• facebook
  • whatsapp
  • telegram

1 - 5 అధ్యాయాలు (జూనియర్ బోటనీ)

1. కిందివాటిని జతపరచండి.

ఇది సరైన జోడింపు
     I   II   III   IV
జ: D  B   E   A

 

2. కింది వ్యాఖ్యలను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి.
1) టాక్సా స్థాయి తక్కువైనప్పుడు అందులోని జీవుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి.
2) ఒక టాక్సాన్ వివిధ స్థాయులకు ప్రతీక.
3) ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్న రెండు జంట లక్షణాలు.
4) కణజాలాల ధర్మాలు, వాటి నిర్మాణంలో ఉన్న కణాల్లో ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి.
జ: 4 (కణజాలాల ధర్మాలు వాటి నిర్మాణంలో ఉన్న కణాల్లో ఉంటాయి. అంతేకాకుండా వాటి నిర్మాణంలో పాల్గొన్న కణాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితంగా ఉంటాయి.)

 

3. వర్గీకరణ ప్రమాణాలను చూపే స్థాయి క్రమంలో ఎన్ని టాక్సాన్‌లకు మొక్కలు, జంతువులు చెందుతాయి?
జ: 7

 

4. నిశ్చితం (A): డ్యుటిరోమైసిటీస్ కొనీడియాలనే అలైంగిక సిద్ధబీజాల ద్వారా మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
వివరణ (R): ఒకసారి డ్యుటిరోమైసిటీస్‌లోని మొక్కల్లో లైంగిక దశలను గుర్తించిన తర్వాత వాటిని వేర్వేరు తరగతులకు మారుస్తారు.
జ: A, R లు సరైనవి. A కు R సరైన వివరణకాదు.

 

5. కిందివాటిలో దేనిలో లైంగికావయవాలు ఉండవు.
A. ఫైకోమైసిటీస్            B. బ్యాక్టీరియా        C. డ్యుటిరోమైసిటీస్
D. సయనోబ్యాక్టీరియా    E. బెసిడియోమైసీటిస్
జ: B, C, D, E

6. కిందివాటిని జతపరచండి.

ఇది సరైన జోడింపు
      I    II     III   IV
జ: C   A    D    E

 

7. కింది వ్యాఖ్యలను పరిశీలించి, సరైన దాన్ని ఎన్నుకోండి.
1) గత కొంతకాలంలోనూ, ప్రస్తుత కాలంలోనూ, భవిష్యత్తులోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కల వితరణ గురించిన అధ్యయనాన్ని వృక్ష భౌగోళిక శాస్త్రం అంటారు.
2) ఒక శైవలం, ఒక శిలీంద్రం ఇంకొక మొక్కతో జరిపే సహజీవనం గురించి తెలిపే శాస్త్రం లైకెనాలజీ.
3) పత్రహరిత రహిత నాళికా కణజాలయుత పరపోషితాలుగా జీవించే మొక్కల గురించి తెలిపే శాస్త్రాన్ని శిలీంద్ర శాస్త్రం అంటారు.
4) మొక్కల్లో పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి పురావృక్షశాస్త్రం తోడ్పడుతుంది.
జ: 4 (మొక్కల్లో పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి పురావృక్షశాస్త్రం తోడ్పడుతుంది.)

 

8. కిందివాటిలో సరికాని జతను ఎన్నుకోండి.
1) జీవ ఎరువులు - మృత్తిక, నీటికాలుష్యాలను అరికట్టడం
2) బయోరెమిడియేషన్ - మృత్తికా కాలుష్య నియంత్రణ
3) ఇసుకను పట్టుకునే మొక్కలు - మృత్తికా కాలుష్యాన్ని అరికట్టడం
4) విరివిగా మొక్కలు నాటడం - హరితగృహ ప్రభావ నియంత్రణ
జ: 3 (ఇసుకను పట్టుకునే మొక్కలు - మృత్తిక కాలుష్యాన్ని అరికట్టడం)

 

9. కింది గ్రంథాల రచన లేదా వివిధ ఆవిష్కరణలు ఏవి ఒకే కాలానికి చెందినవో గుర్తించండి.
1) మైక్రోగ్రాఫియా - మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించడం.
2) వృక్ష కణజాలాల అంతర్నిర్మాణ వర్ణన - ద్వినామ నామీకరణ
3) హెర్బల్స్ - వృక్షాయుర్వేదం
4) RNA జన్యుతత్వ స్వభావం కనుక్కోవడం - లైంగిక వర్గీకరణ వ్యవస్థ
జ: 1 (మైక్రోగ్రాఫియా - మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించడం.)

 

10. కిందివాటిలోని సమసిద్ధబీజత, నాళికాయుత, భిన్నసిద్ధబీజత, విత్తనాలు ఉన్న మొక్కలను వరుసగా ఎన్నుకోండి.
1) పాలిట్రైకమ్ - సైకాస్                2) స్పాగ్నం - లైకోపోడియం
3) లైకోపోడియం - సాల్వీనియా     4) లైకోపోడియం - గింకో
జ: 4 (లైకోపోడియం - గింకో)

 

11. కింది మొక్కలు ఉబ్బిన పత్రపీఠం, ఉబ్బిన పత్రవృంతాన్ని వరుసగా కలిగి ఉంటాయి.
1) కొన్ని లెగ్యూమినస్ మొక్కలు, ఐకార్నియా      2) టెఫ్రోసియా, పిస్టియా
3) ఐకార్నియా, క్రోటలేరియా                             4) మాంగిఫెరా, హైడ్రిల్లా
జ: 1 (కొన్ని లెగ్యూమినస్ మొక్కలు, ఐకార్నియా)

 

12. కింది కాండ రూపాంతరాలు దీర్ఘకాలికతను చూపడంలో ఉపయోగపడతాయి.
1) శాఖీయోత్పత్తిని చూపే వాయుగత కాండ రూపాంతరాలు
2) అదనపు యాంత్రిక ఆధారం కోసం రూపాంతరం చెందిన వాయుగత కాండం
3) భూగర్భకాండ రూపాంతరాలు
4) ప్రత్యుత్పత్తి కోసం రూపాంతరం చెందిన ఉపవాయుగత కాండం
జ: 3 (భూగర్భకాండ రూపాంతరాలు)

 

13. ఏకలింగ, ద్విలింగ పుష్పాలు ఏ పుష్పవిన్యాసంలో ఉంటాయి?
జ: ట్రైడాక్స్

 

14. కిందివాటిలో సంకలిత ఫలాలు కలిగి ఉండేది
A) తామర    B) గులాబి    C) హీలియాంథస్  D) సీతాఫలం
జ: A, B, D

 

15. కింది ఏ మొక్కలు ఒకేరకం పెరుగుదలను కలిగి ఉండే అబ్బురపు వేర్లను ఉత్పత్తి చేస్తాయి.
1) మర్రిచెట్టు, టీనియోఫిల్లం      2) ఫైకస్, మోన్‌స్టెరా
3) మొక్కజొన్న, మోన్‌స్టెరా      4) మోన్‌స్టెరా, చెరకు
జ: 2 (ఫైకస్, మోన్‌స్టెరా)

 

16. కింది టేబుల్‌లోని అంశాలను అధ్యయనం చేసి సరైన కలయికలను (కాంబినేషన్) గుర్తించండి.

జ: II, III
 

కణ నిర్మాణం - విధులు


1. రిక్తికను ఆవరించి ఉండే పొరను ఏమని పిలుస్తారు?    
జ: టోనోప్లాస్ట్‌  


2. కొవ్వులను నిల్వ చేసే శ్వేత రేణువులను ఏమంటారు?      
జ: 
ఈలయో ప్లాస్టులు 


3. అనువాదం దేనిలో జరుగుతుంది?
జ: 
రైబోజోమ్‌లు


4. బ్యాక్టీరియమ్‌ల మైటోకాండ్రియాగా వేటిని పరిగణిస్తారు?   
జ: 
మీసోజోమ్‌లు  


5. సూత్రయుగ్మం ఏ దశలో జరుగుతుంది?
జ: జైగోటీన్‌  


6. మెటాసెంట్రిక్‌ క్రోమోజోమ్‌ ఏ ఆకారంలో ఉంటుంది? 
జ: V ఆకారం 


7. వేరుకొనలో ఒక కణం నుంచి 128 కణాలు ఏర్పడాలంటే ఎన్నిసార్లు విభజన జరగాలి? 
జ: 
7


8. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వైపు విస్తరించి ఉన్న కండె తంతువులను ఏమంటారు?    
జ: అవిచ్ఛిన్న కండె తంతువులు  


9. డీఎన్‌ఏ నిర్మాణాత్మక ప్రమాణాలు   
జ: 
నూక్లియోటైడ్‌లు 


10. డీఎన్‌ఏలోని రెండు పోచల మధ్య గల బంధాలు?  
జ: 
హైడ్రోజన్‌ బంధాలు


11. అక్రోసెంట్రిక్‌ క్రోమోజోముల్లో సెంట్రోమియర్‌ స్థానం  
జ: 
క్రోమోజోమ్‌ అగ్రభాగానికి దగ్గరగా 


12. కిందివాటిలో ఏ కణాంగాన్ని గుర్తించడానికి జానస్‌ గ్రిన్‌ను వాడతారు? 
జ: మైటోకాండ్రియా  


13. హైడ్రోలైటిక్‌ ఎంజైమ్‌లను కలిగిన కణాంగం? 
జ: లైసోజోమ్‌లు  


14. నిజకేంద్రక జీవుల్లో కనిపించే అతిపెద్ద కణాంగం? 
జ: కేంద్రకం 


15. కణంలో ‘ఆత్మహత్య కోశాలు’ అని ఏ కణాంగాన్ని పిలుస్తారు?   
జ:  లైసోజోమ్‌లు


16. లాంప్‌బ్రష్‌ క్రోమోజోమ్‌లు దేనిలో ఉంటాయి?  
జ: డ్రాసోఫిలా


17. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? 
జ: 
 ష్లీడన్‌, ష్వాన్‌ 


18. కిందివాటిని జతపరచండి. 
     జాబితా - I              జాబితా - II
A) సట్టన్, బోవెరి         II) ఒక జన్యువు - ఒక ఎంజైమ్‌ సిద్ధాంతం
B) బీడిల్‌ - టాటమ్‌     II) కణ సిద్ధాంతం
C) ష్లీడన్‌ - ష్వాన్‌        III) క్రోమోజోమ్‌ అనువంశిక సిద్ధాంతం
D) జాకబ్‌ - మోనడ్‌      IV) లాక్‌ ఒపెరాన్‌
జ: 
 A-II B-I C-II D-IV


19. కేంద్రక పూర్వజీవుల కణకవచంలో ఉండే పదార్థం?
జ: 
మ్యురామిక్‌ ఆమ్లం 


20. వృక్షకణంలో ఉండి జంతుకణంలో లేని కణాంగం? 
జ: హరితరేణువు 


21. త్వచ రహిత కణాంగం? 
జ: రైబోజోమ్స్‌ 


22. కిందివాటిలో ఏక త్వచయుత కణాంగం? 
జ: 
గ్లైయాక్సీజోమ్‌లు


23. డీఎన్‌ఏలో అడినోసిన్‌ పరిమాణం 31.2 అయితే సైటోసిన్‌ పరిమాణం? 
జ: 
18.8


24. లైసోజోమ్‌లను ఉత్పత్తి చేసేది? 
జ: గాల్జిసంక్లిష్టం 


25. సింగర్, నికల్సన్‌లు ప్రతిపాదించిన ఫ్లూయిడ్‌ మొజాయిక్‌ నమూనా దేని గురించి తెలియజేస్తుంది?
జ: కణత్వచం 


26. మైకోప్లాస్మాలో ఉండేవి?
జ: 
డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ


27. 70s రైబోజోమ్‌లో ఉండే ఉప ప్రమాణాలు? 
జ: 30s + 50s


28. మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్‌ రవాణ వ్యవస్థ జరిగే ప్రదేశం?
జ: లోపలి త్వచం 


29. హరితరేణువులో కార్బన స్థాపనం ఎక్కడ జరుగుతుంది? 
జ: స్ట్రోమా 


30. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఏ కణాంగంలో విచ్ఛిన్నం అవుతుంది?
జ: పెరాక్సీజోమ్‌లు 


31. కేంద్రకాంశం విధి? 
జ: mRNA 


32. కణచక్రంలోని వివిధ దశలను వరుసక్రమంలో గుర్తించండి.
జ: G1, S, G2, M


33. హిస్టోన్లు అనేవి
జ: ప్రొటీన్లు 


34. క్షయకరణ విభజన - Iలో అతిపెద్ద దశ? 
జ: ప్రథమ దశ 


35. ఖైనిటోకోర్‌ సంక్లిష్ట నిర్మాణం దేనితో నిర్మితమవుతుంది? 
జ: ప్రొటీన్లు 


36. ఈ.కొలై సగటున 20 నిమిషాల్లో కణవిభజన చెంది రెట్టింపయితే రెండు కణాల నుంచి 32 ఈ.కొలై కణాలు ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది? 
జ:100 నిమిషాలు  


37. క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోజోమ్‌ల సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది?
జ: చలన దశ - II 


38. కణ విభజనలో పిల్ల క్రోమోజోమ్‌లు వేరుపడటానికి తోడ్పడేది?
జ: 
సెంట్రోమియర్‌


39. ‘ప్రోగ్రామ్‌డ్‌ సెల్‌ డెత్‌’ దృగ్విషయాన్ని ఏమని పిలుస్తారు? 
జ: అపొప్టోసిస్‌ 


40. కేంద్రకాన్ని ఆవిష్కరించినవారు? 
జ: 
రాబర్ట్‌ బ్రౌన్‌


41. కిందివాటిలో కేంద్రక పూర్వ కణాలను గుర్తించండి. 
A) బ్యాక్టీరియా         B) నీలి ఆకుపచ్చ శైవలాలు  
C) మైకో ప్లాస్మా        D) PPLO
జ: A, B, C, D


42. కణ కవచం వేటితో నిర్మితమవుతుంది? 
జ: సెల్యులోజ్‌, హెమి సెల్యులోజ్‌, పెక్టిన్‌, ప్రొటీన్‌


43. కణ ద్రవాభిసరణను నియంత్రించే కణాంగం? 
జ: రిక్తిక  


44. కిందివాటిలో సరైంది. 
A) జీవరాశుల కణాలన్నింటిలో కేంద్రకం ఉంటుంది.
B) వృక్ష, జంతు కణాల రెండింటిలో స్పష్టమైన కణకవచం ఉంటుంది.
C) నిర్జీవ పదార్థాల నుంచి నవజాతంగా కణాలు ఏర్పడతాయి.
D) కేంద్రక పూర్వజీవుల్లో త్వచంతో ఆవరించిన కణాంగాలు ఉండవు.
జ: 
C మాత్రమే  


45. కిందివాటిని జతపరచండి. 
        జాబితా - I                           జాబితా - II
A) త్వచ రహిత కణాంగం          i) హరితరేణువు  
B) ఏక త్వచయిత కణాంగం     ii) కేంద్రకాంశం
C) ద్వి త్వచయిత కణాంగం     iii) కేంద్రకం
జ: 
 ఏదీకాదు


46. కిందివాటిని జతపరచండి.
    జాబితా - I             జాబితా - II
A)  మెటాసెంట్రిక్‌         I) i
B) సబ్‌ మెటాసెంట్రిక్‌   II) j
C) ఎక్రోసెంట్రిక్‌            III) L
D) టీలోసెంట్రిక్‌           IV) V
జ: A-IV B-III C- II D-I 


47. కేంద్రక పూర్వజీవుల లక్షణం కానిది? 
జ: అంతర త్వచ వ్యవస్థ ఉంటుంది.


48. మొక్కల్లో ద్వితీయ జీవక్రియోత్పన్నాలు?     
జ: జిగురులు 


49. కిందివాటిలో సహజ ఉత్పత్తులు ఏవి? 
A) పెన్సిలిన్‌          B) విటమిన్‌ - C 
C) పెరుగుదల హార్మోన్‌    D) సల్ఫోనమైడ్‌
జ: 
A, B


50.  కిందివాటిని జతపరచండి.   
    జాబితా - I                 జాబితా - II
 A)  చక్కెర                 I) లెసిథిన్‌
B) కొవ్వు ఆమ్లాలు       II) రైబోస్‌
C) అమైనో ఆమ్లాలు    III) అలనిన్‌
D) న్యూక్లియోటైడ్‌లు   IV) అడినైలిక్‌ ఆమ్లం
జ: A-II B-I C-III D-IV


51. కిందివాటిని జతపరచండి. 
జాబితా - I                           జాబితా - II
A) కాలేయం                      I) ఖైటిన్‌
B) తొక్క తీసిన బంగాళదుంప  II) గ్లైకోజన్‌
C) నూలు పోగు              III) స్టార్చ్‌
D) బొద్దింక ఎక్సోస్కెలిటిన్‌    IV) సెల్యులోజ్‌
జ: A-II B-I C-IV D-III


52. అల్ప అణుభారం కలిగిన జీవాణువుల నిర్మాణాన్ని తెలపండి.    
జ: నత్రజని క్షారాలు  


53. సైటోక్రినసిస్‌ అంటే? 
జ: 
కణద్రవ్య విభజన 


54. డీఎన్‌ఏ (జన్యు పదార్థం) గల కణాంగాలు? 
1) కేంద్రకం          2) హరితరేణువు    3) మైటోకాండ్రియా     4) పైవన్నీ
జ: 4) పైవన్నీ


55. ఒక పరాగకోశంలో 1200 పరాగరేణువులు ఉంటే వాటిని ఎన్ని సూక్ష్మ సిద్ధబీజ మాతృకలు ఉత్పత్తి చేస్తాయి?  
జ: 300

Posted Date : 12-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌