• facebook
  • whatsapp
  • telegram

స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్, ఉష్ణవిద్యుత్

1. రెండు కణాల విద్యుదావేశాల నిష్పత్తి 1 : 1, వాటి ద్రవ్యరాశుల నిష్పత్తి 2 : 1. కణాలను ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో నిశ్చలస్థితి నుంచి వదిలినప్పుడు, అవి క్షేత్ర ప్రభావం వల్ల చలిస్తాయి. ఏదైనా కాలం వద్ద కణాల గతిజ శక్తుల నిష్పత్తి
జ: 1 : 2

 

Hint: F = QE = constant. As they experience same force for same time, their 'P' values are equal. 
  

2. ఒక ఏకరీతి బోలు వాహకపు గోళం వ్యాసార్ధం 10 cm దాని ఉపరితల విద్యుదావేశ సాంద్రత 8.85 × 10-8 cm-2. అయితే ఆ గోళ కేంద్రం వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ
జ: 1000 V

 

Hint:
  

3. ఒక విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ పొటెన్షియల్ 'V' (ఓల్ట్‌లలో) విలువ 'X' (మీటర్లలో)తో పాటు V = (4x2 + 5) సమీకరణాన్ని బట్టి మారుతూ ఉంది. x = 0.5 m వద్ద ఉంచిన 2 రుణ విద్యుదావేశంపై పనిచేసే బలపరిమాణం
జ: 8 × 10−6

 

Hint:   


 

4. ఏక కేంద్ర బోలు వాహకపు గోళాల్లో అంతర గోళం వ్యాసార్ధం 'r', బాహ్య గోళ వ్యాసార్ధం 'R'. బాహ్య గోళాన్ని విద్యుదావేశ పూరితం చేసి, అంతర గోళాన్ని భూమికి అనుసంధానం చేస్తే, వ్యవస్థ కెపాసిటి (క్షమత్వం)

జ:     

 

Hint:       
              q = induced charge on inner surface of outer shell
                                            

 

5. ఒక విద్యుత్ క్షేత్రంలోని కొన్ని సమపొటెన్షియల్ తలాలు పటంలో చూపినట్లు ఉన్నాయి. ఆ విద్యుత్ క్షేత్ర పరిమాణం, దిశ -
                                                   

 

జ: 200 Vm−1, X- అక్షం నుంచి 120o
 

Hint:

 is perpendicular to the equi-potential surfaces. In the direction of , potential decreases and    
ΔV = p.d b/n adjacent equi-potential surfaces
Δx = perpendicular distance b/n adjacent equi-potential surfaces

6. ఒక ఘనం అంచు పొడవు 'l'. ఘనం కేంద్రం ద్వారా వెళ్తున్నట్లు ఊహించిన ఒక సరళరేఖ వెంబడి విద్యుదావేశం 'λ' కూలుంబ్/మీటరు చొప్పున వితరణ చెంది ఉంటే, ఘనం ద్వారా ప్రవహించే గరిష్ఠ విద్యుత్ అభివాహానికి, కనిష్ఠ విద్యుత్
అభివాహానికి ఉన్న నిష్పత్తి.

జ: 

Hint:
                    

 

7.'l' మీటర్ల పొడవున్న ఒక రాగితీగ రెండు కొనల మధ్య 'V' ఓల్ట్‌ల పొటెన్షియల్ భేదాన్ని కలిగించారు. రాగిలో ఎలక్ట్రాన్‌ల చలన శీలత 'μ' అయితే, ఎలక్ట్రాన్‌ల డ్రిఫ్ట్ వేగం
జ:  


 

Hint:    

8. 20 kΩ , 60 kΩ రెండు నిరోధాలను శ్రేణిలో కలిపారు. 20 kΩ, 60 kΩ రెండు స్వేచ్చా కొనల వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువలు వరుసగా -5 V, + 15 V అయితే, సంధి వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ
 
జ: సున్నా

 

Hint:  Current through 20 kΩ= current through 60 kΩ    
 

9. ఒక లోహపు దిమ్మె కొలతలు 10 cm × 5 cm × 2 cm. ఈ దిమ్మె నుంచి పొందగల గరిష్ఠ నిరోధానికి, కనిష్ఠ నిరోధానికి మధ్య నిష్పత్తి

జ:  25 : 1

Hint:    


 

10. ఒక్కొక్కటి 1.5 V విద్యుత్ చాలకబలం, 0.5 Ω అంతర్నిరోధం ఉన్న ఇరవై నాలుగు సర్వసమాన విద్యుత్ ఘటాలను 3 Ω ఒక నిరోధానికి కలపాలి. ఈ నిరోధం ద్వారా గరిష్ఠ విద్యుత్ ప్రవహించాలంటే ఈ విద్యుత్ ఘటాలను నువ్వు కలపాల్సిన అడ్డు వరుస సంఖ్య, నిలువు వరుసల సంఖ్య -
జ:  ప్రతి అడ్డువరుసలో 12 ఘటాలు శ్రేణిలో, 2 అడ్డువరుసలు సమాంతరంగా

 

Hint:  Max. current through load of RΩ  
 

11. 2 Ω నిరోధాన్ని ఒక మీటరు బ్రిడ్జి (బ్రిడ్జి తీగ పొడవు 100 cm ) లోని ఒక ఖాళీలో కలిపారు. 2 Ω కంటే ఎక్కువ విలువ ఉన్న మరొక తెలియని నిరోధాన్ని మరొక ఖాళీలో కలిపారు. ఈ రెండు నిరోధాలను తారుమారు చేసి కలిపినప్పుడు, సంతులనస్థానం 20 cm స్థానభ్రంశం చెందింది. కొన సవరణలను ఉపేక్షించి, తెలియని నిరోధం విలువ.
జ: 3 Ω

 

12. 10 m పొడవున్న ఒక పొటెన్షియోమీటరు తీగకు ఉపేక్షించదగిన స్వల్పనిరోధం ఉన్న ఒక బ్యాటరీని కలిపారు. గౌణవలయంలోని ఒక ప్రామాణిక విద్యుత్ ఘటం 6m పొడవున్న తీగపై సంతులనం చెందుతుంది. పొటెన్షియోమీటరు తీగపొడవును 2m పెంచితే, గౌణవలయంలో అదే ప్రామాణిక విద్యుత్ ఘటంతో సంతులన పొడవులోని పెరుగుదల
జ:  1.2 m

 

Hint:   
 

13. ఒక ఉష్ణయుగ్మంలోని చల్లటి సంధిని 0oC వద్ద ఉంచారు. దాని వేడి సంధిని θoC వద్ద ఉంచినప్పుడు జనించిన ఉష్ణ విచాబ గరిష్ఠం, దాని విలువ 'e'. చల్లటి సంధి ఉష్ణోగ్రతను 0oC వద్దనే ఉంచి, వేడి సంధి ఉష్ణోగ్రతను 2θoC చేస్తే,
ఉష్ణయుగ్మంలో జనించిన ఉష్ణవిచాబ విలువ
జ:  సున్నా

 

Hint:
                         

14. కింది ప్రవచనాలను చదివి సరైన వాటిని గుర్తించండి.
A: రాగి ధన థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది.
B: ఇనుము రుణ థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శిస్తుంది.
C: సీసం థామ్సన్ ఫలితాన్ని ప్రదర్శించదు.
జ: A, B & C లు సరైనవి

 

Hint:   Thomson Coeff. = σ for copper σ is +ve, for iron σ is -ve & for lead σ is zero

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌