• facebook
  • whatsapp
  • telegram

సమన్వయం

1. నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం?
A) మెదడు         B) నాడీకణం
C) సైనాప్స్‌          D) ప్రతీకార చర్యాచాపం
జవాబు : B


2. కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారాన్ని తీసుకుని వెళ్లేది?
A) అభివాహినాడులు           B) అపవాహినాడులు
C) సహసంబంధ నాడులు           D) డిటెక్టర్‌ నాడీకణాలు
జవాబు : A


3. విత్తనాల సుప్తావస్థకు కారణమైన వృక్ష హార్మోన్‌?
A) ఎథిలీన్‌          B) అబ్‌సిసిక్‌ ఆమ్లం
C) సైటోకైనిన్స్‌         D) ఆక్సిన్స్‌
జవాబు : B


4. మొక్కల్లో సూర్యరశ్మికి అనుగుణంగా చూపే పెరుగుదల?
A) గురుత్వానువర్తనం          B) స్పర్శానువర్తనం
C) కాంతి అనువర్తనం           D) రసాయన అనువర్తనం
జవాబు : C


5. ఎఫ్‌.డబ్ల్యూ. వెంట్‌ అభిప్రాయం ప్రకారం, ఆక్సిన్‌లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి అవుతాయి?
A) వేర్లు           B) పత్రాలు          C) బీజదళాలు          D) ప్రాంకుర కంచుకం
జవాబు : D


6. కణదేహం నుంచి ఎక్కువ సంఖ్యలో బయటకు పొడుచుకుని వచ్చే సూక్ష్మ నిర్మాణాలేవి?
A) డెండ్రైట్‌లు           B) తంత్రికాక్షాలు
C) తంత్రికాక్ష ధ్రువాలు         D) రణ్‌వీర్‌ కణుపులు
జవాబు : A


7. రెండు నాడీకణాలు సమాచారాన్ని మార్పిడి చేసుకునే క్రియాత్మక ప్రదేశం?
A) ప్రతీకార చర్యాచాపం          B) కణదేహం
C) నాడీకణాల సంయుగ్మం          D) నాడీకణసంధి
జవాబు : D

 

8. నాడీ ప్రచోదనం వేగం?
A) 1 మీ./సె.           B) 10 మీ./సె.
C) 100 మీ./సె.          D) 0.1 మీ./సె.
జవాబు : C

 

9. మెదడును ఆవరించి ఉన్న రక్షణ త్వచాలు?
A) పెరికార్డియం          B) ప్లూరా
C) మైలిన్‌ తొడుగు           D) మెనింజెస్‌
జవాబు : D


10. దృష్టి జ్ఞానానికి సంబంధించిన దృష్టి లంబికలు ఉన్న ప్రదేశం?
A) ముందు మెదడు          B) మధ్య మెదడు
C) వెనుక మెదడు           D) మజ్జా ముఖం
జవాబు : B


11. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జతను గుర్తించండి.
A) బూడిదరంగు ప్రాంతం - తంత్రికాక్షాలు
B) తెలుపురంగు ప్రాంతం - కణదేహం
C) మెదడు - కపాలం
D) కేంద్రనాడీవ్యవస్థ - మెదడు మాత్రమే
జవాబు : C


12. మస్తిష్కం పైభాగంలో ఉబ్బెత్తుగా ఉన్న ముడుతలు?
A) గైరి           B) సల్సి         C) గైరి, సల్సి      D) అర్ధ గోళాలు
జవాబు : A


13. పరిధీయ నాడీ వ్యవస్థలో ఉండేవి?
A) వెన్ను నాడులు         B) కపాల నాడులు
C) A, B          D) మెదడు, వెన్నుపాము
జవాబు : C


14. శరీర భంగిమ, సమతాస్థితులను నియంత్రించే మెదడు భాగం?
A) ద్వారగోర్ధం           B) మజ్జాముఖం
C) అనుమస్తిష్కం          D) మస్తిష్కం
జవాబు : C


15. కనుపాప పెద్దది కావడం, హృదయస్పందన వేగం పెరగడం, రక్త పీడనం పెరగడం - ఇవి దేని లక్షణాలు?
A) కేంద్రనాడీ వ్యవస్థ            B) పరిధీయనాడీ వ్యవస్థ
C) సహానుభూతనాడీ వ్యవస్థ         D) ఏదీకాదు
జవాబు : C

 

16. కోడిపుంజులు, గొర్రె పొట్టేళ్ల పొట్లాటలను చూసినప్పుడు స్ఫురించే హార్మోన్‌
A) సొమటోట్రాపిన్‌          B) థైరాక్సిన్‌
C) ఈస్ట్రోజెన్‌        D) అడ్రినలిన్‌
జవాబు : D


17. కణ విభజనలను ప్రేరేపించే వృక్ష హార్మోన్‌?
A) ఆక్సిన్‌           B) సైటోకైనిన్‌
C) జిబ్బరెల్లిన్‌         D) ఎథిలీన్‌
జవాబు : D


18. కింద పేర్కొన్న శాస్త్రవేత్తల్లో నాడీవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేయనివారు?
A) గాలన్‌         B) లియొనార్డో డావిన్సీ
C) స్టీఫెన్‌ హేల్స్‌         D) పాల్‌ లాంగర్‌హాన్స్‌
జవాబు : B


19. హార్మోన్‌లను స్రవించే గ్రంథులు ..... వ్యవస్థకు చెందుతాయి?
A) బహిస్రావీ వ్యవస్థ          B) అంతస్రావీ వ్యవస్థ
C) నాడీ వ్యవస్థ           D) ప్రసరణ వ్యవస్థ
జవాబు : B

 

20. హృదయస్పందన, శ్వాసక్రియలకు సంబంధించిన వాటిని నియంత్రించే మెదడు భాగం?
A) మధ్య మెదడు         B) ద్వారగోర్ధం
C) అనుమస్తిష్కం          D) మజ్జాముఖం
జవాబు : D

Posted Date : 25-06-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌