• facebook
  • whatsapp
  • telegram

ద్రావణాలు, ఆమ్లాలు - క్షారాలు

1. ‘NH4X' జలద్రావణం ఆమ్ల స్వభావంతో ఉంటుంది. అయితే OH, Cl, Br, I లలో 'X' కానిది-
జ:  OH

 

2. 20% (W/W) NaOH ద్రావణ మొలారిటీ 5 M. అయితే ద్రావణ సాంద్రత g/ml లలో-
జ:  1.0

 

3. సమాన మోలాల్ గాఢత ఉన్న కింది జలద్రావకాల్లో దేనికి ఘనీభవన స్థానం అత్యధికంగా ఉంటుంది?
C6H12O6, NaCl, MgCl2, Al2(SO4)3
జ:  C6H12O6

 

4. కిందివాటిలో దేన్ని అమోనియా బఫర్ కు కలిపితే, 'pH' లో అధిక మార్పు వస్తుంది?
HCl, NaOH, Water, NH4OH
జ:  NH4OH

 

5. 300 K వద్ద 0.1 M K4 [Fe(CN)6] ద్రావణం 100% అయనీకరణం చెందింది. అయితే ద్రావణ ఆస్మాటిక్ పీడనం ?
జ:  12.3 atm

 

6. సోడియం ఎసిటేట్ జలద్రావణ జలవిశ్లేషక స్థిరాంకం (ఎసిటికామ్ల Ka విలువ 2 × 10-5)
జ:  5 × 10-10

7. 4 గ్రా. NaOH ను కలిపితే, బఫర్ ద్రావణ 'pH' విలువ 0.1 యూనిట్ మారితే బఫర్ కెపాసిటీ-
జ:  4

 

8. కాటయాన్, ఆనయాన్ నీటిలో చర్యపొందే లవణం -
జ:  CH3COONH4

 

9. 34.2 గ్రా. అల్యూమినియం సల్ఫేట్ 100 మి.లీ. ద్రావణంలో కరిగి ఉంటే ద్రావణ మొలారిటీ-
జ:  1M

 

10. HCl వాయువును NaCl  సంతృప్త  ద్రావణం ద్వారా పంపితే, NaCl అవక్షేపితం చెందింది. దీనికి కారణం-
జ:  కామన్ అయాన్ ప్రభావం

 

11. 'x' గ్రా. Na2CO3 , 100 ml ల 'y' M Na2CO3 ద్రావణంలో ఉంది. అయితే x, y ల నిష్పత్తి-
జ:  10.6

 

12. ఒక జలద్రావణంలో మొలాలిటీ, మొలారిటీ వరుసగా 1.0 m, 0.75 M అయితే 10 మి.లీ. ఆ ద్రావణంలో ద్రావణి భారం?
జ:  7.5 g

 

13. ఒక జలద్రావణానికి సాంద్రత 1 g / ml కంటే తక్కువ అయితే మొలారిటీ (M), మొలాలిటీ (m) మధ్య సంబంధం-
జ:  m > M

14. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత TK వద్ద 0.05 M Ba(OH)2 ద్రావణ pH విలువ 11.6990 అయితే ఆ 'TK' వద్ద నీటి అయానిక లబ్ధం -
జ:  2 × 10-14 M2

 

15. కింది వాటిలో సరైనవి
I) Ag2S3 లవణానికి Ksp విలువ 108S5
II) IIA గ్రూప్ హైడ్రాక్సైడ్ లలోకెల్లా Be(OH)2 కు అత్యల్ప Ksp విలువ 25ºC వద్ద ఉంటుంది.
III) 0.2 MPb(NO3)2 ద్రావణంలో PbI2 మోలార్ ద్రావణీయత ‘Ksp’ పరంగా (Ksp/0.8)1/2
జ:  పైవన్నీ

 

16. సమాన ఘ.ప. ఉన్నఏ ద్రావణాలను కలిపితే AgCl అవక్షేపం ఏర్పడుతుంది? (AgCl Ksp = 1.8 × 10-10)
జ:  10-4 M Ag+1 and 10-4 MCl
-

17. కొద్దిపాటి HCl ను ఎసిటికామ్లం సోడియం ఎసిటేట్ బఫర్ ద్రావణానికి కలిపితే, కింది చర్య జరిగి ద్రావణ 'pH' స్థిరంగా ఉంటుంది?
జ:  CH3COO+ H--> CH3COOH

 

18. కింది 0.1 M ద్రావణాల్లో అత్యల్ప 'pH' ఉండేది?
CH3COOH, COOH, HCl, NH4OH, KOH
జ:  HCl

19. 'X' L, 10 N HCl, 'Y' L, 2 M HCl ద్రావణాన్ని కలిపారు. ఫలిత ద్రావణ మొలారిటీ Z అయితే X, Y, Z విలువలు వరుసగా-
జ:  6, 6, 6

 

20. కిందివాటిలో సరికానిది.
A) Cl- ఒక లూయీస్ ఆమ్లం
B) 10-3 M HCl ద్రావణ pH విలువ 3
C) ఆమ్లద్రావణంలో pH < pOH
D) బ్రాన్ స్టెడ్ సిద్ధాంతం 'NH3' క్షారస్వభావాన్ని వివరించలేదు.
జ:  A, D

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌