• facebook
  • whatsapp
  • telegram

జీవసాంకేతిక శాస్త్రం - దాని అనువర్తనాలు

1. కిందివాటిలో మొదటి జన్యు పరివర్తిత పంట?   

1) గోల్డెన్‌ రైస్‌        2) బీటీ పత్తి

3) మొక్కజొన్న      4) ఫ్లెవర్‌ సెవర్‌ టొమాటో

2. కిందివాటిలో గోల్డెన్‌ రైస్‌ను ఉత్పత్తి చేసినవారు? 

1) ఎం.ఎస్‌.స్వామినాథన్‌      2) నార్మన్‌ బోర్లాగ్‌ 

3) బార్బరా మెక్‌ క్లింటన్‌       4) ఎవరూ కాదు


3. వేర్ల ఉత్పత్తికి ఉపయోగించే రసాయనం ఏది? 

1) కైనెటిన్‌         2) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం 

3) జిబ్బరెల్లిన్‌     4) అబ్సిసిక్‌ ఆమ్లం 


4. Cry జన్యువులు దేనిలో ఉంటాయి?

1) బాసిల్లాస్‌ సబ్‌టైలిస్‌ 

2) బాసిల్లాస్‌ మెగాస్పోరియమ్‌ 

3) బాసిల్లాస్‌ అమైనో లిక్విఫెసియన్స్‌ 

4) బాసిల్లాస్‌ థురంజియోన్సిస్‌


5. రెస్ట్రిక్షన్‌ ఎండో న్యూక్లియేజ్‌లను ఎవరు కనుక్కున్నారు? 
1) నాథన్స్‌        2) ముల్లర్‌ 
3) ఎరిక్‌         4) హేబర్‌లాండ్‌


6. అన్ని రకాల జీవ నియంత్రణ సహకారులుగా ఉపయోగించే సూక్ష్మజీవులను ఏమంటారు? 
1)  బయో రెమిడియేషన్‌         2) బయోపెస్టిసైడ్‌లు 
3) బయో ట్రాన్స్‌ఫర్‌మేషన్‌     4) బయోఫర్టిలైజర్స్‌


7. తైపేయి అనేది ఏ పంటకు చెందిన రకం? 
1) జొన్న       2) గోధుమ     3) వరి       4) సజ్జ


8. డీఎన్‌ఏ ప్రోబ్‌లు అంటే? 
1) జీవుల్లోని సంపూరక న్యూక్లియోటైడ్‌ వరుసను గుర్తించడానికి ఉపయోగపడే రేడియోధార్మిక పదార్థాలతో లేబిలింగ్‌ చేసిన ఏకపోచక డీఎన్‌ఏ.  
2) ఒక రకమైన ప్రొటీన్‌ను గుర్తించడానికి ఉపయోగపడే రేడియోధార్మిక పదార్థాలతో లేబిలింగ్‌ చేసిన ద్విపోచక డీఎన్‌ఏ. 
3) తనతో సంబంధం ఉండే జన్యువు లేఖన ప్రక్రియను వేగవంతం చేసే చిన్న డీఎన్‌ఏ. 
4) క్రియాత్మక mRNA కి సంపూరకంగా ఉండే డీఎన్‌ఏ వరుస క్రమం.


9. ఇంటర్‌ఫెరాన్‌లను ప్రధానంగా ఉత్పత్తిచేసే జీవులు ఏవి? 
1) సకశేరుకాలు         2) అకశేరుకాలు     
3) బ్యాక్టీరియమ్‌లు    4) శిలీంధ్రాలు


10. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం 
1) పెన్సిలిన్‌           2) స్ట్రెప్టోమైసిన్‌ 
3) ఆక్సీ టెట్రాసైక్లిన్‌         4) ఎరిథ్రోమైసిన్‌


11. డీఎన్‌ఏను ఎండో న్యూక్లియేజ్‌లకు గురిచేసినప్పుడు డీఎన్‌ఏ ఖండితాలు ఏ సాంకేతిక పద్ధతి ద్వారా వేరుచేయబడతాయి? .
1) పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ 
2) సదరన్‌ బ్లాటింగ్‌         
3) ఎలక్ట్రో ఫోరోసిస్‌ 
4) కాలనీ హైబ్రిడైజేషన్‌ పద్ధతి


12. 5' GAATTC 3'
i) ఒక పాలిన్‌డ్రోమ్‌ 
ii) చాలా రెస్ట్రిక్షన్‌ ఎంజైమ్‌లతో గుర్తించబడుతుంది.
iii) EcoRI దీన్ని ఛేదిస్తుంది.
iv) ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ మీద మాత్రమే ఉంటుంది.
1) i, iii  సరైనవి        2) ii, iii  సరైనవి 
3) iii , iv సరైనవి       4) i, iv సరైనవి


13. హ్యుమ్యులిన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియమ్‌ ఏది? 
1) జాంథోమోనస్‌         2) సాల్మోనెల్లా
3) క్లాస్ట్రీడియమ్‌          4) ఈ - కోలై


14. అణుకత్తెరలు అంటే? 
1) ఆక్సిడోరిడక్టేజ్‌లు         2) ప్రోటియేజ్‌లు
3) పాలిన్‌డ్రోమ్‌లు     4) రెస్ట్రిక్షన్‌ ఎండో న్యూక్లియేజ్‌లు


15. EcoRI ఏ స్థానాన్ని గుర్తించి 5' - 3' వరుసలో డీఎన్‌ఏను కత్తిరిస్తుంది?
1)  C - A మధ్య         2) T - A మధ్య 
3) G - A మధ్య          4) A - T మధ్య 


16. 340nm పొడవు ఉన్న ఒక ds DNA లో 20% గ్వానైన్‌ నత్రజని క్షారాలు ఉన్నాయి. దానిలో ఉండే మొత్తం హైడ్రోజన్‌ బంధాల సంఖ్య 
1) 1200         2) 2400        3) 3600         4) 4800


17. ఇచ్చిన జాబితాలో పాలిన్‌డ్రోమిక్‌ వరుస క్రమాన్ని ఎన్నుకోండి.
1) AA TT             2) AC TA 
    TT AA                 TG AT 
3) CT AA             4) GC AC
     GA TT                CG TG


18. ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ, వాంఛనీయ జన్యువు కలిసి ఏర్పడే హైబ్రీడ్‌ డీఎన్‌ఏను ఏమని పిలుస్తారు?
1) C-DNA      2) r-DNA       3) B-DNA         4) z-DNA


19. డీఎన్‌ఏ అతుక్కునే కొనల మధ్య బంధాలను ఏర్పరిచేది? 
1) ఆల్డోలేజ్‌           2) డీఎన్‌ఏ పాలిమరేజ్‌
3) డీఎన్‌ఏ లైగేజ్‌    4) ఎండోన్యూక్లియేజ్‌ 


20. pBR 322 అంటే?
1) సహజ వాహకం 
2) కృతిమ రూపాంతరం చెందిన ప్లాస్మిడ్‌
3) జీఎంవో  
4) అణుకత్తెరలు


21. పరివర్తనం చెందిన కణం దేన్ని కలిగి ఉంటుంది?
1) r-DNA      2) C-DNA       3) t-DNA         4) z-DNA

 

22. ఒక బ్యాక్టీరియల్‌ కణం నుంచి ప్లాస్మిడ్‌ను వేరు చేయడానికి ఉపయోగించే రసాయనాలు 
1) ఇథిలిన్‌ డై అమైన్‌ టెట్రా ఎసిటిక్‌ ఆమ్లం, పొటాషియం ఆక్సైడ్‌  
2) డీఎన్‌ఏ లైగేజ్, సోడియం కార్బొనేట్‌ 
3) మాలిక్‌ హైడ్రోజైడ్, కోలిసిన్‌
4) EDTA, లైసోజైమ్‌


23. సోడియం లారిల్‌ సల్ఫేట్‌ను దేనిలో ఉపయోగిస్తారు?
1) డీఎన్‌ఏ అణువును కత్తిరించడానికి  
2) కణం నుంచి వాంఛనీయ జన్యువును వేరు చేయడానికి 
3) కణం నుంచి ప్లాస్మిడ్‌ను వేరు చేయడానికి   
4) పైవన్నీ 


24. రీకాంబినెంట్‌ డీఎన్‌ఏ సాంకేతిక పద్ధతిలోని వివిధ దశలను వరుస క్రమంలో అమర్చండి.
i) పునఃసంయోజక వాహకాన్ని ఆతిథేయిలోకి బదిలీ చేయడం. 
ii) వాంఛనీయ జన్యువును విడదీయడం.
iii) జన్యుపరివర్తిత ఆతిథేయి కణాలను వరణం ద్వారా ఎన్నుకోవడం
iv) విడదీసిన జన్యువును తగిన వాహకంలోకి ప్రవేశపెట్టడం
1) i, ii, iii, iv       2) ii, iv, iii, i        3) ii, iv, i, iii        4) iv, iii, ii, i


25. కింది రకాల్లో ఏది యాంటీసెన్స్‌ యాత్రికం ద్వారా ఏర్పడింది?
1) ఫ్లెవర్‌ సెవర్‌ టొమాటో         2) వరిలో తైపీ రకం 
3) బీటీ పత్తి           4) బీటీ బంగాళదుంప


26. జన్యు పరివర్తిత బంగాళదుంప మొక్కలు దేనికి నిరోధకతను చూపిస్తాయి?
1) బ్యాక్టీరియమ్‌          2) వైరస్‌     
3) శిలీంధ్రం         4) నిమటోడ్‌


27. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. 
1) r-DNA  టెక్నాలజీని ఉపయోగించి జన్యు థెరపీ ద్వారా మొక్కల్లో జన్యు లోపాలను సరిచేయవచ్చు.  
2) r-DNA  టెక్నాలజీ సహాయంతో మానవుల్లో జన్యు లోపాలను గుర్తించి, జన్యు మార్పిడి థెరపీ ద్వారా నయం చేయలేం.  
3) నేరస్థులను గుర్తించడానికి, బిడ్డకు అసలైన తల్లిదండ్రులెవరో గుర్తించడానికి డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ తోడ్పడుతుంది. 
4) జెనిటిక్‌ ఇంజినీరింగ్‌ ద్వారా ఏర్పరిచిన సూక్ష్మజీవుల వల్ల కాలుష్యాన్ని నివారించవచ్చు.


28. కిందివాటిలో సరికానిది. 
1) జన్యు లోపాల వల్ల అసహజసిద్ధ జన్యు లక్షణాలు ఏర్పడతాయి. 
2) జన్యు పరివర్తిత మొక్కల నుంచి ఏర్పడే జీవ రసాయనాలు బ్యాక్టీరియమ్‌ల నుంచి ఉత్పత్తయ్యే వాటి కంటే మేలైనవి.  
3) GM  మొక్కల వల్ల సహజ పరిణామ విధానంలో తేడాలు రావచ్చు. 
4) GM పంటల వల్ల జీవవైవిధ్యానికి ఎలాంటి హాని ఉండదు.


సమాధానాలు: 1-2; 2-1; 3-2; 4-4; 5-1; 6-2; 7-3; 8-1; 9-1; 10-1; 11-3; 12-2; 13-4; 14-4; 15-3; 16-2; 17-1; 18-2; 19-3; 20-2; 21-1; 22-4; 23-3; 24-3; 25-1; 26-3; 27-2; 28-4.

Posted Date : 24-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌