• facebook
  • whatsapp
  • telegram

జీవప్రపంచం

1. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి.
ఎ) మొక్క ఒక టాక్సాన్
బి) నిర్జీవ వస్తువులు కూడా పెరుగుతాయి
సి) జీవులను నిర్వచించే లక్షణంగా 'పెరుగుదల'ను పరిగణనలోకి తీసుకోలేం
డి) మ్యూల్ ప్రత్యుత్పత్తి చెందదు
సరైన వ్యాఖ్యలను ఎన్నుకోండి.
జ: అన్నీ

 

2. 20వ శతాబ్ద డార్విన్-
జ: ఎర్నెస్ట్ మేయర్.

 

3. పెరుగుదల జంట లక్షణాలు-
జ: ద్రవ్యరాశిలో వృద్ధి, సంఖ్యలో వృద్ధి

4. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) శిలీంద్రాలు A) ప్రరోహాలు ఏర్పడటం
II) ఈస్ట్ B) మ్యూల్
III) ప్రోటోనీమా C) ముక్కలుగా విరగడం
IV) ప్రత్యుత్పత్తి ఉండదు D) సిద్ధబీజం
  E) నిర్జీవులు

సరైన జోడింపు
      I     II    III   IV
జ:  D   A    C    E

 

5. ఈ జీవుల్లో పెరుగుదల ప్రత్యుత్పత్తికి పర్యాయం.
1) ఈస్ట్/అమీబా       2) బ్యాక్టీరియా    3) క్లామిడోమోనాస్      4) అన్నీ
జ: 4(అన్నీ)

 

6. జీవుల ప్రత్యేక లక్షణం-
1) పెరుగుదల        2) ప్రత్యుత్పత్తి      3) జీవక్రియలు         4) అన్నీ
జ:   4 (అన్నీ)

7. జీవులకు చెందిన సాంకేతిక క్లిష్టమైన లక్షణం -
జ: క్షోభ్యత

 

8. జీవులను నిర్వచించదగిన లక్షణం -
జ: జీవక్రియలు

 

9. కిందివాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి.
1) జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు
2) జీవ సంబంధ మ్యూజియాలను విద్యా సంస్థల్లో నెలకొల్పుతారు
3) RBG అతిపెద్ద హెర్బేరియం
4) మామిడి క్రమం సాపిండేల్స్
జ: 1 (జీవులను గుర్తించడానికి 'కప్లెట్' అనే విభిన్న లక్షణాల జంటను ఉపయోగిస్తారు)

 

10. సిస్టమాటిక్స్ అనే పదం ఈ భాష నుంచి తీసుకున్నారు
జ: లాటిన్

 

11. జీవశాస్త్ర నామంలోని రెండు పదాలను చేతిరాతతో రాసినప్పుడు వేర్వేరుగా పేరు కింద గీత గీస్తారు. దీని అర్థం-
1) అవి ముఖ్యమైనవి                             2) మొదటిది ప్రజాతి, రెండోది జాతి
3) చదువరుల దృష్టిని ఆకర్షించడానికి         4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

12. ICBN విస్తరించండి.
జ: International Code for Botanical Nomenclature

 

13. జతపరచండి.

పట్టిక - 1 పట్టిక - 2
I) ఆరబెట్టిన మొక్క నమూనాలు A) బొటానికల్ గార్డెన్స్
II) భద్రపరిచిన జంతు నమూనాలు B) మ్యూజియం
III) సజీవ మొక్కల నమూనాలు C) ఫ్లోరా
IV) మొక్కల నమూనాల విషయ సూచిక D) హెర్బేరియం

సరైన జోడింపు
      I       II     III    IV
జ:  D     B     A     C

 

14. జతపరచండి.

I) ఆవాసం, విస్తరణ A) RBG
II) ఒక వర్గం సమాచారం B) హెర్బేరియం
III) భవిష్యత్తులో గుర్తించడానికి ఉపయోగపడే గిడ్డంగి C) మోనోగ్రాఫ్
IV) మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రం D) ఫ్లోరా

      I      II    III    IV
జ:  D    C    B     A

15. జతపరచండి.

I) IBG A) ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్స్ నామెన్‌క్లేచర్
II) RBG B) లక్నో
III) NBRI C) హౌరా
IV) ICBN D) లండన్ (ఇంటర్నేషనల్ ఫర్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్)

       I     II   III    IV
జ:   C   B    A    D

 

16. కిందివాటిలో ఏది నమూనాల ప్రతిబింబాలను కలిగి ఉంటుంది?
1) హెర్బేరియం      2) డిజిటల్ హెర్బేరియం
3) మ్యూజియం     4) ఫ్లోరా
జ: 2 (డిజిటల్ హెర్బేరియం)

 

17. మనిషి క్రమం -
జ: ప్రైమేట

 

18. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.
A) నామీకరణ      B) లక్షణాల వర్ణన    C) గుర్తించడం
జ:  BCA

19. అన్ని జీవుల నిర్వచింపదగిన లక్షణాలు-
A) పెరుగుదల     B) జీవక్రియలు      C) ప్రత్యుత్పత్తి       D) క్షోభ్యత       E) స్వయం స్పృహ
జ:  BD మాత్రమే

 

20. మామిడి కుటుంబం-
జ:  అనకార్డియేసి

 

జీవ ప్రపంచంలో వైవిధ్యం

1. ప్రపంచ అటవీ దినోత్సవం 
జ: మార్చి 21 


2. స్వయం పోషక థాలోఫైట్‌ గురించి వివరించే శాస్త్రం?
జ: ఫైకాలజీ 


3. లైకేన్‌లో ఉండే శిలీంధ్ర భాగాన్ని ఏమంటారు?
జ: మైకోబయాంట్‌


4. అతి తక్కువ క్రోమోజోమ్స్‌ ఎందులో ఉంటాయి?
జ: హప్లోపాపస్‌  


5. శుష్క, అర్ధశుష్క ప్రాంతాల్లో పంట దిగుబడిని అధికం  చేయడానికి పరిశోధన జరిపే సంస్థ ఏది?
జ: ఐసీఆర్‌ఐఎస్‌ఏటీ  


6. అతి చిన్న టెరిడోఫైట్‌ ఏది?
జ: అజొల్లా 


7. ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?
జ: డెహ్రాడూన్‌ 


8. ప్రైడ్‌ ఫ్రూట్‌ ఆఫ్‌ ఇండియా అని దేన్ని అంటారు?
జ: మామిడి 


9. జీవులను అయిదు రాజ్యాలుగా విభజించిన శాస్త్రవేత్త? 
జ: విట్టేకర్‌   


10. ఎర్రసముద్రం ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన శైవలం ఏది?
జ: ట్రైకోడెస్మియం ఎరిథ్రియం


11. క్రిప్టోగామ్‌లు అంటే?
జ: పుష్పించని మొక్కలన్నీ


12. కిందివాటిలో సరైంది.
1) కొన్ని శిలీంధ్రాల్లో హరితరేణువులుంటాయి.
2) పూతికాహారులైన శిలీంధ్రాలు కూడా ఉన్నాయి.
3)  శిలీంధ్రాలన్నీ స్వయం పోషితాలు
4)  శిలీంధ్రాలన్నీ పరాన్న జీవులు
జ: 2) పూతికాహారులైన శిలీంధ్రాలు కూడా ఉన్నాయి.


13. కిందివాటిలో వేటి కణకవచాలు ఎక్కువగా భద్రపరచబడి శిలాజాల మాదిరి కనిపిస్తాయి?
జ: డయాటమ్‌లు


14. ఫెర్న్‌లలో సిద్ధబీజాశయ పుంజాన్ని (సొరన్‌) కప్పి ఉంచి రక్షించే పొర ఏది?
జ:  ఇండ్యూసియం  


15. అంతరిక్ష పరిశోధనల్లో వాడే శైవలం ఏది?
జ: క్లోరెల్లా 


16. జున్నుగడ్డి (అగార్‌ అగార్‌) దేని నుంచి లభిస్తుంది?
జ: రోడోఫైసి 


17. శైవలాల్లో ఉండి శిలీంధ్రాల్లో లేని కణాంగం?
జ: ప్లాస్టిడ్‌లు


18. డయాటమ్‌ల కణకవచంలో ఉండే ప్రత్యేక పదార్థం?
జ: SiO2


19. శిలీంధ్రాల కణకవచంలో ప్రధానంగా ఉండే పదార్థం?
జ: ఖైటిన్‌ 


20. శిలీంధ్రాల్లో పోషణ విధానం?
జ: పరాన్న జీవులు, పూతికాహారాలు 


21. జన్యుశాస్త్ర పరిశోధనల్లో అత్యధికంగా వాడే శిలీంధ్రం?
జ:  న్యూరోస్పోరా


22. మైకోబయాంట్‌ అంటే?
జ: లైకెన్‌థాలస్‌లోని శిలీంధ్ర భాగస్వామి


23. బ్రయోఫైట్లలో కనిపించే జీవిత చక్రం ఏది?
జ: భిన్నరూప ఏకాంతర జీవిత చక్రం


24. లివర్‌వర్ట్‌ ఏ తరగతికి చెందింది?
జ: హెపాటికాప్సిడా 

Posted Date : 12-04-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌