1. A → ఉత్పన్నాలు అనే చర్యకు ఈ గ్రాఫ్ సూచించబడింది. 'A' పరంగా చర్య
జ: శూన్య క్రమాంక
2. ఒక ప్రథమ క్రమాంకచర్య 50% పూర్తయ్యేందుకు 100 నిమిషాలు పట్టింది. 100% పూర్తయ్యేందుకు పట్టేకాలం
జ: అనంతం
3. ఒక చర్యకు Ea = 0, k = 3.2 × 104 s-1 ఉష్ణోగ్రత 300 k అయితే 310 k వద్ద 'k' విలువ
జ: 3.2 × 104 s-1
4. 2A(వా) + B(వా) → 2C(వా) అనే వాయుచర్యలో 10 నిమిషాల్లో పీడనం 120 mm నుంచి 100 mm కు తగ్గింది. అయితే 'C' ఏర్పడే రేటు
జ: 2mm/ min
5. ఒక నిర్దిష్ట చర్యకు t0.5 విలువ ప్రారంభ గాఢతను సగంచేస్తే, సగమైంది. అయితే క్రియాజనకంపరంగా చర్యాక్రమాంకం
జ: 0
6. లయోఫోబిక్ కొల్లాయిడ్ లు
A) పొగ B) పాలు C) స్టార్చ్ ద్రావణం D) గోల్డ్ స్టాల్
జ: A, D
7. A, B, C, D అనే నాలుగు రక్షక కొల్లాయిడ్ ల గోల్డ్ సంఖ్యలు వరుసగా 0.005, 0.01, 0.1, 0.5 అయితే వాటి రక్షణ సామర్థ్యం తగ్గే క్రమం
జ: ABCD
8. ఒక బ్రైనరీ మిశ్రమంలో కణంసైజు 10-9 సెం.మీ. అయితే ఆ మిశ్రమం.
జ: నిజద్రావణం
9. Assertion (A): సందిగ్ధ గాఢత కంటే అధిక గాఢత వద్ద సబ్బు కొల్లాయిడ్ లో ద్రావణం.
Reason (R): నీరు - ధూళి ఎమల్షన్ కు సబ్బు ఎమల్సీకరణ కారకంగా పనిచేస్తుంది. .
జ: A మరియు R సరైనవి A ను R వివరించదు
10. A, B, C, D అనే నాలుగు వాయువులు సందిగ్ధ ఉష్ణోగ్రతలు 430k, 356k, 400k, 441k అయితే ఒక గ్రామ్ చార్ కోల్ మీద అధికంగా అధిశోషణం చెందే వాయువు.
జ: D
11. ఒక ప్రథమక్రమాంక చర్య యొక్క రేటు స్థిరాంకం 1 x 10-2 s-1. క్రియజనకాల గాఢత ఒక మోల్ నుంచి 0.25 మోల్స్ కు తగ్గడానికి పట్టే కాలం
జ: 138.6 sec
12. ln k మరియు 1/T గ్రాఫ్ వాలు దీనికి సమానం
జ: -Ea/R
13. 2 NO + Br2→ 2 NOBr అనే చర్య యాంత్రికం. కింది ఇచ్చారు.
I. No + Br2→ NOBr2 .... త్వరిత
II. NOBr2 + NO → 2NOBr.... నెమ్మదిగా
NO మరియు Br2ల గాఢతలను రెండురెట్లు పెంచితే, చర్యారేటు ఎన్ని రెట్లు పెరుగుతుంది.
జ: 8 times
14. A + B → క్రియాజనకాలు అనే చర్యలో 'A' పరంగా చర్యారేటు ప్రథమ క్రమాంకం మరియు 'B' పరంగా ప్రథమ క్రమాంకం ఒక లీ. పాత్రలో ఒక మోల్ 'A' మరియు 'B' లను తీసుకుంటే, ప్రారంభరేటు 1 × 10-2 mol L-1 s-1, 90% క్రియాజనకాలు ఉత్పన్నాలుగా మారితే, చర్యారేటు
జ: 1 × 10-4 Mol L-4 s-1
15. చర్యారేటు స్థిరాంకం కింది కారకంపై ఆధారపడదు.
జ: గాఢత
16. కింది చర్యలో డీఎమల్సీకరణం ఉంటుంది.
జ: పెరుగు మజ్జిగగా మారడం