• facebook
  • whatsapp
  • telegram

యూనిట్ - VI జన్యుశాస్త్రం

1. కింది అంశాలు అధ్యయనం చేయండి.

a. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు టి.హెచ్. మోర్గాన్ ప్రయోగాలు జరిపిన జీవి డ్రోసోఫిలా మెలనోగాస్టర్ 

b. క్రోమోజోమల్ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సట్టన్, బొవెరీ.

c. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ లో 3 జతల దైహిక క్రోమోజోమ్‌లు, ఒక జత అల్లోజోమ్‌లు ఉంటాయి.

d. అలీన సూత్రాన్ని ప్రతిపాదించింది టి.హెచ్. మోర్గాన్

       పై అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.

జ: a, b, c

2. జన్యుశాస్త్ర పితామహుడు-

జ: మెండల్

3. శుద్ధరకపు పొడవు రెక్కల డ్రోసోఫిలాను, శుద్ధ రకపు అవశేష రెక్కల డ్రోసోఫిలాతో సంకరణం చేస్తే, ఏర్పడే పొడవు (బహిర్గత) అవశేష రెక్కల (అంతర్గత) డ్రోసోఫిలాల నిష్పత్తి

జ: 1 : 0

4. మెండీలియన్ సంకరణాల్లో కొత్త రకం జీవులు ఏర్పడటానికి కారణం

జ: స్వతంత్ర వ్యూహనం
 

5. మెండీలియన్ ద్విసంకర సంకరణంలో పొడవు రెక్కల, బూడిద వర్ణ డ్రోసోఫిలా (LLGG) (బహిర్గత)ను, అవశేషపు రెక్కలు, ఎబోనీ వర్ణ డ్రోసోఫిలా (llgg) (అంతర్గత) సంకరణం చేసినప్పుడు F2 తరంలో పున్నెట్ చతురస్రంలోని ఎన్ని గడుల్లో LlGg జన్యురూపం ఉన్న జీవులు ఉంటాయి?

జ: 4
 

6. ఒక జన్యువు ఎక్కువ దృశ్య రూపాలను ప్రభావితం చేస్తే ఆ దృగ్విషయాన్ని ఈ విధంగా పేర్కొంటారు.

1) బహుజన్యు అనువంశికత         2) ప్లియోట్రోపీ     

3) బహుళకారక అనువంశికత       4) పరిమాణాత్మక అనువంశికత

జ: 2 (ప్లియోట్రోపీ)
 

7. ఫినైల్‌కీటోన్యూరియా దీనికి ఉదాహరణ-

జ: ప్లియోట్రోపీ
 

8. శుద్ధరకపు పొడవు రెక్కల (బహిర్గత) డ్రోసోఫిలాను, శుద్ధరకపు అవశేష రెక్కల (అంతర్గత) డ్రోసోఫిలాను సంకరణం చేస్తే, ఏర్పడే పొడవు రెక్కల, అవశేష రెక్కల డ్రోసోఫిలాల నిష్పత్తి

జ: 1 : 0

9. ఒక జన్యువుకు నాలుగు యుగ్మవికల్పాలు ఉంటే, అవి ఏర్పరిచే జన్యురూపాల సంఖ్య

జ: 10
 

10. తండ్రి రక్తం వర్గం 'O', తల్లి రక్తం వర్గం ' A' (సమయుగ్మజ) అయితే వారికి కలిగే సంతానం యొక్క రక్త వర్గాలు?

జ: A
 

11. B రక్తవర్గం ఉన్న వ్యక్తిలో-

జ: RBC పై B ప్రతిజనకం ఉంటుంది. ప్లాస్మాలో యాంటీ A ప్రతిదేహాలు ఉంటాయి.
 

12. ఒక రక్త నమూనాను యాంటీ B ప్రతిదేహాలు ఉన్న యాంటీ సీరంతో కలిపితే RBC గుచ్ఛీకరణ జరిగింది. అయితే రక్త నమూనా ఈ వర్గానికి చెందుతుంది.

జ: B
 

13. నిశ్చితం (A): SNPలు బాగా స్థిరంగా ఉంటాయి.

      కారణం (R): వీటికి, అతి తక్కువ ఉత్పరివర్తన రేటు ఉంటుంది.

జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.
 

14. జీవశాస్త్ర రీత్యా వీరిద్దరి మధ్య వివాహం వాంఛనీయం కాదు

జ: 
 

15. AB రక్తవర్గ వ్యక్తులను సార్వత్రిక రక్తగ్రహీతలుగా పేర్కొనడానికి కారణం-
జ: వీరి ప్లాస్మాలో యాంటీ A, యాంటీ B ప్రతిదేహాలు రెండూ ఉండవు.

16. A రక్తవర్గం ఉన్న వ్యక్తి రక్తాన్ని O, A, B, AB రక్త వర్గాలున్న వ్యక్తులను ఎక్కించినట్లయితే, గుచ్ఛీకరణకు ఉన్న అవకాశాలు
[గమనిక: ++ అధికం, + చాలా తక్కువ, - గుచ్ఛీకరణ జరగదు]
జ: O = ++, A = -, B = ++, AB = +

 

17. నిశ్చితం (A): O రక్తవర్గ వ్యక్తులను సార్వత్రిక రక్తదాతలు అంటారు.
      కారణం (R): వారి ప్లాస్మాలో యాంటీ A, యాంటీ B ప్రతిదేహాలు రెండూ ఉంటాయి.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ కాదు.

 

18. కిందివాటిని జతపరచండి.

A) A ప్రతిజనకం మాత్రమే i. Rh+
B) B ప్రతిజనకం మాత్రమే ii. AB
C) A, B ప్రతిజనకాలు రెండూ iii. B
D) D ప్రతిజనకం iv. A
E) ప్రతిజనకాలు ఉండవు v. O

     A     B     C    D    E
జ: IV    III     II     I     V

19. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a) బహుజన్యు అనువంశికతను క్వాలిటేటివ్ అనువంశికత అని కూడా అంటారు.
b) నీగ్రో (AABBCC), ఆల్బినో (aabbcc) లకు జన్మించే పిల్లలను ములట్టోలు అంటారు.
c) Rh ప్రతిజనకాన్ని D - ప్రతిజనకం అని కూడా అంటారు.
d) AB రక్తవర్గ వ్యక్తులు అసంపూర్ణ బహిర్గతత్వానికి ఉదాహరణ.
పైవాటిలో తప్పుగా ఉన్న అంశాలను గుర్తించండి.
జ: a - d

 

20. కిందివాటిని జతపరచండి.

A) XX - XO పద్ధతి  I) మానవుడు
B) ZZ - ZW పద్ధతి II) నల్లులు 
C) ZZ - ZO పద్ధతి III) పక్షులు
D) XX - XY పద్ధతి IV) సీతాకోకచిలుకలు

    A     B     C    D
జ: II    III     IV    I

21. AAA + XY జన్యురూపం ఉన్న డ్రోసోఫిలాలో లింగ సూచిక నిష్పత్తి-
జ: 0.33

 

22. ఒక డ్రోసోఫిలా జన్యురూపం AAA + XX అయితే, అది
జ: సమలింగ జీవి

 

23. ఒక కుటుంబంలో అయిదుగురు మగపిల్లలు ఉన్నారు. ఆరో సంతానం ఆడపిల్ల కావడానికి సంభావ్యత ఎంత?
జ: 50%

 

24. కింది పట్టికను పరిశీలించండి.

పైవాటిలో సరైన జతను గుర్తించండి.
జ: a - c

25. నిశ్చితం (A): తేనెటీగల్లో మగవాటికి తండ్రి ఉండడు కానీ తాత ఉంటాడు.
       కారణం (R): మగ తేనెటీగలు అండం నుంచి నేరుగా అనిషేక జననం ద్వారా అభివృద్ధి చెందుతాయి.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

26. కింది అంశాలను పరిశీలించండి.
a) అల్లోజోమ్‌ల్లోని జన్యువుల నియంత్రణలో ఉండే లక్షణాలను లింగసహలగ్న లక్షణాలు అంటారు.
b) మానవుడి Y - క్రోమోజోమ్ యొక్క అసమజాత భాగంలో ఉండే జన్యువులను హోలాండ్రిక్ జన్యువులు అంటారు.
c) డుచెన్నే కండర క్షీణత X - క్రోమోజోమ్‌లో ఉండే బహిర్గత జన్యువు వల్ల కలుగుతుంది.
d) డ్యుటిర్నోపియా అనేది ఎరుపు వర్ణ అంధత్వం.
పై అంశాల్లో సరైనవి
జ: a - b

 

27. హీమోఫిలిక్ తండ్రికి, మామూలు సమయుగ్మజ తల్లికి జన్మించిన ఒక స్త్రీ, ఒక మామూలు పురుషుడిని వివాహమాడగా వారికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కలిగితే, మగపిల్లల్లో హీమోఫీలియా రావడానికి సంభావ్యత -
జ: 50%

 

28. వర్ణ అంధత్వ ఆడపిల్లకు మామూలు దృష్టి ఉన్న సోదరుడు ఉంటే వారి తల్లిదండ్రులు
జ: వర్ణాంధత్వ తండ్రి, వాహక తల్లి

29. నిశ్చితం (A): Y - సహలగ్న లక్షణాలకు వాహకాలు ఉండవు.
      కారణం (R): Y - సహలగ్న జన్యువులు ఎల్లప్పుడూ అర్ధ యుగ్మజాలు.
జ: A, R నిజం. Aకి R సరైన వివరణ.

 

30. సూర్య అనే వ్యక్తి హైపర్‌ట్రైకోసిస్ కలిగి ఉన్నాడు. ఆ లక్షణం అతడి కొడుకు ద్వారా మనవడికి సంక్రమించే సంభావ్యత ఎంత?
జ: 100%

 

31. కిందివాటిని జతపరచండి.

A) థలసీమియా I) Y - సహలగ్న
B) హీమోఫీలియా II) దైహిక క్రోమోజోమ్
C) హైపర్‌ట్రైకోసిస్ III) X - సహలగ్న
D) సిస్టిక్ ఫైబ్రోసిస్ IV) అసాధారణ హిమోగ్లోబిన్

     A     B    C   D
జ: IV    III    I   II

32. కింది అంశాలను అధ్యయనం చేయండి.
a) క్లెన్‌ఫెల్టర్ సిండ్రోమ్‌లో క్రోమోజోమ్‌ల అమరిక AA + XXY.
b) టర్నర్ సిండ్రోమ్ వ్యక్తుల్లో బార్ దేహం ఉండదు.
c) డౌన్ సిండ్రోమ్ ట్రైసోమీకి ఉదాహరణ.
d) దైహిక క్రోమోజోమ్‌లోని అంతర్గత జన్యువు వల్ల కలిగే జన్యు అపసవ్య స్థితి ఆల్కాప్టోన్యూరియా
సరైన అంశం/ అంశాలను గుర్తించండి.
జ: a, b, c, d

 

33. కింది అంశాలను చదవండి.
a) ఒక జీవికి చెందిన మొత్తం జన్యు సమాచారాన్ని కలిగిన డీఎన్ఏను జీనోమ్ అంటారు.
b) డిస్ట్రోఫిన్ అనే ప్రొటీన్‌ను సంశ్లేషించే సంకేతం ఉన్న జన్యువు అతి పొట్టిది.
c) అత్యధిక సంఖ్యలో జన్యువులు ఉన్న క్రోమోజోమ్ Y.
d) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికత వంశవృక్ష విశ్లేషణలో తోడ్పడుతుంది.
తప్పుగా ఉన్న అంశాలు:
జ: b - c

 

34. డీఎన్ఏ శాటిలైట్స్ అనేవి
జ: VNTRs

35. కింద పేర్కొన్నవి డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతిలోని దశలు

a) బ్లాటింగ్                     
b) డీఎన్ఏ ఖండీకరణ 
c) డీఎన్ఏ స్వభావ వికలత     
d) ప్రోబ్‌ల ద్వారా డీఎన్ఏని గుర్తించడం 
e) ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా డీఎన్ఏ ఖండాలు వేరుచేయడం   
f) డీఎన్ఏ సంగ్రహణ 
g) డీఎన్ఏ ఫింగర్ ప్రింట్     

సరైన వరస క్రమం
జ: f - b - e - c - a - d - g

Posted Date : 27-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌