అనాలజీ అంటే పోలిక అని అర్థం. ఈ అనాలజీలో అడిగే ప్రశ్నల్లో రెండు సంఖ్యలు ఇస్తారు. ఆ సంఖ్యల మధ్య సంబంధం ఉంటుంది. దానిని అర్థం చేసుకుని, ఇచ్చిన ఛాయిస్ నుంచి అదే సంబంధమున్న సంఖ్యను కనుగొనాల్సి ఉంటుంది. దీనిలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోవాలి.
* ఒక సంఖ్యను ఇంకో సంఖ్యతో గుణించవచ్చు.
* ఒక సంఖ్య వర్గం లేదా వర్గమూలం మరో సంఖ్య వర్గం లేదా వర్గమూలం కావచ్చు.
* ఒక సంఖ్య ఘనం లేదా ఘనమూలం మరో సంఖ్య ఘనం లేదా ఘనమూలం కావచ్చు.
* ఇచ్చిన రెండు సంఖ్యలు వరుస సరి, బేసి లేదా ప్రధాన సంఖ్యలుగా ఉండొచ్చు.
1. 7 : 14 :: 9 : --
a) 11 b) 14 c) 18 d) 19
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి రెండు సంఖ్యలు అంటే 7 : 14 మధ్య ఉన్న సంబంధం 7 ను 2తో గుణిస్తే 14 వస్తుంది. ఈ విధమైన సంబంధమే 9 ని '2' తో గుణిస్తే 9×2 = 18 అవుతుంది. కాబట్టి సమాధానం C అవుతుంది.
2. 24 : 15 :: 63 : --
a) 56 b) 38 c) 58 d) 48
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 24, 15 సంఖ్యలకున్న సంబంధం కనుగొని 63 తర్వాత సంఖ్యకు కూడా అదే సంబంధం కనుగొనాలి. 24 = 52-1, 15 = 42-1. ఇక్కడ 52-1, 42-1 అంటే వరుసగా తగ్గే సంఖ్యలను వర్గంచేసి -1 చేశారు. అలాగే 63 = 82-1 తర్వాత 72-1 = 49-1 = 48 అవుతుంది.
3. 2 : 7 :: 6 : --
a) 39 b) 37 c) 25 d) 18
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో 2, 7 అయ్యేందుకు.. 22 + 3 = 4 + 3 = 7 అయింది. అదే విధంగా 62+3 = 36+3 = 39 అవుతుంది.
4. 37 : 73 :: 46 : --
a) 82 b) 64 c) 84 d) 68
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో 37, 73 అయింది. దీనిలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 37ను తిప్పి రాశారు. అదే విధంగా 46ను తిప్పి రాస్తే 64 అవుతుంది.
5. 8 : 81 :: 10 : --
a) 100 b) 125 c) 200 d) 121
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 8 తర్వాత 81 రావడానికి 8 తర్వాత సంఖ్యను (9) వర్గం చేశారు = 92 = 81. అదే విధంగా 10 తర్వాత సంఖ్యను (11) వర్గం చేస్తే = 112 = 121.
6. 1 : 4 :: 25 : --
a) 27 b) 29 c) 30 d) 36
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 1, 4 మధ్య సంబంధం 1=12 4 = 22, 25 = 52. 12, 22 వరుసగా పెరిగితే సహజ సంఖ్య వర్గాలు అదే విధంగా 52, 62 అవుతాయి. అంటే 62= 36 అవుతుంది.
7. 3 : 24 :: 5 : --
a) 128 b) 125 c) 120 d) 123
జవాబు: (c) అవుతుంది ఈ ప్రశ్నలో 3, 24 అయ్యేందుకు సంబంధం 33-3 = 27-3. అంటే ఇచ్చిన సంఖ్యను ఘనం చేసి అదే సంఖ్యను తీసేయాలి. ఇదేవిధంగా 5ను ఘనం చేసి 5ను తీసేయాలి. అంటే 53-5 = 125-5 = 120.
8. 8 : 24 :: -- : 32
a) 5 b) 6 c) 10 d) 8
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి సంఖ్యను కనుక్కోవడానికి రెండో సంఖ్య నుంచి సంబంధం కనుక్కోవచ్చు. అదేవిధంగా నాలుగో సంఖ్యనుంచి మూడో సంఖ్యను కనుక్కోవచ్చు. ఇప్పుడు రెండో సంఖ్య 24 దానిని 2×4 చేస్తే 8 వస్తుంది. అదే విధంగా 32.. 3×2 = 6 అవుతుంది.
9. 63 : 9 :: -- : 14
a) 68 b) 42 c) 96 d) 56
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో మొదటి సంఖ్యనుంచి రెండో సంఖ్య వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన ఛాయిస్‌లో ఒకదానిని ఉపయోగించి నాలుగో సంఖ్య రావాలి. 63 నుంచి 9 రావడానికి 6+3 = 9 అవుతుంది. ఇచ్చిన ఛాయిస్‌లో 68నుంచి 6+8 = 14.
10. 6 : 18 :: 4 : --
a) 2 b) 6 c) 8 d) 16
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో మామూలుగా ఆలోచిస్తే 6×3 = 18 అవుతుంది. కానీ 4×3 = 12 లేదు కాబట్టి మరో సంబంధాన్ని కనుక్కోవాలి. మొదటి సంఖ్యను వర్గంచేసి దాన్ని '2' తో భాగిస్తే 18 వస్తుంది. అదే విధంగా 4ను వర్గం చేసి దాన్ని '2'తో భాగిస్తే 8 వస్తుంది.
62 = 36 = 18
42 = 16 = 8
11. 8 : 28 :: 27 : --
a) 8 b) 28 c) 64 d) 65
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 8ని 23గా అర్థం చేసుకోవచ్చు. 28 రావడానికి 33+1 = 27+1. అంటే 23 తర్వాత 33+1 ను తీసుకున్నారు. అదే విధంగా 33 తర్వాత 43 తీసుకుని +1 కలపాలి.
23 : 33+1 = 8 : 28
33 : 43+1 = 27 : 65 అవుతుంది.
12. 583 : 293 :: 488 : --
a) 291 b) 378 c) 487 d) 581
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని చూస్తే వర్గాలుకాని, ఘనంగాని, గుణించినా, భాగించినా మనకు కావాల్సిన సమాధానం రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు కొన్ని ప్రశ్నలకు మామూలుగా సమాధానం చేయవచ్చు. ఈ ప్రశ్న కూడా అదే విధంగా ఉంది. 583 అంకెల మొత్తం కలిపిచూస్తే 5+8+3 = 16 అవుతుంది. 293 కూడా పై విధంగా చేస్తే 2+9+3 = 14. ఈ రెండింటి మొత్తాల మధ్య తేడా 16-14 = 2 అవుతుంది. మిగతావాటిని కూడా ఇదే విధంగా చేస్తే 4+8+8 = 20 అవుతుంది. దీనిలోంచి తేడా 2 తీసేస్తే మొత్తం 18 కావాలి. అప్పుడు
378 3+7+8 = 18
5+8+3 = 16 2+9+3 = 14
4+8+8 = 20 3+7+8 = 18
13. (18, 8, 2) కిందివాటిలో ఏ సమాధానం సరైనది?
a) (3, 7, 1) b) (11, 12, 10) c) (17, 19, 3) d) (24, 22, 4)
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన set (18, 8, 2). ఇందులో అన్ని సరి సంఖ్యలు ఉన్నాయి. ఇచ్చిన ఛాయిస్ అన్నింటిలో సరి సంఖ్యలు ఉన్న సమాధానం (d) అవుతుంది (24, 22, 4).
14. (8, 3, 2) కిందివాటిలో ఏ సమాధానం సరైనది?
a) (10, 6, 5) b) (63, 8, 3) c) (95, 24, 5) d) (168, 15, 4)
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన set (8, 3, 2). ఇందులో ఉన్న సంబంధాన్ని కనుక్కుని కింద ఇచ్చిన ఛాయిస్‌లో కూడా అదే సంబంధం ఉన్న ఛాయిస్‌ను ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇచ్చింది (8, 3, 2). ఇందులో 2, 3 అవడానికి 22 = 4 - 1 = 3, తర్వాత 3, 8 అవడానికి 32 = 9 - 1 = 8 అలాగే కిందివాటిలో 3, 8 అవడానికి 32 = 9 - 1 = 8. 8, 63 అవడానికి 82 = 64 - 1 = 63 అవుతుంది.
(8, 3, 2) = 22-1 = 3, 32-1 = 8
(63, 8, 3) = 32-1 = 8, 82-1 = 63.
15. 363, 489, 579 ఈ సంఖ్యలకు సరైన సమాధానం కనుక్కోండి.
a) 562 b) 471 c) 382 d) 281
జవాబు: (b) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలను ఇలా రాయవచ్చు.
సంఖ్య sum of digits new sum of digits
363 3+6+3 = 12 1+2 = 3
489 4+8+9 = 21 2+1 = 3
579 5+7+9 = 21 2+1 = 3
471 4+7+1 = 12 1+2 = 3
16. : 61 ::
a) 85 b) 86 c) 87 d) 89
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో ఒక భిన్నం ఇచ్చి దాని విలువ 61 ఇచ్చారు. భిన్నంలోని సంఖ్యలను వర్గంచేస్తే - 52 = 25, 62 = 36. ఈ రెండింటిని కూడితే 25+36 = 61 వస్తుంది. మిగిలిన భిన్నానికి కూడా ఇదే విధంగా చేస్తే సమాధానం వస్తుంది.
= = = 25 + 36 = 61
= = = 36 + 49 = 85
17. 4 : 9 :: 25 : --
a) 49 b) 50 c) 38 d) ఏదీకాదు
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన విలువలు వరుసగా 4 = 22, 9 = 32, 25 = 52 తర్వాత సంఖ్య 62 = 36 కాని ఇచ్చిన వాటిలో లేదు. కాబట్టి మరొక సంబంధం కనుక్కోవాలి. దీనిలో వరుస ప్రధాన సంఖ్యల వర్గాలను చూస్తే అప్పుడు
4 = 22, 9 = 32, 25 = 52, 49 = 72
22, 32, 52, 72
18. 123 : 6 :: 234 : --
a) 22 b) 23 c) 24 c) ఏదీకాదు
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో ఇచ్చిన 123, 6 అవడానికి ఉన్న సంబంధమే 234కు కూడా వర్తించాలి.
123 = 1×2×3 = 6
234 = 2×3×4 = 24
19. 123 : 14 :: 234 :--
a) 25 b) 27 c) 29 d) ఏదీకాదు
జవాబు: (c) అవుతుంది. ఈ ప్రశ్నలో 123ను 14 గా మార్చారు. అంటే 123లో ఉన్న ప్రతి అంకెను వర్గం చేసి కలిపారు. అదే విధంగా 234లో ప్రతి అంకెను వర్గం చేసి కలిపితే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది.
123 = 12+22+32 = 1+4+9 = 14
234 = 22+32+42 = 4+9+16 = 29
20. : 125 :: : --
a) 343 b) 527 c) 216 d) ఏదీకాదు
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో ను 125గా రాశారు. అంటే లవ, హారాలను కలిపి ఘనం చేశారు. అదే విధంగా లో లవ, హారాలను కూడి ఘనం చేయాలి.
= 2+3 = 5 53 = 125
= 3+4 = 7 73 = 343
21. 34 : 912 :: 45 : --
a) 1215 b) 1825 c) 5040 d) ఏదీకాదు
జవాబు: (a) అవుతుంది. ఈ ప్రశ్నలో 34 తర్వాత 912 వచ్చింది. అంటే 34లో ఉన్న ప్రతి అంకెను 3తో గుణించారు. అదే విధంగా 45లో ఉన్న ప్రతి అంకెను 3తో గుణిస్తే మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది.
34
45 4×3, 5×3 = 1215
22. 123 : 2 :: 639 : --
a) 3 b) 4 c) 5 d) 6
జవాబు: (d) అవుతుంది. ఈ ప్రశ్నలో 123 తర్వాత 2 వచ్చింది. అంటే 123లో ఉన్న అంకెలను కలిపి 3తో భాగించారు. అదే విధంగా 639లో ఉన్న ప్రతి అంకెను కలిపి వచ్చిన మొత్తాన్ని 3తో భాగించాలి.
123 1+2+3 = = 2
639 6+3+9 = = 6.