• facebook
  • whatsapp
  • telegram

ప్రసరణ

1. స్టెతస్కోప్‌ను కనుక్కున్నది ఎవరు?
A) లిన్నేయస్‌          B) లెన్నెక్‌
C) జెన్నర్‌           D) హార్వే
జవాబు : B


2. రక్త పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే సాధనం?
A) పెడోమీటర్‌          B) థర్మామీటర్‌
C) స్టెతస్కోప్‌            D) స్పిగ్మోమానోమీటర్‌
జవాబు : D


3. 120/80 అనేది దేన్ని సూచిస్తుంది?
A) హైపర్‌ టెన్షన్‌           B) సాధారణ రక్త పీడనం
C) తక్కువ రక్తపీడనం          D) హైపో టెన్షన్‌
జవాబు : A


4. రక్తస్కందనాన్ని ప్రారంభించేది?
A) ఎర్రరక్త కణాలు          B) తెల్లరక్త కణాలు
C) రక్త ఫలకికలు          D) ప్లాస్మా
జవాబు : C


5. సాధారణంగా 3 గదుల గుండె ఉండే జీవులు....
A) చేపలు          B) ఉభయచరాలు
C) సరీసృపాలు           D) పక్షులు
జవాబు : C


6. సాధారణంగా హృదయస్పందన, నాడీస్పందనల నిష్పత్తి...
A) హృదయస్పందన రేటు ఎక్కువ
B) నాడీ స్పందన రేటు ఎక్కువ
C) రెండూ సమానం
D) నాడీ స్పందన కంటే హృదయస్పందన రెండు రెట్లు
జవాబు : C


7. ఎక్కువ దృఢంగా ఉండే రక్తనాళాలు?
A) దమనులు        B) సిరలు
C) A, B           D) కరోనరి దమని
జవాబు : A

 

8. కవాటాలు ఉన్న రక్తనాళాలు
A) దమనులు          B) సిరలు
C) A, B           D) ఏదీకాదు
జవాబు : B


9. మానవుల్లో సాధారణ డయాస్టోలిక్‌ పీడనం?
A) 120           B) 100           C) 90            D) 80
జవాబు : D


10. రాత్రంతా కదలకుండా కూర్చొని ప్రయాణిస్తే, కాళ్లు/ పాదాలు వాచినట్లు ఉండటాన్ని ....... అంటారు.
A) పెల్లగ్రా          B) ఎనీమియా
C) ఎడిమా            D) క్వాషియార్కర్‌
జవాబు : C


11. కణజాలాల్లో ఉన్న శోషరసాన్ని ........ అంటారు.
A) ప్లాస్మా          B) ప్రోత్రాంబిన్‌
C) కణజాల ఫైబ్రిన్‌          D) కణజాల ద్రవం
జవాబు : D


12. ప్రోటోజోవన్‌ల జీవపదార్థంలో సహజమైన కదలికలను .......... అంటారు.
A) ప్రసరణ       B) బ్రౌనియన్‌ చలనం
C) ద్రవాభిసరణం          D) కోశిక ద్రవ్యసంకోచం
జవాబు : B


13. జన్యులోపం వల్ల రక్తం గడ్డకట్టని స్థితిని ............... అంటారు.
A) పెరినీషియస్‌ ఎనీమియా              B) గ్లాసైటిస్‌
C) హీమోఫిలియా           D) స్కర్వీ
జవాబు : C


14. మొక్కల్లో ఆహారపదార్థాలను రవాణా చేసే కణజాలం?
A) పోషక కణజాలం           B) దారువు
C) సంధాయక కణజాలం           D) విభాజ్య కణజాలం
జవాబు : A


15. బాష్పోత్సేకం అంటే........?
A) శ్వాసక్రియలో భాగంగా ఆక్సిజన్‌ను తీసుకోవడం
B) శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌డైఆక్సైడ్‌ను వదలడం
C) నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం
D) నీటిని నీటిబిందువుల రూపంలో కోల్పోవడం
జవాబు : C


16. రక్తప్రసరణ వ్యవస్థను కనిపెట్టింది ఎవరు?
A) ఫాబ్రిసి            B) మాల్ఫీజీ
C) హార్వే           D) లెన్నెక్‌
జవాబు : C


17. త్రిపత్ర కవాటం యొక్క స్థానం?
A) కుడి కర్ణిక, ఎడమ కర్ణికల మధ్య
B) కుడి కర్ణిక, ఎడమ జఠరికల మధ్య
C) ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య
D) ఎడమ కర్ణిక, పుపుస దమనుల మధ్య
జవాబు : B


18. ఎడమ కర్ణిక నుంచి, ఎడమ జఠరికలోకి రక్తం ప్రసరించడానికి ఉపయోగపడే కవాటం?
A) త్రిపత్ర కవాటం         B) పుపుస కవాటం
C) సిస్టెమిక్‌ (దైహిక) కవాటం            D) ద్విపత్ర కవాటం
జవాబు : D


19. మానవుడిలోని రక్తప్రసరణ వ్యవస్థ?
A) ఏకవలయ ప్రసరణ            B) సంవృత రక్తప్రసరణ
C) ద్వి (ద్వంద్వ) వలయ రక్తప్రసరణ           D) B, C
జవాబు : D


20. హృదయ స్పందనలో మొదటి లబ్‌ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది?
A) గుండెలోని కవాటాలు మూసుకున్నప్పుడు
B) రక్తనాళాల్లోని కవాటాలు మూసుకున్నప్పుడు
C) గుండెలోని కవాటాలు తెరుచుకున్నప్పుడు
D) రక్తనాళాల్లోని కవాటాలు తెరుచుకున్నప్పుడు
జవాబు : A

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌