
  • telegram

గ్రూపులు

1. N2O5, N2O3, N2O4 లలో ONO బంధకోణాల సరైన క్రమం
జ: N2O4 > N2O3 > N2O5

 

2. పెంటా ఆక్వా నైట్రోసోనియం ఐరన్ (I) సల్ఫేట్ రంగు
జ: జేగురు

 

3. p-p బంధం దేనిలో ఏర్పడుతుందంటే
జ: H4P2O6

 

4. కింద తెలిపిన వాటిలో సరికాని వ్యాఖ్య
    1) N2O3 నీలిరంగు ఘనపదార్థం      2) N2O5 పసుపురంగు ఘనపదార్థం
    3) NO రంగులేని వాయువు            4) NO2 జేగురు రంగు వాయువు
జ: 2 (N2O5 పసుపురంగు ఘనపదార్థం)

 

5. ప్రస్తుత కాలంలో హేబర్ విధానంలో NH3 సంశ్లేషణలో ఉపయోగించే ఉత్ప్రేరకం
జ: Al2O3 + K2O + ఐరన్ ఆక్సైడ్

 

6. 15 వ గ్రూపు మూలకాల ఏ హైడ్రైడ్‌కి కనిష్ఠ బాష్పీభవన స్థానం ఉంటుందంటే
జ: PH3

 

7. O3 విఘటనంలో ΔG, ΔH, ΔS ల సంజ్ఞలు వరుసగా
జ: −Ve, −Ve, +Ve

 

8. O3 దేనితో చర్య జరిపి O2 వాయువును వెలువరించదంటే...
జ: C2H4

 

9. రాంబిక్ సల్ఫర్ దేనిలో త్వరగా కరుగుతుందంటే
జ: CS2

 

10. కార్బన్, గాఢ H2SO4 తో చర్య జరిపినప్పుడు ఏర్పడే వాయువు/ వాయువులు?
      1) CO2       2) SO2      3) CO2, SO2 రెండూ       4) CO
జ: 3 (CO2, SO2 రెండూ)

 

11. కింద తెలిపిన వాటిలో తటస్థ ఆక్సైడ్‌ల సమూహం
      1) SO2, Cl2O7, N2O5            2) ZnO, PbO, SnO2
      3) Mn2O7, CrO3, V2O5         4) పైవేవీకావు
జ: 2 (ZnO, PbO, SnO2)

 

12. S−S బంధం దేనిలో ఏర్పడుతుందంటే
జ: H2S2O4

 

13. CO ని నిర్ణయించడంలో వాడే ఆక్సైడ్
జ: I2O5 

 

14. అవశేష కేంద్రక ఇంధనం నుంచి Pu ను PuF6 రూపంలో తొలగించడానికి ఉపయోగించే సమ్మేళనం
జ: O2F2

 

15. స్పర్శా విధానంలో ఆర్సెనిక్ శుద్ధకారిలో ఆర్సెనిక్ మలినాలను తొలగించడానికి వాడేది
జ: జిగటలాంటి సార్ద్ర Fe(OH)3

 

16. U ను సంపన్నం చేసే ప్రక్రియలో UF6 ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సమ్మేళనం/ సమ్మేళనాలు
      1) ClF3       2) BrF3      3) ClF3, BrF3 రెండూ       4) IF7
జ: 3 (ClF3, BrF3 రెండూ)

 

17. కింద తెలిపిన క్రమాలకు ఎదురుగా తెలిపిన వాటి ధర్మాలకు పొంతన లేనిది?
      1) ClO > ClO2 > ClO3 > ClO4: ఆమ్ల స్వభావం
      2) F2 > Cl2 > Br2 > I2 : బంధ విఘటన శక్తి
      3) F2 > Cl2 > Br2 > I2 : ఆక్సీకరణ సామర్థ్యం
      4) HF > HI > HBr > HCl : బాష్పీభవన స్థానాలు
జ: 2 (F2 > Cl2 > Br2 > I2 : బంధ విఘటన శక్తి)

 

18. కింద తెలిపిన చర్యల్లో జరగని చర్య ఏది?
      1) 2 KI + Br2  2 KBr + I2           2) 2 KBr + Cl2  ​​​​​​ 2 KCl + Br2
      3) 2 H2O + 2 F2  ​​​​​​ 4 HF + O2      4) 2 KBr + I2  ​​​​​​ 2 KI + Br2
జ: 4 (2 KBr + I2  ​​​​​​ 2 KI + Br2)

 

19. Cl2 వెలువడని చర్య
జ: NaNO2 + HCl 

 

20. SO2 తాత్కాలిక విరంజనకారిణి కాగా Cl2 శాశ్వత విరంజనకారిణి. ఎందువల్ల?
జ: Cl2 ఆక్సీకరణం మూలంగా విరంజనం చేస్తే SO2 క్షయకరణం మూలంగా విరంజనం చేస్తుంది.

 

21. S8 క్లోరిన్‌తో చర్య జరిపి X అనే సమ్మేళనాన్ని ఇస్తుంది. X నిర్మాణం దేనితో సమంగా ఉంటుందంటే
     1) H2O2      2) O2F2     3) H2O2, O2F2 రెండూ      4) XeF2
జ: 3 (H2O2, O2F2 రెండూ)

 

22. HCl మెత్తగా చూర్ణం చేసిన ఐరన్‌తో చర్య జరిపి ఒక రంగున్న అవక్షేపాన్ని ఇస్తుంది. ఆ అవక్షేపం రంగు
జ: లేత ఆకుపచ్చ

 

23. రేడియం విఘటనంలో ఏర్పడే ఉత్పన్నాలు
జ: ఒక రేడియోధార్మిక ఉత్కృష్ట వాయువు, ఒక రేడియోధార్మికత లేని ఉత్కృష్ట వాయువు

 

24. నీల్ బార్ట్‌లెట్ Xe కి చెందిన IE1 విలువ, ఏ వాయువు IE1 విలువతో సమానంగా ఉంటుందనే వాస్తవాన్ని గ్రహించాడంటే
జ: O2

 

25. Xe తో 5 రెట్లు, 20 రెట్ల F2 చర్య జరిపినప్పుడు, అధిక Xe, ఫ్లోరిన్‌తో చర్య జరిపినప్పుడు ఏర్పడే సమ్మేళనాల పేర్లు వరుసగా....
జ: XeF4, XeF6, XeF2

 

26. XeO3, XeOF4, XeF6, XeF4, XeF2 లలో Xe పై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు వరుసగా
జ: 1, 1, 1, 2, 3

Posted Date : 15-10-2020

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌