• facebook
  • whatsapp
  • telegram

బ్యాక్టీరియా (సూక్ష్మజీవశాస్త్రం)

1. రాబర్ట్‌కోచ్‌కు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏవి నిజం?
A . సూక్ష్మ జీవశాస్త్రానికి పునాది వేసిన వారిలో ఒకరు.
B. సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
C. బ్యాక్టీరియా పదాన్ని ప్రతిపాదించారు.
జ:  AB

 

2. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
A. లూయిస్ పాశ్చర్ - బ్యాక్టీరియా ప్రకృతిలో మార్పులు తెస్తుంది.
B. ఆంటన్ వాన్ లీవెన్‌హాక్ - ప్రోటోజోవన్లను కాదు, బ్యాక్టీరియాను పరిశీలించాడు.
C. ఫ్రెడిరిక్ గ్రిఫిత్ - బ్యాక్టీరియాలో సంయుగ్మాన్ని పరిశీలించాడు.
D. లెడర్‌బర్గ్, జిండర్ - జన్యువహనాన్ని కనుక్కున్నారు.
జ: BC

3. బ్యాక్టీరియాలో సంయుగ్మానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?
A. సంయుగ్మం ఒక సంరక్షణ ప్రక్రియ.
B. దాతకణం జన్యు పదార్థం నకలును తనలో నిలిపి ఉంచుకోదు.
C. సంయుగ్మం ఒక సంరక్షణలేని ప్రక్రియ.
D. దాతకణం జన్యు పదార్థం నకలును తనలో నిలిపి ఉంచుకుంటుంది.
జ: AD

 

4. నిశ్చితం (A): రసాయన పరపోషితాలు సూర్యకాంతి లేదా సేంద్రియ పోషకాలు అవసరం లేని ఒక అసాధారణ
పొందికను చూపుతాయి.
కారణం (R): రసాయన స్వయంపోషితాలు అసేంద్రియ పదార్థాల ఆక్సీకరణం ద్వారా శక్తిని, కార్బన్‌డైఆక్సైడ్ నుంచి కార్బన్‌ను పొందుతాయి.
1) (A), (R) రెండూ సరైనవి మరియు (A) కు (R) సరైన వివరణ.
2) (A) , (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు.
3) (A) సరైంది కానీ (R) సరైంది కాదు.
4) (A) సరైంది కాదు కానీ (R) సరైంది.
జ: (A) సరైంది కాదు కానీ (R) సరైంది.

5. కిందివాటిలో సరికాని జతలేవి?
A. కాంతి పరపోషితాలు - రోడోసూడోమోనాస్
B. రసాయన పరపోషితాలు - క్రోమేషియం
C. పూతికాహారులు - బాసిల్లస్
D. రసాయన పరపోషితాలు - నైట్రోసోమానాస్
E. కాంతి స్వయంపోషితాలు - బెగ్గియోటా
జ: BDE

 

6. నిశ్చితం (A): ప్లాస్మిడ్‌లను జన్యు ఇంజినీరింగ్ సాంకేతికతలో ఉపయోగిస్తారు.
    కారణం (R): ప్రయోగశాల పరిస్థితుల్లో ప్లాస్మిడ్‌లను మార్పులకు గురి చేయలేం.
1) (A), (R) రెండూ సరైనవి మరియు (A) కు (R) సరైన వివరణ.
2) (A), (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు.
3) (A) సరైంది కానీ (R) సరైంది కాదు.
4) (A) సరైంది కాదు కానీ (R) సరైంది.
జ: (A), (R) రెండూ సరైనవి కానీ (A) కు (R) సరైన వివరణ కాదు.

 

7. స్పైరిల్లమ్‌కు సంబంధించి కిందివాటిలో ఏది నిజం?
1) స్పైరిల్లమ్ ఒక పూర్తి మెలిక కంటే తక్కువ మెలికతో ఉంటుంది.
2) స్పైరిల్లమ్ ఒక సన్నటి, పొడవైన, స్క్రూ ఆకారంతో ఉంటుంది.
3) స్పైరిల్లమ్ ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక, కుండలాకార నిర్మాణంతో ఉంటుంది.
4) స్పైరిల్లమ్ పొడవైన దారం లాంటి పోగులుగా ఏర్పడుతుంది.
జ: స్పైరిల్లమ్ ఒక పూర్తి మెలిక కంటే ఎక్కువ మెలిక, కుండలాకార నిర్మాణంతో ఉంటుంది.

 

8. విట్టేకర్ అయిదు రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియా స్థానం ఎక్కడ ఉంటుంది?
A. ఆర్కి బ్యాక్టీరియమ్‌లను మొనీరా కింద      B. యూబ్యాక్టీరియమ్‌లను ప్రొటిస్టా కింద
C. యూబ్యాక్టీరియమ్‌లను మొనీరా కింద      D. సయనో బ్యాక్టీరియమ్‌లను మొనీరా కింద
జ:  ACD

 

9. సూక్ష్మ జీవశాస్త్రానికి చేసిన కృషి ఆధారంగా  కింది శాస్త్రవేత్తలను జతపరచండి.

I II
A. ఆంటన్‌వాన్ లీవెన్‌హాక్ i) బ్యాక్టీరియమ్‌లు అంటు వ్యాధులను కలిగిస్తాయి.
B. రాబర్ట్‌కోచ్ ii) బ్యాక్టీరియాలజీ పితామహుడు.
C. లూయిస్ పాశ్చర్ iii) బ్యాక్టీరియా పదం
D. ఎహెరెన్‌బర్గ్ iv) బ్యాక్టీరియా వర్గీకరణ
  v) సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు

జ: A - v, B - i, C - ii, D - iii                   

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌