• facebook
  • whatsapp
  • telegram

జీవాణువులు

1. జతపరచండి.

I) పిండి పదార్థం A) పత్తి
II) గ్లైకోజెన్ B) బొద్దింక బాహ్య అస్థిపంజరం
III) సెల్యులోజ్ C) బంగాళాదుంప
IV) కైటిన్ D) కాలేయం

      I     II   III     IV
జ:  C    D    A     B

 

2. గ్లైసీన్, అలనైన్,    -   కార్బన్ యొక్క 4 రకాల ప్రతిక్షేపణ సముదాయాల్లో ఒకదాంతో విభేదిస్తాయి. మిగతా
వాటితో పోలిక కలిగి ఉంటాయి. కిందివాటిలో అవి విభేదించే సముదాయం-
     1) H   2) COOH    3) R సముదాయం   4) అమైనో సముదాయం
జ: 3 (R సముదాయం)

3. DNA లోని చక్కెర కిందివాటిలో దేంతో గ్లైకోసైడిక్ బంధంతో కలపబడుతుంది?
జ: నత్రజని క్షారం

 

4. జతపరచండి.

I) ఎస్టర్ బంధం A) పాలిశాకరైడ్
II) గ్లైకోసైడిక్ బంధం B) ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లాలు
III) పెప్టైడ్ బంధం C) నీరు
IV) హైడ్రోజన్ బంధం D) కొవ్వులు

     I     II    III    IV
జ: D    A    B     C

 

5. హీమోగ్లోబిన్ ప్రదర్శించేది-
జ: చతుర్థ నిర్మాణం

 

6. ప్రొటీన్‌లో ఏ అమైనో ఆమ్లం స్థానం ఏదో తెలుసుకునేందుకు తోడ్పడేది-
జ: ప్రాథమిక నిర్మాణం

7. నిశ్చితం (A): కాగితం వృథా చేయడం అంటే వృక్ష సంపదను పోగొట్టుకోవడమే.
     వివరణ (R): కాగితం సెల్యులోజ్‌తో నిర్మితమవుతుంది.
జ:  A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

8. కింది ఏ లక్షణం లేకపోవడంవల్ల ద్వితీయ జీవక్రియా ఉత్పన్నం ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నంతో విభేదిస్తుంది-
     1) గుర్తించగలిగిన నిర్మాణం         2) ద్రవ్యరాశి, ఆకారం
     3) గుర్తించగలిగిన విధులు          4) మొక్క లేదా మానవుడికి ఉపయోగపడటం
జ:  3 (గుర్తించగలిగిన విధులు)

 

9. నిశ్చితం (A): అన్ని స్థూల జీవ అణువులు బృహదణువులు.
      వివరణ (R): కొవ్వులు కూడా బృహదణువులు.
జ: A సరైంది, R సరైంది కాదు.

 

10. కిందివాటిలో ఒక బృహదణువులో పక్కన ఉండే 2 అణువులు గ్లైకోసైడిక్ బంధంతో కలపబడతాయి-
     1) కేంద్రక ఆమ్లాలు     2) పాలిశాకరైడ్లు     3) కొవ్వులు     4) ప్రొటీన్లు
జ:  2 (పాలిశాకరైడ్లు)

11. నిశ్చితం (A): అన్ని అమైనో ఆమ్లాలు మొక్కలకు, జంతువులకు ఆవశ్యకం.
      వివరణ (R): మొక్కలకు బయట నుంచి అమైనో ఆమ్లాల సరఫరా జరగదు.
జ:  A సరైంది,కాదు. R, సరైంది.

 

12. కిందివాటిలో లిపిడ్లకు సరిపోయే లక్షణమేది?
      1) స్థూల అణువులు                         2) ఆమ్లంలో కరుగుతాయి
      3) అధిక అణుభారం కలిగి ఉంటాయి     4) సూక్ష్మ అణువులు
జ: 1 (స్థూల అణువులు)

 

13. మొక్కలు, జంతువుల జీవక్రియల్లో శక్తిరూపాలు మారతాయి. ఇలాంటి దృగ్విషయాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు?
జ: బయోఎనర్జిటిక్స్

 

14. జీవావరణంలో అత్యంత సమృద్ధిగా ఉన్న ప్రొటీన్ -
జ: రూబిస్కో

 

15. జంతువుల్లో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రొటీన్-
జ: కొల్లాజెన్

16. ప్రొటీన్లు ఏ విధంగా ఉండవు?
జ: దారువు కణకవచంలోని ముఖ్యమైన అనుఘటకం

 

17. ఆర్ధ్రోపోడ్‌ల బాహ్య అస్థిపంజరంలోని పాలిశాకరైడ్-
జ: కైటిన్

 

18. శక్తికి మూలాధారమైన పాలిశాకరైడ్
జ:  గ్లైకోజెన్, స్టార్చ్

 

19. కిందివాటిలో విజాతీయ బృహదణువులు ఏవి?
      1) స్టార్చ్, సెల్యులోజ్              2) ప్రొటీన్లు, స్టార్చ్
      3) కేంద్రకామ్లాలు, ప్రొటీన్లు       4) స్టార్చ్, కేంద్రకామ్లాలు
జ: 3 (కేంద్రకామ్లాలు, ప్రొటీన్లు)

 

20.  నిశ్చితం (A): లిపిడ్లు జీవ స్థూల అణువులు.
        వివరణ (R): లిపిడ్ల అణుభారం 1000 Da కంటే తక్కువ.
జ:  A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు

 

21. నిశ్చితం (A): లిపిడ్లు వాస్తవానికి స్థూల జీవ అణువులు కావు.
       వివరణ (R): వాటి అణుభారం ఎక్కువ.
జ:  A సరైంది, R సరైంది కాదు

22. కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
     A. RNA లోని న్యూక్లియోటైడ్ల రకాలు    B. ఆక్టమర్ హిస్టోన్లలో న్యూక్లియోటైడ్ల రకాలు
     C. న్యూక్లియోటైడ్ల రకాలు                   D. పిరిమిడిన్ల రకాలు
     E. ప్యూరిన్ల రకాలు                           F. ఎనర్జీకరెన్సీలోని న్యూక్లియోటైడ్ల రకాలు
     1) FEDACB          2) FECADB          3) BFCEAC            4) BFEDCA
జ: 3 (BFDEAC)

 

23. కిందివాటిలో తప్పు వాక్యాలను గుర్తించండి-
     1) సజీవస్థితి సమతాస్థితిలేని నిలకడ స్థితి
     2) జీవస్థితి, జీవక్రియలు సమానార్థకాలు
     3) సమతాస్థితిలో ఉన్నప్పుడు జీవులు అతి తక్కువ జీవక్రియలు చూపుతాయి
     4) నిర్మాణాత్మక, విచ్ఛిన్నక్రియలకు మధ్య ATP ఒక రసాయనిక అనుసంధానం
జ: 3 (సమతాస్థితిలో ఉన్నప్పుడు జీవులు అతి తక్కువ జీవక్రియలు చూపుతాయి)

 

24. జీవ అణువులు వేటిలో పాల్గొంటాయి?
జ: జీవక్రియ ఫ్లక్స్

 

25. కొలెస్ట్రాల్ దేని నుంచి ఏర్పడుతుంది?
జ: అసిటికామ్లం

 

26. గ్లూకోజ్‌లోని ఏ భాగం శక్తిని నిల్వ చేస్తుంది?
జ: రసాయనిక బంధాలు

27. అధిక పరిమాణం, అధిక అణుభారం ఉన్న సంక్లిష్ట రసాయనిక అణువులను ఒక విద్యార్థి జీవ అణువులని నిర్వచించాడు. అతడు పేర్కొనని మరో లక్షణం ఏది కావచ్చు?
జ: ఆమ్లంలో కరగనివి

 

28. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
       1) సుక్రోజ్ - డైశాకరైడ్          2) స్టార్చ్ - పాలిశాకరైడ్ 
       3) గ్లూకోజ్ - మోనోశాకరైడ్    4) ఫ్రక్టోజ్ - డైశాకరైడ్
జ: 4 (ఫ్రక్టోజ్ - డైశాకరైడ్)

 

29. కిందివాటిలో దేన్ని జీర్ణించేటప్పుడు గ్లైకోసైడిక్ బంధం తెగిపోతుంది?
       1) డీఎన్ఏ     2) ఆర్ఎన్ఏ     3) స్టార్చ్           4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

30. జంతుకణాలు ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తాయి?
జ: గ్లైకోజెన్

 

31. సెల్యూలోజ్ ఒక -
జ: హెక్సోజ్ బృహదణువు

 

32. నీటిలో కరగని అత్యధికంగా లభ్యమయ్యే పాలిశాకరైడ్ ఏది?
జ: సెల్యులోజ్

33. అతి తియ్యని చక్కెర?
జ: ఫ్రక్టోజ్

 

34. నిశ్చితం (A): లిపిడ్లు స్థూల జీవ అణువులు
      వివరణ (R): అవి నీటిలో కరగవు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు

 

35. కిందివాటిలో కేన్‌షుగర్ ఏది?
       1) గ్లూకోజ్   2) సుక్రోజ్     3) ఫ్రక్టోజ్    4) లాక్టోజ్
జ: 2 (సుక్రోజ్)

 

36. ఇన్సులిన్ అనేది వేటి బృహదణువు?
జ: ఫ్రక్టోజ్

 

37. జీవుల్లో CO2 నీటిలో కరిగే చర్య?
జ: ఎంజైమ్‌తో ప్రేరేపితమైన భౌతిక చర్య

 

38. మానవ అస్థిపంజర కండరాల్లో చూపే చర్య?
జ: గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మారడం

39. జీవాణువులకు సంబంధించి టర్నోవర్ అంటే..
జ: ఒక జీవాణువు మరో జీవాణువు నుంచి ఏర్పడటం

 

40. శరీర అనుఘటకాల గతిశాస్త్రస్థితి అంటే..
జ: జీవక్రియాపథాల ద్వారా జీవక్రియా ఉత్పన్నాలు నిర్దిష్టమైన వేగంతో, నిర్దిష్టమైన మార్గంలో వాహన రవాణా

41. కిందివాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
      1) జీవుల్లో ప్రతి రసాయనిక చర్య ఒక ఉత్ప్రేరిత చర్య
      2) ఉత్ప్రేరకాలు ప్రొటీన్లు
      3) జీవక్రియా పథాల్లో ఎక్కువ భాగం సంధించినవి కావు
      4) కణంలో జీవక్రియా ఉత్పన్నాలు ఒక నిర్దిష్టమైన ప్రవాహం, మార్గాలను కలిగి ఉంటాయి
జ: 3 (జీవక్రియా పథాల్లో ఎక్కువ భాగం సంధించినవి కావు)

 

42. నిర్జలీకరణవల్ల కింది ఏ బంధాలు ఏర్పడతాయి?
      1) పెప్టైడ్ బంధం, హైడ్రోజ‌న్ బంధం    2) ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం
      3) గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం  4) హైడ్రోజ‌న్ బంధం, ఎస్టర్ బంధం
జ: 3 (గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం)

 

43. పాలిశాకరైడ్‌లోని పక్కన ఉండే 2 గ్లూకోజ్ అణువుల మధ్య బంధం కిందివాటిలో ఏ బంధాన్ని పోలి ఉంటుంది?
జ: చక్కెర, నత్రజని క్షారాలు

44. కిందివాటిలో డీఎన్ఏ కు సంబంధం లేనిది ఏది?
     1) ఒక మెలిక 34 Aº పొడవు
     2) ఒక మెట్టు ఇంకొక మెట్టుతో 36º కోణం ఉంటుంది
     3) చక్కెరకు యురాసిల్‌కు మధ్య గ్లైకోసైడిక్ బంధం ఉంటుంది
     4) అడినైన్ రెండు హైడ్రోజన్ బంధాలతో కలిసి ఉంటుంది
జ: 3 (చక్కెరకు యురాసిల్‌కు మధ్య గ్లైకోసైడిక్ బంధం ఉంటుంది)

 

45. కేంద్రకామ్లం యొక్క నత్రజని క్షారం?
జ: విజాతీయ చక్రీయం

 

46. జతపరచండి.

I) రైబోజ్ పెంటోజ్ A) ఆర్ఎన్ఏ మాత్రమే
II) 2 డీ ఆక్సీరైబోజ్ B) డీఎన్ఏ
III) G ≡ C C) ఆర్ఎన్ఏ
IV) A  =  U D) డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ

       I    II    III   IV
జ:  C    B    D    A

47. డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ల ఆమ్ల స్వభావానికి కారణం?
జ: ఫాస్ఫేట్

 

48. నిశ్చితం (A): కేంద్రకామ్లాలు స్థూల అణువులు.
       వివరణ (R): ఇవి ఆమ్లంలో కరగవు.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

49. జతపరచండి.

I) సెల్యులోజ్ A) ఫలాలు/ ఫ్రక్టోజ్
II) స్టార్చ్ B) కాగితం 
III) ఇన్యులిన్ C) శిలీంద్రాలు
IV) కైటిన్ D) బంగాళాదుంప/ వరి

      I     II    III    IV
జ:  B    D    A    C

 

50. కిందివాటిలో వేటిలో సెల్యులోజ్ ఉండదు?
      1) ప‌త్తి        2) వృక్ష క‌ణ‌క‌వ‌చం         3) గుజ్జు        4) ఇన్సులిన్
జ: 4 (ఇన్యులిన్)

 

51. ఇన్యులిన్ వేటి బృహదణువు?
జ: ఫ్రక్టోజ్

52. సంక్లిష్ట పాలిశాకరైడ్లు వేటితో నిర్మితమవుతాయి?
జ: అమైనో చక్కెరలు, రసాయనికంగా రూపాంతరం చెందిన చక్కెరలు

 

53. స్టార్చ్ అయోడిన్‌తో నీలి రంగునిస్తుంది ఎందుకంటే..
జ: దీనిలో సంక్లిష్ట సర్పిలాలు ఉంటాయి, I2 ను పట్టి ఉంచగలవు

 

54. నిశ్చితం (A): పాలిశాకరైడ్లు పోషక పదార్థాల విధిని నిర్వర్తిస్తాయి.
      వివరణ (R): కణకవచం రక్షణనిస్తుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు

 

55. కిందివాటిలో సమజాతీయ బృహదణువు కానిదేది?
      1) గ్లైకోజన్    2) స్టార్చ్    3) ఇన్యులిన్    4) సెల్యులోజ్
జ: 1 (గ్లైకోజన్)

 

56. కిందివాటిలో ఒకటి శాఖాయుత పాలిశాకరైడ్-
      1) సెల్యులోజ్    2) స్టార్చ్     3) గ్లైకోజన్      4) సెల్యులోజ్, స్టార్చ్
జ: 1 (గ్లైకోజన్)

 

57. స్వీట్‌కార్న్‌ను వేడినీటిలో కొంచెం సేపు ముంచినప్సుడు నీరు తియ్యగా మారుతుంది. ఎందుకు?
జ: డైశాకరైడ్ మోనోశాకరైడ్‌గా మారుతుంది

58. కిందివాటిలో ప్రొటీన్ కానిదేది?
     1) కణాంతర సంధాయక పదార్థం        2) ఇన్యులిన్
     3) ఇన్సులిన్                                4) GLUT - 4
జ: 2(ఇన్యులిన్)

 

59. కణాల్లోని గ్లూకోజ్ రవాణాకు తోడ్పడే ప్రొటీన్-
జ: GLUT - 4

 

60. కింది కణ అనుఘటకాలను ఆరోహణ క్రమంలో అమర్చండి-
     A) కేంద్రకామ్లాలు    B) లిపిడ్లు 
     C) ప్రొటీన్లు            D) కార్బోహైడ్రేట్లు
జ: BDAC

 

61. జతపరచండి.

I) శక్తి వినియోగమవుతుంది A) విచ్ఛిన్నక్రియ
II) శక్తి విడుదల అవుతుంది B) జీవక్రియ
III) శక్తిని తీసుకోవు, ఇవ్వవు C) నిర్మాణాత్మక క్రియ
IV) సజీవం D) సమతాస్థితి

1) ADCB     2) BCDA     3) BDAC     4) CDBA
           I   II  III  IV
    జ:  C   A   D    B

62. కిందివాటిలో వేటి మధ్య ఎస్టర్ బంధం ఏర్పడుతుంది?
      1) చ‌క్కెర యొక్క కార్బన్‌, న‌త్రజ‌ని        2) ఫాస్ఫేట్‌, చ‌క్కెర యొక్క CH  
      3) సంపూర్వక న‌త్రజ‌ని క్షారాలు            4) న‌త్రజ‌ని క్షారాల జ‌త‌, చ‌క్కెర‌
జ: 2 (ఫాస్ఫేట్, చక్కెర యొక్క CH)

 

63. వెన్నెముకకు నత్రజని క్షారానికి మధ్య కోణం-
జ: 90º

 

64. ఒక న్యూక్లియోటైడ్ అంటే?
జ: ఫాస్పేట్‌కు కలపబడిన న్యూక్లియోసైడ్

 

65. జతపరచండి.

I)  టాక్సిన్ A) కోడిన్
II)  ఆల్కలాయిడ్స్ B) రబ్బర్
III)  లెక్టిన్ C) ఆబ్రిన్
IV)  బృహదణువు D) కోంకనావాలిన్

       I   II   III   IV
జ:  C    A    D     B

66. జతపరచండి.

I) కెరోటినాయిడ్స్ A) కర్క్యూమిన్
II) ఆవశ్యక తైలాలు B) క్యారెట్
III) డ్రగ్ C) జిగుర్లు 
IV) బృహదణువు D) నిమ్మ గడ్డినూనె

       I   II   III  IV
జ:  B   D   A    C

 

67. కిందివాటిలో ఒకటి బృహదణువు కాదు-
      1) జిగురు  2) స్టార్చ్    3) న్యూక్లియోటైడ్‌    4) ర‌బ్బరు
జ: 3 (న్యూక్లియోటైడ్)

 

68. జతపరచండి.

I) 800 - 1000 Da A) స్థూల అణువుల సగటు అణుభారం
II) > 1000 Da B) స్థూలఅణువులు 
III) రక్తంలో గ్లూకోజ్ గాఢత C) సూక్ష్మజీవ అణువులు 
IV) 18 - 800 Da   D) 4.5 to 5.0 mm

      I     II    III   IV
జ:  C    B    D    A

69. పాలిశాకరైడ్, పాలిపెప్టైడ్ల ఎడమచేతివైపు ఉండేవి వరుసగా-
జ: క్షయకరణం కాని కొన, అమైనో

 

70. కిందివాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి-
      1) డీఎన్ఏ లోని నత్రజని క్షారాలు వెన్నెముకకు లోపలివైపు ప్రతిక్షేపితమవుతాయి
      2) ఒక డజన్ కంటే ఎక్కువ డీఎన్ఏ రకాలు ఉంటాయి
      3) ఒక పూర్తి మెలికలో కనీసం 20 నత్రజని క్షారాలు ఉంటాయి
      4) డీఎన్ఏ లోని 2 పోచలు వ్యతిరేక దిశల్లో సమాంతరంగా ఉంటాయి
జ: 3( ఒక పూర్తి మెలికలో కనీసం 20 నత్రజని క్షారాలు ఉంటాయి)

 

71. నిశ్చితం (A): డీఎన్ఏ ఒక ద్విసర్పిలాకారం.
     వివరణ (R): ఇది ఒక ద్వితీయ నిర్మాణం.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు

 

72. ఒక పూర్తి సర్పిలం ఏర్పడేందుకు కావాల్సిన నీటి అణువులు
జ: 20

 

73. ఒక సర్పిలంలోని గ్లైకోసైడిక్ బంధాలు-
జ: 20

74. హీమోగ్లోబిన్‌లోని ఉప ప్రమాణాల రకాలు-
జ: 2

 

75. హీమోగ్లోబిన్‌లోని ఉప ప్రమాణాల సంఖ్య-
జ: 4

 

76. జతపరచండి.

I) అకర్బనిక రసాయనిక శాస్త్రవేత్త A) 2 - D 
II) జీవశాస్త్రజ్ఞుడు B) చతుర్థ నిర్మాణం
III) కర్బన రసాయన శాస్త్రవేత్త   C) అణుసాంకేతికం
IV) భౌతిక శాస్త్రవేత్త D) 3 - D

      I      II    III   IV
జ:  C    B     A     D

 

77. ప్రొటీన్ యొక్క ద్వితీయ నిర్మాణం ప్రదర్శించేది-
జ: కుడిచేతి సర్పిలం

 

78. త్రిమితీయ నిర్మాణం చూపే ప్రొటీన్ ఆకారం -
జ: ఉలెన్ బంతి

79. లెసిథిన్ అనేది ఒక-
జ: ఫాస్ఫోలిపిడ్

 

80. కిందివాటిలో భిన్నమైంది ఏది?
      1) అడినోసిన్    2) థైమిడిలిక్ ఆమ్లం  3) యురిడిన్     4) గ్వానోసిన్
జ: 2 (థైమిడిలిక్ ఆమ్లం)

 

81. అడినిలిక్ ఆమ్లంలోని బంధాలు-
      A. హైడ్రోజన్ బంధాలు            B. ఎస్టర్ బంధం                C. గ్లైకోసిడిక్ బంధం
జ: B C

 

82. కిందివాటిలో జన్యు పదార్థం-
   1) ప్రొటీన్         2) డీఎన్ఏ           3) ఆర్ఎన్ఏ              4) డీఎన్ఏ, ఆర్ఎన్ఏ
జ: 4 (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ)

 

83. డీఎన్ఏ యొక్క వెన్నెముక-
     A. నత్రజని క్షారం                   B. చక్కెర                          C. ఫాస్ఫేట్
జ: B C

 

84. నిశ్చితం (A): నూనెలు తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి.
      వివరణ (R): నువ్వుల నూనె వేసవికాలంలో ద్రవరూపంలో ఉంటుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ కాదు

85. నాడీకణజాలాల్లో ఉండేవి -
జ: ఎక్కువ సంక్లిష్ట నిర్మాణాలు ఉన్న లిపిడ్లు

 

86. అతి సరళమైన లిపిడ్లు-
జ: కొవ్వు ఆమ్లాలు

 

87. గ్లిసరాల్‌ను ఈ విధంగా పిలుస్తారు-
జ: ట్రై హైడ్రాక్సీప్రొపేన్

 

88. లిపిడ్‌లో R సముదాయంలో ఉండేవి-
జ: 19 కార్బన్ల వరకూ

 

89. పామిటిక్ ఆమ్లంలో కార్బాక్సిలిక్ కార్బన్‌ను తప్పించి ఉండే కార్బన్లు-
జ: 15

 

90. పామిటిక్ అరాఖిడోనిక్ ఆమ్లాల్లో కార్బాక్సిల్ కార్బన్‌ను కలుపుకొని ఉండే కార్బన్ల సంఖ్య వరుసగా-
జ: 16, 20

 

91. నిశ్చితం (A): కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్‌తో కలిసి ఎస్టర్ రూపంలో ఉంటాయి.
     వివరణ (R): చాలా లిపిడ్లు గ్లిజరాల్, కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

92. నిశ్చితం (A): జీవ అణువులు జీవ పదార్థం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు.
       వివరణ (R): జీవపదార్థం జీవ అణువులతో నిర్మితమైంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

93. ఏ శాస్త్రజ్ఞుడి అధ్యయనం ఆధారంగా నిర్జీవ, సజీవ పదార్థాల్లోని మూలకాలను తులనం చేశారు?
జ: సి.ఎన్.ఆర్. రావు

 

94. నిర్జీవ, సజీవ పదార్థాల్లో అతి తక్కువ మూలకాలు వరుసగా..
జ: నత్రజని, సిలికాన్

 

95. నిర్జీవ, సజీవ పదార్థాల్లో అత్యధికంగా ఉండే మూలకాలు వరుసగా..
జ: ఆక్సిజన్, ఆక్సిజన్

 

96. మొక్కలు, జంతువుల అకర్బనిక పదార్థ రూపం-
జ: బూడిద

 

97. అతిసరళ అమైనో ఆమ్లం-
జ: గ్లైసిన్

 

98. ఒక ప్రొటీన్ అమైనో ఆమ్లం R సముదాయంలో హైడ్రాక్సీమీథైల్ అయితే అది-
జ: సెరీన్

99. నిశ్చితం (A): అమైనో ఆమ్లం ఒక జ్విట్టర్ అయాన్.
     వివరణ (R): ఇది ఒక  H+ను స్వీకరిస్తుంది లేదా ఒక H+ను ఇస్తుంది.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

100. గ్లుటామిక్ ఆమ్లం అనేది-
జ: ఆమ్లం

 

101. లైసిన్ అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?
జ: క్షార

 

102. కిందివాటిలో ఏది తటస్థం?
       1) వాలిన్                       2) లైసిన్              3) గ్లుటామిక్ ఆమ్లం              4) ఏదీకాదు
జ: 1 (వాలిన్)

 

103. నిశ్చితం (A): వివిధ pH లు ఉన్న ద్రావణాల్లో అమైనో ఆమ్లాల నిర్మాణం మారుతూ ఉంటుంది.
      వివరణ (R): అమైనో ఆమ్లాల్లో అయనీకరణ చెందే ధర్మం ఉన్న అమైనో, కార్బాక్సిలిక్ సముదాయాలు ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

104. కిందివాటిలో ఒకదాన్ని అమైనో ఆమ్లం యొక్క పార్శ్య శృంఖలం గా భావిస్తారు-
        1) H             2) COOH                3) NH2                4) R
జ: 4 (R)

105. అతిసరళ అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లంలోని కార్బన్ల సంఖ్య వరుసగా-
జ: 2, 2

 

106. అతిసరళమైన అమైనో ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు వరుసగా-
జ: గ్లైసిన్, అసిటికామ్లం

 

107. కిందివాటిలో ఒకటి ఆరోమాటిక్ అమైనో ఆమ్లం కాదు-
        1) ట్రిప్టోఫాన్    2) సెరీన్      3) టైరోసిన్     4) ఫినైల్ అలనైన్
జ: 2 (సెరీన్)

 

108. నిశ్చితం (A): యానకం pH మార్పును అమైనో ఆమ్లాలు ఎదుర్కొంటాయి.
         వివరణ (R): అవి ద్విధ్రువయుతం.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

 

109. సంతృప్తం చెందిన కొవ్వు ఆమ్లాల్లోని ద్వి బంధాలు -
జ: 0

 

110. సంతృప్తం చెందని కొవ్వు ఆమ్లాల్లోని ద్వి బంధాలు -
జ: అత్యల్పంగా   1

 

111. నిశ్చితం (A): అమైనో ఆమ్లాలు ప్రతిక్షేపించిన మీథేన్లు.
వివరణ (R): ఒక అమైనో ఆమ్లంలో 4 వాలెన్సీ స్థానాల్లో నాలుగు రకాల ప్రతిక్షేపణ సముదాయాలు ఉంటాయి.
జ: A, R సరైనవి. A కు R సరైన వివరణ.

112. కిందివాటిలో ఒకటి లెసిథిన్‌కు సంబంధించింది కాదు-
      1) పెరాక్సీజోమ్ నుంచి ఇది సంశ్లేషణ చెందుతుంది.
      2) ఇది ఒక ఫాస్ఫోలిపిడ్
      3) ఇది నైట్రోజినస్ ఫాస్ఫోరిలేటెడ్ సంయోగ పదార్థాన్ని కలిగిన డైగ్లిజరైడ్
      4) ఇది కణకవచంలో ఉంటుంది
జ: 4 (ఇది కణకవచంలో ఉంటుంది)

 

113. సర్పిలంలోని మెట్లు వేటితో నిర్మితమవుతాయి?
జ: నత్రజని క్షారాల జతలు

 

114. డీఎన్ఏ లోని పాలిన్యూక్లియాటైడ్ల గొలుసులు-
జ: 2

 

115. డీఎన్ఏ యొక్క 2 పాలిన్యూక్లియోటైడ్ల గొలుసులు -
        1) సంపూరకం      2) ప్రతి స‌మాంత‌రం    3) కుడిచేతివైపు తిరిగి    4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

116. ప్యూరిన్లు, పిరమిడిన్లలోని C - N వలయాల సంఖ్య వరుసగా-
జ: 2, 1

117. కింది మార్పులను నిర్మాణాత్మక, విచ్ఛిన్న రకాలుగా వేరుచేయండి-
     A. స్టార్చ్    గ్లూకోజ్
     B. గ్లూకోజ్   లాక్టిక్ ఆమ్లం
     C. గ్లూకోజ్   ఇథనాల్ + CO2
     D. CO2 + H2O    గ్లూకోజ్
     E. గ్లైకోజెన్  గ్లూకోజ్
     F. ప్రొటీన్   అమైనో ఆమ్లాలు
     G. అసిటికామ్లం  కొలెస్ట్రాల్
  1) నిర్మాణాత్మక - A B విచ్ఛిన్నక్రియ - G D A B
  2) నిర్మాణాత్మక - C D విచ్ఛిన్నక్రియ - A B C D 
  3) నిర్మాణాత్మక - D G విచ్ఛిన్నక్రియ - A B C E
  4) నిర్మాణాత్మక - D C విచ్ఛిన్నక్రియ - C D E F
జ: 3(నిర్మాణాత్మక - D G విచ్ఛిన్నక్రియ - A B C E)

 

118. కిందివాటిలో సమజాతీయ పాలిమర్లు-
       1) కైటిన్      2) గ్లైకోజెన్      3) సెల్యులోజ్     4) అన్నీ
జ: 4 (అన్నీ)

119. నిర్మాణంలో తోడ్పడే పాలిశాకరైడ్‌లు
జ: సెల్యులోజ్, కైటిన్

 

120. కిందివాటిలో నిల్వ చేసే పాలిశాకరైడ్లు ఏవి?
        1) గ్లైకోజన్      2) స్టార్చ్      3) గ్లైకోజన్, స్టార్చ్       4) గ్లూకోజ్
జ:  3(గ్లైకోజన్, స్టార్చ్)

 

121. ఇన్యులిన్ అనేది ఒక-
జ: నిల్వ చేసే పాలిశాకరైడ్

 

122. ఒక మెలికలోని నత్రజని క్షారాలకు C -N వలయాలకు మధ్య నిష్పత్తి-
జ: 2 : 3

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌