• facebook
  • whatsapp
  • telegram

అణుజీవశాస్త్రం

1. కొన్ని వైరస్‌ల్లో RNA జన్యుపదార్థంగానే కాకుండా, కింది విధులను కూడా నిర్వర్తిస్తుంది

ఎ. అడాప్టర్ బి. నిర్మాణాత్మక సి. ఉత్ప్రేరక

జ: ఎబిసి
 

2.  ∅ × 174 బ్యాక్టీరియోఫాజ్ వైరస్‌లో ఉండే న్యూక్లియోటైడ్‌ల సంఖ్య ఎంత?

జ: 5386

3. బ్యాక్టీరియోఫాజ్ లామ్డా‌లోని న్యూక్లియోటైడ్‌ల సంఖ్య ఎంత?

జ: 97004
 

4. మానవుడి ఏకస్థితిక DNA, ఎశ్చరీషియా కోలైలో క్షారజతలు వరుసగా

5. డీఎన్ఏ/ఆర్ఎన్ఏలలో వేటి మధ్య N - గ్లైకోసైడిక్ లింకేజ్ ఏర్పడుతుంది?

జ: నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర
 

6. న్యూక్లియోసైడ్‌లోని 5' OH సమూహంతో ఫాస్ఫేట్ బంధితమైనప్పుడు దాన్ని ఎలా పిలుస్తారు?

జ: ఫాస్ఫో ఎస్టర్ బంధం

7. డీఎన్ఏ, ఆర్ఎన్ఏలలో కనిపించే ఈ బంధనాలను సరైన విధంగా జతపరచండి.

I II
A) N - గ్లైకోసైడిక్ లింకేజ్ i) నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర
B) ఫాస్ఫోఎస్టర్ బంధనం ii) న్యూక్లియోటైడ్ 5' OH ఫాస్ఫేట్ సమూహం
C) 3' - 5' ఫాస్ఫో డై ఎస్టర్ బంధం iii) రెండు న్యూక్లియోటైడ్‌లు

జ: A - i, B - ii, C - iii
 

8. ఒక స్వేచ్ఛా ఫాస్ఫేట్ మొయిటీ సాధారణంగా ఎక్కడ ఉంటుంది?

జ: పాలీన్యూక్లియోటైడ్‌కు చెందిన 5' కొన వద్ద
 

9. పాలీన్యూక్లియోటైడ్‌కు చెందిన 3' కొన దేనికి సంబంధించింది?

జ: 3' చక్కెర కొనలో ఉండే స్వేచ్ఛా OH సమూహం
 

10. పాలీన్యూక్లియోటైడ్ శృంఖలం వెన్నెముక వేటి వల్ల ఏర్పడుతుంది?

జ: ఫాస్ఫేట్, చక్కెర
 

11. థైమిన్ రసాయనికంగా-

జ: 5 మిథైల్ యురాసిల్
 

12. ఆర్ఎన్ఏ వేటిని కలిగి ఉండటంవల్ల అది డీఎన్ఏతో విభేదిస్తుంది?

జ: రైబోస్ చక్కెర 2' స్థానంలో అదనపు - OH సమూహం ఉండటం వల్ల

13. కిందివాటిలో సరైనజతలను గుర్తించండి.

ఎ) ఫ్రెడిరిక్ మిషర్ - న్యూక్లిన్

బి) మ్యురైస్ విల్కిన్స్, రోసాలిండ్ ఫ్రాంక్లిన్ - X - కిరణ వివర్తనం

సి) క్రిక్, వాట్సన్ - ప్యూరిన్, పిరమిడిన్ స్థిరమైన నిష్పత్తి

జ: ఎబి
 

14. డీఎన్ఏ ద్విసర్పిల నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

      ఎ) చక్కెర - ఫాస్ఫేట్ వెన్నెముకగా క్షారాలు వెలుపలివైపు ప్రక్షిప్తమై ఉంటాయి.

      బి) 5' 3' ధ్రువత్వంతో రెండు పోచలు ప్రతిసమాంతరంగా ఉంటాయి.

      సి) ప్యూరిన్ - పిరిమిడిన్ జతకూడటం వల్ల రెండు పోచల మధ్య దూరం సుమారు 20 Aº ఉంటుంది.

జ: ఎబి
 

15. మాలిక్యులార్ బయాలజీలోని సెంట్రల్ డాగ్మాను ఎవరు ప్రతిపాదించారు?

జ: ఫ్రాన్సిస్ క్రిక్
 

16. కిందివాటిలో ఉత్క్రమ అనులేఖనం వేటిలో కనిపిస్తుంది?

1) బ్యాక్టీరియోఫాజ్‌లు     2) రిట్రోవైరస్‌లు          3) బ్యాక్టీరియా            4) సయనోబ్యాక్టీరియా

జ: రిట్రోవైరస్‌లు       

17. ఏ ప్రాంతంలో రుణావేశిత డీఎన్ఏతోపాటు, ధనావేశిత ప్రొటీన్ ఉంటుంది?

జ: న్యూక్లియాయిడ్
 

18. కేంద్రక పూర్వజీవుల్లోని డీఎన్ఏ వర్తులాకారంగా, క్రొమాటిన్ నిర్మాణరహితంగా ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తారు?

జ: జీనోఫోర్
 

19. హిస్టోన్ ప్రొటీన్లలో ఏ రకమైన క్షార ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి?

జ: లైసిన్, ఆర్జినైన్
 

20. ఒక మౌలిక న్యూక్లియోసోమ్‌లో ఏముంటుంది?

జ: 200 bpలు ఉన్న డీఎన్ఏ సర్పిలం
 

21. అనులేఖనం రీత్యా తేజోవంతంగా ఉండే క్రొమాటిన్ భాగం -

జ: వదులుగా ఉండి, తక్కువ వర్ణద్రవ్యాన్ని గ్రహించుకుంటుంది.
 

22. ఏ బ్యాక్టీరియాలో జరిగే పరివర్తనను ఫ్రెడిరిక్ గ్రిఫిత్ కనుక్కున్నాడు.
జ: స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే

 

23. పరివర్తన ప్రయోగంలో వేడిచేసి చంపిన S విభేదం బ్యాక్టీరియాను ఎలుకలోకి పంపినప్పుడు
జ: ఎలుక శరీరం నుంచి S విభేదం లేదా R విభేదం కణాలు తిరిగి స్వాధీనం చేసుకోబడలేదు

24. పరివర్తన ప్రయోగంలో వేడిచేసి చంపిన S విభేదం, సజీవ R విభేదం బ్యాక్టీరియమ్‌లను ఎలుక శరీరంలోకి పంపినప్పుడు
జ: సజీవ S విభేదం కణాలు ఎలుక శరీరం నుంచి స్వాధీనం చేసుకోబడ్డాయి.

 

25. 'పరివర్తన' సూత్రం యొక్క జీవరసాయనిక తత్త్వాన్ని ఎవరు నిర్ధారించారు?
జ: అవెరీ, మాక్లియాడ్, మెకార్థీ

 

26. DNA, DNA ase ఎంజైమ్‌తో జీర్ణమవడం దేన్ని తెలుపుతుంది?
జ: పరివర్తన నిరోధించబడుతుంది.

 

27. ఆల్‌ఫ్రెడ్ హెర్షీ, మార్థా చేస్ వేటిపై పరిశోధిస్తూ డీఎన్ఏ జన్యుపదార్థంగా పనిచేస్తుందని నిర్ధారణ చేశారు?
జ: బ్యాక్టీరియోఫాజ్

 

28. హెర్షీ, చేస్ ప్రయోగంలోని బ్యాక్టీరియల్ డీఎన్‌లో ఏం ఉంటుంది?
జ: కిరణ ధార్మిక 32P

 

29. కిందివాటిలో ఏ నియమాన్ని ఆర్ఎన్ఏ నెరవేర్చదు?
   1) ఇది ప్రతికృతి చెందుతుంది.                           2) ఇది నిర్మాణాత్మకంగా స్థిరత్వంగా ఉంటుంది.
   3) ఇది రసాయనికంగా స్థిరత్వంగా ఉంటుంది.       4) 2, 3
జ: 4 (ఇది నిర్మాణాత్మకంగా స్థిరత్వంగా ఉంటుంది., ఇది రసాయనికంగా స్థిరత్వంగా ఉంటుంది.)

30. కింద పేర్కొన్న ఏ కారణంగా ఆర్ఎన్ఏ అస్థిర, క్రమ పతనం చెందగల స్వభావంతో ఉంటుంది?
1) ఉత్ప్రేరకంగా వ్యవహరించే స్వభావం ఉండకపోవడం          

 2) ప్రతి న్యూక్లియోటైడ్‌లో 2 - OH సమూహం ఉండటం
3) యూరాసిల్ ఉండటం                                                

4) థైమిన్ లేకపోవడం
జ: ప్రతి న్యూక్లియోటైడ్‌లో 2 - OH సమూహం ఉండటం

31. ఆర్ఎన్ఏ ఉండే వైరస్‌లు వేగంగా పరిణామం చెందుతాయి. కారణమేంటి?
జ: ఆర్ఎన్ఏ వేగంగా ఉత్పరివర్తనం చెందుతుంది.

 

32. కింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
          ఎ) ఆర్ఎన్ఏ లక్షణాలను సులభంగా వ్యక్తపరుస్తుంది.
          బి) డీఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణకు ఆర్ఎన్ఏపై ఆధారపడుతుంది.
          సి) డీఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండూ జన్యుపదార్థంగా పనిచేస్తాయి.
          డి) జన్యుసమాచార రవాణాలో ఆర్ఎన్ఏ మెరుగైంది.
జ: ఎబిసిడి

 

33. మొదటి జన్యుపదార్థం ఏది?
జ: ఆర్ఎన్ఏ

34. ప్రతికృతి పూర్తయిన తర్వాత, ప్రతి డీఎన్ఏలో ఒక జనక పోచ, కొత్తగా సంశ్లేషణ చెందిన మరో పోచ ఉంటాయి. ఈ విధానాన్ని ఏమని పిలుస్తారు?
జ: అర్ధసంరక్షక డీఎన్ఏ ప్రతికృతి

 

35. మాథ్యూ మెసల్‌సన్, ఫ్రాంక్లిన్ స్టాల్ దేనిలో అర్ధసంరక్షక డీఎన్ఏ ప్రతికృతి విధానాన్ని నిరూపించారు?
జ: ఎశ్చరీషియా కోలై

 

36. మెసల్‌సన్, స్టాల్ ప్రయోగంలో ఎశ్చరీషియా కోలైకు దేని నుంచి నత్రజని అందుతుంది?
జ: నైట్రోజన్ భార ఐసోటోప్ 15N ఉండే అమ్మోనియం క్లోరైడ్

 

37. మెసల్‌సన్, స్టాల్ ప్రయోగంలో డీఎన్ఏను 15N నుంచి N వర్ధనంలోకి బదిలీ చేశారు. 20 నిమిషాల తర్వాత డీఎన్ఏ నిష్కర్షించబడినప్పుడు కేవలం సంకర డీఎన్ఏ కనిపించింది. 40 నిమిషాల తర్వాత సంకర డీఎన్ఏ మరియు తేలిక వర్ణం డీఎన్ఏ సమపాళ్లలో కనిపించాయి. 60 నిమిషాలపాటు వర్థనం చేసినట్లయితే తేలిక, సంకర సాంద్రతగల డీఎన్ఏల మధ్య నిష్పత్తి ఎంత ఉంటుంది?
జ: 3 : 1

 

38. మెసల్‌సన్, స్టాల్ ప్రయోగంలో డీఎన్ఏను 15N నుంచి N వర్థనంలోకి బదిలీ చేశారు. 20 నిమిషాల తర్వాత డీఎన్ఏ నిష్కర్షించబడినప్పుడు కేవలం సంకర డీఎన్ఏ కనిపించింది. 40 నిమిషాల తర్వాత సంకర డీఎన్ఏ మరియు తేలికవర్ణం డీఎన్ఏ సమపాళ్లలో  కనిపించాయి. 80 నిమిషాలపాటు వర్థనం చేసినట్లయితే తేలిక, సంకర సాంద్రత గల డీఎన్ఏల మధ్య నిష్పత్తి ఎంత ఉంటుంది?
జ: 7 : 1

39. డీఎన్ఏ ప్రతికృతి అర్ధ సంరక్షక  విధానంలో జరుగుతుందని నిరూపించడానికి టేలర్ విసియా ఫాబా (ఫాబా చిక్కుడు) మొక్క పై  చేసిన ప్రయోగంలో ఉపయోగించిన రేడియోధార్మిక పదార్థం ఏది? 
జ: కిరణధార్మిక థైమిడిన్

 

40. డీఎన్ఏ పాలీమరేజ్ పుంజీకరణను సరాసరి ఏ రేటులో ఉత్ప్రేరితం చేస్తుంది.
జ: సెకనుకు 2000 bp

 

41. ఎశ్చరీషియా కోలైలో డీఎన్ఏ ప్రతికృతి చెందడానికి ఎంత సమయం పడుతుంది?
జ: 38 నిమిషాలు

 

42. నిశ్చితం (A): డీ ఆక్సీరైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్లు పుంజీకరణ చర్యకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
     కారణం (R): డీఎన్ఏ ట్రై ఫాస్ఫేట్‌లకు ద్వంద్వ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పుంజీకరణకు అథస్థ పదార్థంగా పనిచేస్తాయి.
జ: A, R రెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.

 

43. డీఎన్ఏ ఆధారిత డీఎన్ఏ పాలీమరేజ్ పుంజీకరణను ఎలా ఉత్ప్రేరితం చేస్తుంది?
జ: కేవలం 5'  3' దిశలోనే

 

44. నిశ్చితం (A): ప్రతికృతి ప్రారంభమవడానికి ఆర్ఎన్ఏ ప్రైమర్ అనే చిన్న ఆర్ఎన్ఏ ఖండితం కావాలి.
      కారణం (R): ప్రైమర్ లేకుండా డీఎన్ఏ పాలీమరేజ్‌లు ప్రతికృతిని ప్రారంభించగలవు.
జ: A సరైంది కానీ R సరైంది కాదు.

45. నిశ్చితం (A): డీఎన్ఏ ప్రతికృతి తర్వాత కణవిభజన జరగకపోతే, బహుస్థితికి దారితీస్తుంది.
       కారణం (R): డీఎన్ఏ ప్రతికృతి, కణవిభజన చక్రం సమన్వితంగా జరగాలి.
జ: A, R రెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.

 

46. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి.
A. ఒక అడినోసిన్‌కు తప్ప అనులేఖనం ప్రక్రియ సంపూరక సూత్రంతో నియంత్రించబడుతుంది.
B. ప్రతికృతిలా కాకుండా అనులేఖనంలో కేవలం ఒక పోచ డీఎన్ఏలోని కొంత భాగం మాత్రమే ఆర్ఎన్ఏగా నకలు అవుతుంది.
C. అనులేఖనంలో కేవలం ఒకే ఒక డీఎన్ఏ పోచ ds RNA ఏర్పడటాన్ని నిరోధిస్తుంది.
      పై వ్యాఖ్యల్లో సరికానివేవి?
జ: ఏదీకాదు

 

47. సంకేతపు పోచ అనేది
    A. డీఎన్ఏలో కనిపిస్తుంది                           B. ఆర్ఎన్ఏలో కనిపిస్తుంది
    C. mRNAకు సంకేతంగా పనిచేస్తుంది         D. దేనికి సంకేతంగా పనిచేయదు
    పై వ్యాఖ్యల్లో ఏది సరైంది?
జ: AD

48. 3'  5' ధ్రువత్వం ఉన్న డీఎన్ఏ మూస పలక పోచలో న్యూక్లియోటైడ్ 'ATG CAT GCA TGC' అనుక్రమం ఉంది. సంకేతపు పోచ 5'  3' ధ్రువత్వంతో 'TAC GTA CGT ACG' అనుక్రమం ఉంది.
        పైన పేర్కొన్న డీఎన్ఏ నుంచి అనులేఖనం చెందిన ఆర్ఎన్ఏ అనుక్రమం ఎలా ఉంటుంది?
జ: 5' UAC GUA CGU ACG 3'

 

49. అనులేఖన ప్రమాణంలోని ప్రమోటర్ ఎలా ఉంటుంది?
జ: సంకేతపు పోచ 5' కొనవైపు

 

50. అనులేఖనం ప్రమాణంలో టెర్మినేటర్ ఎక్కడ ఉంటుంది?
జ: సంకేతపు పోచ 3' కొనవైపు

 

51. జన్యువును ఏవిధంగా నిర్వచించవచ్చు?
     A. అనువంశికతకు క్రియాత్మక ప్రమాణం - సిస్ట్రాన్
     B. tRNA లేదా rRNAకు సంకేతంగా ఉంటుంది
     C. ఒక పాలీపెప్టైడ్ శృంఖలానికి సంకేతాన్ని ఇచ్చే డీఎన్ఏ భాగం
జ: ABCలు సరైనవి

 

52. పాలిసిస్ట్రానిక్ జన్యువులు వేటిలో కనిపిస్తాయి?
జ: కేంద్రక పూర్వజీవులు

53. ఎక్సాన్‌లు అంటే -
జ: పరిపక్వ ఆర్ఎన్ఏలో కనిపించే సంకేతపు అనుక్రమాలు

 

54. ఒక లక్షణం యొక్క అనువంశికత్వం దేంతో ప్రభావితమవుతుంది?
జ: నిర్మాణాత్మక జన్యువులు, ప్రమోటర్ అనుక్రమం, రెగ్యులేటరీ అనుక్రమాలు

 

55. జతపరచండి.

I II
A) m RNA i) మూసఫలకాన్ని ఏర్పరుస్తుంది
B) tRNA ii) జన్యు సంకేతాన్ని గుర్తిస్తుంది
C) rRNA iii) నిర్మాణాత్మక, ఉత్ప్రేరక పాత్ర

జ: A - i, B - ii, C - iii
 

56. బ్యాక్టీరియాలోని అన్ని రకాల ఆర్ఎన్ఏ అనులేఖనాలను, ఎన్ని రకాల డీఎన్ఏ ఆధారిత ఆర్ఎన్ఏ పాలీమరేజ్‌లు ఉత్ప్రేరితం చేస్తాయి?
జ: ఒకటి

 

57. నిశ్చితం (A): ఆర్ఎన్ఏ పాలీమరేజ్ ప్రారంభం, దీర్ఘత, ముగింపును ఉత్ప్రేరితం చేస్తుంది.
     కారణం (R): ఆర్ఎన్ఏ పాలీమరేజ్ ప్రారంభ కారకం () , ముగింపు కారకం (ρ)తో కలిసి ప్రారంభాన్ని, ముగింపును అనులేఖనంలో నిర్వర్తిస్తుంది.
జ: A, R రెండూ సరైనవి. Aకు R సరైన వివరణ.

58. నిజకేంద్రక జీవుల్లో కేంద్రకంలో ఎన్ని రకాల ఆర్ఎన్ఏ పాలీమరేజ్‌లు అనులేఖనాన్ని ఉత్ప్రేరితం చేస్తాయి?
జ: మూడు

 

59. కణాంగాల్లోని ఆర్ఎన్ఏ పాలీమరేజ్‌తోపాటు నిజకేంద్రక జీవుల్లో ఎన్ని రకాల ఆర్ఎన్ఏ పాలీమరేజ్‌లు విధులు నిర్వర్తిస్తాయి?
జ: నాలుగు

 

60. కింది పాలీమరేజ్ ఎంజైమ్‌లను అనులేఖనం చెందిన ఆర్ఎన్ఏలతో జతపరచండి.

I II
A) RNA పాలీమరేజ్ I i) rRNAకు అనులేఖనం చేస్తుంది
B) RNA పాలీమరేజ్ II ii) tRNAకు అనులేఖనం చేస్తుంది
C) RNA పాలీమరేజ్ III iii) hn RNAకు అనులేఖనం చేస్తుంది

జ: A - i, B - iii, C - ii
 

61. hn RNA 5' కొనలో మిథైల్ గ్వానోసైన్‌ట్రైఫాస్ఫేట్‌ను చేర్చడాన్ని ఏమంటారు?
జ: కాపింగ్

 

62. hn RNA 3' కొనలో 200 - 300 అడినైలేట్ అవశేషాలను చేర్చడాన్ని ఏమంటారు?
జ: టైలింగ్

63. నిశ్చితం (A): కేంద్రక ఆమ్లాల్లోని ఒక మార్పు ప్రొటీన్లలోని అమైనో ఆమ్లాల్లో మార్పునకు కారణం.
       కారణం (R): న్యూక్లియోటైడ్లు, అమైనో ఆమ్లాలు సంపూరకాలు.
జ: A సరైంది కానీ R సరైంది కాదు.

 

64. జన్యు సంకేతంలో క్షారాల కలయిక తప్పనిసరిగా 20 అమైనో ఆమ్లాలకు సంకేతాలను సమకూర్చాలని ఎవరు ప్రతిపాదించారు?
జ: జార్జ్ గామోవ్

 

65. ప్రొటీన్ల సంశ్లేషణకు కణరహిత వ్యవస్థను ఎవరు ప్రతిపాదించారు?
జ: మార్షల్ నీరెన్‌బర్గ్

 

66. మూస ఫలకంపై ఆధారపడకుండా నిర్దిష్టమైన క్రమాలు ఉన్న ఆర్ఎన్ఏ పుంజీకరణకు తోడ్పడే ఎంజైమ్ (ఎంజైమ్ ద్వారా RNA సంశ్లేషణ) ఏది?
జ: పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫారిలేజ్

 

67. 'ఒకోవా' అని ఏ ఎంజైమ్‌ను పిలుస్తారు?
జ: పాలీన్యూక్లియోటైడ్ ఫాస్ఫారిలేజ్

 

68. జన్యు సంకేతంలో కోడాన్ ఒక అమైనో ఆమ్లానికి సంకేతంగా పనిచేయడాన్ని ఏమంటారు?
జ: నిస్సందేహమైంది

69. జన్యు సంకేతంలో కొన్ని అమైనో ఆమ్లాలతో ఒకటి కంటే ఎక్కువ కోడాన్‌లను సూచించబడతాయి. దీన్ని ఏమంటారు?
జ: డీజనరేసీ

 

70. ద్వంద్వ ప్రక్రియలను నిర్వర్తించే కోడాన్ ఏది?
జ: AUG

 

71. రాయబారి ఆర్ఎన్ఏలో కింద తెలిపిన న్యూక్లియోటైడ్ వరుస క్రమం ఉన్నట్లయితే, అవి సంకేతంగా పనిచేసిన అమైనో ఆమ్లాల వరసక్రమాన్ని రాయండి.
గమనిక: పైవాటిలో రెండు త్రికాలు ఒక అమైనో ఆమ్లానికి సంకేతంగా ఉంటాయి.
జ: Met - Phe - Phe - Phe - Phe

 

72. మానవుడి హిమోగ్లోబిన్‌లోని గ్లోబిన్ శృంఖలానికి చెందిన జన్యువులోని ఒక జత క్షారంలో వచ్చిన మార్పు అమైనో ఆమ్ల అవశేషంలో ఏ మార్పునకు కారణమవుతుంది?
జ: గ్లుటమిన్ నుంచి వాలిన్‌కు

 

73. బిందు ఉత్పరివర్తనాల్లో కలపడం లేదా తొలగించడం దేంతో జరుగుతుంది?
జ: ఒకటి లేదా రెండు నత్రజని క్షారాలు

 

74. ఫ్రేమ్‌షిఫ్ట్ ఉత్పరివర్తనాల్లో రీడింగ్ ఫ్రేమ్ దేన్ని కనబరుస్తుంది?
జ: ఏ మార్పు ఉండదు

75. త్రిక సంకేతాలను గుర్తించడంతోపాటు నిర్దిష్ట అమైనో ఆమ్లాలకు బంధితమయ్యే అడాప్టర్ అణువు ఉంటుందని ఎవరు సూచించారు?
జ: ఫ్రాన్సిస్ క్రిక్

 

76. t - RNAలోని ప్రతి సంకేతపు శిక్మం వేటితో ఉంటుంది?
జ: సంకేతానికి సంపూరక క్షారాలు

 

77. t - RNAకు సంబంధించి కిందివాటిలో ఏది నిజం?
     A) కుదించుకుపోయిన నిర్మాణం తల కిందులుగా ఉండే 'L' ఆకారంలో ఉంటుంది.
     B) ద్వితీయ నిర్మాణం క్లోవర్ పత్రనమూనాను పోలి ఉంటుంది.
     C) అర్థరహిత సంకేతాలకు t - RNAలు ఉండవు.
జ: ABC

 

78. నిశ్చితం (A): అమైనో ఆమ్లాలు ఉత్తేజితమై tRNAతో అనుసంధానం అవుతాయి.
      కారణం (R): పెప్టైడ్ బంధాలు ఏర్పడటానికి శక్తి అవసరం.
జ: A, R సరైనవి. Aకు R సరైన వివరణ.

 

79. రైబోజోమ్‌ల్లో ఏం ఉంటాయి?
జ: నిర్మాణాత్మక ఆర్ఎన్ఏ, 80 రకాల ప్రొటీన్లు

80. నిశ్చితం (A): బ్యాక్టీరియాలోని 23 srRNA రైబోజైమ్‌గా వ్యవహరిస్తుంది.
       కారణం (R): RNA ఎంజైమ్‌లను రైబోజైమ్‌లని పిలుస్తారు.
జ: A, R సరైనవి. Aకు R సరైన వివరణ.

 

81. నిజకేంద్రక జీవుల్లో ఏ దశలో జన్యు నియంత్రణ జరుగుతుంది?
1) అనులేఖనం దశ        2) ప్రక్రియ దశ       3) అనువాదం దశ    4) పైవన్నీ
జ: 4 ( పైవన్నీ)

 

82. β - గాలక్టోజిడేజ్ ఎంజైమ్ దేని జలవిశ్లేషణను ఉత్ప్రేరితం చేస్తుంది?
జ: లాక్టోజ్

 

83. ఎశ్చరీషియా కోలై బ్యాక్టీరియాలో లాక్టోజ్ వినియోగం ఏ జన్యువుల వ్యక్తీకరణతో నియంత్రితమవుతుంది?
జ: జీవక్రియ, శరీరధర్మ ప్రక్రియ లేదా పరిసర పరిస్థితులు

 

84. లాక్ ఒపెరాన్ నమూనాను ఎవరు ప్రతిపాదించారు?
జ: ఫ్రాంకాయిస్ జాకబ్, జాక్యూ మోనాడ్

 

85. లాక్ ఒపెరాన్ వేటితో ఉంటుంది?
జ: రెగ్యులేటరీ జన్యువు, ప్రమోటర్, ఆపరేటర్, మూడు నిర్మాణ జన్యువులు

 

86. లాక్ ఒపెరాన్‌లోని β - గాలక్టోజిడేజ్ సంకేతాలు ఏ జన్యువులో ఉంటాయి?
జ: Z జన్యువు

87. లాక్ ఒపెరాన్‌లోని పర్మియేజ్ ఎంజైమ్ సంకేతాలతో ఉండేది ఏది?
జ: Y జన్యువు

 

88. లాక్ ఒపెరాన్‌లో 'a' జన్యువు ఏ ఎంజైమ్‌కు సంకేతాన్ని సూచిస్తుంది?
జ: ట్రాన్స్అసిటైలేజ్

 

89. β - గాలక్టోజిడేజ్ చర్యను ప్రారంభించడం లేదా ఆపడాన్ని ఏది నియంత్రిస్తుంది?
జ: లాక్టోజ్ (ప్రేరకం)

 

90. ఒపెరాన్‌లోని రిప్రెసార్ దేని వల్ల నిరంతరంగా సంశ్లేషితమవుతుంది?
జ: i జన్యువు

 

91. రిప్రెసార్ దేని సమక్షంలో నిర్వీర్యమవుతుంది?
జ: ప్రేరకం

 

92. రిప్రెసార్ ద్వారా చేసే లాక్ ఒపెరాన్ నియంత్రణను ఏమని పిలుస్తారు?
జ: నకారక నియంత్రణ

 

93. ఒక డీఎన్ఏ ద్విసర్పిలంలో 20% సైటోసిన్ ఉంటే అడినైన్ శాతం ఎంత?
జ: 30%

 

94. ఆర్ఎన్ఏలో పాలీన్యూక్లియోటైడ్ పోచలో 25% అడినైన్ ఉంటే దానిలో ఉండే యురాసిల్ శాతం ఎంత?
జ: ఊహించలేం

Posted Date : 04-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌