• facebook
  • whatsapp
  • telegram

ఉపరితల రసాయనశాస్త్రం 

1. ఆర్సెనిక్ సల్ఫైడ్ స్కందనంలో Na+, Al+3, Ba+2 అయాన్‌ల స్కందన సామర్థ్య సరైన క్రమం
జ: Na+< Ba+2< Al+3

 

2. రుణావేశ సాల్‌ని స్కందనం చేయడానికి KCl, MgCl2, CrCl3, SnCl4ల స్కందన విలువల క్రమం
జ: SnCl4< CrCl3< MgCl2< KCl

 

3. పెరుగు అనేది...
జ: జెల్

 

4. కంటి వ్యాధుల చికిత్సలో వాడే కొల్లాయిడ్ సాల్
జ: కొల్లాయిడ్ వెండి

 

5. జెలటిన్, హిమోగ్లోబిన్, గమ్ అరబిక్, బంగాళదుంప పిండి పదార్థాల పరిరక్షక ప్రభావాల సరైన క్రమం
జ: జెలటిన్ > హిమోగ్లోబిన్ > గమ్ అరబిక్ > బంగాళదుంప పిండి

 

6. ఫ్రెండ్లిచ్ అధిశోషణ సమోష్ణ రేఖలో విలువ 1/n 
జ: అన్ని సందర్భాల్లో 0 నుంచి 1 వరకు ఉంటుంది.
 

7. ఆకార - ఎంపిక (వరణాత్మకత) ఉత్ప్రేరణ చర్యను జరిపేది
     1) ఎంజైమ్   2) ప్రోటీన్     3) జియోలైట్      4) జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం
జ: 3 (జియోలైట్)

8. సందిగ్ధ మిసెల్ గాఢత వద్ద ఉపరితల అణువులు
జ: సహచరితమవుతాయి

 

9. టిండాల్ ప్రభావం వేటిలో కనిపించదంటే...
     1) పొగ     2) బంగారపు సాల్     3) ఎమల్షన్     4) బ్రైన్ ద్రావణం
జ: 4 (బ్రైన్ ద్రావణం)

 

10. సబ్బులకు ఉండే CMC విలువ
జ: 10-4 to 10-3 mol lit-1

 

11. కాట్రెల్ పొగ అవక్షేపకరణిలో ఉండే సాధారణ సూత్రం
జ: కొల్లాయిడ్ కణాలపై ఉండే ఆవేశాన్ని తటస్థీకరణం చేయడం

 

12. రుణావేశ సాల్‌కి ఉదాహరణ...
జ: జెలటిన్

 

13. స్పర్శా విధానంలో Fe(OH)3 పాత్ర
జ: ఆర్సెనిక్ మలినాన్ని తొలగించడం

 

14. O/W రకం ఎమల్షన్లు, W/O రకం ఎమల్షన్లను స్థిరపరచేది
      1) కెసీన్    2) సిలికా    3) గ్రాఫైట్   4) సబ్బు
జ: 3 (గ్రాఫైట్)

15. కింద తెలిపిన చర్యల్లో సరికాని ఎంజైమ్ చర్య

 
16. TiCl4 + Al (C2H5)3 ఉత్ప్రేరకం ఉపయోగం
జ: అధిక సాంద్రత గల పాలిథిన్‌ని తయారు చేయడం

 

17. కింద తెలిపిన వాటిలో సరికాని జత
     1) జెల్ - ఘనంలో నిక్షిప్తమైన ద్రవం                2) ఎరోసాల్ - వాయువులో నిక్షిప్తమైన ద్రవం
     3) నురుగు - ద్రవంలో నిక్షిప్తమైన వాయువు     4) ఘనస్థితి సాల్ - ద్రవంలో నిక్షిప్తమైన ఘనం
జ: 4 (ఘనస్థితి సాల్ - ద్రవంలో నిక్షిప్తమైన ఘనం)

 

18. ఫ్రెండ్లిచ్ అధిశోషణ సమోష్ణ రేఖలో సరళ రేఖ రావడానికి వేటి మధ్య గ్రాఫ్ గీయాలంటే
జ: log x/m 
 & log P
 

19. సబ్బు ప్రదర్శించే శుద్ధి ప్రక్రియ దేనివల్ల జరుగుతుంది అంటే...
జ: మిసెల్ & ఎమల్షన్‌లు ఏర్పరచడం వల్ల

20. రక్తస్రావాన్ని నిరోధించే చర్య దేనిమూలంగా అంటే
జ: రుణావేశమున్న రక్తాన్ని Fe+3 లేదా Al+3 అయాన్లతో స్కందనం చేయడం

 

21. వేడిగా ఉండే ఏ ఉత్ప్రేరకం మీదుగా ఆల్కహాల్‌లను పంపి నేరుగా గాసోలిన్‌ని పొందవచ్చంటే
జ: Z SM-5

 

22. లిండ్లార్ ఉత్ప్రేరకంలో పెల్లాడియంయుత బొగ్గు విషం ఏదంటే
జ: BaSO4 & Quinoline క్వినోలిన్

 

23. ఘనపదార్థం ఉపరితలంపై వాయువులు అధిశోషణం చెందడం ఉష్ణమోచక చర్య ఎందువల్లనంటే...
జ: "S" decreases "S" తగ్గడం

 

24. H2, CH4, SO2 వాయువులు అధిశోషణం చెందే క్రమం
జ: SO2 > CH4 > H2

Posted Date : 23-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు