• facebook
  • whatsapp
  • telegram

మానవ శరీర నిర్మాణశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం

శరీర ధర్మశాస్త్రం, జీర్ణ వ్యవస్థ, శ్వాసించడం - వాయువుల వినిమయం


1. మానవుడి జీవితకాలంలో రెండుసార్లు ఏర్పడే దంతాల సంఖ్య?
1) 28     2) 12     3) 20     4) 32


2. జఠర గ్రంథులు ఏ స్తరంలో ఉంటాయి?
1) సీరోసా       2) శ్లేష్మస్తరం   
3) అధఃశ్లేష్మస్తరం     4) కండర శ్లేష్మస్తరం


3. వ్యాఖ్య (A): రుచి గ్రాహకాలు నాలుకపై ఉంటాయి.
కారణం (R): రుచి మొగ్గలు రుచి గ్రాహకాలను కలిగి ఉంటాయి.
1) A, R సరైనవి, A, R కు సరైన వివరణ.
2) A, R సరైనవి, A, R కు సరైన వివరణ కాదు.
3) A సరైంది, కానీ R సరైంది కాదు.
4) A, R లు రెండు సరైనవికావు.


4. కిందివాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.
1) పల్ఫ్‌ కుహరం ఒడంటోబ్లాస్ట్‌ కణాలు డెంటిన్‌ సిమెంటమ్‌ పెరియోడాంటైల్‌ పొర

దవడ ఎముక
2) పల్ఫ్‌ కుహురం డెంటిన్‌ ఒడంటోబ్లాస్ట్‌ కణాలు సిమెంటమ్‌ దవడ ఎముక పెరియోడాంటైల్‌ పొర
3) పల్ఫ్‌ కుహరం ఒడంటోబ్లాస్ట్‌ కణాలు సిమెంటమ్‌ డెంటిన్‌ పెరియోడాంటైల్‌ పొర
దవడ ఎముక
4) ఒడంటోబ్లాస్ట్‌ కణాలు పల్ఫ్‌ కుహరం డెంటిన్‌ సిమెంటమ్‌ దవడ ఎముక పెరియోడాంటైల్‌ పొర


5. వ్యాఖ్య (A): డెంటిన్‌ మధ్యస్త్వచం యొక్క ఉత్పాదకం.
కారణం (R): ఒడంటోబ్లాస్ట్‌ కణాలు డెంటిన్‌ను స్రవిస్తాయి. 
1) A, R సరైనవి, A, R కు సరైన వివరణ కాదు.
2) A, R సరైనవి, A, R కు సరైన వివరణ.
3) A సరైంది, R సరైంది కాదు.
4) A, R రెండూ సరైనవి కావు


6. వ్యాఖ్య (A): శాకాహార జంతువుల్లో అంధనాళం పొడవుగా, విశాలంగా ఉంటుంది. 
కారణం (R): అంధనాళం శాకాహార జంతువుల్లో సెల్యులోజ్‌ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
1) A, R రెండూ సరైనవి కావు.
2) A సరైంది, R సరైంది కాదు.
3) A, R రెండూ సరైనవి, A, R కు సరైన వివరణ.
4) A, R రెండూ సరైనవి, A, R కు సరైన వివరణ కాదు.


7. కిందివాటిని పరిశీలించండి. 

నిర్మాణం సంబంధం విధి
i) స్టెన్సన్స్ నాళాలు పెరోటిడ్ గ్రంథి ఆస్యకుహరంలోకి లాలాజలాన్ని  చేరుస్తుంది
ii)  కోశీయ వాహిక పిత్తాశయం జఠరరసాన్ని ఉత్పత్తి చేస్తుంది
iii) లాంగర్‌హన్స్ పుటికలు క్లోమం హార్మోన్స్‌ ఉత్పత్తి
iv) రివినస్‌ నాళాలు నిమ్న  నేత్ర కోటరగ్రంథులు లాలాజలాన్ని చేరవేస్తాయి

పైవాటిలో సరైనవి 
1) i, iv        2) ii, iv        3) i, iii      4) i, ii


8. ఎనామిల్‌ ఏ కణాలతో స్రవించబడుతుంది?
1) డెంటోబ్లాస్ట్‌       2) ఆస్టియోబ్లాస్ట్‌  
3) ఒడంటోబ్లాస్ట్‌     4) ఎమిలోబ్లాస్ట్‌


9. కిందివాటిని జతపరచండి. 
A) టయలిన్‌       i) జఠరరసం
B) HCl             ii) క్లోమరసం
C) ట్రిప్సినోజన్‌     iii) లాలాజలం
D) ఎంటిరోకైనస్‌    iv) పైత్యరసం
                     v) ఆంత్రరసం

1) A-iii, B-i, C-ii, D-v    2) A-iii, B-i, C-iv, D-v
3) A-iii  B-i, C-v, D- iv   4) A-i, B-iii, C-ii, D-v


10. కిందివాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 
1) జీర్ణాశయం సెక్రటిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, క్లోమాన్ని ప్రేరేపిస్తుంది.
2) కొలిసిస్టోకైనిన్‌ పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసం విడుదలకు ఉపయోగపడుతుంది.
3) ఎంటిరోగాస్ట్రిన్‌ను కైమ్‌లో ఉన్న ప్రొటీన్లు ప్రేరేపిస్తాయి.
4) ఎంటిరోకైనిన్‌ చూషకాల కదలికలను ప్రేరేపించి శోషణను తగ్గిస్తుంది. 


11. కిందివాటిని జతపరచండి. 
       కణం                స్రావకం
A) శ్లేష్మ గ్రీవకణాలు      i) ప్రోరెనిన్‌
B) కుడ్యకణాలు          ii) HCl, కాసిల్‌ ఇంట్రెన్సిక్‌ కారకం
C) G - కణాలు          iii) శ్లేష్మం
D)  పెప్టిక్‌ కణాలు       iv) గాస్ట్రిన్‌
1) A-iii, B-ii, C-i, D-iv      2) A-iii, B-i, C-ii, D-iv
3) A-iii,  B-ii, C-iv, D-i      4) A-i, B-ii, C-iii, D-iv


12. జీర్ణాశయ కుడ్యంలోని స్తరాలను వెలుపలి నుంచి లోపలికి వరుసక్రమంలో అమర్చండి. 
A) వలయ కండరాలు       B) సీరోసా   
C) ఏటవాలు అవనమ కండరాలు
D) స్తంభాకార ఉపకళ      E) ఆయత కండరాలు   
F) అధఃశ్లేష్మస్తరం         G) శ్లేష్మస్తరం
1) B-E-A-C-F-G-D      2) B-E-A-C-G-F-D
3) B-E-A-C-D-F-G       4) B-E-C-A-G-D-F


13. మానవ శరీరంలోని విష పదార్థాలను విషరహితం చేసే గ్రంథి?
1) క్లోమం          2) ప్లీహం  
3) అస్థిమజ్జ      4) కాలేయం


14. కాలేయంలో కార్బోహైడ్రేటేతర ఆహారం నుంచి గ్లూకోజ్‌ ఉత్పత్తి కావడాన్ని ఏమంటారు?
1) లిపోజెనిసిస్‌       2) గ్లూకోజెనిసిస్‌   
3) గ్లూకోనియో జెనిసిస్‌     4) గ్లైకోజెనోలైసిస్‌


15. వ్యాపన పద్ధతిలో కణం నుంచి రక్తంలోకి ప్రసరణ చెందేవి?
1) ఫ్రక్టోజ్‌       2) అమైనో ఆమ్లాలు
3) పొట్టి గొలుసు కొవ్వు ఆమ్లాలు  
4) పొడుగు గొలుసు కొవ్వు ఆమ్లాలు


16. కిందివాటిని జతపరచండి. 
సంవరిణి                     ఉండే స్థానం
A) హార్థిక సంవరిణి        i) ఐక్య కాలేయ క్లోమనాళం - ఆంత్రమూలం
B) ఒడ్డి సంవరిణి          ii) గ్రసని - ఆహార వాహిక
C) ఫైలోరిక్‌ సంవరిణి     iii) జఠర నిర్గమ జీర్ణాశయం - ఆంత్రమూలం
D) ఊర్ధ్వ ఆహార          iv) ఆహార వాహిక - వాహిక సంవరిణి
                                    కార్డియాక్‌ జీర్ణాశయం
1) A-iv, B-i, C-iii, D-ii       2) A-iv, B-i, C-ii, D-iii
3) A-iv, B-ii, C-i, D-iii       4) A-iv, B-iii, C-i, D-ii


17. వ్యాఖ్య (A): కాలేయం యూరియాను ఉత్పత్తి చేస్తుంది.
కారణం (R): కాలేయంలో ఆర్నిథిన్‌ వలయం జరుగుతుంది.
1) A, R రెండూ సరైనవి. A, R కు సరైన వివరణ.
2) A, R రెండూ సరైనవి. A, R కు సరైన వివరణ కాదు.
3) A సరైంది, కానీ R సరైంది కాదు.
4) A, R రెండూ సరైనవి కావు. 


18.  ప్రౌఢ మానవుడి దంత సూచిక
1) 0021/0021      2) 2113/2113   
3) 2123/2123       4) 2023/1023


19.  బరువు తగ్గడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటం, పల్స్‌ రేటు తగ్గడం, రక్తపీడనం, మానసిక స్థితి సరిగ్గాలేక పెరుగుదల మందగించడం లాంటి లక్షణాలు దేని లోపం వల్ల కలుగుతాయి? 
1) మరాస్మస్‌       2) క్వాషియార్కర్‌  
3) ఒబేసిటి         4) మలేరియా


20.  జీర్ణాశయంలో pH 1.8 ఉన్నప్పుడు ప్రొటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్‌?
1) ట్రిప్సిన్‌       2) ఎరిప్సిన్‌   
3) పెప్సిన్‌        4) అమైలేజ్‌


21.  ప్రతి రోజూ క్రమం తప్పకుండా వెన్న, గుడ్డు, మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల వచ్చే రుగ్మత?
1) మూత్రం ద్వారా కీటోన్‌ దేహాలు విడుదలవడం 
2) మూత్రపిండాల్లో రాళ్లు
3) హైపర్‌కొలెస్ట్రోలెమియా  
4) హైపోకొలెస్ట్రోలెమియా


22. ఆంత్రరసం/సక్కస్‌ ఎంటెరికస్‌ దేని నుంచి ఉత్పత్తవుతుంది?
1) కూఫర్‌ కణాలు     2) లీబర్‌కున్‌ గుహికలు   
3) గాబ్లెట్‌ కణాలు     4) కుడ్యకణాలు


23.  కిందివాటిలో సరైంది.  
   నిర్మాణం                    వివరం
A) క్లోమం                     i)  J - ఆకారం
B) వర్మిఫామ్‌ అపెండిక్స్‌      ii) C - ఆకారం లేదా ఉండూకం   
C) ఆంత్రమూలం              iii) మిశ్రమ గ్రంథి
D) జీర్ణాశయం                iv) అవశేషాంగం 
1) A-iii, B-iv, C-i, D-ii        2) A-iii, B-i, C-iv, D-ii
3) A-iii, B-iv, C-ii, D-i         4) A-iii, B-ii, C-i, D-iv


24.  జ్ఞానదంతాలు అంటే? 
1) చివరి చర్వణకాలు       2) చివరి అగ్రచర్వణకాలు
3) మొదటి అగ్రచర్వణకాలు      4) మొదటి చర్వణకాలు


25.  కిందివాటిని జతపరచండి. 
A) పెప్సిన్‌                   i) కొవ్వులు
B) పైత్యరస లవణాలు        ii) కెసిన్‌
C) లైపేజ్‌                   iii) మెసిల్లే
D) టయలిన్‌                iv) పిండిపదార్థాలు
1) A-ii,  B-iii,  C-i,  D-iv       2) A-iii,  B-i, C-iv,  D-ii
3) A-ii,  B-iii,  C-iv, D-i         4) A-iii,  B-iv,  C-i,  D-ii


26.  కైలో మైక్రాన్‌లు...
1) అసంపూర్తిగా జీర్ణమైన కొవ్వులు  
2) అసంపూర్తిగా జీర్ణమైన పిండిపదార్థాలు  
3) ఫాస్ఫోలిపిడ్‌లతో పూత పూసిన కొవ్వు ఆమ్లాలు  
4) గ్లైకో ప్రొటీన్లతో పూత పూసిన కొవ్వు ఆమ్లాలు


27.  కిందివాటిలో సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి. 
1) అన్ని జంతువుల శ్వాసక్రియలో వీ2 అవసరం.
2) జంతువులన్నింటిలో వీ2 రక్తం ద్వారా రవాణా చెందుతుంది. 
3) జంతువులన్నీ వీ2 ను నీరు, మొప్పలు, ఊపిరితిత్తుల ద్వారా గ్రహిస్తాయి.
4) జంతువులన్నింటిలో కణ శ్వాసక్రియ మాధ్యమంగా పనిచేస్తుంది. 


28.  శ్వాస వ్యవస్థ దేని నుంచి ఉద్భవిస్తుంది?
1) ఎండోడర్మ్‌     2) మీసోడర్మ్‌ 
3) ఎక్టోడర్మ్‌        4) 1, 2


29.  ఊపిరితిత్తుల్లోని వాయుకోశ ఉపకళ
1) స్తంభాకార శైలికారహిత   
2) సరళ శల్కల శైలికారహిత
3) స్తంభాకార శైలికాసహిత    
4) సరళ శల్కల శైలికాసహిత


30.  కిందివాటిని జతపరచండి. 
శ్వాసాంగాలు               విభాగాలు
A) ఒక జత శ్వాస వృక్షాలు  i) పాలీఖీటా
B) పుస్తకాకారపు           ii) క్రస్టేషియా ఊపిరితిత్తులు
C) అవస్కర శ్వాసక్రియ    iii) అరాక్నిడా
D) మొప్పలు              iv) హాలోతురాయిడియా   
                            v) కీలోనియా

1) A-iv,  B-iii, C-v, D-i           2) A-iv, B-ii, C-iii, D-i
3) A-iv, B-iii, C-v, D-ii           4) A-iv, B-iii, C-ii, D-v


31. వ్యాఖ్య (A): చిన్నపిల్లలు, స్త్రీలలో మృదువైన గొంతు, పురుషుల్లో కీచుగొంతు ఉంటుంది.
 కారణం (R): స్వర తంత్రులు చిన్నపిల్లలు, స్త్రీలలో కంటే పురుషుల్లో పొడవుగా ఉంటాయి.
1) A సరైంది, కానీ R సరైంది కాదు.
2) A, R రెండూ సరైనవి కావు.
3) A, R సరైనవి, R అనేది A కు సరైన వివరణ.
4) A, R  సరైనవి, R అనేది A కు సరైన వివరణ కాదు.


32.  శ్వాసలయ జనక కేంద్రం అనేది
1) న్యూమోటాక్సిక్‌ కేంద్రం             2) మజ్జాముఖం
3) రసాయన సున్నిత ప్రాంతం      4) 1, 2


33. మానవుడిలో నిజమైన స్వరతంత్రులు
1) అరిటినాయిడ్‌ - థైరాయిడ్‌    
2) అరిటినాయిడ్‌ - సాంటోరిని
3) థైరాయిడ్‌ - కార్నిక్యులేటెడ్‌   
4) క్రికాయిడ్‌ - థైరాయిడ్‌


34.  కిందివాటిలో సరైన వరుసక్రమాన్ని గుర్తించండి.
1) నాసికా కక్ష్య స్వరపేటిక

గ్రసని వాయునాళం శ్వాసనాళం శ్వాస నాళికలు వాయుకోశం
2) నాసికా కక్ష్య గ్రసని వాయునాళం శ్వాస నాళికలు శ్వాసనాళం
స్వరపేటిక వాయుకోశం
3) నాసికా కక్ష్య స్వరపేటిక గ్రసని శ్వాసనాళం వాయుకోశం
4) నాసికా కక్ష్య గ్రసని స్వరపేటిక వాయునాళం  
శ్వాసనాళం  శ్వాస నాళికలు వాయుకోశం


సమాధానాలు: 1-3; 2-2; 3-1; 4-1; 5-2; 6-3; 7-3; 8-4; 9-1; 10-2; 11-3; 12-1; 13-4; 14-3; 15-3; 16-1; 17-1; 18-3; 19-2; 20-3; 21-3; 22-2; 23-3; 24-1; 25-1; 26-4; 27-4; 28-1; 29-2; 30-3; 31-3; 32-2; 33-1; 34-4.

Posted Date : 17-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌