• facebook
  • whatsapp
  • telegram

న్యూటన్ నియమాలు

1. 5000 Kg ద్రవ్యరాశి ఉన్న ఒక రాకెట్‌ను నిట్టనిలువుగా పైకి ప్రక్షిప్తం చేశారు. గురుత్వాకర్షణను అధిగమించి 20 ms-2 త్వరణాన్ని పొందడానికి బహిర్గత వాయు వేగం 800 ms-1 అయితే ఒక సెకనుకు వెలువడే వాయువు (g = 10 ms-2)
జ: 187.5 kgs-1
HINT:

 

2. 40N భారం ఉన్న ఒక దిమ్మె నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉంది. అది ఒక బలం వల్ల క్షితిజ సమాంతర దిశలో 5m/s2 రేటుతో త్వరణం చెందుతుంది. ఆ దిమ్మెపై పనిచేసే ఫలిత బలం (g = 10m/s2)
జ: 20N
HINT: 
 

3. 6 Kg ద్రవ్యరాశి ఉన్న ఒక బాంబు తొలుత నిశ్చలస్థితిలో ఉండి, మూడు సర్వసమాన ముక్కలుగా పేలింది. వాటిలో ఒక ముక్క వేగంతో కదులుతుంది, మరో ముక్క  వేగంతో కదులుతుంది. అప్పుడు మూడో ముక్క కదిలే వేగం పరిమాణం-
జ: 20 m/s
HINT:
 

4. ఒక నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉన్న ఒక దిమ్మెపై పనిచేసే క్షితిజ సమాంతర బలం 'F' దానిలో 6 m/s2 త్వరణాన్ని కలగజేస్తుంది. అదే బలం నున్నటి క్షితిజ సమాంతర తలంపై ఉన్న మరో దిమ్మెపై పనిచేస్తే దానిలో 3 m/s2 త్వరణాన్ని కలగజేస్తుంది. ఆ రెండు దిమ్మెలను ఒక్కటిగా కలిపి అంతే బలం ప్రయోగిస్తే కలిగే త్వరణం
జ: 2 m/s2
HINT:

 
 

5. నిశ్చలస్థితిలోని ఒక వస్తువు ద్రవ్యరాశుల నిష్పత్తి 2 : 1 : 1 ఉండేలా మూడు భాగాలుగా ఒక్కసారిగా పేలింది. సమాన ద్రవ్యరాశిఉన్న భాగాలు పరస్పరం లంబదిశలో సమానవేగం 'V' తో చరిస్తున్నాయి. పేలిన తరువాత మూడో భాగం వేగం-
జ: 
HINT:
 


6. 0.2 kg ద్రవ్యరాశి ఉన్న ఒక బంతి ఒక అవరోధాన్ని ఢీకొని తొలి దిశతో 60º కోణం చేస్తూ కదిలింది. దాని వేగం కూడా 20 m/s నుంచి 10 m/s కు మారితే ఆ బంతి పొందే ప్రచోదనం పరిమాణం

జ: 
HINT:
 

7. రెండు సర్వసమానమైన బిలియర్డ్ బంతులు ఒక దృఢమైన గోడను ఒకే వేగంతో ఢీకొట్టాయి. కానీ, మొదటిది గోడకు లంబంగా, రెండోది గోడతో 60º కోణం చేస్తున్నాయి. అవి రెండు వేగంలో ఏ మాత్రం నష్టం లేకుండా పరావర్తనం చెందితే, ఆ రెండు బంతులపై గోడ కలిగించే ప్రచోదన పరిమాణాల నిష్పత్తి-
జ: 
HINT:
 

8. భూమి నుంచి క్షితిజ సమాంతరంతో కోణం చేస్తూ 'V' వేగంతో ఒక మందు గుండును పేల్చారు. గరిష్ఠ ఎత్తు వద్ద అది రెండు సమాన భాగాలుగా పేలింది. అందులో ఒక భాగం (ముక్క) తొలి చలనమార్గంలో అంతేవేగంతో వెనుదిరిగితే రెండోభాగం(ముక్క) వేగం-
జ: 3 Vcos
HINT:
 


9. ఒక లిఫ్ట్ కొంత త్వరణంతో పైకి కదులుతున్నప్పుడు ఆ లిఫ్ట్‌లో వ్యక్తి దృశ్యభారం W1, ఆ లిఫ్ట్ అంతే త్వరణంతో కిందికి కదులుతున్నప్పుడు W2. ఆ లిఫ్ట్ సమవేగంతో పైకి కదులుతున్నప్పుడు ఆ వ్యక్తి భారం-

జ:  
HINT:

 

10. '' సాంద్రత ఉన్న ఒక ద్రవం, 'A' అడ్డుకోత వైశాల్యం ఉన్న జెట్ ప్రవాహం 'V' వేగంతో ఒక ఉపరితలంపై ''  కోణంతో పతనమై అంతేవేగంతో వెనుదిరిగితే, ఆ ఉపరితలంపై పనిచేసే అభిలంబ బలం-
జ: 2AV2sin
HINT: 
 

Posted Date : 30-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌