• facebook
  • whatsapp
  • telegram

వృక్షరాజ్యం

1. జతపరచండి.

I) ఏకకణ నిర్మితం, కశాభ సహితం A) స్పైరోగైరా
II) ఏకకణ నిర్మితం, కశాభ రహితం B) కారా
III) తంతురూపకం C) క్లోరెల్లా 
IV) తంతురూపకం, శాఖాయుతం D) క్లామిడోమోనాస్
  E) యూలోథ్రిక్స్

      I     II    III    IV 
జ:  D   C    A     E

 

2. కిందివాటిలో అన్ని రకాల లైంగికోత్పత్తులనూ చూపేది ఏది?
     1) క్లోరోఫైసీ           2) ఫియోఫైసీ        3) సయనోఫైసీ          4) రోడోఫైసీ
జ: 1 లేదా 2 (క్లోరోఫైసీ, ఫియోఫైసీ)

3. జతపరచండి. 

I) సమసంయోగం (నిశ్చల సంయోగ బీజాలు) A) క్లామిడోమోనాస్
II) అసమసంయోగం B) వాల్వాక్స్
III) సమసంయోగం (కశాభ సహిత సంయోగబీజాలు) C) ఫియోఫైసీ
IV) అండసంయోగం D) స్పైరోగైరా

     I     II    III    IV 
జ:  D   C    A     B

 

4. జతపరచండి.

I) Chl - a, Chl - b A) రోడోఫైసీ
II) Chl - a B) ఫియోఫైసీ
III) Chl - a, Chl - c C) సయనోఫైసీ
IV) Chl - a, Chl - d D) క్లోరోఫైసీ

      I     II     III    IV 
జ:  D   C     B     A

5. సరికాని జతను ఎన్నుకోండి.
      1) వివిధ ఆకారాలున్న హరిత రేణువులు - క్లోరోఫైసీ   2) ఫ్యూకోజాంథిన్ - నిల్వ ఆహారం
      3) ఫ్లోరీడియన్ పిండిపదార్థం - రోడోఫైసీ                   4) మానిటాల్ - నిల్వ ఆహారం
జ: 2 (ఫ్యూకోజాంథిన్ - నిల్వ ఆహారం)

 

6. కింది నిల్వ ఆహారం శిలీంద్రాల గ్లైకోజెన్‌ను పోలి ఉంటుంది-
       1) స్టార్చ్     2) మానిటాల్     3) ఫ్లోరీడియన్ స్టార్చ్    4) లామినారిన్
జ: 3 (ఫ్లోరీడియన్ స్టార్చ్)

 

7. కెల్ప్‌లు వేటికి చెందుతాయి?
జ: ఫియోఫైసీ

 

8. కిందివాటిలో వ్యోమగాములు ఉపయోగించే శైవలం-
    1) స్పైరులీనా     2) క్లోరెల్లా     3) క్లామిడోమోనాస్    4) వాల్వాక్స్
జ: 2 (క్లోరెల్లా)

 

9. పైరినాయిడ్‌లు వేటిలో ఉంటాయి?
జ: క్లోరోఫైసీ హరితరేణువులు

 

10. 100 మీటర్లు పెరిగే శైవలాలను ఏమంటారు? అవి వేటికి చెందినవి?
జ: కెల్ప్‌లు, ఫియోఫైసీ

11. పార్శ్వ కశాభాలున్న బేరిపండు సంయోగబీజాలు ఎందులో ఉంటాయి?
జ: ఫియోఫైసీ

 

12. కశాభాలు ఉండి అంగాలు లేనిది-
జ: రోడోఫైసీ

 

13. ఆలివ్ ఆకుపచ్చ నుంచి రకరకాల గోధుమ వర్ణాలతో ఉండే శైవలాలు-
      1) క్లోరోఫైసీ   2) సయనోఫైసీ      3) క్రైసోఫైట్లు      4) ఏదీకాదు
జ: 4 (ఏదీకాదు)

 

14. సరికాని జతను గుర్తించండి.
 1) కశాభాలుండవు - రోడోఫైసీ                2) కశాభాలుండవు - సయనో బ్యాక్టీరియా
  3) పార్శ్వ కశాభాలు - ఫియోఫైసీ           4) సహనివేశ రూపం - క్లామిడోమోనాస్
జ: 4 (సహనివేశ రూపం - క్లామిడోమోనాస్)

 

15. క్లోరోఫైసీలో కణకవచం బయటి పొరలోని పదార్థం-
జ: పెక్టోజ్

 

16. ఫియోఫైసీ శైవలాల వివిధ రకాల వర్ణాలకు కారణమైన వర్ణద్రవ్యం
జ: ఫ్యూకోజాంతిన్

 

17. ఫియోఫైసీలో కణకవచం బయటి పొరలోని పదార్థం-
జ: ఆల్జిన్

18. ఫియోఫైసీలోని పత్రం లాంటి కిరణజన్యసంయోగక్రియ జరిపే భాగం
జ: ఫ్రాండ్

 

19. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
     1) ఫియోఫైసీలో రెండు పార్శ్వ కశాభాలున్న బేరీపండు ఆకారంలో చలన సిద్ధ బీజాలుంటాయి
     2) ఫియోఫైసీలో సంయోగబీజాలు బేరీపండు ఆకారం, పార్శ్వ, ద్వి కశాభ సహితం
     3) ఫియోఫైసీలో కశాభాలు అసమానం
     4) క్లోరోఫైసీలో కనీస కశాభాల సంఖ్య 4 
జ: 4 (క్లోరోఫైసీలో కనీస కశాభాల సంఖ్య 4)

 

20. రోడోఫైసీలో కణకవచం దేంతో తయారవుతుంది?
       1) సెల్యులోజ్    2) పెక్టిన్   3) పాలి సల్ఫేట్ ఎస్టర్లు   4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

21. కిందివాటిలో ఫియోఫైసీకి చెందనిది ఏది?
     1) ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా   2) లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్
     3) డిక్టియోటా, పార్ఫైరా, సర్గాసం              4) ఫ్యూకస్, ఎక్టోకార్పస్, లామినేరియా
జ: 3 (డిక్టియోటా, పార్ఫైరా, సర్గాసం)

22. అండ సంయోగం ద్వారా మాత్రమే లైంగికోత్పత్తి చెందేవి-
జ: ఎరుపు శైవలాలు


23. రోడోఫైసీ ప్రత్యేక లక్షణం-
    A. Chl - d
    B. ఫైకో ఎరిథ్రిన్
    C. నిశ్చల సిద్ధబీజాలు, సంయోగ బీజాలు
    D. సమ సంయోగం, అసమ సంయోగం ఉండవు
    E. కూజాకారంలో ఉండే కార్పొగోనియం అనే స్త్రీ బీజాశయం
    F. స్పెర్మాషియం
    G. ఫలదీకరణానంతర మార్పులు
    H. అన్నీ
    1) A B C    2) D E F G H   3) 1 & 2    4) A B D F G H
జ: 3 (1 & 2)

 

24. వాయుకోశం ఉన్నది, ఫ్రాండ్ లేనిది వరుసగా-
జ: ఫ్యూకస్, పాలిసైఫోనియా

25. అంతర్గతం, అండసంయోగం విధానంలో జరిగే లైంగికోత్పత్తి దేనిలో ఉంటుంది?
జ: ఫియోఫైసీ

 

26. కిందివాటిలో రోడోఫైసీకి సంబంధించనివి ఏవి?
     1) పాలిసైఫోనియా, పార్ఫైరా       2) గెలీడియం, పాలిసైఫోనియా
     3) గ్రాసిలేరియా, గెలీడియం       4) ఫ్యూకస్, గెలీడియం
జ: 4 (ఫ్యూకస్, గెలీడియం)

 

27. ఆహారంగా ఉపయోగపడే ఉప్పునీటి శైవలాలు-
       1) సర్గాసం    2) లామినేరియా    3) పార్ఫైరా  4) అన్నీ
జ:  4 (అన్నీ)

 

28. ఆహారంగా ఉపయోగపడే రోడోఫైసీకి చెందిన శైవలాలు-
జ: లామినేరియా

 

29. ఆహారంగా ఉపయోగపడే ఫియోఫైసీకి చెందిన శైవలాలు-
జ: సర్గాసం, లామినేరియా

 

30. ఏ ఫియోఫైసీ ఎడిబుల్ మెంబర్ నుంచి అయోడిన్‌ను తయారు చేయవచ్చు?
జ: లామినేరియా

31. వాయుకోశం దేనిలో ఉంటుంది?
జ: ఫ్యూకస్

 

32. ఫ్రాండ్ తో ఉండే రోడోఫైసీకి చెందిన మొక్క-
జ: పార్ఫైరా

 

33. రోడోఫైసీకి చెందిన హైడ్రోకొల్లాయిడ్-
జ: కారగీన్

 

34. ఫియోఫైసీకి చెందిన హైడ్రోకొల్లాయిడ్-
జ: ఆల్జిన్

 

35. శైవలాల వర్గీకరణకు తోడ్పడిన లక్షణాలు-
     A. కణ కవచం  B. వర్ణ ద్రవ్యాలు   C. నిల్వ ఆహారం D. లైంగికోత్పత్తి
జ: A B C

 

36. అగార్ - అగార్‌కు మూలం-
జ: గెలీడియం, గ్రాసిలేరియా

 

37. రోడోఫైసీలో స్త్రీ బీజాశయం-
జ: గదాకారం, కార్పొగోనియం

38. రాక్‌వీడ్ జీవిత చక్రం-
జ: ద్వయ స్థితిక

 

39. రాక్ వీడ్ దేనికి చెందుతుంది?
జ: ఫియోఫైసీ

 

40. ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమైన జీవి యొక్క జీవిత చక్రం-
జ: ద్వయ స్థితిక

41. జీవిత చక్రాలను జతపరచండి.

I) ఏకస్థితిక A) రాక్‌వీడ్ లేదా ఫ్యూకస్
II) ద్వయస్థితిక B) నాళికా సహిత మొక్కలు
III) ఏక ద్వయస్థితిక C) అనేక శైవలాలు
IV) ద్వి ద్వయస్థితిక D) బ్రయోఫైట్లు
  E) పాలిసైఫోనియా

       I    II    III    IV
జ:  C   A    D     E

 

42. బ్రయోఫైట్, నాళికా సహిత మొక్కల జీవిత చక్రాలు వరుసగా-
జ: ఏక ద్వయస్థితిక - ద్వి ఏకస్థితిక

43. బ్రయోఫైట్ల జీవిత చక్రం దేని జీవిత చక్రంతో సమానం?
        A) ఎక్టోకార్పస్                    B) పాలిసైఫోనియా                   C) లామినేరియా                  D) రాక్‌వీడ్ 
జ: A C

 

44. కింది ఘటనలను జీవిత చక్రాలతో జతపరచండి.

I. ద్వయస్థితిక దశ సంయుక్త బీజానికి మాత్రమే పరిమితం A. ద్వయస్థితిక
II. ఏకస్థితిక దశ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితం B. ఏకస్థితిక
III. స్వతంత్ర సంయోగబీజదం, ఆధారపడే సిద్ధబీజదం C. ద్వి ఏకస్థితిక
IV. ఆధారపడే సంయోగబీజదం, స్వతంత్ర సిద్ధబీజదం D. ఏక ద్వయస్థితిక

       I    II    III     IV
జ:  B   A    D      C

 

45. టెరిడోఫైటా, వివృతబీజాలు, ఆవృతబీజాల మధ్య సామాన్య లక్షణం-
జ: జీవితచక్ర రకం

 

46. కిందివాటిలో ఒక దాని జీవితచక్రం మధ్యస్థంగా ఉంటుంది-
     1) శైవలాలు      2) శిలీంద్రాలు     3) బ్రయోఫైట్లు    4) రాక్‌వీడ్
జ: 3 (బ్రయోఫైట్లు)

 

47. నాళికా సహిత ఆర్కిగోనియేట్లు-
జ: ఆవృతబీజాలు

48. అత్యంత పరిణతి చెందిన ఆర్కిగోనియేట్లు-
జ: వివృతబీజాలు

 

49. అత్యంత పరిణతి చెందిన నాళికా రహిత మొక్కలు-
జ: బ్రయోఫైట్లు

 

50. అతి చిన్న, అతి పెద్ద ఆవృతబీజం-
జ: ఉల్ఫియా, యూకలిప్టస్

 

51. జయంట్ రెడ్ఉడ్‌ట్రీకి మరో పేరు-
జ: సిక్వియో డెండ్రాన్

 

52. దీర్ఘశాఖ, హ్రస్వశాఖ, విత్తనాలు కలిగింది-
జ: గింకో

 

53. సూదుల లాంటి పత్రాలు దేనిలో ఉంటాయి?
జ: పైనస్

 

54. కిందివాటిలో దేన్ని సజీవ శిలాజంగా భావిస్తారు-
      1) సైకస్    2) సిడ్రస్     3) నీటం         4) గింకో
జ: 4 (గింకో)

 

55. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
     1) అతి చిన్న ఆవృతబీజం - ఉల్ఫియా      2) అతి పెద్ద ఆవృతబీజం - యూకలిప్టస్

     3) అతి పెద్ద వివృతబీజం - సిక్వియా        4) సంయుక్త పత్రాలు - గింకో
జ: 4 (సంయుక్త పత్రాలు - గింకో)

 

56. కిందివాటిలో ప్రత్యేక వేర్లు వేటిలో ఉంటాయి?
     1) సైకస్, పైనస్           2) సైకస్, యూకలిప్టస్            

    3) పైనస్, ఉల్ఫియా      4) సైకస్ మాత్రమే
జ: 1 (సైకస్, పైనస్)

 

57. కిందివాటిలో దేనిలో కాండం శాఖాయుతం?
     1) సైకస్      2) పైనస్         3) సిడ్రస్, పైనస్        4) సిడ్రస్ మాత్రమే
జ: 3 (సిడ్రస్, పైనస్)

 

58. నిశ్చితం (A): వివృతబీజాల పత్రాలు నీరు నష్టపోకుండా అనుకూలతలను కలిగి ఉంటాయి.
      వివరణ (R): వివృతబీజాల్లో పుష్పాలు స్ట్రోబిలస్‌లలో ఏర్పడతాయి.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ కాదు.

 

59. వివృతబీజాల కాండంలోని నాళికాపుంజాలు కిందివాటిని పోలి ఉంటాయి.
      1) ఆవృతబీజాలు     2) ద్విదళబీజాలు     3) ఏకదళబీజాలు     4) టెరిడోఫైట్లు
జ: 2 (ద్విదళబీజాలు)

 

60. సమ సిద్ధబీజదం, భిన్న సిద్ధ బీజదాలను ఆధారం చేసుకుని భిన్నమైన దాన్ని గుర్తించండి.
     1) బ్రయోఫైట్లు     2) టెరిడోఫైట్లు     3) వివృతబీజాలు     4) ఆవృతబీజాలు
జ: 2 (టెరిడోఫైట్లు)

61. పురుష, స్త్రీ స్ట్రాబిలస్‌లు ఒకే మొక్క, వేర్వేరు మొక్కలపై వరుసగా వేటిలో ఏర్పడతాయి?
జ: పైనస్, సైకస్

 

62. నిశ్చితం (A) : వివృతబీజాల్లో విత్తనాలు మొదటిసారిగా ఏర్పడ్డాయి.
      వివరణ (R) : స్థూల సిద్ధ బీజాశయంలో స్త్రీ సంయోగ బీజదం పూర్తికాలం ఉండిపోతుంది.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

 

63. సంయోగబీజదాలు వేటిలో స్వతంత్రంగా ఉండవు?
జ: పుష్పించే మొక్కలు

 

64. కిందివాటికి చెందిన ఏ మొక్కల్లో నాళయుత అండసంయోగం ఉంది?
      1) టెరిడోఫైట్లు                  2) వివృతబీజాలు            

     3) ఆవృతబీజాలు              4) పుష్పించే మొక్కలు
జ: 3 (ఆవృతబీజాలు )

 

65. జతపరచండి.

I) నాళ సంయోగం A) రోడోఫైసీ
II) జాయిడోగమీ, నాళ సంయోగం B) టెరిడోఫైటా
III) జాయిడోగామస్ రకపు అండసంయోగం C) సైకస్ 
IV) అండ సంయోగం D) ఆవృతబీజాలు

     I     II    III    IV
జ: D   C    B     A

66. నిశ్చితం (A) : వివృతబీజాల్లో విత్తనాలు నగ్నం.
      వివరణ (R) : విత్తనాల చుట్టూ బీజ కవచం ఉండదు.
జ: A సరైంది. R సరైంది కాదు.

 

67. బహు శైలికాయుత సంయోగ బీజాలు వేటిలో కనిపిస్తాయి?
జ: సైకస్

 

68. సైకస్‌లో ఫెర్న్ లక్షణాలు-
     1) వలితకిసలయ విన్యాసం                   2) రామెంటా, ఆర్కిగోనియా  
     3) బహు శైలికాయుత పురుష బీజాలు   4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

69. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
          A) బ్రయోఫైట్లలో సంయోగ బీజాలు చలించేందుకు తోడ్పడే నిర్మాణాల అత్యధిక సంఖ్య-
          B) ఫియోఫైసీలో సంయోగ బీజాల పార్శ్వభాగాన ఉండే కశాభాల సంఖ్య
          C) రోడోఫైసీలో సంయోగ బీజాల ముందు భాగాన ఉండే కశాభాల సంఖ్య
          D) ఫియోఫైసీలో లైంగికోత్పత్తి రకాలు
          E) క్లోరోఫైసీలో అత్యధిక కశాభాల సంఖ్య
          F) ఫెర్న్ పురుష బీజాల శైలికల సంఖ్య
జ: C B A D E F

70. నిశ్చితం (A) : బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్య ఉభయజీవులు అంటారు. 
      వివరణ (R) : అవి ఆదిమ రకమైన నేలపై పెరిగే మొక్కలు.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ కాదు.

 

71. సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
        1) జలానుక్రమంలో బ్రయోఫైట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి
        2) తడినేలపై జీవించడానికి బ్రయోఫైట్లు నీటిపై ఆధారపడతాయి
        3) బ్రయోఫైట్లలోని పురుష బీజాశయాలను మొదటిసారి ఆంథిరీడియా అని అంటారు
        4) బ్రయోఫైట్లలో మొదటిసారిగా స్త్రీ లైంగికావయవం కూజా ఆకారంలోకనిపిస్తుంది
        5) అన్నీ సరైనవే
జ: 5 (అన్నీ సరైనవే)

 

72. నిశ్చితం (A) : మాస్‌లు అత్యంత పరిణతి చెందిన బ్రయోఫైట్లు.
      వివరణ (R) : వాటి శాఖీయ భాగాలు పుష్పించే మొక్కల భాగాలకు సాదృశాలు.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

 

73. నిశ్చితం (A) : బ్రయోఫైట్లు సంయోగ బీజదాలు.
      వివరణ (R) : మొక్క ప్రధానదేహం సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

74. బహుకణ నిర్మిత, కంచుకయుత, వృంత సహిత లైంగికావయవాలు వేటిలో ఉంటాయి?
జ: బ్రయోఫైట్లు

 

75. ద్వి కశాభయుత పురుష బీజాలు, ఆర్కిగోనియాలు వేటిలో కనిపిస్తాయి?
జ: బ్రయోఫైట్‌లు, టెరిడోఫైట్‌లు

 

76. సంయుక్త బీజం దేనిలో సమవిభజన చెందుతుంది?
జ: శైవలాలు, శిలీంద్రాలు

 

77. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
     1) బ్రయోఫైట్లు సమసిద్ధ బీజదాలు, ఏకద్వయ స్థితిక జీవిత చక్రాన్ని చూపుతాయి
     2) కొన్ని టెరిడోఫైట్లు భిన్న సిద్ధ బీజదాలు, ద్వయ ఏక స్థితిక జీవిత చక్రాన్ని చూపుతాయి
    3) కొన్ని టెరిడోఫైట్లు సమసిద్ధ బీజదాలు, ఏక ద్వయ స్థితిక జీవిత చక్రాన్ని చూపుతాయి
    4) అన్ని పుష్పించే మొక్కలూ భిన్న సిద్ధ బీజదాలు, ద్వయ ఏక స్థితిక జీవిత చక్రాన్ని చూపుతాయి
జ: 3 (కొన్ని టెరిడోఫైట్లు సమసిద్ధ బీజదాలు, ఏక ద్వయ స్థితిక జీవిత చక్రాన్ని చూపుతాయి)

 

78. బ్రయోఫైటా, టెరిడోఫైటాల మధ్య సామాన్య లక్షణం-
జ: సంయుక్త బీజంలో విభజనల రకం, జాయిడోగామస్ అండ సంయోగం

79. నిశ్చితం (A): జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో స్పాగ్నంను ఉపయోగిస్తారు.
      వివరణ (R): పీట్‌కు నీటిని నిల్వచేసే శక్తి ఉంది.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

 

80. నిశ్చితం (A): మాస్‌లకు అధిక పర్యావరణ ప్రాముఖ్యం ఉంది.
       వివరణ (R): అవి లైకెన్లతో కలిసి బండరాళ్లపై సహనివేశానికి తోడ్పడే మొదటి జీవులు.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.


81. నిశ్చితం (A): కొన్ని మాస్‌లు వర్షం ప్రభావాన్ని తగ్గించి, మృత్తిక క్రమ క్షయాన్ని నివారిస్తాయి.
      వివరణ (R): అవి ఉపరితలంపై మందమైన చాప లాంటి నిర్మాణంగా ఏర్పడతాయి.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

 

82. జతపరచండి.

I) ప్రోటోనీమా A) శిలీంద్రాలు
II) అనృత ఇలేటర్లు B) మార్కంషియా
III) జెమ్మాలు C) ఫ్యునేరియా
IV) జెమ్మాలు, ఇలేటర్లు D) హార్న్‌వర్ట్‌లు

సరైన జోడింపు
       I     II     III     IV
జ:  C    D      A     B

83. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
      1) ఆంథోసిరాస్ - హార్న్‌వర్ట్                              2) పాలిట్రైకం - హెయిర్ క్యాప్‌మాస్
      3) ఫ్యునేరియా - కార్డ్‌మాస్                             4) స్పాగ్నం - పీట్‌వర్ట్
జ: 4 (స్పాగ్నం - పీట్‌వర్ట్)


84. జతపరచండి.

I) మాస్‌లో రెండో దశ A) ప్రోటోనీమా
II) బ్రయోఫైట్లలో స్వతంత్ర దశ B) మాస్
III) శైశవ దశ C) సంయోగ బీజదం 
IV) పారాఫైస్‌లు   D) గామెటోఫోర్

      I     II   III   IV
జ:  D   C    A     B

 

85. పత్రయుత బ్రయోఫైట్లు వేటిలో ఉంటాయి?
        A) హెపాటికాప్సిడా       B) ఆంథోసిరటాప్సిడా     C) బ్రయాప్సిడా
జ: A, C

86. పాదం, కాడ, గుళికగా విభజించిన సిద్ధ బీజదాన్ని కలిగినవి-
        A) హెపాటికాప్సిడా       B) ఆంథోసిరటాప్సిడా    C) బ్రయాప్సిడా
జ: C

 

87. మధ్యస్థ విభాజ్య కణావళి ఎందులో ఉంటుంది మరియు దాని స్థానం-
        1) హెపాటికాప్సిడా, కాడ           2) బ్రయాప్సిడా, కాడ
        3) హార్న్‌వర్ట్స్, కాడ                 4) ఆంథోసిరటాప్సిడా, పాదం
జ: 3 (హార్న్‌వర్ట్స్, కాడ)

 

88. ఇలేటర్లు సిద్ధ బీజ వ్యాప్తికి వేటిలో తోడ్పడతాయి?
జ: మార్కంషియా

 

89. ఆంథోసిరటాప్సిడాలో కొమ్ము దేన్ని సూచిస్తుంది?
జ: సిద్ధబీజదం

 

90. విట్టేకర్ వర్గీకరణలో శైవలాలు, శిలీంద్రాలు, బ్రయోఫైటాలో తరగతుల సంఖ్య వరుసగా-
జ: 3, 4, 3

 

91. మార్కంషియా అనేది-
జ: సంయోగ బీజదం, సమసిద్ధ బీజదం, ఏక లింగాశ్రయి

92. ఆంథోసిరటాప్సిడాలో కొమ్ము సూచించేది-
జ: సంయోగ బీజదం యొక్క నిటారు, ద్వయ స్థితిక శాఖ

 

93. నిశ్చితం (A): బ్రయోఫైట్లు భిన్నరూప ఏకాంతర జీవిత దశలను చూపుతాయి.
      వివరణ (R): వాటి స్వతంత్ర సిద్ధ బీజదం సంయోగ బీజదాన్ని విశేషంగా విభేదిస్తుంది.
జ: A సరైంది. R సరైంది కాదు.

 

94. ఏ మొక్కలు ఉపరితలంపై చాపలా పెరుగుతాయి?
జ: మాస్‌లు

 

95. జతపరచండి.

I) క్లబ్‌మాస్ A) పాలిట్రైకం
II) హెయిర్ క్యాప్‌మాస్ B) ఫ్యునేరియా
III) పీట్‌మాస్ C) టెరిడోఫైట్
IV) కార్డ్‌మాస్ D) స్పాగ్నం

      I    II    III     IV
జ:  C   A    D     B

96. జతపరచండి.

I) నేలమీద పెరిగే మొదటి మొక్కలు A) వివృతబీజాలు
II) మొదటి నాళికా సహిత మొక్కలు B) ఆవృతబీజాలు
III) విత్తనాలు ఉన్న మొదటి మొక్కలు C) బ్రయోఫైట్లు
IV) ఆర్కిగోనియాలు లేని మొదటి నాళికా సహిత మొక్కలు D) టెరిడోఫైట్లు

      I    II     III   IV
జ:  C   D    A     B

 

97. నాళికా సహిత మొదటి పుష్పించని మొక్కలు-
జ: టెరిడోఫైట్లు

 

98. టెరిడోఫైట్లు అంటే-
     A) అత్యంత పరిణతి చెందిన పుష్పించని మొక్కలు
    B) నాళికా సహిత ఆదిమ మొక్కలు
    C) నేలపై పెరిగే మొదటి నాళికా సహిత మొక్కలు
    D) పిండాలను ధరించే మొదటి నాళికా సహిత మొక్కలు
   E) సిద్ధ బీజదం స్వతంత్రంగా పెరిగే మొదటి మొక్కలు
జ: A B C D E

99. స్థూల పత్రాలను ధరించే టెరిడోఫైట్లు వేటికి చెందుతాయి?
జ: టీరాప్సిడా

 

100. జతపరచండి.

I) చుట్టూ పోషక కణజాలంతో ఆవరించిన దారువు A) నాళాకార ప్రసరణ స్తంభం 
II) దవ్వ ఉన్న ప్రథమ ప్రసరణ స్తంభం B) జాలాకార ప్రసరణ స్తంభం
III) చెల్లాచెదురుగా పత్రావకాశాలు కలిగిన నాళాకార ప్రసరణ స్తంభం C) ప్రథమ ప్రసరణ స్తంభం
IV) అతి వ్యాప్తమైన పత్రావకాశాలతో సన్నగా చీలిన నాళాకార ప్రసరణ స్తంభం D) సోలినోస్టీల్

       I   II   III   IV
జ:  C   A    D     B

 

101. దవ్వ కలిగిన ప్రసరణ స్తంభం అంటే-
జ: నాళాకార ప్రసరణ స్తంభం

 

102. దేనిలో పత్రావకాశాలు అతివ్యాప్తంగా ఉంటాయి?
జ: జాలాకార ప్రసరణ స్తంభం

103. చెల్లాచెదురుగా ఉండే పత్రావకాశాలు దేని లక్షణం?
జ: సోలినోస్టీల్

 

104. పత్రావకాశాలు లేనిది-
జ: ప్రథమ ప్రసరణ స్తంభం, నాళాకార ప్రసరణ స్తంభం

 

105. టెరిడోఫైటాలోని ఎక్కువ మొక్కలు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే రకంలో కింది మొక్కలను పోలి ఉంటాయి.
     1) బ్రయోఫైట్లు                   2) వివృతబీజాలు            

    3) పుష్పించే మొక్కలు        4) ఆవృతబీజాలు
జ: 1 (బ్రయోఫైట్లు)

 

106. కింది టెరిడోఫైట్లు భిన్నసిద్ధ బీజదాలు
        1) సైలోటం, ఈక్విజిటం                  2) సెలాజినెల్లా, సాల్వీనియా
        3) సాల్వియా, సెలాజినెల్లా              4) ఈక్విజిటం, లైకోపోడియం
జ: 2 (సెలాజినెల్లా, సాల్వీనియా)

 

107. టెరిడోఫైటా సంయోగ బీజదం-
జ: ప్రథమాంకురం, స్వతంత్రం, నాళికా రహితం

 

108. నిశ్చితం (A): టెరిడోఫైటా మొక్కల వ్యాప్తి అతితక్కువ భౌగోళిక ప్రాంతాలకు పరిమితమైంది.
       వివరణ (R): వాటి సంయోగ బీజదాలు పెరగడానికి చల్లటి తేమ గల, నీడ ప్రాంతాలు అవసరం, ఫలదీకరణకు నీరు అవసరం.
జ: A, R లు సరైనవి. A కి R సరైన వివరణ.

109. మొదటిసారిగా స్త్రీ సంయోగ బీజదం పాక్షికంగా సిద్ధ బీజదంపై దేనిలో పెరిగింది?
జ: టెరిడోఫైట్లు

 

110. మొదటిసారిగా స్త్రీ సంయోగ బీజదం పూర్తిగా సిద్ధ బీజదంపై దేనిలో పెరిగింది?
జ: వివృతబీజాలు

 

111. విత్తనం ఏర్పడటానికి పూర్వగామి-
జ: స్థూల సిద్ధ బీజాశయంలో ఉండగానే స్త్రీ సంయోగ బీజదంలో సంయుక్త బీజం పిండంగా వృద్ధి చెందడం

 

112. లేత పత్రాలు అగ్రభాగం నుంచి కింది వైపునకు మెలి తిరగడాన్ని ఏమంటారు?
      1) పుష్ప రచన                         2) పత్ర విన్యాసం                

     3) వలితకిసలయ విన్యాసం          4) అండన్యాసం
జ: 3 (వలితకిసలయ విన్యాసం)

 

113. జతపరచండి.

I) ఇండ్యూషియం A) టెరిస్
II) అనృత ఇండ్యూషియం B) డ్రయోప్టెరిస్
III) రామెంటా C) ఈనెల వ్యాపనం
IV) ద్విభాజీ D) పత్రవృంతం

      I    II     III     IV
జ:  B   A     D     C

114. సిద్ధబీజాశయ పత్రాలు సిద్ధ బీజాశయాలను ఎక్కడ ఏర్పరుస్తాయి?
జ: ఉదరతలంలో

 

115. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
       1) సోరస్ - సిద్ధ బీజాశయాలు                            
       2) సిద్ధ బీజాశయ పత్రాలు - స్ట్రోబిలస్/ శంకువు
       3) బహుశైలికాయుత - చలనపురుష బీజాలు    
       4) ఇండ్యూషియం - ఆర్కిగోనియం
జ: 4 (ఇండ్యూషియం - ఆర్కిగోనియం)

 

116. బహుశైలికాయుత పురుషబీజాలను కలిగింది-
జ: డ్రయోప్టెరిస్

 

117. టెరిస్‌లో సోరస్‌ను రక్షించేది-
జ: వెనకకు వంగిన ఫలవంతమైన పత్రకం ఉపాంతం

118. జతపరచండి.

I) సైలోటం A) లైకాప్సిడా
II) అడియాంటం B) స్పీనాప్సిడా
III) సెలాజినెల్లా C) టీరాప్సిడా
IV) ఈక్విజిటం D) సైలాప్సిడా

     I     II     III    IV
జ: D   C     B     A

 

119. కిందివాటిలో ఫెర్న్ లక్షణం కానిది-
       1) ఇండ్యూషియం               2) ఫర్కేట్ వెనేషన్              

       3) సూక్ష్మపత్రాలు              4) రామెంటా
జ: 3 (సూక్ష్మపత్రాలు)

 

120. జతపరచండి.

I) అండ సంయోగం A) టెరిడోఫైట్లు
II) జాయిడోగమీ B) వివృతబీజాలు
III) నాళసంయోగం C) సైకస్
IV) నాళసంయోగం, జాయిడోగమీ D) క్లోరోఫైసీ

     I    II     III     IV
జ: C   A     B     D

121. నాళికాసహిత మొక్కల్లో సామాన్య లక్షణం
జ: సంక్లిష్ట కణజాలం

 

122. జతపరచండి.

I) అత్యంత క్షీణత చెందిన ఆర్కిగోనియాలు A) ఫలదీకరణం తర్వాత ఏర్పడిన అంకురచ్ఛదం కలిగిన మొక్కలు
II) అత్యంత వృద్ధిచెందిన ఆర్కిగోనియాలు B) మొదట నేలమీద పెరిగిన నిజమైన మొక్కలు
III) ఆర్కిగోనియాలు లేవు C) మొదట పుష్పించే మొక్కలు
IV) దిగబడిన వృంత రహిత ఆర్కిగోనియాలు D) పిండాన్ని ధరించిన మొదటి మొక్కలు

       I   II   III   IV
జ:  C   D    A     B

 

123. పిండాన్ని ధరించే మొక్కలు, ఆర్కిగోనియేట్లకు మధ్య సామాన్యం కానిది-
జ: ఆవృతబీజాలు

 

124. నాళికా సహిత మొక్కలు, ఆర్కిగోనియేట్లకు మధ్య సామాన్యం కానిది-
జ: ఆవృతబీజాలు

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌