• facebook
  • whatsapp
  • telegram

అనువంశికతా సూత్రాలు, వైవిధ్యత

1. సాహివాల్ గోవులు, ఒంగోలు జాతి ఎద్దులను ఎలా అభివృద్ధి చేశారు?
జ: కృత్రిమ వరణం, సంప్రదాయ వన్యగోవుల దేశవాళీకరణం వల్ల

 

2. కింది సంకరణల్లో దేనిలో Tt 50%, TT 50% జన్యురూపాలున్న పొడవైన మొక్కలను పొందుతారు?
1) ఏక సంకర సంకరణం               2) ఏకసంకర పశ్చ సంకరణం
3) ద్విసంకర పరీక్షా సంకరణం       4) ఏకసంకర పరీక్షా సంకరణం
జ:  2 (ఏకసంకర పశ్చ సంకరణం)

 

3. బహుళ ప్రభావత దేనికి సంబంధించింది?
జ: ఒకటి కంటే ఎక్కువ లక్షణాలను చూపే జన్యువుకు

 

4. కిందివాటిని జతపరచండి.

A. సట్టన్, బోవెరి I. క్రోమోజోమ్ పటం
B. ఆల్‌ఫ్రెడ్ స్టర్టెవాంట్ II. ఉత్పరివర్తనం
C. హ్యుగో డీవ్రిస్ III. క్రోమోజోమ్ అనువంశికతా సిద్ధాంతం
D. టి.హెచ్. మోర్గాన్ IV. సహలగ్నత

జ: A-III, B-I, C-II, D-IV

5. ఎరుపు రంగు పుష్పాలున్న పసుపు రంగు విత్తనాల బటానీ మొక్కను, తెలుపు రంగు పుష్పాలున్న ఆకుపచ్చని విత్తనాల మొక్కతో పరాగ సంపర్కం జరిపినప్పుడు 139 పసుపు, ఎరుపు; 138 పసుపు, తెలుపు; 136 ఆకుపచ్చ, ఎరుపు, 139 ఆకుపచ్చ, తెలుపు సంతతి కనిపించింది. విత్తనాల పసుపుపచ్చ రంగు, పుష్పాల ఎరుపు రంగు బహిర్గతత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని భావిస్తే సంతతి జన్యురూపాలు ఎలా ఉంటాయి?
జ: YyRr, Yyrr, yyRr, yyrr

 

6. తోట బటానీ మొక్కలో పొడవు (T) యుగ్మవికల్పం, పొట్టి (t) యుగ్మవికల్పంపై బహిర్గతత్వం చూపుతుంది. సగం పొడవు, సగం పొట్టి మొక్కలను ఉత్పత్తి చేసే సంకరణంలోని జనకుల జన్యు రూపం ఎలాంటిది?
జ: Tt × tt

 

7. బూడిద రంగు విత్తనం (G) , తెలుపు రంగు విత్తనం (g) పై బహిర్గతత్వం చూపినప్పుడు, అన్ని తెలుపు రంగు విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కల జనకుల దృశ్యరూపం, జన్యురూపం ఎలాంటిది?
జ: తెలుపు × తెలుపు - gg × gg

 

8. ఒక ద్వయస్థితిక జీవి 4 లోసైలలో విషమయుగ్మత చూపుతుంది. అది ఎన్ని రకాల సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది?
జ: 16

9. టమాటోల్లో ఎరుపు రంగు ఫలం (R) పసుపు రంగుపై బహిర్గతత్వం చూపుతుంది. ఒకవేళ ఎరుపునకు సమయుగ్మజంగా ఉన్న టమాటో మొక్కను పసుపు రంగు ఫలాలున్న సమయుగ్మజ మొక్కతో సంకరణం జరిపినప్పుడు F1 మొక్క ఏర్పడుతుంది. ఈమొక్కను పసుపు రంగు ఫలాలున్న జనక మొక్కతో సంకరణం జరిపినప్పుడు ఏర్పడే సంతతి ఎలా కనిపిస్తుంది?
జ: ఎరుపు : పసుపు 1 : 1

 

10. పుచ్చకాయలో తెలుపు పుష్పాలు, చక్రాభ ఫలాలున్న ఒక మొక్కను పసుపురంగు పుష్పాలు, గోళాకార ఫలాలున్న మొక్కతో సంకరణం చేశారు. F1 సంతతి మొక్కలన్నీ తెలుపు పుష్పాలు, చక్రాభ ఫలాలను ప్రదర్శించాయి. ఈ మొక్కలను స్వపరాగ సంపర్కం జరిపినప్పుడు ఏర్పడిన 256 సంతతిలో వివిధ దృశ్యరూపాల పౌనపున్యం ఎంత?
జ: 144 : 48 : 48 : 16

 

11. సమయుగ్మజ జనకుల మధ్య సంకరణం వల్ల ఏర్పడిన F1 సంకరం బహిర్గతత్వం, అంతర్గతత్వ జనకులకు విరుద్ధమైన దృశ్యరూపాన్ని చూపితే దాన్ని ఏమంటారు?
జ: అసంపూర్ణ బహిర్గతత్వం

 

12. పసుపు పచ్చ శరీరం, తెలుపు కళ్లు ఉన్న వన్యజాతి మగను, వన్యజాతి ఆడతో సంకరణం జరిపినప్పుడు సంతతిలో 98.7% జనక తరం తరహావి, 1.3% పున సంయోజనాలు కనిపించాయి. ఈ ఫలితాలకు కారణం ఏమింటంటే
జ: లింగ సహలగ్నత

13. నిశ్చితం (A): గ్లుటమేట్ అమైనో ఆమ్లం, వాలిన్‌గా మారినప్పుడు సికిల్‌సెల్ అనీమియా (కొడవలి రక్తహీనత) వస్తుంది.
      కారణం (R): డీఎన్ఏలోని ఒక జత క్షారాలు మారినప్పుడు ఫ్రేమ్ - షిప్ట్ ఉత్పరివర్తనం ఏర్పడింది.
జ: A సరైంది కానీ, R సరైంది కాదు.

 

14. క్రోమోజోమ్‌లు, జన్యువులకు సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏది నిజం కాదు?
A. క్రోమోజోమ్‌లు, జన్యువులు రెండూ జతలుగా ఉంటాయి.
B. సంయోగబీజాలు ఏర్పడేటప్పుడు క్రోమోజోమ్‌లు పృథక్కరణ చెందుతాయి కానీ, జన్యువులు పృథక్కరణ చెందవు.
C. క్రోమోజోమ్ జత, జన్యువుల్లోని ఒక్కొక్కటి సంయోగ బీజంలోకి సంక్రమిస్తాయి.
జ: కేవలం B

 

15. ఉత్పరివర్తనాలను హ్యుగోడీవ్రీస్ మొదటిసారిగా వేటిలో గమనించారు?
జ: ఈనోథెరా లామార్కియానా

 

16. పొడవు F2 స్వపరాగ సంపర్కం వల్ల ఏ విధమైన దృశ్య, జన్యు రూపాలు ఏర్పడవచ్చు?
1) అన్ని పొడవైన మొక్కలు                          2) పొడవు, పొట్టి మొక్కలు 3 : 1 నిష్పత్తిలో
3) పొడవు, పొట్టి మొక్కలు 1 : 1 నిష్పత్తిలో      4) 1 లేదా 2
జ: 4(1 లేదా 2)

17. లెన్స్ కులినారిస్‌లో అనువంశికత విధానం ఎలా ఉంటుంది?
జ: సహ బహిర్గతత్వం

 

18. బటానీ BB సమయుగ్మజాలు గుండ్రటి విత్తనాల్లో పెద్దవైన పిండిరేణువులను ఉత్పత్తి చేస్తాయి.
      బటానీ bb సమయుగ్మజాలు ముడతలు పడిన విత్తనాల్లో చిన్నవిగా ఉన్న పిండిరేణువులను ఉత్పత్తి చేస్తాయి.
      Bb విషమయుగ్మజాలు గుండ్రటి విత్తనాల్లో మధ్యస్థంగా ఉన్న పిండిరేణువులను ఉత్పత్తి చేస్తాయి.
ఈ దృగ్విషయాన్ని ఇది వివరిస్తుంది?
జ: బహుళ ప్రభావత

 

19. అంతర్గత యుగ్మవికల్పానికి సంబంధించి కిందివాటిలో ఏది నిజం?
A. తక్కువ సామర్థ్యం ఉన్న ఎంజైమ్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
B. క్రియారహిత ఎంజైమ్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
C. ఏ ఎంజైమ్‌ను ఉత్పత్తి చేయకపోవచ్చు.
జ: ABC

20. బహిర్గత యుగ్మవికల్పం కింది లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.
1) రూపాంతరం చెందనిది, అసలైన దృశ్యరూపాన్ని ప్రతిబింబిస్తుంది.
2) రూపాంతరం చెందింది, అసలైన దృశ్యరూపాన్ని ప్రతిబింబిస్తుంది.
3) క్రియాశీలంగా ఉంటుంది కానీ రూపాంతరం చెందిన యుగ్మవికల్పం.
4) రూపాంతరం చెందింది, అసలైన దృశ్యరూపాన్ని ప్రతిబింబించదు.
జ: 1 (రూపాంతరం చెందనిది, అసలైన దృశ్యరూపాన్ని ప్రతిబింబిస్తుంది)

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌