• facebook
  • whatsapp
  • telegram

యూనిట్ - II జంతు దేహ నిర్మాణం

1. కిందివాటిని పరిశీలించండి.

     a) కణజాలాలు  b) వ్యవస్థలు  c) అంగాలు  d) కణాలు  e) జీవి

    పైవాటిని ఆరోహి క్రమంలో అమర్చండి.

జ: d-a-c-b-e
 

2. నాడీ కణాలు, జ్ఞాన కణాలు వీటిలో ఉండవు-

జ: పేరాజోవన్లు
 

3. ప్రౌఢ జీవులైన గాస్ట్రోపాడ్‌లు దీన్ని వ్యక్తం చేస్తాయి-

జ: అసౌష్ఠవం
 

4. పంచ వికిరణ వలయ సౌష్ఠవాన్ని ఈ జీవులు ప్రదర్శిస్తాయి-

జ: ఇఖైనోడర్మ్‌లు
 

5. సీ అనిమోన్లు, ఏనిడేరియన్ల సౌష్ఠవం-

జ: ద్వివలయ
 

6. మధ్యస్త్వచ పొరలతో ఆవరించి ఉండే దేహకుహరం-

జ: నిజసీలోం

 

7. కింది అంశాలను అధ్యయనం చేయండి

    a) పిండం సంయుక్త బీజకుహరిక నెమటోడ్ల దేహకుహరంగా నిలిచి ఉంటుంది.

    b) కుడ్య (దైహిక) ఆంత్రవేష్ణానికి, అంతరాంగ (స్ల్పాంక్‌నిక్) ఆంత్రవేష్ణానికి మధ్య ఉండే కుహరాన్ని మిథ్యాసీలోం అంటారు.

    c) విభక్త శరీరకుహరం, ఆంత్ర కుహరికా శరీర కుహరం నిజశరీర కుహరాలే.

    d) బల్లపరుపు పురుగులు ఏసీలోమేట్లు పై అంశాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

జ: b (కుడ్య (దైహిక) ఆంత్రవేష్ణానికి, అంతరాంగ (స్ల్పాంక్‌నిక్) ఆంత్రవేష్ణానికి మధ్య ఉండే కుహరాన్ని మిథ్యాసీలోం అంటారు.)
 

8. డ్యుటిరోస్టోంల సీలోం ఈ రకం-

జ: ఆంత్రకుహరికా సీలోం
 

9. ప్రాథమిక ప్రేరేపణ వల్ల దీనిలో ప్రాంతీయ భేదనం జరుగుతుంది

జ: ఆహార నాళం

 

10. ఖాళీని పూరించండి.

జ: ఇఖైనోడర్మేటా
 

11. కిందివాటిని జతపరచండి.
   

      A   B   C   D
జ: IV   III   II    I

 

12. వాఖ్య (A): మూత్రాశయ కుడ్యం స్తరిత (సంయుక్త) ఉపకళతో ఏర్పడుతుంది. దీన్ని పరివర్తన ఉపకళ అంటారు.
కారణం (R): మూత్రాశయంలోని మూత్రం పరిమాణాన్ని బట్టి దీని గోడ మందంగా లేదా పలుచగా మారుతూ ఉంటుంది.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

13. చర్మస్రావ గ్రంథులు ఈ రకానికి చెందుతాయి-
జ: హోలోక్రైన్

 

14. సెరటోనిన్ స్రవించే సంయోజక కణజాల కణాలు-
జ: మాస్ట్ కణాలు

 

15. కిందిఅంశాలను అధ్యయనం చేయండి.
    a) మాస్ట్ కణాలు రక్తనాళ విస్ఫారకాలను స్రవిస్తాయి.    
    b) గోధుమరంగు ఎడిపోజ్ కణజాలం శిశువుల్లో ఉంటుంది.
    c) ఎడిపోజ్ కణజాలం ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది.
    d) బంధకం (ligament) ఒక ఎముకను మరొక దాంతో సంధిస్తుంది.
   పైవాటిలో సరైన అంశాలను గుర్తించండి.
జ: a, b, c, d

 

16. కిందివాటిని జతపరచండి.

     A  B   C   D
జ: I   IV   II   V

 

17. ఎముక మాత్రికలోని లిక్విణులు వీటితో జాలకంలా కలిసి ఉంటాయి.
జ: సూక్ష్మకుల్యలు

 

18. కిందివాటిని జతపరచండి.

      A   B   C  D
జ: IV   III   II   I

 

19. జననానంతరం రక్తకణాలు ఈ భాగంలో ఉత్పత్తి అవుతాయి-
జ: ఎరుపు మజ్జ

 

20. ఎర్రరక్తకణాలు పరిణితి చెందడానికి ఈ విటమిన్‌లు అవసరం-
జ: ఫోలిక్ ఆమ్లం, B12

 

21. కింది అంశాలను అధ్యయనం చేయండి.
    a) RBC సంఖ్య తగ్గడాన్ని పాలీసైథీమియా అంటారు.
    b) రక్తంలో ఆక్సిజన్ తగ్గుదల మూత్రపిండాలను ప్రేరేపించి ఎరిత్రోపాయిటిన్‌ను స్రవింపజేస్తుంది.
    c) WBC సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ల్యూకోసైటోపేనియా అంటారు.
    d) కణికాభ కణాలను బహురూప కేంద్రక తెల్లరక్తకణాలు అంటారు.
   పైవాటిలో తప్పుగా ఉన్న అంశాలను గుర్తించండి.
జ: a-c

 

22. కిందివాటిని జతపరచండి.

     A   B   C  D
జ: V   III   II   I

 

23. అంతర సంధాయక చక్రికలు వీటిలో ఉంటాయి.
జ: హృదయ కండరాలు

 

24. రాణ్వియర్ కణుపులు ఈ కణజాలానికి అనుబంధంగా ఉంటాయి-
జ: నాడీ కణజాలం

 

25. నాడీ ఫేసికిల్‌ను ఆవరించి ఉండేది-
జ: పెరిన్యూరియం

 

26. నాడీకణజాలంలో మధ్యస్త్వచం నుంచి అభివృద్ధి చెందే కణాలు-
జ: మైక్రోగ్లియల్ కణాలు

 

27. చర్మం యొక్క కెరాటిన్ సహిత మృతత్వచం ఈ రకం-
జ: స్తరిత శల్కల ఉపకళ

 

28. ఊపిరితిత్తుల్లోని వాయుగోణులను ఆవరించి ఉండే ఉపకళ-
జ: శల్కల

 

29. గోళ్లు, గిట్టలు, కొమ్ములు దీనికి ఉదాహరణలు-
జ: బాహ్య స్త్వచ ఉత్పన్నాలు

 

30. ఎలర్జీ ప్రతిచర్యల్లో పాల్గొనే రక్తకణాలు-
జ: ఇసినోఫిల్స్‌

 

31. హిస్టమిన్, సెరటోనిన్, హెపారిన్ మొదలైన వాటిని స్రవించేవి-
జ: మాస్ట్ కణాలు

 

32. ఫైబ్రోబ్లాస్ట్‌లు, స్థూల భక్షక కణాలు, మాస్ట్‌కణాలు దీనిలో ఉంటాయి.
జ: ఏరియోలార్ కణజాలం

 

33. మానవ రక్తంలోని తెల్లరక్తకణాలను కింద ఇచ్చారు. వాటిసంఖ్య ఆధారంగా ఆరోహి క్రమంలో అమర్చండి.
      a) బేసోఫిల్స్‌     b) న్యూట్రోఫిల్స్‌    c) ఇసినోఫిల్స్‌    d) లింఫోసైట్స్    e) మోనోసైట్స్
జ: a-c-e-d-b

 

34. కిందివాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి.
    1) మోనోసైట్     2) లింఫోసైట్     3) న్యూట్రోఫిల్     4) ఎరిత్రోసైట్
జ: 4 (ఎరిత్రోసైట్)

 

35. సంయోజక కణజాలంలోని ఈ కణాలు ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి-
జ: ప్లాస్మాకణాలు

 

36. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.
    1) కండరం - ATP                    2) గుండె - లయారంభకం
    3) మోనోసైట్ - హీమోగ్లోబిన్       4) నాడీ - ఎసిటైల్‌ కోలిన్
జ: 3 (మోనోసైట్ - హీమోగ్లోబిన్)

 

37. వ్యాఖ్య (A): ఆహారనాళ కుడ్యంలో అనేక పొరల్లో కండరాలు ఉంటాయి.
కారణం (R): వివిధ జీర్ణగ్రంథులు స్రవించే ఎంజైమ్‌లను, ఆహారాన్ని బాగా కలియబెట్టడానికి ఈ కండరాలు తోడ్పడతాయి.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

38. హెమీకార్డేట్లలోని సీలోం రకం-
జ: ఆంత్ర కుహరికా సీలోం

 

39. వ్యాఖ్య (A): బల్లపరుపు పురుగుల్లో సీలోం లేకపోవడం వాటికి అసౌకర్యమే.
      కారణం (R): మృదుకణజాలం అంతరాంగ కదలికలను నియంత్రిస్తుంది.
జ: A, R నిజం. A కి R సరైన వివరణ.

 

40. కిందివాటిని పరిశీలించి, సరైన వరుస క్రమాలను గుర్తించండి.
    a) మిథ్యాసీలోం - సంయుక్త బీజకుహరిక - నెమటోడ్‌లు
    b) షైజోసీలోం - నిజసీలోం - అనెలిడ్‌లు
    c) ఎంటిరోసీలోం - నిజసీలోం - ఆర్థ్రోపొడా
    d) హీమోసీల్ - రక్తంతో నిండింది - ఆర్థ్రోపొడా
జ: a, b, d

 

41. ఆరోగ్యవంతుడైన మానవుడిలో ఎర్ర రక్తకణాల సంఖ్య, తెల్లరక్త కణ సంఖ్య నిష్పత్తి సుమారుగా-
జ: 500 : 1

 

42. ఈ ఉపకళలోని ఉపరితల పొరల్లో నిర్జలీకరణం చెందిన కణాలు ఉంటాయి-
జ: స్తరిత శల్కల కెరాటిన్ సహిత

 

43. అనియంత్రిత, అరేఖిత కండరాలు దీనిలో ఉంటాయి.
జ: జీర్ణాశయం

 

44. నాడీ కణజాలంలో విశ్రాంతి దశలో ఉండే స్థూల భక్షక కణాలు
జ: మైక్రోగ్లియల్ కణాలు

 

45. కిందివాటిని జతపరచండి.

A) ఏరియోలార్ సంయోజక కణజాలం I) బ్లబ్బర్
B) ఎడిపోజ్ కణజాలం II) స్నాయు బంధనం
C) జాలక సంయోజక కణజాలం III) మాస్ట్ కణాలు
D) సాంద్రీయ క్రమయుత సంయోజక కణజాలం IV) ఎముక మజ్జ
  V) కాండ్రోసైట్స్

      A  B   C   D
జ: III   I   IV   II

 

46. కింది వాటిని జతపరచండి.
 

A) పాలీసైథీమియా I) RBC సంఖ్య తగ్గడం
B) ఎరిత్రోసైటోపేనియా II) RBC సంఖ్య పెరగడం
C) ఇసినోఫీలియా III) ఇసినోఫిల్స్‌ సంఖ్య తగ్గడం
D) హిమాటోపాయిసిస్ IV) రక్తకణాల ఉత్పత్తి
  V) ఇసినోఫిల్స్‌ సంఖ్య పెరగడం

 

      A  B  C  D
జ:  II   I   V  IV

 

47. రక్తం-మెదడు అవరోధాన్ని ఏర్పరచే కణాలు-
జ: ఏస్ట్రోసైట్స్

 

48. వ్యాఖ్య (A) : స్వయంచోదిత నాడీ వ్యవస్థలోని నాడీతంతువులు మైలిన్ రహితం.
కారణం (R): పరిధీయ నాడీ వ్యవస్థలోని మైలిన్ రహిత నాడీ తంతువులకు అనుబంధంగా ష్వాన్ కణాలు ఉండవు.
జ: A నిజం, R నిజం కాదు.

 

49. కింది పట్టికను పరిశీలించండి.

   పైవాటిలో సరైన జతను గుర్తించండి.
జ: a-d

 

50. నేత్రపటలంలో ఉండేవి-
జ: ద్విధ్రువ నాడీకణాలు

 

51. కండర ఫేసికిల్‌ను ఆవరించి ఉండేది-
జ: పెరిమైసియం

Posted Date : 01-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌