• facebook
  • whatsapp
  • telegram

మానవ శరీర నిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం - III

1. స్థూలభక్షక కణాలు ఏ రకమైన కదలికలను వ్యక్తం చేస్తాయి?
జ. అమీబాయిడ్

 

2. రేఖిత కండర తంతువులో కాల్షియం అయాన్లను నిల్వ చేసుకునే కణాంగిక -
జ. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం

 

3. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a. కండర సూక్ష్మతంతువులోని సన్నటి తంతువులు ఏక్టిన్, ట్రోపోనిన్, మయోసిన్‌తో ఏర్పడతాయి.
b. కండర సూక్ష్మతంతువులోని మందమైన తంతువులు ట్రోపోమయోసిన్‌తో ఏర్పడతాయి.
c. కండర సూక్ష్మతంతువులోని రెండు డోబీ గీతల మధ్య భాగాన్ని కండర ఖండితం అంటారు.
d. A పట్టీలోని సన్నని తంతువులు లేని మధ్య భాగాన్ని H మండలం అంటారు.
పై వాటిలో సరైన అంశాలు
జ. c, d

 

4. కండర సూక్ష్మతంతువులోని నియంత్రణ ప్రొటీన్లు-
జ. ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్

 

5. కండర గ్లానికి కారణం-
జ. లాక్టిక్ ఆమ్లం ఏర్పడటం

 

6. కండరంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం కాలేయాన్ని చేరి పైరూవిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది గ్లూకోనియోజెనిసిస్ ద్వారా గ్లూకోజ్‌గా మారి, తిరిగి కండరానికి సరఫరా అయి, సంకోచంలో పాల్గొంటుంది. కండరానికి, కాలేయానికి మధ్య జరిగే ఈ చక్రీయ చర్యలను ఏ విధంగా పేర్కొంటారు?
జ. కోరీ వలయం

 

7. కండరంలో ఆక్సిజన్‌ను నిల్వ చేసే ఎర్రటి వర్ణకం-
జ. మయోగ్లోబిన్

 

8. చైతన్యవంతంగా సంకోచించే కండరంలో ఈ పదార్థం పరిమాణం క్రమంగా అధికమవుతుంది.
జ. లాక్టిక్ ఆమ్లం

 

9. కండర సూక్ష్మతంతువులోని సన్నటి తంతువులకు క్రాస్‌బ్రిడ్జ్‌లు అతకడం, విడివడటం; ముందుకు వెనకకు కదలడం లాంటి క్రియలన్నింటినీ కలిపి ఈ విధంగా పేర్కొంటారు-
జ. రాచెట్ యంత్రాంగం

 

10. కండర సూక్ష్మతంతువులోని H - మండలంలో ఉండేది-
జ. మయోసిన్

 

11. వ్యాఖ్య (A): రేఖిత కండరాలు అలసట చెందుతాయి.
కారణం (R): కండరంలో లాక్టిక్ ఆమ్లం అధికం కావడంవల్ల అలసట కలుగుతుంది.
జ. A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

12. వ్యాఖ్య(A): కండరం సంకోచించేటప్పుడు క్రియాటైన్ ఫాస్ఫేట్ అయిపోయినప్పుడు మూడో శక్తిజనకం వినియోగంలోకి వస్తుంది.
కారణం(R): క్రియాటైన్ ఫాస్ఫేట్ అయిపోయినప్పుడు గ్లూకోజ్ ఆక్సీకరణం చెందడం ప్రారంభమవుతుంది.
జ. A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

13. కింది అంశాలను పరిశీలించండి.

పై వాటిలో సరికానిది

జ. b - c
 

14. కండర ఖండితంలో ఒక అంచు నుంచి మధ్య భాగానికి కింద పేర్కొన్న భాగాలను సరైన వరుసక్రమంలో అమర్చండి.
a. M - రేఖ    b. H - మండలం    c. Z - రేఖ    d. I - పట్టీ
జ. c - d - b - a

 

15. వ్యాఖ్య (A): స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతానికి రాచెట్ యంత్రాంగం మూలాధారం.
కారణం (R): క్రాస్‌బ్రిడ్జ్‌లు ముందుకు, వెనుకకు కదులుతూ ఈ యంత్రాంగాన్ని ఏర్పరుస్తాయి.
జ. A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

16. మానవ కపాలంలోని ఎముకల సంఖ్య
జ. 8

 

17. మానవుడి కపాలంలోని కీలక ఎముక
జ. స్ఫీనకీయం

 

18. మానవుడి ముఖ భాగంలో చుట్ట (Scroll) లాంటి ఎముకలు
జ. శంకువులు

 

19. కిందివాటిని జతపరచండి.

A. కూటకం I. నాసికామార్గపు ఎముకలు
B. దాగలి II. కాంఠిక అథోహనువు
C. కర్ణాంతరాస్థి III. ప్రలంబం
D. శంకువులు IV. ఆర్టిక్యులార్

      A    B    C   D
జ. IV    III    II    I

 

20. మానవుడి గ్రీవ భాగంలోని వెన్నుపూసల సంఖ్య -
జ. 7

 

21. మానుబ్రియం, దేహం, జిఫాయిడ్ కీలితం దీని యొక్క భాగాలు -
జ. ఉరోస్థి

 

22. మానవుడి పర్శుకలకు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి.
a. మానవుడి పర్శుకల బోను 12 జతల పర్శుకలతో ఏర్పడుతుంది.
b. ఆఖరి రెండు జతల పర్శుకలను ఫ్లవక పర్శుకలు అంటారు.
c. మొదటి ఏడు జతల పర్శుకలను మిథ్యా పర్శుకలు అంటారు.
d. అయిదు జతల పర్శుకలు నిజ పర్శుకలు.
పైవాటిలో సరికాని అంశాలను గుర్తించండి.
జ. c - d

 

23. మానవ దేహంలోని అతి పొడవైన ఎముక-
జ. తుంటి ఎముక

 

24. కిందివాటిని జతపరచండి.

A. అనుబంధాస్థి పంజరంలోని ఎముకలు I. 22
B. పుర్రెలోని ఎముకలు II. 206
C. మానవ అస్థిపంజరం III. 92
D. అక్షాస్థి పంజరం IV. 80
  V. 120

     A    B   C    D
జ. V    I    II    IV

 

25. ఏక్రోమిన్ కీలితం దీనిలోని భాగం-
జ. అంసఫలకం

 

26. వ్యాఖ్య (A) : భుజం వద్ద ఉండే కీలు ఒకటి కంటే ఎక్కువ తలాల్లో స్వేచ్ఛాచలనాన్ని అనుమతిస్తుంది.
కారణం (R) : భుజం వద్ద కీలు బంతిగిన్నె కీలు.
జ. A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

27. కిందివాటిని జతపరచండి.

A. బంతిగిన్నె కీలు I. మణిబంధం కీలు
B. మడతబందు కీలు II. శీర్షధరం, అక్షం మధ్య కీలు
C. బొంగరపు కీలు III. మోకాలు కీలు
D. జారుడు కీలు IV. తుంటి కీలు
  V. బొటన వేలు కీలు

     A    B    C   D
జ. IV   III    II    I

 

28. కండరాల్లో వడివడిగా, అనియంత్రితంగా, నిరంతరాయంగా జరిగే సంకోచాలు-
జ. ధనుర్వాతం

 

29. మానవుడిలో తొడ భాగానికి, ముంగాలుకు మధ్య ఉన్న కీలు-
జ. మడతబందు కీలు

 

30. మానవుడి పూర్వాంగంలోని ఎముకలను కింద పేర్కొన్నారు.
a. కరభాస్థికలు   b. భుజాస్థి    c. మణిబంధాస్థికలు   d. రత్ని, అరత్ని   e. అంగుళ్యాస్థులు
పైవాటిని భుజం నుంచి హస్తం వైపునకు వరస క్రమంలో అమర్చండి.
జ. b - d - c - a - e

 

31. కిందివాటిలో సరిగా జతపరచనిది.
1) మయోసిన్          -   సంకోచించే ప్రొటీన్
2) టెండాన్              -   సంయోజక కణజాలం
3) ఎరుపు కండరం    -   మయోగ్లోబిన్
4) ట్రోపోనిన్            -   తంతుయుత ప్రొటీన్
జ. 4 (ట్రోపోనిన్  -    తంతుయుత ప్రొటీన్)

 

32. సంకోచం చెందేటప్పుడు కండరంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లం ఈ భాగంలో గ్లూకోజ్‌గా మారుతుంది.
జ. కాలేయం

 

33. కిందివాటిని జతపరచండి.

A. టెండాన్ I. లాక్టిక్ ఆమ్లం
B. లిగమెంట్ II. పుచ్ఛ కశేరుకాలు
C. గ్లాని III. టోనస్
D. పుచ్ఛఅనుత్రికం IV. కండరం - ఎముక
  V. ఎముక   -  ఎముక

       A    B   C   D
జ.  IV    V   I    II

 

34. జ్ఞాపక కేంద్రంగా పనిచేసి, జ్ఞాపకాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చే మెదడు భాగం
జ. హిప్పోక్యాంపస్

 

35. రెండు మస్తిష్కార్ధ గోళాలను సమన్వయం చేస్తూ మస్తిష్కంలో ఉన్న అడ్డు నాడీ పట్టీ
జ. కార్పస్ కెల్లోజం

 

36. కింది అంశాలు అధ్యయనం చేయండి.
a. మానవ మస్తిష్కంలోని ఉపరితలపు బూడిద వర్ణ పదార్థాన్ని వల్కలం అంటారు.
b. మానవ మస్తిష్క వల్కలం అనేక ముడతలు పడి ఉంటుంది. వీటిని గైరై అంటారు.
c. గైరైల మధ్య ఉండే గాడులను సల్సై అంటారు.
d. మస్తిష్కం వినడానికి, చూడటానికి ముఖ్య కేంద్రం
పైవాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి.
జ. d

 

37. పూర్వ రక్త ప్లక్షం ఇక్కడ ఏర్పడుతుంది.
జ. ఊర్ధ్వ పర్యంకం

 

38. కిందివాటిని జతపరచండి.

A. పర్యంకం I. పునఃప్రసార కేంద్రం
B. కార్పోరా క్వాడ్రిజెమినా II. జ్ఞాన, చాలక ప్రచోదనాల, సమన్వయం
C. మస్తిష్కం III. సమతాస్థితి
D. పాన్స్ వరోలీ IV. జ్ఞాపక కేంద్రం
  V. దృష్టి, శ్రవణం

      A    B    C    D
జ.  II    V    IV    I

 

39. ఆర్బార్ విటే అంటే-
జ. చెట్టు శాఖల్లా విస్తరించిన అనుమస్తిష్కపు తెలుపు పదార్థం

 

40. న్యూమోటాక్సిక్ కేంద్రం దీనిలో ఉంటుంది-
జ. పాన్స్ వరోలీ

 

41. కింది అంశాలు చదవండి.
a. మధ్య మెదడు, పాన్స్ వరోలీ, మజ్జాముఖాలను కలిపి మెదడు మూలం అంటారు
b. పార్శ్వకుహరాలు ఐటర్ ద్వారా డయాసీల్‌కు కలిపి ఉంటాయి
c. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడం, దగ్గు మొదలైనవాటి నియంత్రణా కేంద్రం మజ్జాముఖంలో ఉంటుంది.
d. అనుమస్తిష్కాన్ని దేహపు గైరోస్కోప్ అని కూడా అంటారు
పైవాటిలో సరైన అంశాలను గుర్తించండి.
జ. a, c, d

 

42. కిందివాటిని జతపరచండి.

A. మన్రో రంధ్రం I. పుర్రె
B. మహావివరం II. మొసలి
C. ఫొరామెన్ ఒవాలిస్ III. మెదడు
D. ఫొరామెన్ పెనీజా IV. కాలేయం
  V. గుండె

     A   B   C  D
జ. III   I    V   II

 

43. వెన్నుపాము చివరి భాగం శంకువు ఆకారంలో సన్నబడిన భాగం
జ. కోనస్ మెడుల్లారిస్

 

44. వెన్నుపాము లోపల ఉండే గొట్టం లాంటి కుహరం-
జ. కేంద్రీయ నాళం

 

45. మానవుడిలోని జ్ఞాన కపాలనాడులు-
జ. I, II, VIII

 

46. వెన్నునాడుల స్వభావం-
జ. మిశ్రమ

 

47. వ్యాఖ్య (A): సహానుభూత విభాగాన్ని ఉరస్కటి బాహ్యప్రవాసం అంటారు.
కారణం (R): పూర్వనాడీసంధి కణ దేహాలు వెన్నుపాము ఉరః కటిభాగాల్లో ఉండటంవల్ల.
జ. A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

48. నాడీకణంలా పూర్ణ లేదా శూన్య అనుక్రియను ప్రదర్శించేది-
జ. కండరం

 

49. సోడియం, పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానళ్లలో వివిధ రకాల అనుక్రియలకు సంబంధించిన కింది అంశాలను అధ్యయనం చేయండి.


పైవాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.
జ. b

 

50. ప్రతీకార చర్యాచాపంలో నాడీప్రచోదనం పయనించే భాగాలు కింద పేర్కొన్నారు.
a. అభివాహి నాడీకణం         b. ప్రభావిత అంగం         c. ప్రేరణ             d. ప్రతిస్పందన
e. చాలక నాడీకణం              f. గ్రాహకం                     g. అంతర నాడీకణం

వీటిని వరస క్రమంలో అమర్చండి.
జ. c- f - a - g - e - b - d

 

51. కిందివాటిని జతపరచండి.

A. బాహ్యగ్రాహకాలు I. రక్తనాళాల గోడలు
B. అంతరగ్రాహకాలు II. లోపలి చెవి
C. ప్రొప్రియోసెప్టార్‌లు III. ఉష్ణోగ్రత
D. ఉష్ణగ్రాహకాలు IV. దృష్టి

      A   B   C   D
జ.  IV   I    II   III

 

52. మానవుడి కన్నీటిలో ఉండే ఎంజైమ్-
జ. లైసోజైమ్

 

53. మానవుడిలో అల్జిమర్ వ్యాధికి కారణం దీని లోపమే -
జ. ఎసిటైల్ కోలిన్

 

54. కిందివాటిని జతపరచండి.

A. ఫోవియా I. కాంతి ప్రవేశించడానికి మార్గం
B. తారక   II. ట్రాన్స్ డ్యూసెస్ ఆర్ జీ బీ లైట్
C. కనుపాప   III. కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని ప్రసారం చేయడం.
D. కటకం IV. లోనికి ప్రవేశించే కాంతి పరిమాణ నియంత్రణ
E. దృష్టి నాడీ   V. నేత్ర పటలంపై కాంతిని ఫోకస్ చేస్తుంది.

      A   B  C  D  E
జ.  II   IV   I  V   III

 

55. కిందివాటిని జతపరచండి.

A. త్రిక కశేరునాడులు I. ఒక జత
B. ఉరః కశేరునాడులు II. 8 జతలు
C. అనుత్రిక కశేరునాడులు III. 7 జతలు
D. గ్రీవా కశేరునాడులు IV. 12 జతలు
  V. 5 జతలు

    A     B  C   D
జ. V   IV   I   II

 

56. వ్యాఖ్య (A): Na+, K+, ప్రొటీన్ల గాఢతలోని అసమతుల్యత వల్ల విరామత్వచ శక్మం ఉత్పత్తి అవుతుంది.
కారణం (R): Na+, K+ల అసమతుల్యతను నిలపడానికి నాడీకణాలు విద్యుత్ శక్తిని వినియోగిస్తాయి.
జ. A నిజం కానీ, R నిజం కాదు.

 

57. త్రిధారానాడి?
జ. V

 

58. మానవుడిలో పార్కిన్‌సన్ వ్యాధి దీనిలోపం వల్ల వస్తుంది.
జ. డోపమైన్

 

59. మానవుడిలో చెవికి అనుబంధంగా ఉన్న గ్రంథులు
జ. సెరూమినస్ గ్రంథులు

 

60. కార్టి అనేది-
జ. వినికిడి పరికరం

 

అస్థిపంజర వ్యవస్థ

1. కపాలం పీఠభాగంలోని పూర్వాంతపు ఎముకలు
జ: సేవకం  


2. కిందివాటిని జతపరచండి. 
A) కపాలంలో                   I) నేత్రగుళిక పైభాగం కీలకమైన ఎముక   
B) అనుకపాలాస్థులు       II)  కిరీట సూదనం, లాంబ్డాయిడ్‌ సూదనం
C) కుడ్యాస్థులు               III) మహావివరం
D) లాలాటికాస్థి               IV) స్పీనకీయం
                                       V) సేవకం 

జ: A-IV B-III C-II D-I


3. పై దవడ, కింది దవడలను కలిపే ఎముక?
జ: కాంఠిక ఎముక

4. కిందివాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి.  
జ: హనువు - U ఆకారపు ఎముక

5. ప్రౌఢ మానవుడిలో అవశేష ఎముక
జ: అనుత్రిక - సంయుక్త


6. రెండు అనుకపాలాస్థుల మధ్య గల పెద్ద రంధ్రాన్ని ఏమని పిలుస్తారు?
జ: మహావివరం


7. ప్రౌఢ మానవుడి అస్థిపంజర వ్యవస్థలో మొత్తం ఎముకల సంఖ్య?
జ: 206


8. కిందివాటిని జతపరచండి. 

  జాబితా - I          జాబితా - II
  I) కూటకం          A) అక్ష కశేరుకం
II) దాగలి              B) కాంఠిక అథోఃహనువు
III)  కర్ణాంతరాస్థి   C) శీర్షధరం
IV) ఒడంటాయిడ్‌ కీలితం    D) ప్రలంబం
V) ఒడంటాయిడ్‌ కుల్య      E) ఆర్టిక్యులార్‌
   I  II  III  IV  V         I  II  III  IV  V
1)  A D  B   A  C     2) E D  A   B   D
3)  E A  D   B  C    4) D E  B   A   C

జ: 1)  A D  B   A  C 


9. పుర్రె వద్ద ప్రారంభించి వెన్నెముకలో గల గ్రీవ, ఉర, కటి, త్రిక - సంయుక్త, అనుత్రిక - సంయుక్త కశేరుకాల సంఖ్య వరుసగా
జ: 7-12-5-1-1


10. ముఖ ఎముకలు, వెన్నెముకలో గల త్రిభుజాకారపు ఎముకలు 
జ:  సీరిక, త్రిక - సంయుక్త, అనుత్రిక సంయుక్త


11. కిందివాటిని అధ్యయనం చేయండి.

A) కశేరు - ఉరోస్థి పర్షుకలన్నీ నిజ పర్షుకలు, అన్ని నిజ పర్షుకలు కశేరు - ఉరోస్థి పర్షుకలు.
B) కశేరు - మృదులాస్థి పర్షుకలన్నీ మిథ్యా పర్షుకలు కానీ మిథ్యా పర్షుకలన్నీ కశేరు - మృదులాస్థి  పర్షుకలు కావు.
C) ప్లవక పర్షుకలన్నీ మిథ్యా పర్షుకలు కానీ మిథ్యా పర్షుకలన్నీ ప్లవక పర్షుకలు కావు.
D) మొదటి ఏడు జతల పర్షుకలు నిజ పర్షుకలు.
    పై వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 
జ:  A, B , C , D


12. మానవుడి పూర్వాంగపు ఎముకల్లోని మణిబంధకాస్థులు, చరమాంగపు ఎముకల్లోని చీలమండ ఎముకలు వరుసగా ఎన్ని?
జ: 8, 7 


13. సెసమాయిడ్‌ ఎముక అని దేన్ని పిలుస్తారు?
జ: మోకాలి చిప్ప - స్నాయుబంధనం


14. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి. 

A) డయాఫైసిస్‌ అనేది విస్తరించిన అంత్యాల మధ్య ఉండే కాడ
B) మెటాఫైసిస్‌ అనేది విస్తరించిన అంత్యాలు
C) ఎపిఫైసిస్‌ అనేది మెటాఫైసిస్‌కు, డయాఫైసిస్‌కు మధ్య ఉండే ప్రాంతం
D) మెటాఫైసిస్‌లో ఎపిఫైసియల్‌ ఫలకం ఉంటుంది
    పై వాటిలో పొడవైన ఎముకకు సంబంధించి సరైంది?
జ: A, D


15. కిందివాటిలో సరైన జత. 

ఎముక(లు) రకం మూలం
A) గమనాంగాల ఎముకలు ఎండోకాండ్రల్ ఎముకలు  గ్రిసిల్
B)  చాలా కపాల  ఎముకలు పునఃస్థాపక ఎముకలు మధ్య భ్రూణ కణజాలం
C) మోకాలి చిప్ప సెసమాయిడ్‌ ఎముక బంధనం
D)  ఆస్‌కార్డిస్ అంతరాంగ ఎముక నెమరువేసే జంతువుల్లో  మృదుకణజాలం

జ: A, D


16. నిశ్చితం(A): అక్ష కశేరుకం, శీర్షధరం మధ్య బొంగరపు కీలు ఉంటుంది. 
కారణం(R):  అక్ష కశేరుకం ఒడంటాయిడ్‌ కీలితంపై శీర్షధరం యొక్క ఒడంటాయిడ్‌ కుల్య ఇమిడి ఉంటుంది.
జ: A, R రెండూ సరైనవి, A కు R సరైన వివరణ.


17. ప్లవక పర్షుకలు, కశేరుకానికి మధ్య ఉండే పై భాగాన్ని, కింది భాగాన్ని ఏమని పిలుస్తారు?
జ: ట్రాబెక్యులార్‌ పక్షం, కాపిట్యులార్‌ పక్షం


18. కిందివాటిని పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి. 

A) సైనోవియల్‌ కీలును ఆవరించి రెండు పొరల్లో ఏర్పడిన సైనోవియల్‌ గుళిక ఉంటుంది.
B) సైనోవియల్‌ గుళిక వెలుపలి పొర సాంద్ర క్రమరహిత తంతుయుత సంయోజక కణజాలంతో ఏర్పడి ఉంటుంది. 
C) సైనోవియల్‌ గుళిక లోపలి పొర ఏరియోలార్‌ కణజాలంతో ఏర్పడుతుంది. 
D) ఏరియోలార్‌ కణజాలం సైనోవియల్‌ ద్రవాన్ని స్రవిస్తుంది.
E) సైనోవియల్‌ ద్రవంలో హయలురోనిక్‌ ఆమ్లం, భక్షక కణాలు ఉండవు.
F) సైనోవియల్‌ కీళ్లు స్వేచ్ఛా కదలికలను చూపే డై ఆర్థ్రోస్‌ కీళ్లు. 
జ: A, B C, D, F


19. కిందివాటిలో సరికానిది. 
జ: సూదన రేఖలు వెన్నెముకలో ఉంటాయి.


20. రెండు పొడవైన ఎముకల సంధి తలాల్లో ఉండే సంధి తల మృదులాస్థికి గల మరొక పేరు, అది ఏ వర్ణంలో ఉంటుందో తెలపండి. 
జ: కచాభ మృదులాస్థి - నీలి, తెలుపు వర్ణం   

 

21. ‘అవును ఎముక’ వేటి మధ్య ఉంటుంది? ఇది ఏ కీలుతో ఏర్పడుతుంది?
జ: శీర్షధరం - అనుకపాలాస్థి, కాండైలాయిడ్‌ కీలు

 

22. అసంపూర్తి బంతిగిన్నె కీలు (శాడిల్‌ కీలు) ఏ క్షీరదాల్లో కనిపిస్తుంది?
జ:  మానవుడు, కోతులు, చింపాంజీ


23. మరణానంతరం కండరాలు బిగుసుకుపోవడాన్ని ఏమంటారు?
జ: రిగర్‌మార్టిస్‌


24. ఎముకల మధ్య రాపిడిని తగ్గించే, కందెనగా పనిచేసే ద్రవం?
జ:  సైనోవియల్‌ ద్రవం 


25. జీఫాయిడ్‌ కీలితం
జ: మృదులాస్థి నిర్మితం 

 

26. అంసఫలకం పెద్ద త్రిభుజాకార బల్లపరుపు ఎముక. ఇది ఉర:పుష్ఠభాగంలో ఏయే పర్షుకల మధ్య అమరి ఉంటుంది?
జ: 2వ, 7వ పర్షుకలు

Posted Date : 12-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌