1. ఒక పట్టకాన్ని గాలిలో ఉంచినప్పుడు దాని సందిగ్ధ కోణం C. దాని నుంచి బహిర్గామి కాంతి కిరణాన్ని పొందాలంటే పట్టకానికి ఎంత గరిష్ఠ పట్టకకోణం ఉండవచ్చు?
జ. 2C
2. ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం మీద కాంతి పడినప్పుడు, పతన, బహిర్గామి కిరణాలు పట్టకం భూమి పరంగా సౌష్టవతతో ఉంటే విచలన కోణం ఎంత?
జ. 30o
3. వక్రీభవన గుణకం 1.5 ఉన్న ఒక సమబాహు త్రిభుజాకార పట్టకం మీద కాంతి కిరణం లంబంగా పతనమై, దాని రెండో వక్రీభవన తలం మీద పడినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం చెందితే ఆ కాంతి కిరణం విచలన కోణం -
జ. 60o
4. వక్రీభవన గుణకం 1.5 ఉన్న పట్టకం పట్టక కోణం 4o. దాన్ని గాలిలో ఉంచితే కనిష్ఠ విచలన కోణం.
జ. 2o
5. పట్టక కోణం 2o ఉన్న పట్టకం వక్రీభవన గుణకం 1.5. దాన్ని వక్రీభవన గుణకం 4/3 ఉన్న నీటిలో ఉంచితే కనిష్ఠ విచలన కోణం -
జ.
6. స్వల్ప పట్టక కోణం ఉన్న పట్టకం వక్రీభవన గుణకం 1.5. దాన్ని గాలిలో ఉంచినప్పుడు కనిష్ఠ విచలన కోణం, వక్రీభవన గుణకం 1.3 ఉన్న ద్రవంలో ఉంచినప్పుడు కనిష్ఠ విచలన కోణాల నిష్పత్తి -
జ. 6.5 : 2
7. ఒక పట్టకాన్ని కనిష్ఠ విచలన స్థానంలో ఉంచినప్పుడు-
జ. పతన కోణం, బహిర్గామి కోణాలు సమానం.
8. ఏ రంగు సందిగ్ధ కోణం కనిష్ఠంగా ఉంటుంది?
జ. ఊదా
9. ఒక సాంద్రతర యానక వక్రీభవన గుణకం దాన్ని గాలి నుంచి వేరుచేసే తలం వద్ద సందిగ్ధ కోణం
జ. 45o
10. వక్రీభవన గుణకం 3/2 ఉన్న గాజు నుంచి వక్రీభవన గుణకం 4/3 ఉన్న నీటిని వేరుచేసే తలం వద్ద సందిగ్ధ కోణం
జ. sin-1
11. రెండు యానకాలలో కాంతివేగాలు వరుసగా 1.25 × 108 m/s, 2.25 × 108 m/s. అయితే వాటిని వేరుచేసే తలంవద్ద సందిగ్ధ కోణం
జ. sin-1
12. ఒక నీటి స్తంభంలో పైకి లేస్తున్న గాలి బుడగమీద తీవ్రమైన విసరిత కాంతి పడేటట్లు చేస్తే, ఆ బుడగ ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం కాంతి...
జ. సంపూర్ణాంతర కాంతి పరావర్తనం
13. గాజు పలకలో ఉన్న పగులును వంకరగా చూస్తే కింది విధంగా కనిపిస్తుంది.
జ. వెండిలా
14. సమాంతర తలాలున్న గాజు దిమ్మె మందం t. దాని వక్రీభవన గుణకం µ . దాని ఒక సమాంతర తలం మీద పతనకోణం i తో కాంతి పడి రెండో సమాంతర తలం నుంచి బహిర్గతమవుతుంది. కాంతి గాజు దిమ్మెలో ప్రయాణించిన దూరం...
జ.
15. కాంతి ఒక యానకం నుంచి వేరొక యానకంలోకి ప్రయాణిస్తుంటే, ఏ భౌతిక రాశి మారదు ?
జ: పౌనఃపున్యం
16. ఒకేదశలో ఉన్న రెండు వరుస బిందువుల మధ్య దూరం
జ: తరంగదైర్ఘ్యం
17. హైగెన్స్ తరంగ సిద్ధాంతం దేన్ని విశదీకరించలేదు?
జ: ధ్రువణం
18. మాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం దేన్ని విశదీకరించలేదు?
జ: కాంతి విద్యుత్ ఫలితం
19. విద్యుత్క్షేత్ర సదిశ గరిష్ఠ విలువ (E0), అయస్కాంతక్షేత్ర సదిశ గరిష్ఠ విలువ (B0)ల మధ్య సంబంధం
జ: B0 = E0/C
20. శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం ఎంత?
జ: 3 × 108m/s
21. =
జ: శూన్యంలో కాంతివేగం
22. =
జ: యానకంలో కాంతివేగం
23. యానకం వక్రీభవన గుణకం దేనికి సమానం?
జ:
24. 4000 Ao, 5000 Ao తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి తరంగాల వేగాల నిష్పత్తి
జ: 1 : 1
25. నీటితో పోలిస్తే గాజు వక్రీభవన గుణకం అయితే గాజుతో పోలిస్తే నీటి వక్రీభవన గుణకం...
జ:
26. నీటి వక్రీభవన గుణకం 1.33 అయితే నీటిలో కాంతి వేగం
జ: 2.25 × 108 m/s
27. గాజుతో పోలిస్తే నీటి వక్రీభవన గుణకం అయితే నీటిలో కాంతివేగం 2.25 × 108m/s అయితే గాజులో కాంతివేగం
జ: 2.0 × 108 m/s
28. శూన్యంలో కాంతి తరంగదైర్ఘ్యం 6000 Ao అయితే గాజులో దాని తరంగదైర్ఘ్యం (గాజు వక్రీభవన గుణకం = 1.5)
జ: 4000 Ao
29. నీటితో పోలిస్తే గాజు వక్రీభవన గుణకం గాజులో కాంతి తరంగదైర్ఘ్యం 4000 Ao . నీటిలో దాని తరంగదైర్ఘ్యం -
జ: 4500 Ao