• facebook
  • whatsapp
  • telegram

జీవక్రియలలో సమన్వయం

1. ఆకలి కోరికలకు కారణమయ్యే హార్మోన్‌?
A) లెప్టిన్‌         B) ఘ్రెలిన్‌
C) కొలిసిస్టోకైనిన్‌         D) సెక్రెటిన్‌
జవాబు : B


2. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక నాడీవ్యవస్థ పేరు?
A) కేంద్రనాడీవ్యవస్థ           B) పరిధీయ నాడీవ్యవస్థ
C) జీర్ణనాడీవ్యవస్థ            D) సహానుభూతపర నాడీవ్యవస్థ
జవాబు : C


3. జీర్ణాశయం నుంచి కొద్ది కొద్ది మొత్తాల్లో ఆహారం చిన్నపేగుల్లోకి విడుదల కావడానికి కారణం?
A) పైలోరిక్‌ సంవరిణి           B) పాయు సంవరిణి
C) ఎంటరిక్‌ సంవరిణి           D) పెరిస్టాలిసిస్‌
జవాబు : A


4. జీర్ణాశయం నుంచి ఆంత్రమూలంలోకి ప్రవేశించే ఆహార ముద్ద పేరు?
A) బోలస్‌           B) మలం          C) శ్లేష్మం           D) ఖైమ్‌
జవాబు : D


5. మానవుల్లో సాధారణ దంత ఫార్ములా?
A) కుంతకాలు - 2, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 3
B) కుంతకాలు - 3, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 3
C) కుంతకాలు - 2, రదనికలు - 1, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 2
D) కుంతకాలు - 2, రదనికలు - 2, అగ్రచర్వణకాలు - 2, చర్వణకాలు - 2
జవాబు : A


6. మనలో ఆకలి కోరికలను పెంచేవి?
A) ఆహారపు వాసన, ఆహారపు రుచి
B) ఆహారాన్ని చూడటం, అలసట, నీరసం
C) ఆహార అవసరం, ఆహారాన్ని గురించిన ఆలోచన
D) పైవన్నీ
జవాబు : D


7. వాసనకు సంబంధించిన గ్రాహకాలు?
A) ఘ్రాణ గ్రాహకాలు          B) దృష్టి గ్రాహకాలు
C) నాసీసెప్టార్స్‌             D) మెకనోరిసెప్టార్స్‌
జవాబు : A

 

8. సాధారణంగా మానవులు?
A) నిశాచరులు          B) దివాచరులు
C) కాథెమెరల్‌          D) ఏదీకాదు
జవాబు : B


9. ఆకలి కోరికలను మెదడుకు తీసుకువెళ్లడంలో కీలకపాత్ర పోషించే కపాల నాడి ఏది?
A) అబ్డూసెన్స్‌         B) వెస్టిబ్యులో కాక్లియర్‌
C) గ్లాసోఫెరెంజియల్‌          D) వేగస్‌
జవాబు : D


10. ఆంత్రచూషకాల పని?
A) జీర్ణమైన ఆహారాన్ని శోషించడానికి పేగు గోడల వైశాల్యాన్ని పెంచడం
B) చిన్న పేగుల్లో నుంచి ఆహారాన్ని పెద్ద పేగుల్లోకి వదలడం
C) జీర్ణంకాని ఆహారాన్ని మలంగా మార్చడం
D) పెద్దపేగులోని ఉపయోగకర పదార్థాల పునఃశోషణ
జవాబు : A


11. జీర్ణనాళం చివరి భాగం?
A) పురీషనాళం          B) ఉండూకం
C) పెద్దపేగు          D) పాయువు
జవాబు : D

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌