• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్ ప్రవాహం

1. వాహకం ద్వారా ఎలక్ట్రాన్‌ల దిశాత్మక ప్రవాహం

A) పొటెన్షియల్           B) ఎలక్ట్రాన్ ప్రవాహం

C) విద్యుత్ ప్రవాహం         D) ఏదీకాదు
 

2. కిందివాటిలో మంచి విద్యుత్ వాహకం

A) రాగి         B) జర్మేనియం          C) కర్ర         D) గాజు
 

3. మానవ శరీరం ఒక

A) బంధకం          B) వాహకం       

C) అర్ధవాహకం         D) ఏదీకాదు
 

4. వాహకం ద్వారా తక్కువ పొటెన్షియల్ నుంచి ఎక్కువ పొటెన్షియల్‌కు ప్రవహించేది

A) ఎలక్ట్రాన్‌లు            B) విద్యుత్తు

C) ధనావేశాలు          D) ఏదీకాదు
 

5. ఒక విద్యుత్ ఘటంలో

A) రసాయనిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది

B) యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది

C) విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది

D) అయస్కాంతశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది
 

6. విద్యుత్ ప్రవాహానికి సమీకరణం

7. విద్యుత్ ఘటం గుర్తు


 

8. విద్యుత్ నిరోధం గుర్తు


 

9. విద్యుత్ పొటెన్షియల్ భేదం కిందివాటిలో దేనికి సమానం?

A)           B)          C) పని × ఆవేశం         D) ఏదీకాదు
 

10. పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహాల నిష్పత్తి
A) వోల్టేజీ         B) విశిష్ట నిరోధం       C) నిరోధం         D) ఏదీకాదు

 

11. ఓమ్ నియమంలో ఇది స్థిరం
A) ఉష్ణోగ్రత        B) నిరోధం         C) పీడనం         D) ఏదీకాదు

 

12. కింది చిత్రాల్లో ఓమ్ నియమాన్ని చూపించే గ్రాఫ్

13. ఓమీయ వాహకాల్లో విద్యుత్ ప్రవాహం, పొటెన్షియల్ భేదం మధ్య ఉండే సంబంధాన్ని చూపే రేఖా పటం

14. కిందివాటిలో ఓమ్ నియమం కానిది
A) V = IR        B)        C) VI = R         D)

 

15. వోల్టేజీని రెట్టింపు చేస్తే వాహక విద్యుత్ ప్రవాహం
A) సగమవుతుంది        B) రెట్టింపవుతుంది         C) మారదు            D) ఏదీకాదు

 

16. సిలికాన్, జెర్మేనియంలు
A) వాహకాలు         B) బంధకాలు         C) అర్ధవాహకాలు         D) ఏదీకాదు

 

17. 240 V తీగను తాకినప్పుడు మన శరీరం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం
A) 0.001A          B) 0.015A           C) 0.024A            D) 0.0024A

 

18. జతపరచండి
1) 0.001A a) కండరాలు సంకోచిస్తాయి
2) 0.005A b) స్పృహ కోల్పోతారు
3) 0.010A c) ప్రభావాన్ని గుర్తించగలం
4) 0.070A d) నొప్పిని కలగజేస్తుంది
A) 1-a, 2-b, 3-c, 4-d            B) 1-d, 2-c, 3-b, 4-a
C) 1-c, 2-d, 3-b, 4-a            D) 1-c, 2-d, 3-a, 4-b

 

19. విశిష్ట నిరోధ ప్రమాణం
A) ఓమ్ B) ఆంపియరు C) ఓమ్ - మీ D) ఏదీకాదు

 

20. కిందివాటిలో Ω గుర్తు దేన్ని సూచిస్తుంది
A) వోల్ట్          B) ఆంపియర్         C) నిరోధం          D) ఓమ్

 

21. నిరోధం ప్రమాణం
A) ఆంపియర్          B) వోల్ట్          C) ఓమ్           D) ఏదీకాదు

 

22. R = ρ ఈ ఫార్ములాలో l అనేది
A) పొడవు        B) వ్యాసార్ధం         
C) మధ్యచ్ఛేద వైశాల్యం           D) ఏదీకాదు

 

23. విశిష్ట నిరోధ ఫార్ములా

 

24. ఒక తీగ పొడవు l మధ్యచ్ఛేద వైశాల్యం A అయితే దాని నిరోధం

25. విద్యుత్ స్టౌలోని తీగ చుట్టలను దేంతో చేస్తారు?
A) టంగ్‌స్టన్          B) రాగి           C) ఇనుము         D) నిక్రోమ్


26. ఒక వాహక నిరోధం R. దాని పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యాలను రెట్టింపు చేస్తే దాని నిరోధం
A)           B) 2 R          C) R          D) 4 R


27. R1 = 100 Ω, R2 = 1 Ω నిరోధాలు ఇచ్చారు. వాటిని సమాంతరంగా సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం
A) 0.1 Ω            B) 0.5 Ω           C) 0.99 Ω           D) 0.10 Ω


28. ఒక్కోటి 1 Ω ఉన్న 10 సర్వసమానమైన నిరోధాలను సమాంతరంగా సంధానం చేస్తే ఫలిత నిరోధం
A) 1 Ω             B) 10 Ω           C) 0.1 Ω             D) 0.01 Ω


29. ఒక్కోటి 2 Ω ఉన్న 5 సర్వసమానమైన నిరోధాలను సమాంతరంగా సంధానం చేస్తే ఫలిత నిరోధం
A) 2 Ω B) 10 Ω C) 0.04 Ω D) 0.4 Ω


30. శ్రేణిలో కలిపిన 2 నిరోధాల ఫలిత నిరోధం 28 Ω. వాటిలో ఒక నిరోధం విలువ 17 Ω అయితే రెండో నిరోధం విలువ
A) 20 Ω          B) 45 Ω           C) 23 Ω            D) 11 Ω

 

31. మూడు నిరోధాలు 2 Ω, 8 Ω, 12 Ωలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం

A) 10 Ω            B) 20 Ω          C) 30 Ω             D) ఏదీకాదు


32. గృహోపకరణాల వలయంలో ఫ్యూజ్ వాడటానికి కారణం
A) ఓవర్ లోడ్‌ను తగ్గించడానికి
B) అగ్నిప్రమాదాలను అరికట్టడానికి
C) ఓవర్ లోడ్‌ను తగ్గించడానికి, అగ్నిప్రమాదాలను అరికట్టడానికి
D) విద్యుత్ సామర్థ్యం వాడకం తగ్గించడానికి


33. గృహోపకరణ వలయంలో ఓవర్‌లోడ్ అంటే
A) విద్యుత్ ఉపకరణాల సంఖ్య పెంచి సామర్థ్యాన్ని 4.8kW కంటే ఎక్కువగా వాడటం
B) మెయిన్ నుంచి 20 A కంటే ఎక్కువ విద్యుత్‌ను గృహోపకరణాల వలయంలో వాడటం
C) విద్యుత్ ఉపకరణాల సంఖ్య పెంచి సామర్థ్యాన్ని 4.8kW కంటే ఎక్కువగా వాడటం, మెయిన్ నుంచి 20 A కంటే ఎక్కువ విద్యుత్‌ను గృహోపకరణాల వలయంలో వాడటం
D) మెయిన్ నుంచి 40A కంటే ఎక్కువ విద్యుత్‌ను గృహోపకరణాల వలయంలో వాడటం

 

34. షార్ట్ సర్క్యూట్ సమయంలో వలయంలో విద్యుత్
A) బాగా పెరుగుతుంది         B) తగ్గుతుంది          C) మారదు           D) ఏదీకాదు


35. ఫ్యూజ్ ముఖ్య ఉపయోగం
A) ఎక్కువ విద్యుత్ ప్రవాహాన్ని ఆపడానికి
B) అగ్నిప్రమాదాన్ని అరికట్టడానికి
C) లఘువలయాలను నివారించడానికి
D) అన్నీ


36. ఫ్యూజ్‌వైరు అభిలక్షణం
A) తక్కువ నిరోధం         B) అధిక నిరోధం
C) తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత
D) అధిక ద్రవీభవణ ఉష్ణోగ్రత


37. కిందివాటిలో KWH దేనికి ప్రమాణం?
A) పొటెన్షియల్           B) విద్యుత్          C) విద్యుత్‌శక్తి
D) విద్యుచ్ఛాలక బలం


38. 100 వాట్ బల్బ్‌ను 20 గంటలు వెలిగిస్తే వినియోగించిన విద్యుత్ శక్తి kWHలో
A) 1 B) 2 C) 5 D) ఏదీకాదు


39. అయిదు 60 W బల్బ్‌లు రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తాయి. యూనిట్ 80 పైసలు అయితే 30 రోజులకు చెల్లించాల్సిన మొత్తం
A) రూ.72.00         B) రూ.50.60 పై.          C) రూ.57.00           D) రూ.57.60 పై.

 

40. 750 W ఇస్త్రీ పెట్టెను 5 గంటలు వినియోగించారు. యూనిట్ ఖరీదు 80 పైసలు అయితే చెల్లించాల్సిన మొత్తం

A) రూ.3.70 పై.          B) రూ.2.70 పై.        C) రూ.3.50 పై.          D) రూ.3.00


41. ప్రతిరోజు ఒక 60 Ω బల్బ్‌ను 8 గంటల పాటు వెలిగిస్తే దానికి 30 రోజులకు వినియోగమయ్యే శక్తి kWHలలో లెక్కగట్టండి
A) 7.2                 B) 5.2       C) 16.2                 D) 14.4


42. కింది పటంలో చూపినట్లుగా నాలుగు నిరోధాలను కలిపితే X, Y బిందువుల మధ్య ఉండే ఫలిత నిరోధం

A) Ω          B) Ω          C) 20 Ω               D) 3 Ω


43. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగ మధ్యచ్ఛేద వైశాల్యం మార్చకుండా దాని పొడవును రెట్టింపు చేస్తే దాని నిరోధం
A) మారదు               B) సగమవుతుంది               C) రెట్టింపవుతుంది          D) ఏదీకాదు

 

44. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగ మధ్యచ్ఛేద వైశాల్యం మార్చకుండా దాని పొడవును సగం చేస్తే తీగ నిరోధం

A) మారదు B) సగమవుతుంది C) రెట్టింపవుతుంది D) 4 రెట్లవుతుంది


45. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగపొడవు మార్చకుండా మధ్యచ్ఛేద వైశాల్యాన్ని రెట్టింపు చేస్తే దాని నిరోధం
A) మారదు          B) సగమవుతుంది               C) రెట్టింపవుతుంది               D) 4 రెట్లవుతుంది


46. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగ పొడవు మార్చకుండా మధ్యచ్ఛేద వైశాల్యాన్ని సగం చేస్తే దాని నిరోధం
A) మారదు               B) సగమవుతుంది               C) రెట్టింపవుతుంది               D) 4 రెట్లవుతుంది


47. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగ పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యాలు రెండింటిని రెట్టింపు చేస్తే దాని నిరోధం
A) సగమవుతుంది               B) రెట్టింపవుతుంది               C) మారదు               D) 4 రెట్లవుతుంది


48. నిర్దిష్ట పదార్థంతో చేసిన తీగపొడవు, మధ్యచ్ఛేద వైశాల్యాలు రెండింటిని సగం చేస్తే దాని నిరోధం
A) సగమవుతుంది               B) రెట్టింపవుతుంది               C) 4 రెట్లవుతుంది               D) మారదు


49. R1, R2లను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం 6 Ω సమాంతరంగా కలిపినప్పుడు Ω అయితే R1, R2ల విలువలు వరుసగా
A) 1.5 Ω, 4.5 Ω               B) 2 Ω, 4 Ω          C) 3 Ω, 3 Ω               D) 5 Ω, 1 Ω

 

50. 6 Ω, 12 Ωలను శ్రేణి, సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధాలు క్రమంగా

A) 3 Ω, 6 Ω               B) 18 Ω, 3 Ω               C) 18 Ω, 8 Ω               D) 18 Ω, 4 Ω


51. షార్ట్ సర్క్యూట్ దేని వల్ల ఏర్పడుతుంది?
A) పొడితీగలు               B) తీగల మధ్య స్పర్శ వల్ల 
C) ఎర్తింగ్ లేకపోవడం               D) అన్నీ


52. దేని వల్ల ఓవర్ లోడింగ్ ఏర్పడుతుంది?
A) ఒకే సాకెట్‌ను చాలా పరికరాలకు కలపడం వల్ల
B) షార్ట్ సర్క్యూట్
C) వోల్టేజీ పెరగడం వల్ల        D) అన్నీ


53. విద్యుత్ ఫ్యూజ్ ...... పై ఆధారపడి ఉంటుంది.
A) విద్యుత్ అయస్కాంత ఫలితం               B) విద్యుత్ ఉష్ణ ఫలితం
C) విద్యుత్ రసాయన ఫలితం               D) ఏదీకాదు

54. షార్ట్ సర్య్కూట్, ఓవర్‌లోడ్ నుంచి రక్షించడానికి ముఖ్యమైన సురక్షితమైన పద్థతి
A) విద్యుత్ మీటరును వాడటం
B) స్టెబిలైజర్‌ను ఉపయోగించడం
C) ఫ్యూజ్‌ను వినియోగించడం
D) ఎర్తింగ్ చేయడం

 

55. కింది వలయంలో A, B ల మధ్య నిరోధం

A) 10 Ω               B) 20 Ω               C) 4 Ω               D) 5 Ω


56. 2, 4, 8 ఓమ్‌ల నిరోధాలను శ్రేణిలో కలిపితే ఫలిత నిరోధం
A) 2 Ω               B) 4 Ω               C) 8 Ω               D) 14 Ω


57. 2, 4, 8 ఓమ్‌ల నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం
A) Ω               B) Ω               C) Ω               D) Ω


58. కింది వలయంలో A, B ల మధ్య ఫలిత నిరోధం


A) 14 Ω               B) 6 Ω               C) 3 Ω               D) 13 Ω

59. పటంలో చూపిన సంధాన తుల్య నిరోధం ఎంత

A) 30 Ω               B) 20 Ω               C) 15 Ω               D) 10 Ω


60. కింది పటంలో చూపినట్లుగా A, B బిందువుల మధ్య ఫలిత నిరోధం

A) 20 Ω               B) 10 Ω               C) Ω               D) Ω


61. కింది పటంలో A, B బిందువుల మధ్య ఫలిత నిరోధం విలువ

A) 15 Ω               B) 10 Ω               C) 6 Ω               D) 25 Ω

62. పక్క చిత్రంలో A, B ల మధ్య ఫలిత నిరోధం


A) 5 Ω               B) 10 Ω               C) 15 Ω               D) 25 Ω


63. వలయ పటంలో I1 : I2 విలువ

A) 2 : 1               B) 1 : 2               C) 1 : 4               D) 4 : 1

 


పటంలోని లోపం
A) వోల్ట్‌మీటర్‌ను శ్రేణిలో కలిపారు
B) వోల్ట్‌మీటర్‌ను సమాంతరంగా కలిపారు
C) అమ్మీటర్‌ను శ్రేణిలో కలిపారు
D) అమ్మీటర్‌ను సమాంతరంగా కలిపారు


65. A, B ల మధ్య ఫలిత నిరోధం

A) 8 Ω               B) 10 Ω               C) 16 Ω               D) 24 Ω

66. R సమాన నిరోధం ఉన్న 5 నిరోధాలను పటంలో చూపిన విధంగా కలిపారు. A, B ల మధ్య ఫలిత నిరోధం ఎంత?
A)            B) R               C) 2R               D)


67. 2 Ω, 8 Ω, R Ω లున్న మూడు నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం 16 Ω అయితే R విలువ
A) 16 Ω               B) 10 Ω               C) 8 Ω               D) 6 Ω

 

68. R Ω నిరోధం ఉన్న ఒక తీగను 10 భాగాలుగా విభజించి అన్ని భాగాలను సమాంతరంగా సంధానం చేస్తే ఫలిత నిరోధం

A) 0.1R Ω               B) 0.01R Ω               C) 10 Ω               D) 1 Ω


69. విద్యుత్ పని రేటును ఏమంటారు?
A) విద్యుత్ పొటెన్షియల్
B) విద్యుత్ సామర్థ్యం
C) విద్యుత్ రసాయన తుల్యాంకం
D) ఉష్ణయాంత్రిక తుల్యాంకం

70. R1, R2, R3 విలువలు ఉన్న 3 నిరోధాలను సమాంతరంగా కలిపితే వాటి ఫలిత నిరోధం 'Req' కు సమీకరణం


71. నీ స్నేహితుడు పటంలో చూపిన విధంగా వలయాన్ని ఏర్పరిచాడు. వోల్టు మీటరు సహాయంతో A, Bల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలిచాడు అయితే
A) పొటెన్షియల్ భేదం కొంతసేపు E విలువ, కొంతసేపు సున్నాను చూపిస్తుంది.
B) పొటెన్షియల్ భేదం సున్నాకు సమానం
C) పొటెన్షియల్ భేదం 'E'కు సమానం
D) పొటెన్షియల్ భేదం 2Eకు సమానం.

 

72. వలయాన్ని గమనించండి. రింగు ఆకారంలోని వాహకం నిరోధం సున్నా. A, Bల మధ్య ఫలిత నిరోధం
A) 2R               B) 4R               C) 7R               D) 10R


73. కింది పటంలోని వలయంలో కలిపిన పరికరాలకు సంబంధించి కిందివాటిలో సరైంది

A) వలయంలోని బ్యాటరీకి ఓల్ట్ మీటర్‌ను శ్రేణిలోను, అమ్మీటర్‌ను సమాంతరంగా కలిపారు.
B) వలయంలో ఓల్ట్‌మీటర్ బ్యాటరీకి సమాంతరంగా, అమ్మీటర్‌ను శ్రేణిలో కలిపారు.
C) అమ్మీటర్, ఓల్ట్‌మీటర్ రెండూ వలయం, శ్రేణిలో కలిపారు.
D) అమ్మీటరు, ఓల్ట్ మీటరు రెండూ వలయంలో సమాంతరంగా కలిపారు.

 

74. జతపరచండి.

1) బ్యాటరీ

ఎ)

2) ప్లగ్ కీ

బి)

3) నిరోధం

సి)

4) ఫ్యూజ్

డి)

A) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి               B) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
C) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి               D) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి


75. జతపరచండి.

1. విద్యుత్ ప్రవాహం               ఎ) ఓల్ట్

2. నిరోధం               బి) ఆంపియర్

3. పొటెన్షియల్ భేదం               సి) ఓమ్-మీటర్

4. విశిష్ట నిరోధం               డి) ఓమ్
A) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి               B) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

C) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి               D) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

76. హీటర్ కాయిల్‌ను తయారుచేయడానికి వాడేది
A) వెండి               B) రాగి               C) బంగారం               D) నిక్రోమ్, మాంగనీస్


77. ఇస్త్రీపెట్టె, రొట్టెలను వేడి చేసే పరికరాల్లో హీటింగ్ ఎలిమెంట్‌గా వాడేది
A) గ్రాఫైట్               B) నికెల్               C) నిక్రోమ్               D) సిలికాన్


78. డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు తయారుచేయడానికి వాడే పదార్థం
A) కార్బన్               B) సీసం               C) సిలికాన్, జెర్మేనియం               D) నిక్రోమ్


79. గృహ వినియోగంలో అన్ని విద్యుత్ ఉపకరణాలకు ఇది సమానం
A) విద్యుత్ ప్రవాహం               B) వోల్టేజీ               C) నిరోధం         D) సామర్థ్యం


80. వినియోగించిన విద్యుత్‌శక్తికి ప్రమాణం
A) వోల్ట్               B) ఆంపియర్               C) వాట్               D) కిలోవాట్/గంట


జవాబులు: 1-C; 2-A; 3-B; 4-A; 5-A; 6-C; 7-D; 8-D; 9-B; 10-C; 11-A; 12-A; 13-B; 14-C; 15-B; 16-C; 17-D; 18-D; 19-C; 20-D; 21-C; 22-A; 23-B; 24-D; 25-D; 26-C; 27-C; 28-C; 29-D; 30-D; 31-D; 32-C; 33-C; 34-A; 35-D; 36-C; 37-C; 38-B; 39-D; 40-D; 41-D; 42-B; 43-C; 44-B; 45-B; 46-C; 47-C; 48-D; 49-D; 50-D; 51-B; 52-D; 53-B; 54-C; 55-D; 56-D; 57-B; 58-C; 59-C; 60-C; 61-C; 62-B; 63-B; 64-D; 65-C; 66-D; 67-D; 68-B; 69-B; 70-C; 71-C; 72-D; 73-B; 74-D; 75-D; 76-D; 77-C; 78-C; 79-B; 80-D.

Posted Date : 24-08-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌