• facebook
  • whatsapp
  • telegram

లోహసంగ్రహణశాస్త్రం

1. Fe3O4 ధాతువును ఏమని పిలుస్తారు?
A) మాగ్నటైట్‌
B) మాగ్నసైట్‌
C) హెమటైట్‌
D) పైరోలుసైట్‌

జవాబు : A
 

2. 2 ZnS + 3O2  2 ZnO + 2 SO2 చర్య దేనికి ఉదాహరణ?
A) ప్రగలనం
B) భస్మీకరణం
C) భర్జనం
D) క్షయకరణం

జవాబు : C

3. కిందివాటిలో భూపటలంపై అత్యధికంగా లభించే లోహం?
A) Ag
B) Al
C) Zn
D) Fe

జవాబు : B
 

4. థర్మైట్‌ పద్ధతిలో ఉపయోగించే క్షయకరణ కారకం?
A) Al
B) Mg
C) Fe
D) Si

జవాబు : A
 

5. కిందివాటిలో క్రియాశీలత సరైన క్రమాన్ని గుర్తించండి.
A) K < Na < Zn > Fe
B) Na > K > Ca > Mg
C) Ag > Au > K > Na
D) K > Na > Ca > Mg

జవాబు : D

6. మాగ్నసైట్‌ రసాయన ఫార్ములా?
A) MgCO2
B) MgO
C) MnO2
D) MgCO3

జవాబు : D

7. ప్లవన క్రియ అనే పద్ధతిలో ఉపయోగించే ధాతువు?
A) మాగ్నెటైట్‌
B) హెమటైట్‌
C) సల్ఫైడ్‌
D) ఆక్సైడ్‌

జవాబు : C

8. కిందివాటిలో ప్రగలన ప్రక్రియకు ఉదాహరణ?
A) ZnCO3  ZnO + CO2
B) 2 PbS + 3O2  2 PbO + 2 SO2
C) Al2 O3 + 2 H2 Al2 O3 + 2 H2O
D) Fe2O3 + 3C  2 Fe + 3 CO

జవాబు : D

9. బ్లిస్టర్‌ కాపర్‌ అంటే?
A) శుద్ధ కాపర్‌
B) కాపర్‌ ధాతువు
C) కాపర్‌ మిశ్రమ లోహం
D) 2% మలినాలు ఉన్న కాపర్‌

జవాబు : D

10. సోడియం అర్జెంటో సైనైడ్‌ ఫార్ములా?
A) NaAgN2
B) 2 Na [Ag(CN)2]
C) Ag (CN)2
D) AgCN

జవాబు : B
 

11. కింది అంశాల్లో తప్పుగా జతపరిచింది ఏది?
A) మాగ్నసైట్‌ - Mg CO3
B) గెలీనా PBS
C) జిప్సం - CuSO4. 2 H2O
D) రాక్‌ సాల్ట్‌ - NaCl

జవాబు : C

12. బాక్సైట్‌ దేని ధాతువు?
A) Fe
B) Al
C) Cu
D) Zn

జవాబు : B
 

13. విరిగిన రైలు పట్టాల భాగాలను అతికించేందుకు .........ప్రక్రియను వాడతారు?
A) ప్లవన ప్రక్రియ
B) ప్రగలనం
C) భర్జనం
D) థర్మైట్‌

జవాబు : D

14. లోహ క్షయం జరగాలంటే...... కావాలి.
A) కేవలం నీరు
B) కేవలం గాలి
C) గాలి, నీరు
D) ఏదీకాదు

జవాబు : C
 

15. 22 క్యారట్ల బంగారం అంటే?
A) 22 గ్రా. స్వచ్ఛమైన బంగారం
B) 22 గ్రా. Cu లేదా Ag; 22 గ్రా. బంగారం
C) 22 భాగాల బంగారానికి 2 భాగాల Cu లేదా Ag
D) 22 Kg. ల స్వచ్ఛమైన బంగారం

జవాబు : C

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌