• facebook
  • whatsapp
  • telegram

అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వం

1. 'M' భ్రామకం ఉన్న ఒక అయస్కాంతీకరించిన తీగను కేంద్రం వద్ద 60o కోణాన్ని ఏర్పరిచే వృత్తాకార జ్యాగా వంచారు. దాని తుల్య అయస్కాంత భ్రామకం   A-m2 అయితే 'M' విలువ

జ. 3 A-m2
 

2. ఒక చిన్న దండాయస్కాంతాన్ని అపవర్తన అయస్కాంత మాపకం పడమటి భుజంపై tan A స్థానంలో సూచిక వైపు దక్షిణం ధ్రువం ఉండేలా అమర్చారు. అది కలిగించిన అపవర్తనం 45o. అయస్కాంతమాపక భుజాలను 90o కోణంతో అపసవ్యదిశలో తిప్పితే ఏర్పడే అపవర్తనం 

జ. సూచిక ఏ దిశ లో నైనా ఉండొచ్చు

3. ఒక చిన్న అయస్కాంతాన్ని దక్షిణ ధ్రువం ఉత్తరం వైపు ఉండేలా యామ్యోత్తర రేఖ వెంబడి అమరిస్తే, దాని నుంచి కొంత దూరంలో తటస్థ బిందువు ఏర్పడింది. అదే అయస్కాంతాన్ని అంతే దూరంలో, tan A స్థానంలో ఉంచి దాని భుజాలను 30o కోణంతో ఉత్తరం వైపు తిప్పితే ఏర్పడే అపవర్తనం .... 

జ.  30o లేదా 60o

4. ఒక చిన్న దండాయస్కాంత ఉత్తరధ్రువం ఉత్తర దిశలో ఉండేలా యామ్యోత్తర రేఖ దిశలో అమరిస్తే, దాని నుంచి కొంత దూరంలో తటస్థ బిందువు ఏర్పడింది. అదే దండాయస్కాంతాన్ని tan B స్థానంలో సగం దూరంలో అమరిస్తే ఏర్పడే అపవర్తనం ...

జ. tan-1 (8)
 

5. ఒక చిన్న దండాయస్కాంతం మధ్య లంబరేఖపై P బిందువు వద్ద తటస్థ బిందువును ఏర్పరిచింది. అయస్కాంతాన్ని 90o కోణంతో తిప్పితే, అదే బిందువు P వద్ద ఫలిత ప్రేరణ క్షేత్ర తీవ్రత -

జ. 
 

6. వ్యాఖ్య (A): దండాయస్కాంతం పొడవు పెరిగితే, అక్షీయ రేఖపై అయస్కాంత ప్రేరణ పెరుగుతుంది, మధ్యలంబ రేఖపై తగ్గుతుంది.
 

   వ్యాఖ్య (B): ఒక పొడవైన అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని టేబుల్‌పై ఆనించి నిట్టనిలువుగా అమరిస్తే అయస్కాంతానికి ఉత్తర దిశవైపు తటస్థ బిందువు ఏర్పడుతుంది.

జ. A నిజం, B తప్పు.
 

7. ఏకరీతి అయస్కాంత క్షేత్రం నుంచి ఒక దండాయస్కాంతాన్ని 120o డిగ్రీల కోణంతో తిప్పడానికి చేసిన పని W  అయితే, అదే దిశలో ఉండటానికి అవసరమయ్యే టార్క్ ...
జ. 

8. కంపన అయస్కాంతమాపకంలో ఒక దండాయస్కాంతం వల్ల కంపన కాలం 6 సెకన్‌లు. దీన్ని పొడవుకు లంబంగా నాలుగు ముక్కలు, పొడవుకు సమాంతరంగా మూడు ముక్కలుగా చేస్తే ఒక్కొక్క అయస్కాంత ముక్క కంపన కాలం...
జ. 1.5 sec

 

9. రెండు ఏకకేంద్ర తీగచుట్టల్లోని చుట్ల సంఖ్య 10. అవి ఒకే తలంలో ఉన్నాయి. వాటి వ్యాసార్ధాలు 20 సెం.మీ., 40 సెం.మీ. వాటిలో విద్యుత్ ప్రవాహాలు 0.2 A, 0.3 A. వ్యతిరేక దిశల్లో కేంద్రం వద్ద ఫలిత అయస్కాంత క్షేత్రం
జ. 

 

10. ఒక వృత్తాకార తీగ చుట్టను ని విద్యుచ్ఛాలక బలం ఉన్న బ్యాటరీకి కలిపితే దాని కేంద్రం వద్ద కొంత అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. తీగచుట్టను ఊడదీసి రెట్టింపు పొడవు అయ్యేలా సాగదీసి మళ్లీ తొలి వ్యాసార్ధంలో 1/3 వంతు వ్యాసార్ధం ఉన్న చుట్టగా చుట్టి E1 విద్యుచ్ఛాలక బలం ఉన్న బ్యాటరీకి కలిపి, మళ్లీ కేంద్రం వద్ద అంతే అయస్కాంత క్షేత్రాన్ని పొందాలంటే E1 విలువ 
జ. 2E/9

 

11. ఒక తిన్నటి కడ్డీ ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేసినప్పుడు
జ. కడ్డీ అక్షం వెంబడి విద్యుత్ క్షేత్రం మాత్రమే ఏర్పడుతుంది. అయస్కాంత క్షేత్రం శూన్యం అవుతుంది

 

12. 100 guass ప్రేరణకు ఒక ఏకరీతి క్షేత్రం తూర్పు పడమర దిశలో ఉంది. ఈ క్షేత్రం వల్ల గరిష్ఠ టార్క్ పొందేలా 44 సెం.మీ. పొడవున్న ఒక తీగ ఉచ్చు ఆకారంలో ఉంది. ఇందులో ప్రవహించే కరెంట్ 10 A అయినప్పుడు ఆ ఉచ్చు పొందే గరిష్ఠ టార్క్
జ. 1.54 × 10-3 Nm

 

13. 0.1 కె.జి. ద్రవ్యరాశి ఉన్న ఒక లోహపు తీగ ఘర్షణ లేనప్పుడు, 0.5 మీ. దూరంలో వేరు చేసిన రెండు క్షితిజ సమాంతర రైలు పట్టాలపై జారుతోంది. ఈ రైలు పట్టాలపై నిట్టనిలువు ఏకరీతి అయస్కాంత ప్రేరణ క్షేత్రం 2T ను ఏర్పరిస్తే, ఒక రైలు పట్టా వెంబడి 0.2 A ల కరెంట్ ప్రవహించి, తీగ ద్వారా అది మరో రైలు పట్టాను చేరి, వ్యతిరేక దిశలో వెనుతిరిగింది. పట్టాలపై తీగ మొదట నిశ్చల స్థితిలో ఉన్న‌ట్ల‌యితే 1 సెకన్ తర్వాత దాని వేగం 
జ. 2 m/s

14. ఒక క్షితిజ సమాంతర తీగ ద్వారా 200 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తోంది. దీని కింద 20 × 103 kg/m దైర్ఘ్య సాంద్రత ఉన్న మరో తీగను పై తీగ నుంచి 2 సెం.మీ. దూరంలో సమతాస్థితిలో వేలాడేలా ఉంచాలంటే, కింది తీగలో ప్రవహింపజేయాల్సిన కరెంట్ 
జ. 100 A

 

15. దక్షిణం నుంచి ఉత్తర దిశలో క్షితిజ సమాంతరంగా ఉన్న 5T ప్రేరణ గల ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో 200 MeV శక్తి ఉన్న ఒక ప్రోటాన్ నిట్టనిలువుగా కింది దిశలో పతనం చెందుతోంది. mp = 1.6 × 10-27 kg, qp= 1.6 × 10-19 C, అయితే ప్రోటాన్‌పై పని చేసే బలం? 
జ. 1.6 × 10-10 N

Posted Date : 28-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌